25-06-1971 అవ్యక్త మురళి

* 25-06-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"సేవ మరియు తపస్సుల సమానత" 

           మిమ్మల్ని మీరు వృక్షపతి సంతానంగా భావిస్తున్నారా? వృక్షపు చిహ్నాలు భక్తి మార్గంలో కూడా కొనసాగుతూ వచ్చాయి. ఎప్పుడైతే తపస్వులు తపస్సు చేస్తారో వృక్షం క్రిందే తపస్సు చేస్తారు. దీని రహస్యం ఏమిటి? వృక్షం క్రిందే తపస్సు ఎందుకు చేస్తారు? దీనికి కారణం ఏమిటి, ఇది ఎలా మొదలైంది? దీని బేహద్ రహస్యమేమిటి, ఈ సృష్టి రూపీ వృక్షంలో కూడా మీ నివాస స్థానం ఎక్కడ? వృక్షం క్రింద జడంలో కూర్చున్నారు కదా! ఇప్పుడు ఏ చిత్రాలను జ్ఞాన సహితంగా తయారుచేస్తారో అవే మళ్ళీ భక్తి మార్గంలో స్మృతి చిహ్నాల రూపంగా కొనసాగుతూ వస్తాయి. వృక్షం చిత్రంలో దూరం నుండి ఏం కనిపిస్తుంది? తపస్వులు తపస్సు చేస్తున్నట్లు, వృక్షం క్రింద తపస్వి కూర్చున్నట్లు కనిపిస్తుంది. వృక్షం క్రింద కూర్చోవడం వల్ల దానంతట అదే వృక్షం యొక్క పూర్తి జ్ఞానము బుద్ధిలోకి వస్తుంది. వృక్షం క్రింద కూర్చున్నట్లయితే అనుకోకుండానే ఫలాలు, పూలు, ఆకులు మొదలగువాటిలోకి అటెన్షన్ వెళుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే కల్పవృక్షం క్రింద ఫౌండేషన్ లో కూర్చుంటారో అప్పుడు కల్పవృక్షపు జ్ఞానము బుద్ధిలో ఆటోమేటిక్ గా ఉంటుంది. ఎలాగైతే బీజములో వృక్షపు మొత్తం జ్ఞానం ఉంటుందో ఇదేవిధంగా స్వయమును ఈ కల్పవృక్షపు పునాదిలో మరియు వృక్షం క్రింద మూలములో ఉన్నట్లుగా భావిస్తారో అప్పుడు మొత్తం వృక్షం యొక్క జ్ఞానము బుద్ధిలో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీ ఈ స్థితి భక్తి మార్గంలో కొనసాగుతూ వచ్చింది. ఇది ప్రాక్టికల్, తపస్సు చేస్తున్నారు, భక్తి మార్గంలో మళ్ళీ స్థూలవృక్షం క్రింద కూర్చుని తపస్సు చేస్తారు. చూడండి - ప్రారంభంలో, మేము వృక్షంపైన కూర్చున్నాము అనే నషా మీకు ఉండేది. వృక్షం మొత్తం క్రింద ఉంది, మేము పైన ఉన్నాము. పైన కూడా ఉన్నారు కదా! వృక్షమును తలక్రిందులుగా చేసినట్లయితే పైకైపోతారు కదా! ఎలాగైతే ప్రారంభంలో, మేము ఈ వృక్షం పైన కూర్చొని వృక్షం మొత్తాన్ని చూస్తున్నాము అనే నషా ఉండేదో అలాగే ఇప్పుడు కూడా ఈ భిన్న భిన్న రకాల తపస్సు యొక్క నషా ఉంటోందా? ఇప్పటి నషా కంటే మొదట్లోని నషా ఎక్కువగా ఉండేదా లేక ఇప్పుడు ఎక్కువగా ఉందా? అది కేవలం తపస్సు యొక్క స్వరూపము. ఇప్పుడు తపస్సు మరియు సేవ రెండూ జతగా ఉన్నాయి. అప్పటి నషా కేవలం తపస్సు వలన ఉండేది, క్రిందకు రావడానికి ఎటువంటి కారణం ఉండేది కాదు. కాని ఇప్పుడు తపస్సు మరియు సేవ రెండూ కలిసి కొనసాగుతున్నాయి. రెండు కార్యాలు కొనసాగుతుండగా మధ్య మధ్యలో తమకి తాము నషా ఎక్కించుకోవడంపై విశేషమైన ధ్యానమును ఉంచాలి. దీనినే బ్యాటరీని చార్జ్ చేసుకోవడము అని అంటారు. వృక్షమంతా ప్రత్యక్ష రూపంలో ఉన్నట్లుగా మరియు మనం సాక్షిగా అయి వృక్షమును చూస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటాము. ఈ నషా కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, శక్తిని కలిగిస్తుంది. కావుననే వృక్షపతికి, వృక్షమునకు ఎంతో గాయనము ఉంది. కావున ఇటువంటి విభిన్నమైన సేవలను చేస్తూ కూడా తపస్సు యొక్క శక్తిని మీలో మీరే నింపుకుంటూ ఉండాలి, తద్వారా తపస్సు మరియు సేవ కంబైండ్ గా మరియు ఒకేసారి ఉంటాయి. సేవలోకి వచ్చినప్పుడు తపస్సును మర్చిపోవడం కాదు, రెండూ కలిసి ఉండాలి. ఇది కంబైండ్ రూపం కదా! దీన్ని మధ్య మధ్యలో పరిశీలించుకుంటూ ఉండాలి. ఎప్పటివరకు పరిశీలకులుగా అవ్వరో అప్పటివరకు తయారు చేసేవారిగా అవ్వలేరు. వరల్డ్ మేకర్ లేక పీస్ మేకర్ అన్న గాయనమేదైతే ఉందో ఆ విధంగా, ఎప్పటివరకైతే పరిశీలకులుగా అవ్వరో  అప్పటివరకు అవ్వలేరు. మీపై మీరు ఎంతగానో పరిశీలించుకోవాలి. ఇతరులు ఎంత పరిశీలించినా కాని అంతగా చేయలేరు. కాని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం ద్వారానే మీ ఉన్నతిని పొందగలరు,  మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. పరిశీలించుకోవడంలో సమయం పట్టదు. ఎప్పుడైతే సహజమైన అభ్యాసము ఏర్పడుతుందో అప్పుడు సమయం యొక్క అవసరం కూడా ఉండదు. అంతా దానంతట అదే నడుస్తూ ఉంటుంది. అప్పుడు పరిశీలించుకోవడంలో ఒక్క క్షణం కూడా పట్టదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నట్లయితే అందుకు ఎంత సమయం పడుతుంది? ఎంత బిజీగా ఉన్నా ఒక్క క్షణమునైతే  కేటాయించగలరు. కేవలం అభ్యాసం అవసరం. చెకింగ్ మాస్టర్‌గా అవ్వాలి. అన్నింటిలోను మాస్టర్‌గా అవ్వాలి. ఏ విధంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా, మాస్టర్ జ్ఞానస్వరూపులుగా ఉన్నారో అలాగే చెకింగ్ మాస్టర్‌గా కూడా అవ్వాలి.

           డ్రామా అనుసారంగా అంతా సక్రమంగానే నడుస్తోంది. కాని అంతా సరిగ్గా నడుస్తున్నా కూడా చెకింగ్ చేసుకోవలసి ఉంటుంది. ఇది కళ్యాణకారీ యుగమని కూడా మీకు తెలుసు. అయినా ప్రతి ఒక్కరూ తమను గూర్చి మరియు ఇతరుల కళ్యాణమును గూర్చిన ప్లానును ఆలోచించవలసి ఉంటుంది. అటువంటి క్రొత్త క్రొత్త ప్లానులను తయారుచేయండి, తద్వారా మీ స్థితి పైకి ఎదగాలి. అందరూ నడుస్తున్నారు మరియు నడుస్తూ ఉంటారు. కాని మధ్య మధ్యలో ప్లానింగ్ లేక సహయోగము యొక్క ఎక్స్ ట్రా ఫోర్స్ లభించడం ద్వారా ముందుకు వెళ్ళగలుగుతారు. రాకెట్ కు కూడా అగ్నితో ఫోర్స్ ను ఇవ్వడం జరుగుతుంది, అప్పుడే అది పైకి ఎగురుతుంది. అలాగే ప్రకాశము మరియు శక్తితో కూడిన ఫోర్స్ లభించడంతో అది జంప్ చేయగలుగుతుంది. దీని కొరకు ఎక్స్ ట్రా ఫోర్స్ తో కూడిన సహయోగముతో మనకు శక్తి యొక్క ప్రాప్తి అనుభవమవుతుంది, ఇది కూడా అవసరమే. ఒకటేమో - మనన శక్తి చాలా బలహీనంగా ఉంది, కావుననే మెజారిటీవారు వ్యర్థ సంకల్పాలను ఎలా కంట్రోల్ చేయాలి అన్న రిపోర్ట్ నే ఇస్తున్నారు. ఈ ముఖ్యమైన బలహీనతను ఎలా పరిశీలించి దాన్ని అంతం చేయాలి అన్న విషయంలో ప్లానును ఆలోచించండి. బలహీనతలను గూర్చి అయితే తెలుస్తూనే ఉంటుంది, వాటిని గూర్చి అర్థం చేయించినప్పుడు అవి కాస్త లోపలికి వెళ్ళిపోతాయి కాని, సంస్కారాలను అంతం చేసుకోలేరు. కావుననే కొద్ది సమయం తరువాత మెజారిటీవారి నుండి మళ్ళీ అదే రిపోర్టు వెలువడుతుంది. భట్టీలు మొదలైనవాటి ద్వారా కూడా ఎక్స్ ట్రా శక్తి లభిస్తుంది, ఎంతో కొంత పరివర్తన జరుగుతుంది. కాని ఈ ఫోర్స్ ను ఏదైతే ఇక్కడి నుండి తీసుకువెళతారో అది సదాకాలికంగా ఉండేందుకు ప్లానును ఆలోచించండి. శక్తి లేదు అని చాలామంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు, జ్ఞానము ఉంది కాని ఏ జ్ఞానమునైతే శక్తి మరియు ప్రకాశము అని అంటారో ఆ జ్ఞానము ద్వారా స్వయంలో శక్తిని ఎలా నింపుకోవాలి అన్న విధానం రాదు. ఏ విధంగా మనవద్ద అగ్గిపెట్టె ఉండి, ఆ అగ్గిపెట్టె నుండి అగ్నిని పుట్టించే విధానం రాకపోతే ఆ కార్యమును సిద్ధింపజేయలేరో అలా జ్ఞానమైతే అందరికీ ఉంది కాని, ఆ జ్ఞానము ద్వారా కొందరు ప్రకాశమును మరియు శక్తిని అనుభవం చేసుకుంటారు, మరికొందరు కేవలం జ్ఞానమును అర్థం చేసుకుని వర్ణన చేస్తారు. జ్ఞానము ద్వారా స్వయములో శక్తిని ఎలా తీసుకురావాలి అన్న భిన్న భిన్న యుక్తుల ద్వారా శక్తిని నింపుకోవాలి, దాని ద్వారా జంప్ చేయగలుగుతారు. అచ్ఛా!

Comments