25-03-1971 అవ్యక్త మురళి

* 25-03-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“అతీతులుగా మరియు విశ్వ ప్రియులుగా అయ్యేందుకు విధి”.

           అందరూ మీ అలౌకిక మరియు పారలౌకిక నషా మరియు లక్ష్యములో ఎల్లప్పుడూ ఉంటున్నారా? అలౌకిక నషా, లక్ష్యము మరియు పారలౌకిక నషా, లక్ష్యము ఈ రెండింటి గురించి తెలుసా? రెండింటిలో అంతరముందా లేక ఒక్కటేనా? అలౌకిక నషా మరియు నిషానా ఈ ఈశ్వరీయ జన్మకు సంబంధించినవైతే, పారలౌకిక నషా మరియు లక్ష్యము భవిష్య జన్మకు సంబంధించినవి. మరి ఈశ్వరీయ జన్మ యొక్క నషా మరియు లక్ష్యము గుర్తు ఉందా? అలాగే పారలౌకిక అనగా భవిష్యత్తు యొక్క నషా మరియు లక్ష్యము గుర్తు ఉన్నాయా? ఒకవేళ ఈ రెండూ అన్నివేళలా ఉన్నట్లయితే ఎటువంటి స్మృతి తయారౌతుంది? అలౌకిక నషా మరియు లక్ష్యము ద్వారా అతీతంగా తయారైతే పారలౌకిక నషా మరియు లక్ష్యముల ద్వారా విశ్వప్రియులుగా తయారౌతారు. కావున ఈ రెండు నషాలు మరియు లక్ష్యముల ద్వారా అతీతంగా మరియు ప్రియంగా తయారౌతారు. అర్థమైందా!

           ఇప్పుడు అన్నింటి నుండీ అతీతంగా అవ్వాలి. మీ దేహము నుండి కూడా అతీతంగా తయారైనట్లయితే అన్ని విషయాలలో కూడా అతీతమైపోతారు. అతీతంగా అయ్యేందుకు ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. అతీతంగా అవ్వటం ద్వారా తరువాత స్వతహాగనే అందరికీ ప్రియులుగా అయిపోతారు, ప్రియంగా అయ్యేందుకు పురుషార్థము చెయ్యవలసిన అవసరము ఉండదు. అతీతంగా అయ్యేందుకే పురుషార్థము చెయ్యవలసి ఉంటుంది. ఒకవేళ అందరికీ ప్రియంగా అవ్వాలంటే ఏ పురుషార్థము చెయ్యాలి? అన్నింటి నుండీ అతీతంగా అయ్యే పురుషార్థము చెయ్యాలి. మీ దేహము నుండి అతీతంగా అయితే అవ్వనే అవుతారు, కానీ ఆత్మలో ఏ పాత సంస్కారాలైతే ఉన్నాయో వాటి నుండి కూడా అతీతంగా అవ్వండి. అలా కాక వాటికి ప్రియంగా అయ్యే పురుషార్థము ద్వారా ప్రియంగా అయినట్లయితే రిజల్టుగా ఏముంటుంది? ఇంకా ప్రియంగా అయ్యేందుకు బదులుగా బాప్ దాదాల హృదయరూపీ సింహాసనము నుండి దూరమైపోతారు. కావున ఈ పురుషార్థము చెయ్యకూడదు. అతీతమైనదేదైనా తప్పకుండా ప్రియంగా అనిపిస్తుంది. ఈ సంగఠనలో ఒకవేళ ఏదైనా అతీతమైన వస్తువు కనిపించినట్లయితే అందరి ఆకర్షణ మరియు అందరి ప్రేమ ఆ వైపుకు వెళ్తుంది. కావున మీరు కూడా అతీతంగా అవ్వండి, ఇది సహజ పురుషార్థము కదా! అతీతంగా అవ్వలేకపోతారు, దీనికి కారణము ఏమిటి? ఈ రోజుల్లోని ఆకర్షణ మొత్తము ప్రపంచములో ఏ కారణంగా ఉంటుంది? (అట్రాక్షన్ పై) అట్రాక్షన్‌ కూడా స్వార్థముతో ఉంటుంది. ఈ సమయములోని ఆకర్షణ స్నేహముతో కాకుండా స్వార్థముతో ఉంటుంది. కావున స్వార్థము కారణంగా ఆకర్షణ ఏర్పడుతుంది, మరియు ఆకర్షణ కారణంగా అతీతంగా అవ్వలేరు. మరి అందుకొరకు ఏం చెయ్యవలసి ఉంటుంది? స్వార్థము అంటే ఏమిటి? స్వార్థము అనగా స్వ రథమును స్వాహా చెయ్యండి. ఈ రథమేదైతే ఉందో అనగా దేహ అభిమానము, దేహ స్మృతి, దేహ ఆకర్షణల ఈ స్వార్థమును ఎలా అంతము చెయ్యాలి? దానికి సహజ పురుషార్థము - స్వార్థ అన్న పదమునకు గల అర్థమును తెలుసుకోండి. స్వార్థము పోయినట్లయితే అతీతంగా అవ్వనే అవుతారు. కేవలము ఒక్క అర్థాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని అర్థ స్వరూపంగా అవ్వాలి. కావున ఒక్క మాటకు గల అర్థాన్ని తెలుసుకోవటం ద్వారా సదా ఒక్కరికి చెందినవారిగా మరియు ఏకరసంగా తయారైపోతారు. అచ్ఛా!

           ఈ రోజు టీచర్స్ భట్టీ ప్రారంభోత్సవము. సంపూర్ణ ఆహుతిని వేసే సామర్థ్యము ఉందా? ఈ గ్రూపు ఇంచార్జ్ టీచర్స్ ది కదా! ఇప్పుడు ఇలా ఉన్నారా లేక తయారవ్వనున్నారా? ఎల్లప్పుడూ మీ సంపూర్ణ స్థితిని మరియు మీ సంపూర్ణ స్వరూపమును ఆహ్వానిస్తూ ఉండండి. ఏవిధంగా ఎవరినైనా ఆహ్వానించినప్పుడు బుద్ధిలో అదే స్మృతి ఉంటుంది కదా! ఈ విధంగా ఎల్లప్పుడూ మీ సంపూర్ణ స్వరూపమును ఆహ్వానిస్తూ ఉన్నట్లయితే ఎల్లప్పుడూ అదే స్మృతిలో ఉంటారు. మరియు ఈ స్మృతిలో ఉన్న కారణంగా ఏ రిజల్టు ఉంటుంది? ఆ ఆవాగమన చక్రమేదైతే నడుస్తూ ఉందో, ఆవాగమన చక్రమేది? ఒక్కోసారి ఉన్నత స్థితిలో ఉంటారు, ఒక్కోసారి క్రిందకు వచ్చేస్తారు. ఇలా పైకి క్రిందకూ వచ్చే ఆవాగమన చక్రమేదైతే ఉందో ఆ చక్రము నుండి ముక్తులైపోతారు. ఆ మనుష్యులైతే జన్మమరణ చక్రము నుండి ముక్తులవ్వాలని కోరుకుంటారు మరియు మీరు ఈ స్మృతి-విసృతుల ఆవాగమన చక్రమేదైతే ఉందో దాని నుండి ముక్తులయ్యేందుకు పురుషార్థము చేస్తారు. కావున ఎల్లప్పుడూ మీ సంపూర్ణ స్వరూపమును ఆహ్వానించడము ద్వారా ఆవాగమనము నుండి తొలగిపోతారు అనగా ఈ వ్యర్థ విషయాల నుండి దూరమవ్వటం ద్వారా ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్న లక్కీ సితారలుగా తయారైపోతారు. ఇంచార్జ్ టీచరుగా అయ్యేందుకు మొదట మీ ఆత్మరూపీ బ్యాటరీని చార్జ్ చెయ్యండి. ఎంతగా ఎవరి బ్యాటరీ చార్జ్ అవుతుందో అంతగానే మంచి ఇంచార్జ్ టీచరుగా అవ్వగలరు. అర్థమైందా! నేను ఇంచార్జ్ టీచరును అని గుర్తు వచ్చినప్పుడంతా నా బ్యాటరీ చార్జ్ అయ్యి ఉందా అని మొదటగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ బ్యాటరీ చార్జ్ తక్కువగా అయినట్లయితే ఇంచార్జ్ టీచరులో కూడా అంతగానే లోపము కనిపిస్తుంది. మరి ఇప్పుడేం చెయ్యాలి? మంచిగా బ్యాటరీని చార్జ్ చేసుకొని మళ్ళీ ఇంచార్జ్ గా అయ్యి వెళ్ళాలి. ఏదో అలా కేవలము ఇంచార్జ్ గా అయ్యి వెళ్ళవద్దు. ఒకవేళ బ్యాటరీ చార్జ్ కాకుండా ఇంచార్జ్ గా అయినట్లయితే ఏమౌతుంది? చార్జ్ అన్న పదమునకు రెండు మూడు అర్థాలు ఉన్నాయి. 1. బ్యాటరీ చార్జ్ అవ్వటము 2. చార్జ్ అనగా డ్యూటీ కూడా 3. దోషిపై చార్జ్ తీసుకుంటారు అని అంటారు. ఎవరిపైనైనా చార్జ్ వేస్తారు కదా! కావున ఇంచార్జ్ అవ్వటంతో ఒకవేళ బ్యాటరీ చార్జ్ అయినట్లయితే ఇంచార్జ్ గా యథార్థ రీతిలో అవుతారు. ఒకవేళ బ్యాటరీ చార్జ్ అవ్వనట్లయితే, యథార్థరూపము లేనట్లయితే తరువాత భిన్నభిన్న చార్జీలు పడతాయి. కావున ఎలా ఇంచార్జ్ అవుతారు అన్నది ఇప్పుడు అర్థమైందా? ధర్మరాజపురిలో మొదట చార్జ్ ను ఇచ్చి తరువాత శిక్షను ఇస్తారు. కావున ఒకవేళ బ్యాటరీ చార్జ్ అవ్వనట్లయితే చార్జెస్ పడతాయి. అందరి దృష్టిలోకి ఈ గ్రూపు వచ్చేటట్లుగా అలా తయారై వెళ్ళాలి. పెద్దవారు పెద్దవారే, కానీ చిన్నవారు కూడా తక్కువేమీ కారు అని అందరూ అనుభవము చెయ్యాలి. ఇటువంటి లక్ష్యమును పెట్టుకొని, భట్టీ  నుండి అటువంటి లక్షణములను ధారణ చేసేందుకు వెళ్ళాలి. మిమ్మల్ని మీరు ఎక్కడ మలచుకోవాలనుకుంటే అక్కడ మలచుకోగలిగినంత కోమలంగా అవ్వాలి. కోమలమైనదానిని ఎక్కడ వంచాలనుకుంటే అక్కడ వంచగలరు. కానీ కఠినమైన దానిని ఎవ్వరూ వంచలేరు. కోమలంగా అవ్వాలి కానీ ఎందులో? సంస్కారాలను మార్చుకోవడములో కోమలంగా అవ్వండి కానీ కోమలమైన మనస్సు నుండి దూరంగా ఉండాలి. ఈ లక్ష్యము మరియు లక్షణములను ధారణ చేసి వెళ్ళాలి. స్నేహీ మరియు సహయోగిగా అయ్యే వారైన ఈ గ్రూపుకు ఇచ్చే స్లోగన్ 'అధికారిగా అవుతాము మరియు అధీనతను తొలగిస్తాము' ఎప్పుడూ అధీనులుగా అవ్వవద్దు. సంకల్పాలకైనా, మాయకైనా లేక ఇతర వేరే రూపాలకైనా అధీనులుగా అవ్వవద్దు. ఈ శరీరమును కూడా అధికారులుగా అయ్యి నడిపించాలి మరియు మాయపై కూడా అధికారులుగా అయ్యి దానిని మీ అధీనము చేసుకోవాలి. సంబంధాల అధీనతలోకి కూడా రాకూడదు. లౌకిక సంబంధములోనైనా లేక ఈశ్వరీయ సంబంధములోనైనా అధీనతలోకి రాకూడదు. సదా అధికారులుగా అవ్వాలి. ఈ స్లోగన్ ను ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలి. ఇలా తయారయ్యే వెళ్ళాలి. మానస సరోవరములో స్నానం చెయ్యటం ద్వారా ఫరిస్తాగా అవుతారు అని ఒక నానుడి ఉంది కదా! ఈ గ్రూపు కూడా భట్టీరూపీ జ్ఞాన మానస సరోవరములో స్నానము చేసి ఫరిస్తాగా తయారై వెళ్ళాలి.

           ఫరిస్తాగా అయినట్లయితే ఫరిస్తా అనగా ప్రకాశమయ శరీరము. ఈ దేహపు స్మృతి నుండి కూడా దూరము. వారి పాదములు అనగా బుద్ధి ఈ పంచ తత్వాల ఆకర్షణ నుండి కూడా ఉన్నతంగా అనగా దూరంగా ఉంటుంది. అటువంటి ఫరిస్తాలను మాయ లేక ఏ మాయావి కూడా తాకజాలరు. కావున ఏ మాయావీ మనుష్యులు గానీ, మాయ గానీ తాకను కూడా తాకలేనంతగా అలా తయారై వెళ్ళాలి. కుమారీల మహిమ చాలా ప్రసిద్ధమైనది. కానీ ఏ కుమారి? బ్రహ్మాకుమారీల మహిమ ప్రసిద్ధమైనది. బ్రహ్మాకుమారి అనగా బ్రహ్మా బాబాను ప్రత్యక్షముచేసే కుమారి. ఎవరైతే టీచర్స్ గా అవుతారో వారైతే కేవలము పాయింట్ ను బుద్ధిలో ఉంచుకోకూడదు మరియు వర్ణన చెయ్యకూడదు, కానీ పాయింట్ (బిందు)రూపంగా అయ్యి పాయింట్ ను వర్ణన చెయ్యాలి. ఒకవేళ స్వయం పాయింట్ స్థితిలో స్థితులవ్వనట్లయితే పాయింట్ కు ఎటువంటి ప్రభావమూ ఉండదు. కావున పాయింట్స్ ను ప్రోగుచేసుకోవడంతో పాటూ, మీ పాయింట్ రూపమును కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే పుస్తకం నిండిపోతుందో అప్పుడు పుస్తకాన్ని చూసి, సాకార బ్రహ్మాబాబా చరిత్రకు కాపీగా అయ్యానా అని అన్నింటినీ పరిశీలించుకోవాలి. కాపీ ఖచ్చితంగా అదే విధముగా ఉంటుంది కదా! అలా బాబా సమానంగా కనిపించాలి. ఎంత సమానత ఉంటుందో అంతగా ఎదుర్కొనేందుకు శక్తి ఉంటుంది. సమానతను తీసుకురావటం ద్వారా ఎదుర్కొనే శక్తి స్వతహాగనే వచ్చేస్తుంది. అచ్ఛా!

           ఈ గ్రూపు తక్కువేమీ కాదు. ఇంతటి పెద్ద శక్తిదళము ఎప్పుడైతే మూలమూలలో సేవ గురించి వ్యాపించినట్లయితే ఏమవుతుంది? బ్రహ్మాకుమారీలకు జై అన్న శబ్దము ప్రసిద్ధమైపోతుంది. ఇప్పుడైతే నిందిస్తున్నారు కదా! ఇక్కడనే మీ ఎదురుగా మహిమ అనే పుష్పాలను పెడతారు కావుననే ఎవరైనా చూడటంతోనే అందరి నోటి నుండి ఈ శబ్దము ప్రసిద్ధమై వెలువడేటట్లుగా అలా తయారై వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఈ గ్రూపు ఈ ప్రాక్టికల్ పేపర్‌ను ఇవ్వాలి. నాలుగువైపులా బాప్ దాదా మరియు సహయోగీ పిల్లల జయజయకారాలు మారుమ్రోగాలి. అటువంటి శక్తి ఉందా? ఒక్కరి సాంగత్యములోనే ఉండటం ద్వారా సాంగత్యదోషము నుండి దూరమౌతారు. సాంగత్యదోషము అనేక రకాల దోషాలను ఉత్పన్నము చేస్తుంది, కావున దీనిపై చాలా ధ్యానమునుంచాలి. ఒకరు తండ్రి, రెండవది మేము అంతే, మూడోవారెవ్వరూ లేరు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఉంటుందో అప్పుడిక ఎల్లప్పుడూ మీ మస్తకము నుండి మూడవ నేత్రపు సాక్షాత్కారము జరుగుతుంది. ఇక్కడి స్మృతి చిహ్నము ఏదైతే ఉందో అందులో యోగమునకు గుర్తుగా ఏం చూపించారు? మూడవ నేత్రము. ఒకవేళ బుద్ధిలో మూడవవారు ఎవరైనా వచ్చారంటే మళ్ళీ మూడవ నేత్రము మూసుకొని పోతుంది కావున ఎల్లప్పుడూ మూడవ నేత్రము తెరుచుకొని ఉండాలి, ఇందుకొరకు మూడవవారు ఎవ్వరూ లేరు అన్నదానిని గుర్తు ఉంచుకోవాలి. అచ్ఛా!

Comments