25-08-1971 అవ్యక్త మురళి

* 25-08-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"ముఖ్యమైన ఏడు బలహీనతలు మరియు వాటిని తొలగించేందుకు 7 రోజుల కోర్సు."

            క్షణకాలములో వాణినుండి అతీతమయ్యే స్థితిలో స్థితులవ్వగలరా? ఏవిధంగా ఇతర కర్మేంద్రియాలను ఎప్పుడు కావాలనుకొంటే, ఎలా కావాలానుకుంటే అలా కదల్చగలరో అలాగే బుద్ది లగనమును ఎక్కడ కావాలనుకుంటే, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అలా మరియు అక్కడ స్థిరము చెయ్యగలరా? అటువంటి పవర్‌ఫుల్ గా అయ్యారా? ఈ విధి వృద్ధిని పొందుతూ ఉందా? ఒకవేళ విధి యథార్థమైనదైనట్లయితే విధి ద్వారా సిద్ధి అనగా సఫలత మరియు శ్రేష్ఠత ప్రతిరోజు తప్పకుండా వృద్ధిని పొందే అనుభవమును చేస్తారు. ఈ పరిణామము ద్వారా మీ పురుషార్థపు యథార్థ స్థితిని పరిశీలించుకోగలరు. ఈ సిద్ధి విధిని పరిశీలించుకొనేందుకు ముఖ్యమైన గుర్తు. ఏ విషయానైనా పరిశీలించేందుకు గుర్తులు ఉంటాయి. మరి ఈ గుర్తుల ద్వారా మీ సంపూర్ణ బుద్ధి యొక్క గుర్తును పరిశీలించగలరా? ఈరోజుల్లో పురుషార్థుల పురుషార్థమేదైతే నడుస్తూ ఉందో, అందులో ఏ ముఖ్యమైన బలహీనతలు కనిపిస్తాయి? 1. స్మృతిలో సమర్ధత లేదు. 2. దృష్టిలో దివ్యత మరియు అలౌకికత యథాశక్తి నంబర్ వారీగా వచ్చి ఉంది. 3. వృత్తిలో విల్ పవర్ లేని కారణంగా వృత్తి ఏకరసంగా ఉండకుండా, చంచలంగా ఉంటుంది. 4. నిరాకారీ స్థితిపై అటెన్షన్ తక్కువగా ఉన్న కారణంగా ముఖ్య వికారాలైన దేహఅభిమానము, కామము మరియు క్రోధము... ఈ మూడింటి యుద్ధము సమయ ప్రతిసమయము జరుగుతూ ఉంటుంది. 5. సంగఠనలో ఉంటూ లేక సంపర్కములోకి వస్తూ వాయుమండలము, వైబ్రేషన్లు తమ ప్రభావమును కలిగిస్తాయి. 6. అవ్యక్త ఫరిస్తాతనపు స్థితి తక్కువగా ఉన్న కారణంగా, మంచి లేక చెడు విషయాల ఫీలింగ్ రావటం ద్వారా ఫెయిల్ అయిపోతారు. 7. తమ స్మృతియాత్రలో తక్కువ సంతుష్టత, ఇదే పురుషార్థుల పురుషార్థపు నంబర్ వార్ రిజల్ట్.

            ఇప్పుడు ఈ 7 విషయాలను తొలగించుకొనేందుకు 7 రోజుల కోర్సును చెయ్యవలసి ఉంటుంది. ఈ ఏడు విషయాలను ముందు ఉంచుకొని ఎవరైతే ఇతరులకు 7 రోజుల కోర్సును చేయిస్తారో వారు తమను తాము రివైజ్ చేయించుకోవాలి. ఏవిధంగా మురళీలను రివైజ్ చేస్తున్నట్లయితే రివైజ్ చెయ్యటం ద్వారా నవీనత మరియు శక్తి పెరిగే అనుభవమును ఎలా అయితే చేస్తారో, అలా వాటిని అమృతవేళ ఏకాంతములో కూర్చొని ఇప్పుడు 7 విషయాలను ఏవైతే వినిపించామో వాటిపై ఒక్కొక్క విషయమునకు నివారణ ప్రతిరోజు పాఠములో ఎలా ఇమిడి ఉంది అన్నదానిని మననము చేసి వెన్నను అనగా సారమును వెలికితియ్యండి మరియు పరస్పరములో ఇచ్చిపుచ్చుకోండి. కోర్సునైతే చేసారు కానీ జిజ్ఞాసువులకు కోర్సును చేయించిన తరువాత ఎలా అయితే ప్రతి పాఠపు యుక్తిని తెలియజేస్తారో లేక అటెన్షన్ ను ఇప్పిస్తారో అలా రెగ్యులర్ గాడ్లీ స్టూడెంట్లు అయిన మీరు ప్రతి ఒక్కరూ ఇప్పుడు మళ్ళీ ఒక వారము రోజులు ఒక్కో పాఠాన్ని ప్రాక్టీసు చెయ్యండి మరియు ప్రాక్టికల్ లోకి తీసుకురండి. సాప్తాహిక పాఠాన్ని చదువుతారు కదా! మీరు కూడా సేవలో పవిత్రతా సప్తాహము లేక శాంతి సప్తాహపు ప్రోగ్రామును చేస్తారు కదా! అలాగే మీ ప్రోగ్రస్ కొరకు ప్రతి పాఠము యొక్క సప్తాహిక పాఠాన్ని ప్రాక్టికల్ లోకి మరియు ప్రాక్టీసులోకి తీసుకురండి. మరి రివైజ్ చెయ్యటం వలన  ఏమవుతుంది? సఫలత సమీపంగా, సహజంగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది కావున శ్రేష్ఠముగా అయితే అవ్వనే అవుతారు. మిమ్మల్ని మీరు ప్రతి సంకల్పము, ప్రతి కర్మలో మహాన్ గా తయారుచేసుకొనేందుకు అన్నింటికన్నా సహజయుక్తిని మూడు మాటలలో వినిపించండి. మనస్సులో, మాటలలో, కర్మలలో మహానత కొరకు అడుగుతున్నాము.

           మహాన్ గా అయ్యేందుకు ఒకటి - స్వయమును పాత ప్రపంచములో మెహమాన్(అతిథి)గా భావించండి. రెండవ విషయము - ఏ సంకల్పమును చేసినా లేక కర్మను చేసినాగానీ మహాన్ అంతరమును బుద్దిలో ఉంచుకొని సంకల్పమును మరియు కర్మను చెయ్యండి. మూడవ విషయము - తండ్రి మరియు మీ దైవీ పరివారములోని ప్రతి ఆత్మ గుణాలు మరియు శ్రేష్ఠ కర్తవ్యమును మహిమ చేస్తూ ఉండండి. 1.మెహమాన్, 2. మహాన్ అంతరము, 3. మహిమ... ఈ మూడు విషయాలు నడుస్తూ ఉన్నట్లయితే 7 లోపాలు ఏవైతేఉన్నాయో అవి సమాప్తమైపోతాయి. మెహమాన్‌గా భావించని కారణంగా ఏదైనా రూపము లేక దృశ్యములోకి  అట్రాక్షన్ మరియు అటెన్షన్ వెళ్తుంది.

           మహాన్ అంతరమును ఎదురుగా ఉంచుకోవటం ద్వారా ఎప్పుడు కూడా దేహ అహంకారము లేక క్రోధపు అంశము లేక వంశము ఉండజాలదు. మూడవ విషయము - తండ్రి మరియు ప్రతి ఆత్మ గుణాల మహిమ లేక కర్తవ్యాల మహిమను చేస్తూ ఉన్నట్లయితే ఎవరి ద్వారా ఏవిధమైన ఫీలింగ్ రాజాలదు, మరియు గుణాలు లేక కరవ్యాల మహిమను చేస్తూ ఉన్నట్లయితే స్మృతియాత్ర నిరంతరము ఉంటుంది మరియు అసంతుష్టత కూడా నిరంతర సహజ స్మృతిలోకి పరివర్తన అయిపోతుంది. ఈ మూడు మాటలను సదా స్మృతిలో ఉంచుకొన్నట్లయితే సమర్థవంతులుగా అయిపోతారు. దృష్టి, వృత్తి, వాయుమండలము అన్నీ పరివర్తన అయిపోతాయి.

           ద్వాపరయుగము నుండి ఇప్పటివరకు మీ మరియు దైవీ పరివారపు ఆత్మల మహిమను చేస్తూ వచ్చారు. కీర్తనను చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ చైతన్య పరిచిత ఆత్మల అవగుణాలను లేక లోపాలను ఎందుకు చూస్తారు మరియు ఎందుకు బుద్ధిలో ధారణ చేస్తారు? ఇప్పుడు కూడా మొత్తము విశ్వము నుండి ఎన్నుకోబడిన శ్రేష్ఠ ఆత్మల గుణగానమును చెయ్యండి. బుద్ధి ద్వారా గ్రహించండి మరియు నోటి ద్వారా ఇతరుల గుణగానమును చెయ్యండి, అప్పుడిక దృష్టి లేక వృత్తి చంచలమౌతుందా? ఎవరిలోని లోపము గురించైనా ఫీలింగ్ ఉంటుందా? ఏదైనా మందిరములోని మూర్తి ఎంతటి ఆకర్షణీయముగా లేక సుందరంగా అలంకరించబడి ఉన్నా కానీ ఎప్పుడూ దాని సుందరత లేక అలంకారం వైపు సంకల్పమాత్రము కూడా దృష్టి చంచలమవ్వదు అని అనుభవము చేసుకున్నారు కదా! అలాగే అక్కడే ఒకవేళ సినిమా లేక ఏదైనా పుస్తకం నుండి ఏదైనా ఆకర్షణను లేక అలంకరణను చూసినట్లయితే లేక ఏదైనా బోర్డును చూసినా గానీ వృత్తి మరియు దృష్టి చంచలమౌతుంది, ఎందుకని? ఆకర్షణ అయితే మూర్తులలో కూడా ఉంది. అలంకరణ, రూపు రేఖలు మరియు ప్రాకృతిక సౌందర్యము మూర్తులలో కూడా ఉంది, అయినప్పటికీ వృత్తి మరియు దృష్టి ఎందుకని చంచలమవ్వవు? రెండు చిత్రాలనూ ఎదురుగా పెట్టుకోండి లేక ఒకటే గదిలో పెట్టుకున్నట్లయితే ఒక్క క్షణములో ఆ వైపుకు వెళ్ళటంతోనే వృత్తి చంచలమౌతుంది మరియు ఈ వైపుకు వెళ్ళటం ద్వారా వృత్తి పవిత్రమౌతుంది. ఈ పవిత్రత మరియు అపవిత్రతలకు కారణమేమిటి? స్మృతి. వీరు దేవి అన్న స్మృతి ఉండటం ద్వారా అది స్మృతిని, దృష్టిని మరియు వృత్తిని పవిత్రముగా చేస్తుంది మరియు వారు ఆడవారు అన్న స్మృతి ఉండటం ద్వారా ఆ స్మృతి, వృత్తి మరియు దృష్టి అపవిత్రత వైపుకు లాగుతుంది. అక్కడ రూపమును చూస్తారు మరియు ఇక్కడ ఆత్మికతను చూస్తారు. ఇటువంటి గత అనుభవమైతే ఉంది కదా! వర్తమానము కూడా పర్సంటేజ్ లో ఉంది. కానీ దీనిని తొలగించుకొనేందుకు ఎప్పుడు ఎక్కడ చూసినా, ఎవ్వరితో మాట్లాడుతున్నాకూడా స్మృతిలో ఏం ఉంచుకోవాలి? ఆత్మగా భావించటము, ఇదైతే ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. కానీ కర్మలోకి వస్తూ, సంపర్కములోకి వస్తూ, సంబంధములోకి వస్తూ వీరంతా జడ చిత్రాల చైతన్య దేవి మరియు దేవతల రూపాలు అన్న స్మృతినే ఉంచుకోండి. కావున దేవీ రూపము స్మృతిలోకి రావటం ద్వారా జడ చిత్రాలలో ఎప్పుడూ సంకల్ప మాత్రము కూడా అపవిత్రత లేక దేహ ఆకర్షణ ఉండదో, అలాగే చైతన్యరూపములో కూడా ఈ స్మృతిని ఉంచుకోవటం ద్వారా సంకల్పములో కూడా ఈ కంప్లైంట్ ఉండదు మరియు కంప్లీట్ అయిపోతారు. అర్థమైందా? ఇవే వర్తమాన పురుషార్థుల కంప్లైంట్ పై కంప్లీట్ గా అయ్యేందుకు యుక్తులు.

           అచ్ఛా - భట్టీ చేసేవారు తమ ఉన్నతిని చేసుకుంటున్నారు, స్పీడ్ కూడా తీవ్రంగా ఉందా? భట్టీ  సమాప్తమైన తరువాత కిందకు వచ్చి స్పీడ్ ను తక్కువ చేసుకోరు కదా! అటువంటి పురుషార్థమునే చేస్తున్నారు కదా. అచ్ఛా!

Comments

Post a Comment