26-10-1975 అవ్యక్త మురళి

26-10-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

వికారీ దేహరూపీ సర్పం ద్వారా మొత్తం సంపాదన సమాప్తం. 

                     సర్వప్రాప్తుల యొక్క అధికారాన్ని ఇచ్చేవారు, జరిగిపోయిందేదో జరిగిపోయిందిగా భావించి వర్తమానం మరియు భవిష్యత్తు యొక్క ప్రతి సంకల్పాన్ని శ్రేష్టంగా తయారుచేసేవారు మరియు ఆత్మల యొక్క కర్మలఖాతా తెలిసిన ధర్మరాజు శివబాబా మాట్లాడుతున్నారు -
                    బాప్ దాదా పిల్లలందరినీ చూస్తున్నారు - ప్రతి ఒక్కరు ఇక్కడకు వచ్చి కోర్సు చేశారా ? కోర్సు తరువాత రివైజ్ కోర్సు నడిచింది. రివైజ్ కోర్సు తరువాత ఇప్పుడు అంతిమ కోర్సు రియలైజేషన్ కోర్సు అనగా ఏదైతే విన్నారో, ఏదైతే పొందారో, ఏదైతే బాబా యొక్క చరిత్ర చూశారో దాని అనుసారంగా స్వయంలో నింపుకున్నది ఎంత, మరియు పోగొట్టుకున్నది ఎంత? కేవలం వినేవారిగా అయ్యారా లేక సంపన్నంగా తయారయ్యారా? సమర్థంగా అయ్యారా లేక కేవలం ఇతర శ్రేష్టాత్మల యొక్క లేదా బాప్ దాదా యొక్క గుణగానం చేసేవారిగా అయ్యారా? జ్ఞానస్వరూపంగా, స్మృతి స్వరూపంగా, దివ్యగుణ సంపన్న స్వరూపంగా మరియు సదా సేవాధారి స్వరూపంగా అయ్యారా లేక వీటన్నింటిని కేవలం స్మరించేవారిగా అయ్యారా? జ్ఞానం చాలా ఉన్నతమైనది, యోగం చాలా శ్రేష్టమైనది, దివ్యగుణధారణ చేయటం అవసరం మరియు సేవచేయటం బ్రాహ్మణుడైన నా యెక్క కర్తవ్యం ఈ విధంగా కేవలం స్మరణచేసేవారిగా అయ్యారా లేక స్వరూపంగా కూడా తయారయ్యారా? ఈ విధంగా మిమల్ని మీరు అనుభూతి చెందాలి, ఇదే  అంతిమకోర్సు. ఎలాగైతే దీపావళికి పాతలెక్కల ఖాతా సమాప్తం చేసి కొత్తది ప్రారంభిస్తారు మరియు తమ ఖాతా పుస్తకాలను పరిశిలించుకుంటారు. అదేవిధంగా మీరందరూ కూడా ఆది నుండి అంతిమం వరకు అనగా ఇప్పటివరకు గల మీ ఖాతా పుస్తకాన్ని పరిశీలించుకోండి. ప్రతి సబెక్టులో ఎన్ని మార్కులు పొందారో పరిశీలించుకోండి. సమయ ప్రమాణంగా గమ్యం ఎదురుగా కనిపిస్తోంది. రెండు లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి - వర్తమాన సంగమయుగీ ఫరిస్తా స్థితి యొక్క లక్ష్యం మరియు రెండు - భవిష్య దేవతా స్వరూపం యొక్క లక్ష్యం. లక్ష్యం ఎలాగైతే స్పష్టంగా ఉందో లక్షణాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయా? విశ్వపరివర్తనకు ముందు స్వయంలో పరివర్తన వచ్చినట్టు అనుభవం అవుతుందా? ఇలా పరిశీలించుకున్నారా? బాప్ దాదా పిల్లలందరి యొక్క లెక్కల ఖాతాను పరిశీలించారు. ఎవరైతే తమ కర్మల కథని రాసారో వారి ఫలితాన్ని కూడా చూశారు. ఏమి చూశారంటే కొంతమంది ఆత్మలు భయం మరియు సిగ్గుకు వశమై అసలు రాయనే లేదు. కానీ బాప్ దాదా దగ్గర నిరాకారీ మరియు సాకారీ తండ్రి రూపంలో ప్రతిబిడ్డ యొక్క లెక్కలఖాతా ఆది నుండి ఇప్పటి వరకు స్పష్టంగా ఉంటుంది. దీనిని ఎవరు తొలగించలేరు. ఇప్పటివరకు లెక్కల ఖాతా పుస్తకంలో ఫలితం ఏమిటంటే విశేషంగా మూడురకాలైన ఫలితం ఉంది. ఒకటి - దాచటం, రెండు - ఎక్కడో అక్కడ చిక్కుకోవడం, మూడు - నిర్లక్ష్యంలోకి వచ్చి సాకులు తయారుచేయటం. సాకులు తయారుచేయడంలో చాలా తెలివైనవారిగా ఉన్నారు. తమను తాము లేదా తమ పొరపాటుని దాచుకునేటందుకు చాలా అద్భుతమైన విషయాలు తయారుచేస్తున్నారు. ఆది నుండి ఇప్పటి వరకు ఇలాంటి విషయాలన్నింటినీ సంగ్రహిస్తే ఈనాటి శాస్త్రాల వలే పెద్ద శాస్త్రంగా తయారవుతుంది. తమ పొరపాటును పొరపాటుగా అంగీకరించడానికి బదులు దానిని యదార్థంగా రుజువు చేసుకోవడంలో లేదా అసత్యాన్ని సత్యంగా రుజువు చేయడంలో ఈనాటి నల్లకోటు లాయర్ల వలే మాయతో యుద్ధం చేయడానికి బదులు ఇలాంటి కేసుల్లో యుద్ధం చేయడంలో చాలా తెలివైనవారిగా ఉన్నారు. కానీ వారికిది గుర్తుండడం లేదు. ఏమిటంటే ఇప్పుడు తమను తాము రుజువు చేసుకోవడం అంటే బాబా ద్వారా జన్మజన్మాంతరాల కోసం ఏవైతే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయో వాటి నుండి వంచితులవ్వడం. తమను తాము రుజువు చేసుకనేవారికి మొండితనం యొక్క సంస్కారం తప్పకుండా ఉంటుంది. ఇలాంటి ఆత్మ సద్గతిని పొందలేదు. ఇప్పటివరకు ఎక్కువమంది మొదటి పాఠం అనగా పవిత్ర దృష్టి మరియు అందరూ సోదరులు అనే వృత్తిలో ఫెయిల్ అయిపోయారు. ఇప్పటి వరకు కూడా ఈ మొదటి ఆజ్ఞపై నడిచే ఆజ్ఞాకారులు చాలా కొద్దిమంది ఉన్నారు. మాటిమాటికి ఈ ఆజ్ఞను ఉల్లంఘన చేస్తున్న కారణంగా తమపై భారం పెంచుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే పవిత్రత అనే ముఖ్య సబ్జెక్టు యొక్క గొప్పతనం తెలుసుకోలేదు. అది లేకపోతే వచ్చే నష్టం కూడా తెలియలేదు. దేహధారి పట్ల అయినా సంకల్పంలో కాని, కర్మలో కాని చిక్కుకోవడం, లేదా ఈ వికారీ దేహరూపీ సర్పాన్ని తాకటం అనగా ఇప్పటి వరకు మీరు చేసుకున్న సంపాదనంతటిని సమాప్తం చేసుకోవడం. జ్ఞానం యొక్క ఎంత అనుభవం ఉన్నా కానీ లేదా స్మృతి ద్వారా శక్తుల యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకున్నా కానీ, తనువు, మనస్సు ధనాలతో సేవచేసినా కానీ, ఆ సర్వ ప్రాప్తులన్నీ ఈ దేహరూపీ సర్పాన్ని తాకటం ద్వారా ఈ సర్పం యొక్క విషం కారణంగా ఎలాగైతే మనుష్యులు చనిపోతారో అలాగే ఈ సర్పం ద్వారా కూడా అనగా దేహంలో చిక్కుకోవడం యొక్క విషం సంపాదనంతటిని సమాప్తం చేసేస్తుంది. ఇంతకు ముందు చేసుకున్న సంపాదన యొక్క లెక్కలఖాతా పుస్తకంలో నల్లమచ్చ పడిపోతుంది. దానిని తొలగించడం చాలా కష్టం ఎలాగైతే యోగాగ్ని పాత పాపాలను భస్మం చేస్తుందో ఈ వికారీ భోగం భోగించాలనే అగ్ని పాత పుణ్యాన్ని భస్మం చేసేస్తుంది. దీనిని సాధారణ విషయంగా భావించకండి. అయిదు అంతస్తుల మీద నుండి పడిపోవడం లాంటిది. కొంతమంది పిల్లలు ఇప్పటి వరకు నిర్లక్ష్యం యొక్క సంస్కారానికి వశమై ఈ విషయాన్ని పెద్ద పొరపాటుగా లేదా పాపకర్మగా భావించడం లేదు. వర్ణన కూడా సాధారణ రూపంతోనే చేస్తున్నారు. నాద్వారా నాలుగైదుసార్లు ఇలా అయ్యింది. ఇక ముందు చేయను ఇలా వర్ణించే సమయంలో కూడా పశ్చాత్తాపం యొక్క రూపం ఉండడం లేదు, సాధారణ సమాచారం చెబుతున్నట్టు చెబుతున్నారు - ఇదిలా అవుతూనే ఉంటుంది, గమ్యం చాలా ఉన్నతమైనది, ఇప్పుడిలా ఎలా అవుతుందని లోలోపల అనుకుంటున్నారు. అయినా కానీ ఈరోజు అలాంటి పాపాత్మలకు జ్ఞానాన్ని గ్లాని చేసేవారికి బాప్ దాదా హెచ్చరిస్తున్నారు - ఈనాటి నుండి కూడా ఈ పొరపాటును కఠిన పొరపాటుగా భావించి తొలగించుకోక పోయినట్లయితే చాలా కఠిన శిక్షకు అధికారిగా అవుతారు. మాటిమాటికి అవజ్ఞ యొక్క భారం కారణంగా ఉన్నత స్థితి వరకు చేరుకోలేరు. ప్రాప్తి పొందేవారి వరుసలో ఉండేవారి బదులు పశ్చాత్తాపపడేవారి వరుసలో నిలుచుని ఉంటారు. ప్రాప్తి పొందేవారికి జైజైకారాలు వస్తాయి మరియు అవజ్ఞ చేసినవారికి నయనాల మరియు నోటి నుండి హాహాకారాలు వస్తాయి మరియు సర్వ ప్రాప్తులు పొందిన బ్రాహ్మణాత్మలు ఇలాంటి ఆత్మలను కులకళంకితుల వరుసలో చూస్తారు. తాము చేసిన వికర్మల యొక్క నలుపుదనం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అందువలన ఇప్పటి నుండి ఈ విరాట పొరపాటు అనగా చాలా పెద్ద పొరపాటు తెలుసుకుని ఇప్పుడే మీ వెనకటి పొరపాట్లను పశ్చాత్తాప హృదయంతో బాబాముందు స్పష్టం చేసి మీ భారాన్ని తొలగించుకోండి. మీకు మీరే కఠిన శిక్ష వేసుకోండి. ఇక ముందు శిక్షల నుండి విడిపించబడతారు. ఒకవేళ ఇప్పుడు కూడా బాబా దగ్గర దాచి పెడితే లేదా మిమ్మల్ని మీరు సత్యంగా రుజువుచేసుకుని నడిపించుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు నడిపించుకోవడం అనగా అంతిమంలో మరియు ఇప్పుడు కూడా ఏమి చేయను సంతోషం ఉండడం లేదు... సఫలత రావడం లేదు..... సర్వ ప్రాప్తుల యొక్క అనుభూతి అవ్వడం లేదు... ఇలా మనసులో అరుస్తుంటారు. ఈ విధంగా ఇప్పుడు కూడా అరుస్తారు మరియు అంతిమంలో కూడా అయ్యో నా భాగ్యం అంటూ అరుస్తారు. కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు నడిపించుకోవడం అనగా మాటిమాటికి అరవడం. ఇప్పుడు ఈ విషయాన్ని దాటవేయడం అనగా మీ జన్మజన్మాంతరాల శ్రేష్ట అదృష్టాన్ని కాల్చేసుకున్నట్టు. అందువలన ఈ విశేష విషయంపై విశేష ధ్యాస పెట్టుకోండి. సంకల్పంలో కూడా విషంతో నిండిన ఈ సర్పాన్ని తాకకండి. సంకల్పంలో తాకినా కాని మిమ్మల్ని మీరు మూర్చితులుగా చేసుకోవడమే. కనుక లెక్కల ఖాతా పుస్తకంలో విశేషంగా నిర్లక్ష్యం చూశారు. ఇంకొక ఫలితం నిన్న వినిపించాను. ఏయే విషయాల్లో వృద్ధికళకు బదులు ఆగిపోతున్నారో, తీవ్ర వేగానికి బదులు మధ్యలో వేగానికి వచ్చేస్తున్నారో, ఇది ఎక్కువమంది యొక్క ఫలితం. అందువలన ఇప్పుడు మిమ్మల్ని మీరు అనుభూతి చెందండి అనగా అంతిమ రివైజ్ కోర్సు సమాప్తం చేయండి. మిమ్మల్ని మీరు మంచిగా అన్నివైపుల నుండి ప్రతి సబ్జెక్టులో పరిశీలన చేసుకోండి. అన్ని మర్యాదలను బాబా యొక్క ఆజ్ఞలను మరియు శ్రేష్ట సలహాలను ఎంత వరకు ప్రత్యక్షంలోకి తీసుకువచ్చానని పరిశీలించుకోండి మరియు వెనువెంట మధువన మహాయజ్ఞంలో సదాకాలికంగా అంతిమ ఆహుతి చేయండి.  అర్థమైందా! ఇప్పుడు తండ్రి యొక్క ప్రేమ స్వరూపాన్ని లోకువగా తీసుకోకండి. లేకపోతే అంతిమ మహాకాలుని రూపంలో ఉన్నపుడు ఒక పొరపాటుకు వేలరెట్లు పశ్చాత్తాపం పడతారు.
                        ఈవిధంగా సైగలతో అర్ధం చేసుకునే బ్రాహ్మణుల నుండి దేవతలకు, సర్వ ప్రాప్తుల యొక్క అధికారాన్ని ప్రాప్తింపచేసుకునే అధికారులకు మరియు జరిగిపోయిందేదో జరిగిపోయినదిగా భావించి భవిష్యత్తు మరియు వర్తమానం యొక్క ప్రతి సంకలాన్ని శ్రేష్టంగా తయారుచేసుకునేవారికి, ఇలాంటి బ్రాహ్మణ కులదీపకులకు, ఆశా సితారలకు స్వయం యొక్క మరియు విశ్వం యొక్క అదృష్టాన్ని మేల్కొలుపుకునే అదృష్టవంతులైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments