* 25-05-1973 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“భవిష్య ప్లాను”
స్వయమును విశ్వపరివర్తకులుగా మరియు విశ్వకళ్యాణకారులుగా భావిస్తున్నారా? విశ్వంలోని ప్రతి ఆత్మకు సందేశమును ఇచ్చేవారిగా భావిస్తూ విశ్వమునకు ఎంతవరకు సందేశమును ఇవ్వగలిగారు అనే దాని లెక్కను వేస్తూ ఉంటారా? ఎక్కడెక్కడైతే సందేశమును ఇచ్చే కర్తవ్యం ఇప్పుడు జరుగనున్నదో దాని కొరకు క్రొత్త క్రొత్త ప్లాన్లను తయారుచేస్తున్నారా? ఎవరికి ఏ కర్తవ్యము లేక బాధ్యత ఉంటుందో ఆ కర్తవ్యము కొరకు వారికి ఎల్లప్పుడు ప్లానులు కలుగుతూ ఉంటాయి.
వారు ఎప్పుడూ సందేశమును ఇచ్చేందుకు లేక బాబా పరిచయమును లేక శబ్దమును వ్యాపింపజేసేందుకు ఏ భిన్న భిన్న ప్లానులనైతే ప్రాక్టికల్ లోకి తీసుకువస్తారో అందులో ముఖ్యమైన ప్రయత్నంగా ఏ ధరణి పైన లేక ఏ స్థానం పైన సందేశమును ఇవ్వాలో అక్కడ మొదట స్టేజ్ ను తయారుచేస్తారు, స్పీచులు చేస్తారు మరియు పబ్లిసిటీ యొక్క భిన్న భిన్న సాధనాలను ఉపయోగిస్తారు, తద్వారా అన్ని స్థానాలలోని ఆత్మలకు సందేశమునిచ్చే కర్తవ్యాన్ని చేస్తున్నారు. కాని, ఈ సాధనాల ద్వారా ఇప్పటివరకు విశ్వంలోని అంశమాత్రపు ఆత్మలకు మాత్రమే సందేశమును ఇవ్వగలిగారు. ఇప్పుడు కొద్ది సమయం లోపల ఎప్పుడైతే మొత్తం విశ్వంలోని ఆత్మలందరికి సందేశమునిచ్చి, జ్ఞానము మరియు యోగముల పరిచయమును ఇచ్చి బాబాను గుర్తించేలాంటి కర్తవ్యమునైతే చేయవలసిందే, దానితో పాటు ఈ ప్రకృతిని కూడా పావనంగా తయారు చేయాలి, అప్పుడే విశ్వపరివర్తన జరుగుతుంది. కొద్ది సమయంలో చాలా పెద్ద కర్తవ్యమును చేసేందుకు భవిష్యత్తులో ఏ ప్లానును తయారుచేశారు? వాటి రూపురేఖలు మీ బుద్ధిలోకి వస్తున్నాయా? ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అదే రూపురేఖ ఉందా లేక ఏదైనా భిన్నంగా ఉందా, అయితే అది ఏమిటి? దానిని ముందుగానే చూస్తున్నారా లేక నడుస్తూ తిరుగుతూ చూస్తున్నారా? స్పష్టంగా ఉన్నట్లయితే రెండు మాటల్లో వినిపించండి.
ఇప్పుడు సమయము కూడా షార్ట్ గా ఉంది, కావున ప్లాను కూడా షార్ట్ గా కావాలి. షార్ట్ గా ఉండాలి కాని శక్తిశాలిగా ఉండాలి. ఆ రెండు పదాలూ ఏమిటి? భవిష్య ప్లాను ప్రాక్టికల్ రూపంలో రెండు పదాల యొక్క ఆధారంపైనే జరుగనున్నది. ఆ రెండు పదాలను ఇంతకుముందు కూడా వినిపించారు. ఒకటేమో సాక్షాత్ బాబా మూర్తిగా ఉండాలి మరియు ఇంకొకటి సాక్షిగా మరియు సాక్షాత్కారమూర్తులుగా ఉండాలి. ఎప్పటివరకైతే ఈ రెండు మూర్తులుగా అవ్వరో అప్పటివరకు మొత్తం విశ్వపరివర్తనను కొద్ది సమయంలో చేయలేరు. ఈ ప్లానును ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేందుకు ఏవిధంగా ఇప్పుడు కూడా స్టేజ్ ను మరియు స్పీచ్ ను తయారుచేస్తారో అలా మీరు మీ స్థితిరూపీ స్టేజ్ ను తయారుచేసుకోవలసి ఉంటుంది.
మీ రూపురేఖల ద్వారా భవిష్య సాక్షాత్కారమును చేయించేందుకు ఏ విధంగా భిన్న భిన్న పాయింట్లను గూర్చి ఆలోచిస్తూ స్టేజ్ ను తయారుచేసుకుంటారో అలాగే ఈ ముఖముపై ఏ ముఖ్యమైన కర్మేంద్రియాలైతే ఉన్నాయో వాటి ద్వారా బాబా చరిత్ర మరియు బాబా కర్తవ్యము సాక్షాత్కారమవ్వాలి, బాబా గుణాల సాక్షాత్కారమవ్వాలి. ఈ భిన్న భిన్న పాయింట్లను తయారుచేయవలసి ఉంటుంది. నయనాల ద్వారా, దృష్టి ద్వారా అతీతంగా చేయగలగాలి, అనగా నయనాల దృష్టి ద్వారా ఆ కర్మేంద్రియాల దృష్టి, వృత్తి, స్మృతి మరియు కృతిని మార్చివేయండి. మస్తిష్కము ద్వారా స్వయం యొక్క లేక అందరి యొక్క స్వరూపాలను స్పష్టంగా సాక్షాత్కరింప చేయించండి. మీ పెదాలపై ఉన్న ఆత్మిక మందహాసం ద్వారా అవినాశీ సంతోషమును అనుభవం చేయించండి. మీ మొత్తం ముఖం ద్వారా వర్తమానపు శ్రేష్ఠ పొజిషన్ మరియు భవిష్య పొజిషన్ ను సాక్షాత్కరింప చేయించండి. మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా ఇతర ఆత్మల వ్యర్థ సంకల్పాలు లేక వికల్పాల యొక్క ప్రవహిస్తున్న వరద నుండి మీ శక్తి ద్వారా అల్పకాలంలో తీరానికి చేర్చి చూపించండి. వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి మార్చివేయండి. మీ ఒక్క మాట ద్వారా అనేక తపిస్తున్న ఆత్మలకు తమ లక్ష్యం యొక్క, గమ్యం యొక్క ఆధారమును అనుభవం చేయించండి. ఆ ఒక్క మాట ఏమిటి? 'శివబాబా'. 'శివబాబా' అని అనడంతోనే లక్ష్యము, ఆధారము లభించేస్తాయి. తమ ప్రతి కర్మ అనగా చరిత్ర ద్వారా, చరిత్ర అంటే కేవలం బాబాదే కాదు శ్రేష్ఠ ఆత్మలైన మీ ప్రతి ఒక్కరి శ్రేష్ఠ కర్మలు కూడా చరిత్రలే. సాధారణ కర్మలను చరిత్ర అని అనరు. కావున ప్రతి శ్రేష్ఠ కర్మరూపీ చరిత్ర ద్వారా బాబా చిత్రమును చూపించండి. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మికమైన ప్రాక్టికల్ స్పీచ్ ను చేస్తారో అప్పుడు కొద్ది సమయంలో విశ్వపరివర్తనను చేస్తారు. దీని కొరకు స్టేజ్ కూడా కావాలి. స్టేజ్ ను తయారుచేయడంలో ఏయే ముఖ్య సాధనాలను ఉపయోగిస్తారు? అవైతే మీకు తెలుసు కదా! అది మీ విశేషమైన చిహ్నము. స్టేజ్ ను తెల్లగా తయారుచేస్తారు, ఇదే మీ ముఖ్యమైన చిహ్నము. ఏ విధంగా మీ వస్త్రాలు తెల్లగా ఉన్నాయో, ఏ విధంగా ఆత్మ యొక్క స్థితి ఉంటుందో అలాగే బయటి స్థితికి కూడా రూపాన్ని ఇస్తారు. కావున ఈ విషయాలనేవైతే స్థూలమైన స్టేజ్ పై ఉంచే ప్రయత్నం చేస్తారో వాటిలో నుండి ఒక్కటైనా స్మృతిలో లేకపోతే లేక యథార్థ రూపంలో లేకపోతే, అప్పుడు ఆ స్టేజ్ యొక్క ప్రకాశము మంచిగా కనిపించదు. అదేవిధంగా ఎప్పుడైతే మీ స్థితి యొక్క స్టేజీ ద్వారా ప్రాక్టికల్ స్పీచ్ ను ఇవ్వవలసి ఉంటుందో అప్పుడు దాని కొరకు కూడా ఈ విషయాలన్నింటి యొక్క ఏర్పాట్లు కావాలి. లైట్ కావాలి అనగా డబుల్ లైట్ స్వరూపపు స్థితి కావాలి. ఇదైతే మీకు తెలుసు కదా! రెండూ లైటే. స్టేజ్ పై ఎవరైనా తేలికగా లేకపోతే, లేవడంలో, కూర్చోవడంలో భారీగా అయిపోతే స్పీచ్ ను వినేందుకు బదులుగా జనాలు వారినే చూడడం మొదలుపెడతారు. కావున ఇక్కడ డబుల్ లైట్ స్థితి కావాలి. అలాగే మైక్ కూడా చాలా శక్తిశాలిగా ఉండాలి. దూరం వరకు కూడా శబ్దం స్పష్టరూపంలో చేరుకోవాలి. కావున మైక్ లో కూడా మైట్ ఉండాలి. ఒక్క సంకల్పం చేయండి, ఒక్క దృష్టి అటువైపుకు సారించడంతోనే ఆ దృష్టి మరియు ఆ సంకల్పము లైట్ హౌసులా పనిచేయాలి. ఒకే స్థానంలో ఉంటూ కూడా అనేక ఆత్మలపై మీ శ్రేష్ఠ సంకల్పాలు మరియు దివ్యదృష్టి యొక్క ప్రభావము పడాలి. ఇటువంటి శక్తిశాలీ మైకులలా అవ్వాలి. మరి ఇక్కడ మైక్ దేనికి గుర్తు? సంకల్పాలు మరియు దృష్టి. దివ్యమైన మరియు ఆత్మికమైన దృష్టి. అలాగే తెల్లదనము అనగా స్వచ్ఛమైన బుద్ధి కావాలి. అందులో కొద్దిగ కూడా ఎటువంటి మచ్చ ఉండకూడదు. ఒకవేళ స్టేజ్ పై మచ్చ ఉంటే, తెల్లదనము లేకపోతే అందరి ధ్యానము కోరుకోకపోయినా అటువైపుకు వెళ్ళిపోతుంది అలాగే మళ్ళీ స్లోగనుల యొక్క అలంకరణ కూడా కావాలి. ఈ స్థితిరూపీ స్టేజ్ పై ఏ స్లోగనుల యొక్క అలంకరణ, కావాలి? స్థితిరూపీ స్టేజ్ మరియు ప్రాక్టికల్-మనసా-వాచా-కర్మణారూపీ భాషణ ఉండాలి. ఇటువంటి స్టేజ్ కొరకు ఎటువంటి స్లోగన్లు కావాలి?
ఒకటేమో- ఆత్మనైన నేను విశ్వకళ్యాణం యొక్క శ్రేష్ఠ కర్తవ్యం కొరకు సర్వశక్తివంతుడైన బాబా ద్వారా నిమిత్తమయ్యాను అన్న ఈ స్లోగన్ స్మృతిలో ఉండాలి. ఈ స్థితిలో ఈ స్లోగన్ గుర్తుండకపోతే స్థితి సుందరంగా అనిపించదు. ఇవి విశేషంగా ధారణ కొరకు ఉన్న స్లోగనులే. ఇంకొక స్లోగన్ - ఆత్మనైన నేను మహాదానిని మరియు వరదానిని. ఏ ఆత్మలకైతే దానమును తీసుకునే లేక ఇచ్చే సాహసం ఉండదో, వారికి కూడా వరదాత అయిన బాబా ద్వారా లభించిన వరదానాల ద్వారా, తమ స్థితి యొక్క సహయోగం ద్వారా వరదానమును ఇవ్వాలి. కావున మరి స్లోగన్ ఏమిటి? నేను మహాదానిని మరియు వరదానిని, ఇది స్పష్టీకరణ. మూడో విషయము - ఆత్మనైన నేను నా చరిత్ర, మాటలు లేక సంకల్పాల ద్వారా నా మూర్తిలో ఆత్మలందరికీ బాప్ దాదా యొక్క మూర్తిని మరియు స్వరూపమును సాక్షాత్కరింపజేయాలి. ఈ విధంగా స్థితిని సుందరంగా తయారుచేసుకునే స్లోగన్ ఏదైతే ఉందో దానిని కూడా స్మృతిలో ఉంచుకోవాలి. కావున ఈ విధంగా మీ స్టేజ్ ను మరియు స్పీచ్ ను తయారుచేసుకోండి. స్టేజ్ పై, కూర్చీపై కూర్చోండి అనగా మీ స్టేటస్ రూపీ కుర్చీపై కూర్చోండి. కావున స్టేజీ, స్పీచ్ మరియు స్టేటస్ ఈ మూడూ అవసరము. మళ్ళీ కొద్ది సమయంలో విశ్వాన్ని మార్చివేస్తారు. ఇది చేయడమైతే వస్తుంది కదా! కావున స్టేజీ ఈ విధంగా దృఢంగా ఉండాలి అన్నది కూడా గుర్తుంచుకోండి. ఏకరసంగా, అచలంగా మరియు స్థిరంగా ఉండాలి, దానిని ఎటువంటి తుఫాను మరియు ఎటువంటి వాతావరణము చలింపజేయజాలకూడదు. ఈ విధంగా మీ ఏర్పాట్లు చేసుకోండి, ఇటువంటి అభ్యాసం ఉందా? ఈ విధంగా ఎవర్రడిగా, ఎవర్ హ్యాపీగా ఉన్నారా? ఎవరైతే ఒక్క క్షణంలో ఎటువంటి స్థితిని, ఎటువంటి స్థానమును మరియు ఎటువంటి ఆత్మల యొక్క భూమి ఉంటుందో అదేవిధంగా కొద్ది సమయంలో మీ స్థితిని తయారుచేసుకొని ప్రాక్టికల్ స్పీచ్ చేయగలగాలి. అర్థమైందా? ఇది భవిష్య ప్లాను.
అచ్ఛా - ఈ విధంగా సదా తమ స్థితి ద్వారా, స్టేటస్ ద్వారా సర్వాత్మలకు తమ సంపూర్ణ స్థితి మరియు తమ వాస్తవిక స్టేటస్ ను సాక్షాత్కరింపజేసే శ్రేష్ఠ ఆత్మలకు, విశ్వకళ్యాణకారీ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment