24-12-1972 అవ్యక్త మురళి

* 24-12-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"సంగమయుగ శ్రేష్ఠ ఆత్మల బాధ్యత"

          అందరూ విధాత, విధానము మరియు విధులను మంచిగా తెలుసుకున్నారా? ఒకవేళ విధాతను తెలుసుకున్నట్లయితే విధానము మరియు విధి స్వతహాగనే బుద్ధిలోకి మరియు కర్మలోకి వచ్చేస్తాయి. విధాత ద్వారా శ్రేష్ఠ ఆత్మలైన మీరందరు విధానమును తయారుచేయించేవారుగా తయారయ్యారు, అలా స్వయమును భావించుకొని ప్రతి కర్మను చేస్తున్నారా? ఎందుకంటే ఈ సమయములో బ్రాహ్మణులైన మీ శ్రేష్ఠ కర్తవ్యము ఏదైతే ఉందో అదే విశ్వము కొరకు మొత్తము కల్పములో విధానముగా తయారవుతుంది. బ్రాహ్మణులైన మీ కర్తవ్యము ఇంతటి మహత్వపూర్ణమైనది. అలా మీ ప్రతి కర్మను మహత్వపూర్ణముగా భావించుకొని చేస్తున్నారా? స్వయమును విధానమునకు రచయితగా భావించుకొని ప్రతి కర్మను చెయ్యాలి. ఆచార వ్యవహారాలన్నీ ఎప్పటినుండి మరియు ఎవరి ద్వారా మొదలవుతాయి? అవే మళ్ళీ మొత్తము కల్పమంతటిలో కొనసాగుతూ వస్తాయి! ఈ సమయములో బ్రాహ్మణులైన మీ ఆచార వ్యవహారాలు, పద్ధతులు ప్రాక్టికల్ జీవితము రూపంలో నడుస్తాయి, అవి సదాకాలము కొరకు అనాది విధానముగా తయారవుతాయి. అలా భావించుకొని ప్రతి కర్మను చెయ్యటం ద్వారా ఎప్పుడు కూడా నిర్లక్ష్యము రాదు. ఈ విధిపూర్వకమైన స్మృతి స్వరూపంగా అయ్యి నడవాలి. ఇంత పెద్ద బాధ్యతగా భావించి కర్మ చెయ్యాలి - ఈ స్మృతి ఉంటుందా? సంగమయుగములోని ప్రతి ఒక్క శ్రేష్ఠ ఆత్మకు బాధ్యత లభించి ఉంది, ఇదే సంగమయుగ విశేషత. ఇది ఏదో విశేష ఆత్మల బాధ్యత, మనము వారు తయారుచేసిన విధానాలపై నడిచేవారము అని భావించడము కాదు. ప్రతి ఒక్క ఆత్మ విధానమును తయారుచేసేవారే - ఈ నిశ్చయము ద్వారా ప్రతి కర్మ యొక్క సంపూర్ణ సిద్ధిని పొందగలరు ఎందుకంటే స్వయమును విధానము యొక్క రచయితగా భావించుకొని ప్రతి కర్మను యథార్థ విధితో చేస్తారు. యథార్థవిథి యొక్క సంపూర్ణ సిద్ధి తప్పకుండా ప్రాప్తిస్తుంది. సిద్ధిని పొందేందుకు కేవలము ఒక్క విషయము బుద్ధిలో స్పష్టంగా వచ్చినట్లయితే సహజంగానే విధిని పొందగలరు. అది ఏ విషయము? ఈ స్మృతి కూడా విస్మృతిలోకి ఎందుకని వచ్చేస్తుంది? ఏ విషయము నిమిత్తంగా అవుతుంది? కేవలము ఒక్క యుక్తి వచ్చినట్లయితే విస్మృతి నుండి సదాకాలము కొరకు సహజముగానే ముక్తులైపోగలరు, అది ఏ యుక్తి? ఏదైనా విషయము విఘ్నరూపముగా ముందుకు వస్తే, వచ్చిన ఆ విషయమును పరివర్తన చేసే ఈ యుక్తి వచ్చినట్లయితే సదా విఘ్నాల నుండి ముక్తులైపోగలరు. విసృతికి కారణముగా వ్యర్థ స్మృతి, వృత్తి, దృష్టి మరియు సంపర్కములు తయారవుతాయి. వీటన్నింటిని పరివర్తన చెయ్యటము వచ్చినట్లయితే పరిపక్వత వచ్చేస్తుంది. ఏదైనా వ్యర్థ స్మృతి వస్తే, దేహము మరియు దేహ సంబంధములు, దేహ పదార్థాల స్మృతిని పరివర్తన చెయ్యటము వచ్చినట్లయితే పరిపక్వ స్థితి తయారవ్వదా? అలాగే వృత్తి మరియు దృష్టిని పరివర్తన చెయ్యటము వచ్చినట్లయితే, సంపర్కమును పరివర్తన చెయ్యటము వచ్చినట్లయితే సంపూర్ణతకు సమీపంగా వచ్చేస్తారు కదా! పరివర్తన చేసే పద్ధతి రాదు, దేహదృష్టికి బదులుగా దేహీ దృష్టిని పరివర్తన చేసుకోవటము, వ్యక్త సంపర్కమును అవ్యక్త, అలౌకిక సంపర్కములోకి పరివర్తన చెయ్యటము, ఇందులోనే లోపము ఉన్న కారణంగా సంపూర్ణ స్థితిని పొందలేకపోతారు. ప్రకృతిలో కూడా పరివర్తన చేసే శక్తి ఉందనే దానిని చూడాలి. సైన్స్ ప్రకృతి యొక్క శక్తి, ప్రకృతి శక్తి అయిన సైన్స్ వస్తువును ఒక్క క్షణములో పరివర్తన చెయ్యగలదు. వేడిని శీతలంగా, శీతలతను వేడిగా తయారు చెయ్యగలదు, సైన్స్ లో ఈ శక్తి ఉంది కదా? వేడి వాతావరణాన్ని శీతలంగా మరియు శీతల వాతావరణాన్ని వేడిగా తయారుచేస్తుంది.ప్రకృతిలోని పవర్ వస్తువును పరివర్తన చెయ్యగలిగినప్పుడు పరమాత్మ శక్తి లేక శ్రేష్ఠ ఆత్మల శక్తి తమ దృష్టి, వృత్తిని పరివర్తన చెయ్యలేకపోతాయా?

           మీ వృత్తి, మీ దృష్టినే పరివర్తన చేసుకోలేకపోవటం కారణంగా మీ కొరకు మీరే విఘ్నరూపులుగా తయారవుతారు. ప్రకృతి మీ రచన అయినప్పుడు, మీరైతే మాస్టర్ రచయితలు కదా! మరి ఆలోచించండి, నా రచనలో ఈ శక్తి ఉంది, కానీ మాస్టర్ రచయిత అయిన నాలో ఈ శక్తి లేదు, ఇది శ్రేష్ఠ ఆత్మల లక్షణమా? ఈరోజుల్లో ప్రకృతి యొక్క శక్తి ఒక్క క్షణములో ఏది కావాలంటే దానిని ప్రాక్టికల్ లో చేసి చూపిస్తుంది, కావున ఈరోజుల్లోని భ్రమిస్తున్న ఆత్మలు పరమాత్మ శక్తి ఈశ్వరీయ శక్తి లేక సైలెన్స్ శక్తిని ప్రాక్టికల్ గా  ప్రమాణరూపంలో చూడాలనుకుంటున్నారు. ఎవరైనా అపకారము చేసినా, మీరు ఒక్క క్షణములో అపకారమును ఉపకారములోకి పరివర్తన చేసెయ్యండి. ఎవరైనా వారి సంస్కారము లేక స్వభావమునకు వశమై మీ ఎదురుగా పరీక్ష రూపంలో వచ్చినా కానీ మీరు ఒక్క క్షణములో మీ శ్రేష్ఠ సంస్కారపు స్మృతి ద్వారా అటువంటి ఆత్మపట్ల కూడా దయాహృదయపు సంస్కారము లేక స్వభావమును ధారణ చెయ్యండి. ఎవరైనా దేహధారీ దృష్టితో ఎదురుగా వచ్చినా, మీరు ఒక్క క్షణములో వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేసెయ్యండి. ఎవరైనా పడద్రోసే ఆలోచనలతో లేక వారి సాంగత్యదోషములోకి తీసుకొని వచ్చే దృష్టితో ఎదురుగా వచ్చినా కానీ మీరు వారికి సదా శ్రేష్ఠ సాంగత్యపు ఆధారముతో  వారిని కూడా సాంగత్యదోషము నుండి బయటకు తీసి శ్రేష్ఠ సాంగత్యమును ఏర్పరచుకొనేవారిగా తయారుచెయ్యండి. ఇటువంటి పరివర్తన చేసే యుక్తి రావటం ద్వారా ఎప్పుడూ విఘ్నాలతో ఓటమి పొందరు. సంపర్కములోకి వచ్చేవారందరూ మీ ఈ సూక్ష్మ, శ్రేష్ఠ సేవపై బలిహారమైపోతారు. ఏవిధంగా తండ్రి ఆత్మలను పరివర్తన చేస్తారో, అందుకు తండ్రి కొరకు ధన్యవాదాలను గానం చేస్తారు, బలిహారమైపోతారు, అలా సంపర్కములోకి వచ్చే ఆత్మలందరూ మీకు కృతజ్ఞతలు చెబుతారు. ఒకటే సహజ యుక్తి కదా! మామూలుగా కూడా ఏ విషయమైనా, ఏ దృశ్యమైనా, ఏ వస్తువైనా పరివర్తన అయితే అవ్వవలసిందే. ఈ డ్రామా కూడా పరివర్తనశీలి. వినాశనమైతే జరిగేదే ఉంది, ముక్తిధామములోకైతే అందరూ వెళ్ళవలసిందే అని లోకులకు చెప్తుంటారు, కానీ ఒకవేళ వినాశనమునకు ముందే జ్ఞాన యోగముల ఆధారముతో వికర్మలను వినాశనము చేసుకున్నట్లయితే శిక్షల నుండి విముక్తి పొందుతారు. వెళ్ళటమైతే వెళ్ళవలసిందే, అయినా కూడా ఎవరు చేసుకుంటారో వారు పొందుతారు. ఈ రకంగా ప్రతి విషయము పరివర్తితమవ్వవలసిందే, కానీ ఏ సమయములో అయితే మీ ముందు ఆ విషయము విఘ్నరూపముగా అవుతుందో ఆ సమయములో మీ శక్తి ఆధారముతో ఒక్క క్షణములో పరివర్తితము చేసేసినట్లయితే ఆ పురుషార్థము చేసే ఫలితము మీకు ప్రాప్తిస్తుంది. పరివర్తన అయితే అవ్వవలసిందే కానీ సరియైన రూపములో, శ్రేష్ఠ రూపంలో పరివర్తన చెయ్యటం ద్వారా శ్రేష్ఠ ప్రాప్తి లభిస్తుంది. సమయం ఆధారంపై పరివర్తన ఉన్నట్లయితే ప్రాప్తి ఉండదు. ఏ విఘ్నము వచ్చిందో అది సమయప్రమాణంగా తప్పకుండా తొలగిపోతుంది కానీ సమయాని కంటే ముందే మీ పరివర్తనా శక్తి ద్వారా మొదటనే పరివర్తన చేసినట్లయితే దాని ప్రాప్తి మీకు లభిస్తుంది. కావున ఏది వచ్చిందో అది దానికదే తొలగిపోతుందిలే, లేక ఈ ఆత్మకు ఏదైతే లెక్కాచారము ఉందో అది పూర్తయిపోతుందిలే లేక సమయమే అందరికీ నేర్పిస్తుందిలే అని కూడా భావించకండి. నేను చేస్తే నేను పొందుతాను. సమయము చేసినట్లయితే మీరు పొందరు, అది సమయపు విశేషత అవుతుందే కానీ మీ విశేషత కాదు. సమయానికి ఏ విషయమైనా స్వతహాగనే జరిగితే దాని గాయనము ఉండదు కానీ సమయము ఆధారము లేకుండా ఏదైనా కార్యము చేసినట్లయితే అద్భుతముగా కొనియాడబడుతుంది. సీజన్లో వచ్చే పండ్లకు అంత విలువ ఉండదు, కానీ ఆ పండును అన్ సీజన్లో ప్రాప్తి చేసుకున్నట్లయితే ఎక్కువ విలువ ఉంటుంది. కనుక సమయము దానికదే సంపూర్ణముగా చేస్తుందని కూడా కాదు. సంపూర్ణంగా అయ్యి సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. సమయము రచన, మీరు రచయిత. రచయిత రచన ఆధారంపై ఉండరు. రచయిత రచనను అధీనము చేసుకుంటాడు. కావున అటువంటి పరివర్తన చేసే శక్తిని ధారణ చెయ్యండి. ఈ రోజుల్లో ఒక చిన్న మెషినరీ వస్తువును ఎంతగా పరివర్తన చేసేస్తుంది! పూర్తిగా పనికిరాని వస్తువును పనికొచ్చేవిధముగా తయారుచేస్తుంది, పాతను క్రొత్తగా చేస్తుంది. మరి మీ సర్వ శ్రేష్ఠ శక్తి యొక్క సూక్ష్మ మెషినరీ, మీ వృత్తి దృష్టి లేక ఇతరుల వృత్తి, దృష్టిని పరివర్తితము చెయ్యలేదా? ఇదైంది, అదైంది అని మళ్ళీ ఎప్పుడూ నోటి నుండి వెలువడదు. ఎటువంటి సాకులు చెప్పరు, ఇవి కూడా సాకులే. తమను తాము సురక్షితముగా ఉంచుకొనేందుకు భిన్న భిన్న సాకులు ఉంటాయి. సంగమయుగములో బ్రాహ్మణులకు అన్నింటికంటే ఎక్కువగా ఈ ఆట వస్తుంది అని వినిపించి ఉన్నాము కదా! దీని నుండే పరివర్తన చెయ్యాలి. సర్వుల సంస్కారాలను మార్చటము, ఈ లక్ష్యమే బ్రాహ్మణజీవితమునకు ఆధారము. ఇతరులు మారినప్పుడు మేము మారతాము, ఇలా కాదు. మనము మారి ఇతరులను మార్చాలి, ఇందులో స్వయమును సదా ముందు ఉంచుకోవాలి. ఇతరులు మారనీ, మారకపోనీ, నేను మారుతాను, అప్పుడు ఇతరులు స్వతహాగనే మారిపోతారు. కావున మీరు మార్చేవారు, విశ్వాన్ని పరివర్తన చేసేవారు, అంతేకానీ ఏదైనా విషయములో స్వయం మారిపోరు... ఇటువంటి లక్ష్యమును సదా స్మృతిలో ఉంచుకుంటూ మీకు మీరు పరిపక్వంగా తయారుచేసుకోండి. ఇప్పుడు సమయ సమీపతయొక్క ఘంటికలు మ్రోగుతున్నాయి. మీరు కూడా చాలా ఎక్కువ వేగముతో తండ్రి పరిచయము యొక్క ప్రత్యక్ష ప్రమాణమును చూపించేందుకు పురుషార్థము చెయ్యండి. ఏ పాలననైతే తీసుకున్నారో ఆ పాలన ఫలమును చూపించండి. వ్యక్త సాకారరూపుని ద్వారా శిక్షణ మరియు పాలన లభించాయి. అవ్యక్తరూపము ద్వారా కూడా చాలా శిక్షణలతో కూడిన పాలన లభించింది. ఇప్పుడు ఇది ఏ సమయము? ఇప్పటివరకు కూడా పాలననే తీసుకుంటుంటారా లేక పాలనకు ఫలితమును చూపిస్తారా? ఇప్పుడైతే డ్రామా యొక్క ఈ పాత్రనే చూపిస్తున్నారు - ఏవిధంగా సత్యయుగములో తల్లిదండ్రులు పాలన చేసి రాజ్యభాగ్యమునకు అధికారిగా తయారుచేసి, రాజ్య భాగ్యమును ఇచ్చి సింహాసనాధికారిగా తయారు చేసి రాజతిలకమును ఇచ్చి అనగా బాధ్యతా తిలకమును ఇచ్చి స్వయం సాక్షులుగా అయ్యి చూస్తారు. తోడుగా ఉన్నాకూడా సాక్షులుగా అయ్యి చూస్తారు. మరి ఈ విధానము కూడా ఎక్కడినుండి మొదలవుతుంది?

           ఇప్పుడు కూడా బాప్ దాదా ఈ విశ్వసేవ యొక్క బాధ్యతా తిలకమును ఇచ్చి స్వయం సాక్షిగా చూస్తారు. వారు సాక్షియే కదా! తోడుగా ఉంటూకూడా సాక్షి. ఈ సంవత్సరము ఇంకా సాక్షిగా అవ్వాలి. ఈ అవ్యక్తరూపపు మిలనము వ్యక్తుని ద్వారా కూడా ఎంతవరకు! కావున ఎవరైతే అవ్యక్తంగా అయ్యి అవ్యక్త తండ్రి ద్వారా అవ్యక్త మిలనమును జరుపుకోగలరో వారికి ఈ నూతన సంవత్సరములో అవ్యక్త స్థితిలో స్థితులను చేసే లేక అనుభవము కలిగించే డ్రిల్లును నేర్పిస్తున్నారు. ఏ పాత్ర కూడా ఎల్లప్పుడూ ఒకేవిధంగా నడవదు, ముందుకు వెళ్ళేందుకు మారుతూ ఉంటుంది. కావున ఇప్పుడు బాప్ దాదా విశేషంగా వ్యక్తరూపములో అవ్యక్త మిలనమును చేసే సహజ వరదానమును ఇస్తున్నారు.

           ఈ నూతన సంవత్సరములోని మొదటి మాసమునకు డ్రామా అనుసారంగా విశేషమైన వరదానము ఉంది, ఎవరైతే అవ్యక్త స్థితిలో ఉండే, తండ్రితో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణను చేసే పురుషార్థము చేస్తారో ఆ పురుషార్ధీ ఆత్మకు లేక లగనమును జోడించే ఆత్మకు, సత్యమైన హృదయముతో తండ్రి ద్వారా ప్రాప్తిని పొందే ఆత్మకు సహజముగానే వరదానము రూపములో అవ్యక్తమైన, అద్భుతమైన అనుభవములు ప్రాప్తిస్తాయి, కావున ఇప్పుడు వ్యక్తము ద్వారా అవ్యక్త మిలనము కూడా సమాప్తమైపోతుంది. అప్పుడిక ఏం చేస్తారు? మిలనమును జరుపుకోరా? అల్పకాలమునకు చెందిన మిలనమునకు బదులుగా సదాకాలపు మిలనము యొక్క అనుభవజ్ఞులుగా అయిపోతారు. ఎలా అనుభవము చేస్తారంటే పూర్తిగా సమీపంగా, సమ్ముఖంలో మిలనమును జరుపుకుంటున్నాము అన్నట్లుగా అనుభవము చేస్తారు. అర్థమైందా? ఈ నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరి లగనము అనుసారంగా అనేక అలౌకిక అనుభవాలు జరగగలవు, కావున విఘ్న వినాశకులుగా అయ్యి లగనములో మగనమై ఉండాలి. లగనము ద్వారా  విఘ్నము కూడా తన రూపమును మార్చేసుకుంటుంది. విఘ్నము విఘ్నముగా అనుభవ్వదు,కానీ విఘ్నములు విచిత్ర అనుభవీ మూర్తిగా తయారుచేసేందుకు నిమిత్తంగా అవుతాయి. విఘ్నము కూడా ఒక ఆటను చూపిస్తుంది. పెద్ద విషయము చిన్ని విషయంగా అనుభవమౌతుంది. “ఎలా" అన్న మాట మారిపోయి “ఇలా" గా అయిపోతుంది. 'తెలియదు' అన్న పదము మారిపోయి 'అనీ తెలుసు'గా అయిపోతుంది అనగా జ్ఞాన సంపన్నులుగా అవుతారు. కావున ఈ సంవత్సరమును విశేషంగా పురుషార్థములో తీవ్రతను తీసుకువచ్చే సంవత్సరంగా భావించి జరుపుకోవాలి. స్వయమును మార్చుకొని విశ్వమును పరివర్తన చేసే విశేష సంవత్సరంగా జరుపుకోవాలి.అచ్ఛా!

           విధానము, విధి మరియు విధాతలను తెలుసుకొనే ఇటువంటి తీవ్ర పురుషార్థులకు, పరివర్తన చేసే పరిపక్వ ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments