24-06-1971 అవ్యక్త మురళి

* 24-06-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

  "అంతర్ముఖులుగా అవ్వడం వల్ల కలిగే లాభాలు"

             ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్ వెలువడినప్పుడు ఇన్వెన్షన్ ఎంత శక్తిశాలిగా ఉంటుందో అంతగానే దానిని అండర్ గ్రౌండ్ లో కనుగొంటారు. మీ ఇన్వెన్షన్ కూడా రోజు రోజుకీ చాలా శక్తిశాలిగా అవుతూ ఉంటుంది. ఏ విధంగా వారు అండర్ గ్రౌండ్ లో ఇన్వెన్షన్ ని కనుగొంటారో అలాగే మీరు కూడా ఎంతగా అండర్ గ్రాండ్ గా అనగా అంతర్ముఖులుగా ఉంటారో అంతగానే క్రొత్త క్రొత్త ఇన్వెన్షన్లు లేక యోచనలు కనుగొంటూ ఉండగలరు. అండర్ గ్రౌండ్ లో ఉండడం ద్వారా ఒకటేమో వాయుమండలం నుండి సురక్షితంగా ఉంటారు, ఇంకొకటి - ఏకాంతము లభించిన కారణంగా మనన శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. మూడవది - మాయ విఘ్నాల నుండి సురక్షణా సాధనము ఏర్పడుతుంది. స్వయమును సదా అండర్ గ్రౌండ్ గా అనగా అంతర్ముఖులుగా తయారుచేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మొత్తం కార్య వ్యవహారమంతా అండర్ గ్రౌండ్ గా నడుస్తుంది. అలా అంతర్ముఖులుగా అయి కూడా కార్యమును చేయవచ్చు. కార్యము చేయలేరు అనేమీ లేదు, కార్యాలు కూడా అన్నీ నడువగలవు, కాని అంతర్ముఖులుగా అయి కార్యము చేయడం ద్వారా ఒకటేమో విఘ్నాల నుండి సురక్షితులుగా ఉంటారు, ఇంకొకటి సమయమును పొదుపు చేయగలరు, మూడవది సంకల్పాలను పొదుపు చేయగలరు. అభ్యాసమైతే ఉంది కదా! అప్పుడప్పుడు అనుభవం కూడా చేసుకుంటారు. అంతర్ముఖులుగా అయి మాట్లాడుతారు కూడా. కాని బాహ్యముఖతలోకి వస్తూ కూడా అంతర్ముఖులుగా, హర్షితముఖులుగా, ఆకర్షణామూర్తులుగా కూడా ఉంటారు. కర్మ చేస్తూ ఈ అభ్యాసం చేయాలి. ఏ విధంగా స్థూల కార్య వ్యవహారాల ప్రోగ్రామును తయారుచేస్తారో అలా మీ బుద్ధితో ఏఏ కార్యవ్యవహారాలు లేక కార్యాలను చేయాలో ఆ ప్రోగ్రామును కూడా తయారు చేయండి. ఎవరైతే ప్రోగ్రామును తయారుచేయడంలో అనుభవజ్ఞులుగా ఉంటారో వారి ప్రతి కార్యము సమయానికి సఫలమవుతుంది. అదేవిధంగా మనది కూడా సూక్ష్మ కార్య వ్యవహారము. బుద్ధి ఒక్క క్షణంలో ఎక్కడికైనా వెళ్ళిరాగలదు. కార్యాలు కూడా ఎంతో విస్తారమైనవి. కావున ఎప్పుడైతే ప్రోగ్రామును సెట్ చేస్తారో అప్పుడే సమయపు పొదుపు మరియు అధిక సఫలత ఏర్పడగలదు. ఈ ప్రోగ్రామును మధ్య మధ్యలో తయారుచేస్తూ ఉండండి. కాని సదాకాలికంగా చేయండి. ఏవిధంగా స్థూల కార్య వ్యవహారాలను సెట్ చేస్తూ, చేస్తూ అభ్యాసకులుగా అయిపోయారో అలాగే ఈ అభ్యాసమును కూడా చేస్తూ చేస్తూ అభ్యాసులుగా అయిపోతారు. దీని కొరకు విశేషంగా సమయాన్ని కేటాయించవలసిన అవసరం లేదు. ఏదైనా స్థూల కార్యము, ఎక్కువ బుద్ధిని ఉపయోగించవలసి వచ్చే కార్యము అయినా దానిని చేస్తూ కూడా మీ ఈ ప్రోగ్రామును సెట్ చేయవచ్చు. ప్రోగ్రామును సెట్ చేయడంలో ఎంత సమయం పడుతుంది? ఒకటి, రెండు నిమిషాలు కూడా ఎక్కువే. ఈ అభ్యాసం చేయాలి. అమృతవేళ మీ బుద్ధి కార్యవ్యవహారపు ప్రోగ్రామును కూడా ముందే సెట్ చేసుకోవాలి. ప్రోగ్రామును తయారుచేసుకుంటారు, ఆపై ఈ కార్యాలను చేశాము మరియు ఎంతవరకు జరిగింది, ఎంతవరకు జరుగలేదు అని చూసుకుంటారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామును కూడా తయారుచేసుకుని మధ్యమధ్యలో పరిశీలించుకోండి. ఎంత గొప్ప వ్యక్తులు ఉంటారో అంతగా వారు ప్రోగ్రాము లేకుండా వెళ్ళరు, ఎలా వస్తే అలా చేసేయడం చేయరు. వారి ఒక్కొక్క క్షణము ప్రోగ్రామ్ తో బుక్కవుతుంది. మీరు కూడా శ్రేష్ఠ ఆత్మలు, కావున మీ ప్రోగ్రాం సెట్ అయి ఉండాలి. కొందరికి ప్రోగ్రామును తయారుచేసే విధానం వస్తుంది, మరికొందరికి రాదు. స్థూల కార్య వ్యవహారాల్లో కూడా అలా జరుగుతుంది. ఎంతెంతగా మీ ప్రోగ్రాంను సెట్ చేసుకోవడం వస్తుందో అంతగానే మీ స్థితిలో కూడా సెట్ అవ్వడం వస్తుందా అని పరిశీలించుకోవాలి. లేకపోతే ప్రోగ్రాంను తయారుచేసుకోకపోతే ఏ విధంగా విషయాలు పైకీ క్రిందికీ అవుతాయో అలాగే స్థితి కూడా పైకి క్రిందికీ అవుతుంది, సెట్ అవ్వదు. అచ్ఛా!

Comments

  1. Thankyou so much బాబా కు మరియు మీకు

    ReplyDelete

Post a Comment