25-10-1975 అవ్యక్త మురళి

25-10-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బేహద్ శిక్షకులుగా భావించి వైరాగ్యవృత్తిని ధారణ చేయండి. 

                 పంజాబ్, గుజరాత్ జోన్ యొక్క టీచర్లతో అవ్యక్త బాప్ దాదా మాట్లాడిన మహావాక్యాలు -
                       మిమ్మల్ని మీరు మాస్టర్ విశ్వశిక్షకులుగా భావిస్తున్నారా? లేక మీమీ సేవా కేంద్రాల్లో నేను ఫలానా స్థానం యొక్క టీచర్ ను అనేది బుద్ధిలో ఉంటుందా? నేను విశ్వం యొక్క నిమిత్తమైన మాస్టర్ విశ్వశిక్షకుడిని అని బుద్ధిలో ఉండాలి. హద్దు స్మృతిలో ఉంటుందా లేక బేహద్ స్మృతిలో ఉంటుందా? బేహద్ నషా మరియు బేహద్ సేవ యొక్క ప్లాన్ నడుస్తున్నాయా లేక మీ స్థానం యొక్క ప్లాన్ నడుస్తుందా? బేహద్ నషా ఉంటేనే విశ్వానికి యజమాని కాగలరు. హద్దులోని నషా మరియు హద్దులోని స్మృతి ఉంటే విశ్వయజమాని యొక్క సంస్కారం తయారవ్వదు. అప్పుడు చిన్నచిన్న రాజులుగా అవుతారు. విశ్వమహారాజు యొక్క ప్రాలబ్ధాన్ని పొందే గుర్తులు ఇప్పటి నుండి కనిపిస్తాయి. ఏదైనా చిక్కు ప్రశ్నను సమాధానపరచాలంటే దానికి కొన్ని గుర్తులు అడుగుతారు. దాని ద్వారా ఎంత కఠినమైన చిక్కు ప్రశ్నలైనా త్వరగా పరిష్కారం అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరు ఏవిధంగా ఉంటారో అనేది చిక్కు ప్రశ్న. దీనిని గుర్తులు ద్వారా పరిశీలించవచ్చు. వాటి ద్వారా మీకు కూడా తెలుస్తుంది - నేను నా యొక్క పురుషార్ధం అనుసారంగా ఏవిధంగా అవుతానని, టీచర్లు అనగా స్వతంత్రులు. కేవలం సేవాబంధన తప్ప ఏ కర్మబంధన ఉండదు. సేవ అనేది బంధన కాదు, బంధన్ముక్తంగా తయారుచేసేది. అన్ని విషయాల్లో స్వతంత్రులు అయినప్పుడు టీచర్స్ కి బేహద్ బుద్ధి ఉండాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు బేహద్ సేవలో సహయోగి అయ్యే అవకాశం స్వయం తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎంతగా స్వయం బేహద్ సేవ యొక్క అనుభవం చేసుకుంటారో అంతగానే చాలా అనుభవీమూర్తిగా పిలువబడతారు. అనుభవీమూర్తులకే విలువ ఉంటుంది. పాతకాలపు అనుభవీలు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహకు విలువ ఉంటుంది, వారు పాతవారు అనుభవీలు అని. అదేవిధంగా ఇక్కడ కూడా అనుభవీలుగా అవ్వాలి. మీరు అవకాశం తీసుకోవాలి. కార్యక్రమం అనుసారంగా చేశారంటే దాంట్లో సగభాగం మీది, సగభాగం ఇతరులది అవుతుంది. సంపాదనను భాగాలవారిగా పంచుకున్నట్టు. కార్యక్రమం అనుసారంగా చేయడంలో సగమే వస్తుంది. స్వయం తీసుకుని చేస్తే దానికి పూర్తిగా లభిస్తుంది. నన్ను యోగ్యునిగా భావించాలి, నేను తయారై చూపిస్తాను ఇలా అనకండి. స్వయానికి స్వయం ఆఫర్ చేసుకున్నవారికే ఆఫర్ లభిస్తుంది. నాకు అవకాశం లభిస్తే చేస్తాను అని ఎప్పుడూ అనకూడదు లేదా ఎదురు చూడకూడదు. నన్ను ముందుకు తీసుకువెళ్తే వెళ్తాను అని అనకూడదు, ఇది కూడా ఆధారమే. టీచర్స్ ఆధారమూర్తులు. ఆధారమూర్తులు ఎవరి ఆధారాన్ని తీసుకోరు. ఇది కూడా అదృష్టం, దీనిని పోగొట్టుకోకూడదు. కనుక మీకు మీరే అవకాశం ఇవ్వండి బేహద్ అనుభవిగా అవ్వండి. బేహద్ బుద్ధిమంతులుగా అవ్వండి. అవకాశం తీసుకుంటూ వెళ్ళండి అప్పుడు అవకాశం లభిస్తూ ఉంటుంది. వారినే మాస్టర్ విశ్వ శిక్షకులు అంటారు. మిగతావారందరూ తమతమ సెంటర్ యొక్క శిక్షకులు. బాబాని చూసారు కదా - మధువనం అనే ఒకే స్థానంలో ఉంటూ నలువైపులా ప్లాన్స్ తయారుచేసేవారు. కేవలం మధువనం వరకే కాదు. అదేవిధంగా నిమితమైనవారు ఎక్కడ ఉంటున్నా కాని బేహద్ ప్లాన్ తయారుచేస్తూ ఉండాలి. ఇలా బేహద్ బుద్ధి కలిగినవారేనా? టీచర్లు అందరూ, నలువైపులా తిరుగుతున్నారా కేవలం మీ ప్రాంతంలోనే తిరుగుతున్నారా? ఎవరు ఎంతగా ఈశ్వరీయ సేవార్థం తిరుగుతూనే ఉంటారో వారు అంతగా చక్రవర్తి రాజుగా అవుతారు. మంచిది.
                     ఇవన్నీ బేహద్ టీచర్స్ నిమిత్తం. ఇప్పుడైతే ముఖ్య ప్లాన్ చెప్పారు. మరి బేహద్ వైరాగ్యవృత్తిని టీచర్లు స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? మీకు బేహద్ వైరాగ్యవృత్తి ఉందా లేక మీ సెంటర్లపై లేదా వచ్చే జిఙ్ఞాసువులతో తగుల్పాటు ఉందా? ఎప్పుడైతే తగుల్పాటు నుండి బేహద్ వైరాగ్యం ఉంటుందో అప్పుడు జై జై కారాలు వస్తాయి. స్థూల, సూక్ష్మ సాధనాలతో అన్నింటితో బేహద్ వెర్యాగం. ఇలాంటి భూమి తయారైందా లేక సెంటర్ మార్చితే కదిలిపోతారా జిజ్ఞాసువులతో జాలి రాదా? కొంచెం కూడా వారి గురించి సంకల్పం రాదా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇలాంటి పరీక్ష వస్తే నష్టోమోహులేనా? అవి లౌకిక సంబంధాలు, ఇవి సేవా సంబంధాలు. మీరు ఎవరికైతే వాణి చెబుతారో వారి పట్ల మోహం ఉండదా? ఇవి అలౌకిక సేవా సంబంధాలు. వీటిలో కూడా మీకు మోహం ఉంటే రాబోయే విద్యార్థులు దీనిగురించి వాణి చెబుతారు. కనుక మీ గురించి మీరు లోతైన రూపంలో పరిశీలించుకోండి. ఇప్పుడు ఏదైనా ఆర్డర్ వస్తే ఎవరెడీగా ఉన్నారా, ఈ సెంటర్ లో సేవ బాగుంది, సేవ బాగున్నా కూడా తగుల్పాటు ఉండకూడదు. అందరితో అతీతం అయినప్పుడే బేహద్ వైరాగ్యవృత్తి అంటారు. మీ శరీరంతో కూడా అతీతం. నిమిత్త సేవార్ధం నడిపిస్తున్నారు అంతే. బుద్ధి మాటిమాటికి బాబా నుండి తొలగి అటువైపు వెళ్తుంది అంటే అది తగుల్పాటుకు గుర్తు. మీతో మీకు కూడా తగుల్పాటు ఉండకూడదు. మీలో ఉన్న విశేషతపట్ల కూడా తగుల్పాటు ఉండకూడదు. కొందరిలో సంభాళించే శక్తి మంచిగా ఉంటుంది లేదా కొందరిలో వాచాశక్తి బాగుంటుంది, నేను ఇలాంటి వాడిని అనే తగుల్పాటు ఉండకూడదు. ఆ విశేషత బాప్ దాదా ఇచ్చినది. మీ జ్ఞానం యొక్క విశేషత లేదా మరే విశేషత అయినా కానీ దాంతో కూడా తగుల్పాటు ఉండకూడదు, దీని ద్వారా కూడా అభిమానం వస్తుంది. కనుక ఇది కూడా బుద్ధిలో పెట్టుకోండి. ఈ విశేషత బాబా నుండి లభించిన వారసత్వం, సర్వాత్మల కొరకు మనకు లభించింది. అదే వారికి ఇస్తున్నాం, మనము నిమిత్తులం ఇలా బేహద్ వైరాగ్యవృత్తి గల టీచర్స్ యొక్క సంఘటన కావాలి. వారి నడవడం ద్వారా, చూడడం ద్వారా, మాట్లాడడం ద్వారా అందరికీ వీరు బేహద్ వైరాగులు అని అనుభవం అవ్వాలి. జ్ఞానంతో సేవ చేయటంలో తెలివైనవారు, ఇదైతే అందరూ అనుభవం చేసుకున్నారు. ఇప్పుడు బేహద్ వైరాగ్యం యొక్క అనుభవం చేయండి. ఇతరులు కూడా అనుభవం చేసుకోవాలి. మంచిది. ఓంశాంతి.

Comments