* 24-05-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“పరివర్తనకు ఆధారము దృఢ సంకల్పము"
ఈ రోజు సర్వ పురుషార్ధీ ఆత్మలను చూస్తూ చూస్తూ బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఈ శ్రేష్ఠ ఆత్మలే సృష్టిని పరివర్తన చేసేందుకు నిమిత్తులుగా అయ్యారు అని బాప్ దాదాకు తెలుసు. ఒక్కొక్క శ్రేష్ఠ ఆత్మ నెంబర్ వారీగా ఎంత అద్భుతము చేస్తోంది! వర్తమాన సమయంలో ఏదైనా లోపము లేక బలహీనత ఉన్నా కాని, భవిష్యత్తులో ఈ ఆత్మలే ఎలా ఉన్నవారు ఎలా అవ్వనున్నారు! మరియు ఎలా ఉన్నవారిని ఎలా చేయనున్నారు! కావున భవిష్యత్తును చూసి, మీ అందరి సంపూర్ణ స్థితిని చూసి బాప్ దాదా హర్షితమవుతున్నారు. మీరు అందరికన్నా పెద్ద ఇంద్రజాలికులు కదా! ఏ విధంగా ఇంద్రజాలికులు కొద్ది సమయంలో చాలా విచిత్రమైన ఆటను చూపిస్తారో, అలా ఆత్మిక ఇంద్రజాలికులైన మీరు కూడా మీ ఆత్మికతా శక్తి ద్వారా మొత్తం విశ్వమంతటినీ పరివర్తనలోకి తీసుకురాబోతున్నారు, పూర్తిగా దివాలా తీసినవారిని డబుల్ కిరీటధారులుగా తయారుచేయనున్నారు. కాని, స్వయమును పరివర్తన చేసే మరియు విశ్వమును పరివర్తన చేసే ఇంత పెద్ద కార్యమును ఒకే దృఢ సంకల్పంతో చేయనున్నారు. ఒకే దృఢసంకల్పంతో స్వయమును మార్చివేస్తారు. అది ఏ దృఢసంకల్పము ద్వారా? అనేక జన్మల విస్మృతి యొక్క సంస్కారం స్మృతిలోకి మారిపోయే ఆ ఒక్క సంకల్పము ఏమిటి? అది ఒక్క క్షణానికి సంబంధించిన విషయమే. దాని ద్వారా స్వయమును మార్చేసుకున్నారు. ఒకే క్షణము మరియు ఒకే సంకల్పము “నేను ఆత్మను” అన్నది ధారణ చేశారు. ఈ దృఢ సంకల్పం ద్వారానే మీ విషయాలనన్నింటినీ మార్చేసుకున్నారు. అలాగే దృఢ సంకల్పము ద్వారా విశ్వమును కూడా పరివర్తనలోకి తీసుకువస్తారు. ఆ ఒక్క దృఢ సంకల్పము ఏమిటి? మేమే విశ్వపు ఆధారమూర్తులము, ఉద్ధారమూర్తులము అనగా విశ్వకళ్యాణకారులము. ఈ సంకల్పమును ధారణ చేయడం ద్వారానే విశ్వపరివర్తనా కర్తవ్యములో సదా తత్పరులై ఉంటారు. కావున ఒకే సంకల్పం ద్వారా స్వయమును లేక విశ్వమును మార్చివేస్తారు, ఇటువంటి ఆత్మిక ఇంద్రజాలికులు మీరు. ఆ ఇంద్రజాలికులు అల్పకాలం మాత్రమే వస్తువులను పరివర్తనలోకి తీసుకువచ్చి చూపిస్తారు, కాని ఆత్మిక ఇంద్రజాలికులైన మీరు అవినాశీ పరివర్తన, అవినాశీ ప్రాప్తిని పొందేవారు మరియు చేయించేవారు. కావున సదా మీ ఈ శ్రేష్ఠ పదవిని మరియు ఈ శ్రేష్ఠ కర్తవ్యమును మీ ముందు ఉంచుకుంటూ ప్రతి సంకల్పమునూ చేయండి మరియు కర్మనూ చేయండి, అప్పుడు ఏ సంకల్పము లేక కర్మా వ్యర్థమవ్వవు. నడుస్తూ, తిరుగుతూ పాత శరీరంలో మరియు పాత ప్రపంచంలో ఉంటూ, మీ శ్రేష్ట పదవిని మరియు శ్రేష్ట కర్తవ్యమును మరిచిపోయిన కారణంగా అనేకరకాల పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని మీరు మరిచిపోవడం కూడా తప్పే కదా! ఎవరైతే తమనుతాము మర్చిపోతారో వారు అనేక పొరపాట్లకు నిమిత్తులుగా అయిపోతారు. కావున మీ పదవిని సదా మీముందు ఉంచుకోండి. ఏ విధంగా సత్యమైన భక్తులు కూడా ప్రపంచంతో పోల్చి చూస్తే, నాస్తికులు, అజ్ఞానులు ఎన్ని వికర్మలైతే చేస్తారో, వికారాలకైతే వశమవుతారో వాటినుండి ఎంతగానో దూరముగా ఉంటారు, ఎందుకు? కారణమేమిటంటే నవధభక్తిని అనగా సత్యమైన భక్తిని ఎవరైతే చేస్తారో వారు ఎల్లప్పుడూ తమముందు తమ ఇష్టదైవాన్ని ఉంచుకుంటారు. వారిని తమ ముందు ఉంచుకున్న కారణంగా అనేక విషయాలలో సురక్షితులుగా ఉంటారు మరియు అనేక ఆత్మలకన్నా శ్రేష్ఠముగా అయిపోతారు. ఎప్పుడైతే భక్తులు కూడా భక్తి ద్వారా తమ ఇష్టదైవాన్ని తమ ముందు ఉంచుకోవడం ద్వారా నాస్తికులు మరియు అజ్ఞానుల కన్నా శ్రేష్ఠులుగా అవ్వగలుగుతారో అంతగా మరి జ్ఞానీ ఆత్మలు సదా తమ శ్రేష్ఠ పదవి మరియు కర్తవ్యమును తమ ముందు ఉంచుకున్నట్లయితే వారు ఎలా అవ్వగలరు? శ్రేష్ఠతి శ్రేష్ఠముగా అవ్వగలరు. కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సదా మీ పదవి మరియు కర్తవ్యము మీముందు ఉంటోందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చాలాకాలం మరిచిపోయే సంస్కారమును ధారణ చేశారు. కాని, ఇప్పుడు కూడా పదే పదే మరిచిపోయే సంస్కారమును ధారణ చేస్తూ ఉన్నట్లయితే స్మృతి స్వరూపపు నషా లేక సంతోషము ఏదైతే ప్రాప్తమవ్వాలో దానిని ఎప్పుడు పొందగలరు? స్మృతి స్వరూపపు సుఖము లేక సంతోషమును ఎందుకు అనుభవం చేసుకోలేరు? దాని ముఖ్య కారణం ఏమిటి? ఇప్పటివరకు అన్నిరూపాల నుండి నష్టోమోహులుగా అవ్వలేదు. నష్టోమోహులుగా అయితే ఎంత ప్రయత్నించినా కాని, స్మృతి స్వరూపంలోకి తప్పక వచ్చేస్తారు. కావున మొదట నష్టోమోహులుగా ఎంతవరకు అయ్యారు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. చాలా చాలా దేహాభిమానంలోకి రావడము దేహపు మమకారము నుండి ఇంకా అతీతంగా అవ్వలేదు అని నిరూపిస్తుంది, లేక దేహపు మోహమును ఇంకా అంతం చేయలేదని నిరూపిస్తుంది. నష్టోమోహులుగా ఉండని కారణంగా సమయము మరియు శక్తులు ఏవైతే బాబా ద్వారా వారసత్వ రూపంలో ప్రాప్తమవుతున్నాయో వాటిని కూడా అంతం చేసేస్తారు, వాటిని ఉపయోగించుకోలేరు. లభించడమైతే అందరికీ లభిస్తాయి కదా! ఎప్పుడైతే పిల్లలుగా అయ్యారో అప్పుడు తండ్రి ఆస్తి లేక వారసత్వమేదైతే ఉందో దానికి అధికారులుగా అవుతారు. కావున సర్వాత్మలకు సర్వశక్తుల వారసత్వము తప్పక లభిస్తుంది. కాని, ఆ సర్వశక్తుల వారసత్వాన్ని ఉపయోగించడము మరియు స్వయమును ఉన్నతిలోకి తీసుకువెళ్ళడము నెంబర్ వారీగా, పురుషార్థానుసారంగానే జరుగుతుంది. కావున అనంతమైన తండ్రికి పిల్లలుగా అయి హద్దులోని వారసత్వాన్ని తీసుకుంటే వారిని ఏమంటారు? అనంతమైన పదవిని తీసుకునేందుకు బదులుగా హద్దులోని వారసత్వాన్ని లేక పదవిని తీసుకోవడం అనంతమైన పిల్లల కర్తవ్యం కాదు. కావున ఇప్పుడు కూడా స్వయమును అనంతమైన వారసత్వానికి అధికారులుగా చేసుకోండి. అధికారులు ఎప్పుడూ ఆధీనులుగా అవ్వరు, తమ రచనకు ఆధీనులుగా అవ్వరు. తమ రచనకు ఆధీనులుగా అవ్వడమును అధికారులు అని అంటారా? పదే పదే విస్మృతిలోకి రావడం ద్వారా మిమ్మల్ని మీరే బలహీనంగా చేసేసుకుంటారు. బలహీనంగా ఉన్న కారణంగా చిన్న విషయాన్ని కూడా ఎదుర్కోలేరు. కావున ఇప్పుడు అర్థ కల్పపు ఈ విసృతి సంస్కారాలకు వీడ్కోలు పలకండి. ఈ రోజు బాప్ దాదా కూడా మీ అందరితో ప్రతిజ్ఞ చేయిస్తారు. ఏవిధంగా మీరు వినాశనంలో ఇంకొద్ది సమయం మిగిలి ఉంది అని ప్రపంచంలోని వారితో ఛాలెంజ్ చేస్తారో, మరి ఆ కొద్ది సమయంలో మిమ్మల్ని మీరు సతో ప్రధానులుగా చేసుకోలేరా? ఏ విధంగా ప్రపంచంలోని వారిని ఛాలెంజ్ చేస్తారో అలా మీరు కూడా విస్మృతి సంస్కారాలకు వీడ్కోలు చెప్పలేరా? ప్రపంచమును ఛాలెంజ్ చేసేవారు స్వయం తమ కొరకు మాయను ఛాలెంజ్ చేయలేరా? మాయాజీతులుగా అవ్వలేరా? ఎప్పుడైతే వారికి ధైర్యమును ఇప్పిస్తారో, ఉల్లాసంలోకి తీసుకువస్తారో అలా మీ కొరకు మీరు స్వయమునకు ధైర్యమును, ఉల్లాసమును అందించుకోలేరా? కావున ఈ రోజు నుండి ప్రతిజ్ఞను చేయండి - ఎప్పుడూ, ఎటువంటి పరిస్థితిలోనూ మాయతో ఓడిపోము, పోరాడుతాము మరియు విజయులుగా అవుతాము అని ప్రతిజ్ఞ చేయండి. ఈ కంకణాన్ని కట్టుకోలేరా? ఎవరికైతే జ్ఞానము లేదో, శక్తి లేదో వారికి కూడా రాఖీ కడుతూ ప్రతిజ్ఞ చేయిస్తారు మరియు ఎవరైతే ఎంతోకాలంగా జ్ఞానములో సంబంధము మరియు శక్తిని ప్రాప్తించుకునేవారిగా ఉన్నారో ఆ శ్రేష్ఠ ఆత్మలు, మహావీర ఆత్మలు, శక్తిస్వరూప ఆత్మలు, పాండవ సేన ఈ ప్రతిజ్ఞ యొక్క రాఖీని కట్టుకోలేరా? అంతిమం వరకు బలహీనతలను మరియు లోపములను మీ సహచరులుగా చేసుకోవాలనుకుంటున్నారా? ఈ రోజుల్లో సైన్స్ వారు కూడా ఒక్క క్షణంలో ఏ వస్తువునైనా భస్మం చేసేస్తారు. మరి జ్ఞానస్వరూపులు, మాస్టర్ సర్వశక్తివంతులు ఒక్క క్షణపు దృఢసంకల్పంతో లేక ప్రతిజ్ఞతో తమ బలహీనతలను భస్మం చేసుకోలేరా? ఇతరులకు ఎంతో ఫోర్స్ తో, నషాతో ఈ పాయింట్లను ఇస్తారు. కావున ఏ విధంగా ఇతరులకు నషాతో చెబుతారో అదేవిధంగా మీరు స్వయములో కూడా విజయులుగా అయ్యే నషాను, ధైర్యమును ఉంచలేరా? కావున ఈ రోజు నుండి బలహీనతలకు వీడ్కోలు చెప్పేయండి.
ఇప్పుడిప్పుడే పురుషార్థులుగా, ఇప్పుడిప్పుడే ఫరిస్తారూపులుగా ఇంతటి సమీపంగా మీ సంపూర్ణ స్థితి కనిపించడం లేదా? సమయం ఇంత సమీపంగా ఉన్నప్పుడు సంపూర్ణ స్థితి కూడా సమీపంగా ఉండాలి కదా! దీని ద్వారా కూడా పురుషార్థంలో శక్తిని నింపుకుంటారు. గమ్యస్థానము ఇప్పుడిక కొద్దిదూరంలోనే ఉంది అని ఎవరికైనా తెలిసిపోతే ఆ గమ్యస్థానానికి చేరుకునే సంతోషంలో అన్ని విషయాలను మరిచిపోతారు. కావున నడుస్తూ, నడుస్తూ పురుషార్థంలో అలసట లేక చిన్న చిన్న చిక్కులలో చిక్కుకొని బద్ధకంలోకి వస్తారో వాటన్నింటినీ అంతం చేసుకునేందుకు, మీముందు సమయమును మరియు సమయంతో పాటు మీ ప్రాప్తిని కూడా స్పష్టంగా ఉంచుకున్నట్లయితే అలసట లేక బద్ధకము అంతమైపోతుంది. ఏ విధంగా ప్రతి సంవత్సరపు సేవా ప్లానును తయారుచేస్తారో అలాగే ప్రతి సంవత్సరము మీపైకి ఎక్కే కళ యొక్క లేక సంపూర్ణంగా అయ్యే లేక శ్రేష్ఠ సంకల్పం యొక్క కర్మను చేసేందుకు కూడా మీతో మీరు ప్లానును తయారుచేయండి మరియు ప్లానుతో పాటు, అన్నివేళలా మీ ప్లానును మీ ముందు ఉంచుకుంటూ ప్రాక్టికల్ లోకి తీసుకువస్తూ ఉండండి. అచ్ఛా!
ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి తమ సంపూర్ణ స్వరూపమును మరియు బాబాను ప్రత్యక్షం చేసేవారికి నమస్తే.
Comments
Post a Comment