24-12-1974 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఒకసారి సహయోగం ఇవ్వటం అంటే అంతిమం వరకు సహయోగం తీసుకోవటం.
సహజయోగి పిల్లలకు సదా మరియు అంతిమం వరకు సహయోగిగా అయ్యేటువంటి దయాహృదయుడైన శివబాబా ఈ మధుర మహవాక్యాలు తెలియచేస్తున్నారు -
బాప్ దాదా సదా విదేశీయులను నెంబర్ వన్‌గా స్మృతి చేస్తారు. ఎలా అయితే బంధనాలలో ఉండేవారు మొదట జ్ఞాపకం వస్తారో అలాగే విదేశంలో ఉండే పిల్లలు కూడా జ్ఞాపకం వస్తారు. వారికి కూడా మాటిమాటికి ఈ దేశానికి రావటానికి బంధన కదా? బాప్ దాదా అందరికంటే సమీపంగా చూస్తారు. ఎవరైతే విదేశానికి సేవకు వెళ్ళారో వారు ఏమైనా దూరమా? వారు కళ్ళ ఎదురుగా లేరు కానీ నయనాలలో ఇమిడి ఉన్నవారు, ఎప్పుడు దూరం అవ్వరు. వారు అయితే అందరి కంటే సమీపం అయ్యారు కదా? మీరు నయనాల ఎదురుగా ఉంటున్నారా లేదా నయనాలలో ఇమిడి ఉంటున్నారా? ఎవరైతే ఇమిడి ఉంటారో వారే నిరంతర యోగి. విదేశంలో ఉండే పిల్లలు సమీపంగా వస్తున్నారు. దేశం యొక్క లెక్కతో దగ్గరగా ఉండేవారు నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా రావటంలేదు. అంటే ఎవరు సమీపం అయ్యారు? ఇదంతా సూక్ష్మ సంబంధం, సమీప సంబంధం. కనుకనే సమీంగా వచ్చారు. ఇది ఋజువు కదా? డ్రామానుసారం చూడండి, ఇంతమంది మహరథీల సంకల్పం సాకారం అవ్వలేదు. కానీ ఒకే బాబా యొక్క సంకల్పమే సాకారం అయ్యింది. మరలా సమీపం అయ్యారు కదా? స్వయాన్ని బాప్ దాదాకు దూరంగా భావించకండి.
మీ జన్మపత్రాన్ని చూసుకోవాలి. ఆది నుండి అంటే జన్మ నుండి నా అదృష్టరేఖ ఎలా ఉంది? అని. ఎవరికైతే జన్మతోనే అదృష్టం లభించిందో, ఆది సమయం యొక్క అదృష్టాన్ని తయారు చేసుకుని వచ్చారో, దాని ఆధారంగా వారికి తర్వాత వెనుక లిఫ్ట్ లభిస్తుంది. ఆది నుండే సహజప్రాప్తి లభించింది కదా? శ్రమ తక్కువ మరియు ప్రాప్తి ఎక్కువ. ఈ లాటరీ లభించింది. ఒక రూపాయి లాటరీకి లక్షలు లభిస్తే శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ అయినట్లే కదా? ఏదైనా విషయంలో ఒకవేళ సమయానికి ఏదైనా సంకల్పాన్ని ఆజ్ఞగా భావించి ఎవరైతే సహయోగిగా అవుతారో ఆ సమయం యొక్క సహయోగులకు బాప్ దాదా కూడా అంతిమం వరకు సహయోగి అయ్యేటందుకు బంధించబడి ఉన్నారు. ఒకసారి సహయోగం ఇవ్వటం ద్వారా అంతిమం వరకు సహయోగం తీసుకునే అధికారిగా చేస్తుంది. ఒకటికి వంద రెట్లు లభించటం ద్వారా శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. మనస్సుతో, తనువుతో అయినా, ధనంతో అయినా కానీ సమయానికి సహయోగి అయ్యారంటే బాప్ దాదా అంతిమం వరకు సహయోగం ఇచ్చేటందుకు బంధించబడి ఉన్నారు. దీనినే భక్తులు మరో మాటలో అందశ్రధ్ధ అని అంటారు. ఇలా ఒకవేళ ఎవరైనా జీవితంలో ఒకసారైనా బాప్ దాదా కార్యంలో సహయోగి అయితే వారికి అంతిమం వరకు బాప్ దాదా సహయోగిగా ఉంటారు. ఇది కూడా ఒక లెక్క. అరమైందా! మంచిది.
Comments
Post a Comment