25-06-1970 అవ్యక్త మురళి

* 25-06-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము
                             
"వ్యక్త మరియు అవ్యక్తవతనపు భాషలో అంతరము"

వ్యక్త లోకములో ఉంటూ అవ్యక్త వతనపు భాషను తెలుసుకోగలరా? అవ్యక్త వతనములో ఏ భాష ఉంటుంది? ఎప్పుడైనా అవ్యక్త వతనపు భాష విన్నారా? ఇప్పుడైతే అవ్యక్తులు వ్యక్త లోక నివాసుల కొరకు అవ్యక్త ఆధారమును తీసుకొని వ్యక్త దేశపురీతిలో ఆవిధంగా మాట్లాడవలసి వస్తోంది. అక్కడ అవ్యక్త వతనములో అయితే ఒక్క క్షణములో చాలా రహస్యాలు స్పష్టమైపోతాయి. ఇక్కడ మీ ప్రపంచములో చాలా మాట్లాడిన తరువాత స్పష్టమవుతుంది. ఇదే వ్యక్త భాషలోని అంతరము. ఈ రోజు బాప్ దాదా ఏం చూస్తున్నారు అన్నదానిని అవ్యక్త బాప్ దాదా సూచనల ద్వారా తెలుసుకోగలరా? సైన్స్ ద్వారా ఎక్కడెక్కడి విషయాలనో, ఎక్కడెక్కడి దృశ్యాలనో క్యాచ్ చెయ్యగలరు. అలాగే మీరు అవ్యక్త స్థితి ఆధారముతో సమ్ముఖములోని విషయాలను క్యాచ్ చెయ్యలేరా? మూడు విషయాలను చూస్తున్నారు. ఆ మూడు ఏ విషయాలు? ప్రతి ఒక్కరూ ఎంతవరకు చెక్కర్(పరిశీలించేవారి)గా అయ్యారు మరియు చెక్కర్ తో పాటు ఎంతవరకు మేకర్(తయారుచేసేవారి)గా అయ్యారు అన్నదానినే బాప్ దాదా ఈ రోజు చూస్తున్నారు. ఎవరైతే ఎంతగా చెక్కర్ లుగా అవుతారో అంతగా మేకర్ లుగా కూడా అవ్వగలరు. ఈ సమయములో మీరు లా మేకర్ లు కూడా మరియు నూతన ప్రపంచ మేకర్ లు కూడా మరియు పీస్ మేకర్ లు కూడా. కానీ మేకర్ తో పాటుగా చెక్కర్ గా కూడా తప్పకుండా అవ్వాలి. విశేషంగా దేనిని చెక్(పరిశీలన) చేసుకోవాలి? ఇప్పుడు ఈ సేవే మిగిలి ఉంది, దీనితోనే పేరు ప్రసిద్ధమన్నాలి. ఆ చెకర్స్ ఏం చెక్ చేస్తారు? కల్తీ మరియు లంచము. కావున ఈ సేవయే ఇప్పుడు మిగిలి ఉంది. లంచము మరియు కల్తీ చేసేవారు ఎవరైతే ఉంటారో వారి వద్దకు ఆల్‌ మైటీ గవర్నమెంటు తరఫున చెకర్లుగా అయ్యి వెళ్ళండి. ఏవిధంగా ఆ గవర్నమెంటు చెకర్స్ గానీ లేక ఇన్ స్పెక్టర్లు గానీ ఇటువంటివారెవరి వద్దకైనా వెళ్ళినట్లయితే వారు తామ చేసిన కల్తీని చూపించరు. అదేవిధంగా పాండవ గవర్నమెంటు అథారిటీ నుండి చెకర్లుగా అయ్యి వెళ్ళండి, వారు మిమ్మల్ని చూడటంతోనే వారి లంచాలు, కల్తీతో గాభరా పడిపోతారు, తల వంచేస్తారు. ఇప్పుడు ఈసేవ మిగిలి ఉంది, దీనితోనే పేరు ప్రసిద్ధమవ్వాలి. ఒక్కరు తల వంచినా అనేకుల తలలు వంగిపోతాయి. పాండవ గవర్నమెంటు అథారిటీలుగా అయ్యి వెళ్ళాలి, సవాలును విసరాలి. ఇప్పుడు అర్థమైందా! స్వయముపై కూడా చెకర్ లుగా అవ్వాలి మరియు సేవలో కూడా చెకర్ లుగా అవ్వాలి. ఎవరు ఎంతగా చెకర్ లుగా మరియు మేకర్ లు(తయారుచేసేవారి)గా అవుతారో వారే మళ్ళీ రూలర్(పాలకులు)గా కూడా అవుతారు. కావున ఎంతవరకు చెకర్లుగా అయ్యారు, ఎంతవరకు మేకర్లుగా అయ్యారు మరియు ఎంతవరకు రూలర్లుగా అయ్యారు అన్న విషయాలను ప్రతి ఒక్కరిలో చూస్తున్నారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఈ మూడు రూపాలలో స్థిరం చేసుకుంటారో అప్పుడిక చిన్న చిన్న విషయాలలో సమయము వ్యర్ధమవ్వదు. మీరు ఉన్నదే ఇతరుల లంచాలు, కల్తీలను చెక్ చేసేవారుగా అయినప్పుడు మీవద్ద లంచము, కల్తీ ఉండగలవా? కావున మేము ఈ మూడు స్థితులలో ఎంతవరకు స్థితులమై ఉండగలుగుతున్నాము అన్న నషా ఉండాలి. రూలర్స్ గా ఎవరైతే ఉంటారో వారు ఎవరి అధీనములోనూ ఉండరు. అధికారులుగా ఉంటారు. వారు ఎప్పుడూ ఎవరి అధీనములోనూ ఉండజాలరు. మరి ఇక మాయ అధీనములో ఎలా ఉంటారు? అధికారమును మర్చిపోయినందు వలన అధికారిగా భావించరు. అధికారిగా భావించనందువల్ల అధీనమైపోతారు. ఎంతగా మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తారో అంతగా ఉదారచిత్తులుగా తప్పక అవుతారు. ఎవరు ఎంతగా ఉదారచిత్తులుగా అవుతారో అంతగానే వారు అనేకుల కొరకు ఉదాహరణ స్వరూపులుగా అవుతారు. ఉదారచిత్తులుగా అయ్యేందుకు అధికారిగా అవ్వవలసి ఉంటుంది. అధికారి అన్న మాటకు అర్థమే అధికారము ఎల్లప్పుడూ గుర్తు ఉండటము. అప్పుడు ఉదాహరణ స్వరూపంగా అవుతారు. బాప్ దాదా ఏవిధంగా ఉదాహరణ రూపులుగా అయ్యారో అలా మీరందరు కూడా అనేకుల కొరకు ఉదాహరణ రూపులుగా అవుతారు. ఉదారచిత్తులుగా ఉన్నవారు ఉదాహరణగా కూడా తయారవుతారు మరియు అనేకులకు
సహజంగానే ఉద్ధారము కూడా చెయ్యగలరు. అర్థమైందా!

ఎవరిలోనైనా మాయ ప్రవేశించినప్పుడు మొదటగా ఏ రూపములో మాయ వస్తుంది? (ప్రతిఒక్కరూ వారి వారి ఆలోచనలను వినిపించారు) మొదటగా మాయ భిన్న భిన్న రూపాలలో సోమరితనాన్ని తీసుకువస్తుంది. దేహ అభిమానములో కూడా మొదటి రూపముగా సోమరితనాన్ని ధారణ చేస్తుంది. ఆ సమయములో శ్రీమతాన్ని తీసుకొని వెరిఫై చేయించుకొనేందుకు సోమరితనము వస్తుంది, మరల దేహాభిమానము పెరుగుతూ ఉంటుంది. ఇతర విషయాలన్నింటిలో భిన్న భిన్న రూపాలతో మొదట సోమరితనపు రూపము వస్తుంది. సోమరితనము, బద్దకము మరియు ఉదాసీనత... ఇవన్నీ ఈశ్వరీయ సంబంధము నుండి దూరము చేసేస్తాయి. సాకార సంబంధము నుండి లేక బుద్ధి సంబంధము నుండి లేక సహయోగము తీసుకొనే సంబంధము నుండి దూరము చేసేస్తాయి. ఈ బద్దకము వచ్చిన తరువాత ఏ భయంకర రూపము వస్తుంది? దేహ అహంకారములోకి ప్రత్యక్ష రూపములో వచ్చేస్తారు. మొదట ఆరవ వికారము నుండి మొదలవుతుంది. జ్ఞానీ ఆత్మలైన పిల్లలలో మాయ చివరీ నెంబరు నుండి అనగా బద్దకము రూపములో మొదలవుతుంది. బద్దకములో ఎటువంటి సంకల్పాలు ఉత్పన్నమౌతాయి? వర్తమాన సమయములో ఈ రూపములో మాయ ప్రవేశిస్తుంది. ఈ విషయముపై చాలా శ్రద్ధ వహించాలి. ఈ ఆరవ రూపంలో మాయ భిన్న భిన్న ప్రకారాలతో వచ్చేందుకు ప్రయత్నము చేస్తుంది. బద్దకమునకు కూడా రకరకాల రూపాలు ఉంటాయి. శారీరిక, మానసిక, రెండు సంబంధాలలో కూడా మాయ రాగలదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా దీనిని చేద్దాములే, తొందరేముంది అని కొంతమంది ఆలోచిస్తుంటారు. ఇలా-ఇలా చాలా రాయల్ రూపముతో మాయ వస్తుంది. అవ్యక్త స్థితి ఈ పురుషార్థి జీవితములో 6-8 గంటలు ఉండడమనేది ఎలా జరుగగలదు? ఇది అంతిమములనే జరుగగలదు అని కూడా కొందరు ఆలోచిస్తారు, ఇది బద్దకపు రాయల్ రూపము. ఆతరువాత చేస్తానులే, ఆలోచిస్తానులే, చూస్తానులే... ఇవన్నీ బద్దకములే. ఇప్పుడు వీటిని పరిశీలించుకోండి. ఎవ్వరినీ మాయ రాయల్ రూపములో మాయ వెనక్కి తప్పించడం లేదు కదా? ప్రవృత్తిని తప్పక పాలన చేయవలసిందే, కానీ ప్రవృత్తిలో ఉంటూ వైరాగ్య వృత్తిలో ఉండాలన్నది మరచిపోతారు. సగం విషయము గుర్తుంటుంది, సగం విషయమును వదిలివేస్తారు. చాలా సూక్ష్మ సంకల్పాల రూపములో మొదట బద్దకము ప్రవేశిస్తుంది, ఆ తరువాత పెద్ద రూపాన్ని ధరిస్తుంది. అదే సమయములో దానిని తీసేసినట్లయితే ఎక్కువగా ఎదుర్కోవలసిన అవసరము ఉండదు. కావున ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా అవ్వటంలో లేక హైజంప్ చేయటంలో ఏ రూపంలో మాయ బద్దకస్తులుగా చేస్తుంది అన్నదానిని పరిశీలించుకోవాలి. మాయ యొక్క బయటి రూపమేదైతే ఉందో దానిని పరిశీలించుకుంటారు కానీ ఈ రూపములో చెక్ చేసుకోవాలి. ఫిక్స్ సీట్లు తక్కువ కదా! అని కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారు. కావున ఇతరులు పురుషార్ధములో ముందుకు వెళ్ళటం చూసి మేమైతే ఇంత ముందుకు వెళ్ళలేము. ఈమాత్రం చాల్లే అని తమ బుద్ధిలో ఆలోచిస్తారు. ఇది కూడా బద్దకము రూపమే. కావున ఈ అన్ని విషయాలలో మిమ్మల్ని మార్చుకోవాలి, అప్పుడే లా మేకర్స్ లేక పీస్ మేకర్స్ గా అవ్వగలరు మరియు న్యూ వరల్డ్(కొత్త ప్రపంచపు) మేకర్లుగా అవ్వగలరు. మొదట స్వయమునే న్యూగా చేసుకోనప్పుడు న్యూ వరల్డ్ మేకర్లుగా ఎలా అవ్వగలరు? మొదట అయితే స్వయమును తయారుచేసుకోవాలి కదా! పురుషార్థములో తీవ్రతను తీసుకువచ్చే పద్ధతి తెలిసినప్పుడు మరిక అందులో ఎందుకు ఆగరు? ఎప్పటివరకైతే మీతో మీరు ప్రతిజ్ఞను చేసుకోరో అప్పటివరకు పరిపక్వత రాజాలదు. ఎప్పటివరకైతే ఇక్కడ ఫిక్స్ అవ్వరో అప్పటివరకు అక్కడ సీట్లు ఫిక్స్ అవ్వవు. మరి ఇప్పుడు చెప్పండి, పురుషార్థములో తీవ్రతను ఎప్పుడు తీసుకువస్తారు? (ఇప్పటినుండే) 'ఇప్పుడు కాకున్న మరెప్పుడూ లేదు' అన్న స్లోగన్‌ను మ్యూజియంలో మరియు ప్రదర్శినీలలో ఏదైతే అందరికీ వినిస్తుంటారో దానిని మీకొరకు కూడా గుర్తు ఉంచుకోవాలి. ఎప్పుడో ఒకసారి చేస్తాములే అని ఇలా ఆలోచించవద్దు. ఇప్పుడు తయారై చూపించాలి. ఎంతగా ప్రతిజ్ఞను చేస్తారో అంతగా పరిపక్వత మరియు ధైర్యము వస్తాయి, సహయోగము కూడా లభిస్తుంది.

మీరు పాతవారు, కావున మిమ్మల్ని ఎదురుగా ఉంచి అర్థం చేయిస్తున్నాము. ఎదురుగా ఎవరిని ఉంచటం జరుగుతుంది? ఎవరైతే స్నేహీలుగా ఉంటారో వారినే ముందు ఉంచుతారు. స్నేహీలకు చెప్పటానికి ఎటువంటి సంకోచమూ కలుగదు. ప్రతి ఒక్కరూ అటువంటి స్నేహీలు. బాబా పెద్దగా ఎందుకు మాట్లాడరు అని అందరూ ఆలోచిస్తూన్నారు. కానీ బహుకాలపు సంస్కారము వలన అవ్యక్తరూపము నుండి వ్యక్తములోకి వచ్చినప్పుడు పెద్దగా మాట్లాడటము మంచిగా అనిపించదు. పిల్లలైన మీరు కూడా నెమ్మది నెమ్మదిగా శబ్దము నుండి దూరమై సంజ్ఞల ద్వారా కార్యవ్యవహారమును నడిపించాలి, ఈ అభ్యాసమును చెయ్యాలి. అర్థమైందా? బాప్ దాదా బుద్ధి డ్రిల్లును చేయించటానికి వస్తారు, దీనివలన పరిశీలించే మరియు దూరదేశులుగా అయ్యే అర్హత ఇమర్జ్ రూపములో వస్తుంది ఎందుకంటే ముందు ముందు ఎటువంటి సేవ ఉంటుందంటే, అందులో దూరదృష్టిగల బుద్ధి మరియు నిర్ణయ శక్తి చాలా అవసరముంటుంది, కావున ఈ డ్రిల్లును చేయిస్తున్నారు. అప్పుడిక పవర్ ఫుల్ గా అయిపోతారు. డ్రిల్లు ద్వారా శరీరము కూడా శక్తివంతముగా అవుతుంది. కావున ఈ బుద్ధి డ్రిల్లు ద్వారా బుద్ధి శక్తిశాలిగా అయిపోతుంది. ఎంతెంతగా మీ సీటును ఫిక్స్ చేసుకుంటారో, సమయాన్ని ఫిక్స్ చేసుకుంటారో అప్పుడు మీ ప్రవృత్తి కార్యమును కూడా ఫిక్స్ చేసుకోగలరు. రెండు లాభాలూ ఉంటాయి. బుద్ధి ఎంతగా ఫిక్స్ అవుతుందో ప్రోగ్రాములు కూడా అన్నీ ఫిక్స్ గా ఉంటాయి. ప్రోగ్రాము ఫిక్స్ అయినట్లయితే ప్రోగ్రెస్ (అభివృద్ధి)కూడా ఫిక్స్ అవుతుంది. ప్రోగ్రెస్ కదిలిందంటే ప్రోగ్రాము కూడా కదులుతుంది. ఇప్పుడు ఫిక్స్ చేయ్యటమును నేర్చుకోండి. ఇప్పుడు సంపూర్ణంగా అయ్యి ఇతరులను కూడా సంపూర్ణంగా తయారుచేయటము మిగిలి ఉంది. ఎవరైతే తయారవుతారో వారు మళ్ళీ దానికి ఋజువును కూడా ఇస్తారు. ఇప్పుడు తయారుచేయించే ప్రమాణమును ఇవ్వాలి. కావుననే ఈ కార్యము కొరకు వ్యక్త దేశములో ఉండాలి. అచ్ఛా!

Comments

  1. ఓంశాంతి, బాబా పెద్ద ధ్వనితో (గట్టిగా) ఎందుకు మాట్లాడరు? ఎప్పుడైనా ఎవరిలో అయినా మాయ ప్రవేశిస్తే మొదట ఏ రూపంలో వస్తుంది? అప్పుడు ఏ విషయంలో నిర్లక్ష్యము చేస్తారు? బాప్ దాదా బుద్ధి యొక్క వ్యాయామం ఎందుకు చేయిస్తున్నారు? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete

Post a Comment