24-04-1974 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఇప్పుడు త్రిమూర్తి లైట్స్ యొక్క సాక్షాత్కారమూర్తిగా అయ్యే తేది నిర్ణయించండి.
ఒక సెకనులో జన్మసిద్ధ ఈశ్వరీయ అధికారం ఇచ్చేటువంటి, నిరాశావాదులను ఆశావాదులుగా చేసేవారికి మరియు సర్వాత్మలకు ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి త్రిమూర్తి శివబాబా మాట్లాడుతున్నారు -
ఈరోజు ఈ సంఘటన యొక్క ఏ విశేషత బాప్ దాదా చూస్తున్నారు? ప్రతి ఒక్కరు మీ విశేషతను తెలుసుకుంటున్నారా? త్రిమూర్తి బాబా త్రిమూర్తి వంశావళి ప్రతి ఒక్కరిలో ఈరోజు మూడు లైట్స్ చూస్తున్నారు. మూడు లైట్స్ తమ వైపు ఆకర్షితం చేసేవిగా ఉన్నాయా లేక నెంబర్ వారీగా ఉన్నాయా? అని. ఎప్పుడైతే మూడు లైట్స్ మెరుస్తూ కనిపిస్తాయో, అప్పుడే అందరికి సాక్షాత్కారం చేయంచగలరు. పవిత్రత యొక్క లైట్, సత్వ ప్రధాన దివ్యదృష్టి యొక్క లైట్ మరియు మస్తకమణి యొక్క లైట్. ఈ మూడు సంపూర్ణంగా చేసేటందుకు ముఖ్య విషయాలు. స్వయాన్ని అడగండి - సదా సత్వప్రధాన ఆత్మికదృష్టి, సదా ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మలో పవిత్రత యొక్క మెరుపు ఎంత వరకు వచ్చింది? అని. సదా స్మృతి స్వరూపంగా అయ్యారా? ఒకవేళ మీలో ఒక విషయం లోపం ఉన్నా త్రిమూర్తి లైట్స్ యొక్క సాక్షాత్కారం చేయించలేరు. ఈ పవిత్రతయే అన్నింటికంటే శ్రేష్టమైనది మరియు సహజ ప్రచార సాధనం. ఇదే అంతిమ ప్రచార రూపం. ఇతర ఏ ఆత్మలు ఈ ప్రచారం చేయలేరు. విశ్వపరివర్తనా కార్యంలో అన్నింటికంటే శక్తివంతమైన ప్రచార సాధనం విశేషాత్మలైన మీకు ఇదే. మరి ఇలాంటి ప్రచారం చేస్తున్నారా లేక ఏదైనా ప్లాన్ తయారుచేసారా లేదా ఏదైనా విచిత్ర సినిమా తయారుచేసారా? ఎలా అయితే ఈ రోజుల్లో స్థూల సినిమా చూడటం ద్వారా ప్రజలు ప్రభావితం అవుతున్నారో, అలాగే మీ అందరి మస్తకం మరియు నయనాలు విచిత్ర అనుభవం చేయించేటువంటి సినిమా చూపిస్తే వారు పరివర్తన అవ్వరా? ఎలా అయితే పరదా ఎదురుగా కూర్చోవటం ద్వారా పరదా వెనుక ఉన్న రకరకాలైన దృశ్యాలు కనిపిస్తాయో, అలాగే మీ ఎదురుగా రాగానే అనేకరకాలైన దివ్యదృష్టి కనిపిస్తుంది. ఇటువంటి రీల్ తయారుచేస్తున్నారా? ఈ పురుషార్ధంలో నిమగ్నమై ఉన్నారా లేదా ఇప్పటి వరకు స్వయాన్ని సీట్ పై సెట్ చేసుకోవటంలోనే నిమగ్నమై ఉన్నారా? ఈరోజుల్లో ప్రపంచంలో ఆత్మలకు ఎప్పుడు ఎవరి సంకల్పంలో లేని కొత్త విషయం కావాలి. అటువంటి కర్తవ్యం చూపించేటందుకు నిమిత్తంగా ఎవరు అవుతారు? మహారథీలు. ప్రతి ఒక్కరు స్వయాన్ని మహారథీగా భావిస్తున్నారు కదా? భవిష్యత్తులో సదా శ్రీలక్ష్మి, నారాయణునిగా అయ్యే ధైర్యం పెట్టుకుంటున్నారు కదా? చంద్రవంశంలోకి వెళ్ళేటందుకు ఎవరు చేయి ఎత్తటం లేదు, అంటే అంటే సూర్యవంశీగా అయ్యేవారు, మహారథీలు అయ్యారు కదా? ఎప్పుడైతే మహారథీలందరు ఇటువంటి మహాన్ కార్యం చేసేటందుకు నిమగ్నమైతే విశ్వపరివర్తనా కార్యం ఎంత సమయంలో జరుగుతుంది? మహారథీల సంఘటన సమయానుసారం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి సంఘటనలో కూడా జరిగిపోయిన సంఘటనల ప్రమాణంగా ప్లాన్ తయారుచేసారా లేక ప్రత్యక్ష ప్రభావం యొక్క తేదీ కూడా నిర్ణయిస్తారా? ఎలా అయితే ఇతర అన్ని విషయాల యొక్క ప్లాన్ మరియు తేదీ నిర్ణయిస్తున్నారో, అలాగే సంపూర్ణ సఫలత త్రిమూర్తి లైట్స్ యొక్క సాక్షాత్కారమూర్తిగా అయ్యేటువంటి ప్లాన్ మరియు తేదీ ఈసారి నిర్ణయిస్తారా లేదా దీని కొరకు ఇంకేదైనా మీటింగ్ ఉంటుందా? వైజానికులు టైంబాంబ్ తయారు చేయగలుగుతున్నప్పుడు, మీరు టైం బాంబ్స్ తయారుచేయలేరా? మీరు కేవలం బాంబ్స్ మాత్రమే తయారుచేస్తున్నారా? లేదా ప్రత్యక్షఫలం వచ్చేటందుకు ఇప్పుడు ఇంకా భూమి తయారుకాలేదు అని అనుకుంటున్నారా?
ఈరోజుల్లో భూమిని పరివర్తన చేయటం కూడా కష్టమైన విషయమేమీ కాదు. ఎటువంటి భూమిలో అయినా ఈ రోజుల్లో విజ్ఞానం ఫలం ఇస్తుంది కదా? నిరాశావాదులను కూడా ఆశావాదులుగా చేస్తుంది కదా? మరి మాస్టర్ సర్వశక్తివంతులు, కిరీటం మరియు తిలకధారులు నిరాశావాదులను ఆశావాదులుగా చేయలేరా? అసంభవాన్ని సంభవం చేయటం ఈ ప్రతిజ్ఞ అనేది బ్రాహ్మణుల స్వధర్మం. అంటే ధారణ కనుక స్వదర్మంలో స్థితులవ్వటం కష్టమా లేక సహజమా? ఏదైతే బోర్డ్ పెడుతున్నారో, దానిపై ఏమి వ్రాస్తున్నారు? ఒక సెకనులో జన్మసిద్ధ అధికారం పొందండి. అని అంటే తప్పకుండా ఒక సెకనులో ప్రాప్తింప చేసే ప్లాన్ ప్రత్యక్షంలో ఉన్నప్పుడే వ్రాస్తారు కదా? అసంభవాన్ని సంభవం చేసే ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా? ఇటువంటి వేగవంతమైన కర్తవ్యం ఎప్పటి నుండి ప్రారంభిస్తారు? బోర్డ్ క్రింద మరొక మాట కూడా వ్రాస్తారు - ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అని. అయితే ఇప్పటి నుండే అవ్వాలి కదా? కనుక ఈ సంవత్సరంలో ఈ విధమైన అమూల్యమైన ప్లాన్ తయారుచేయండి. మొదట సాక్షాత్కారమూర్తిగా తయారయ్యారా? ఎందుకంటే భక్తిలో కూడా కొద్దిగా మూర్తి ఖండితం అయినా పూజకు లేదా మందిరంలో పెట్టడానికి కూడా యోగ్యంగా భావించరు మరియు దర్శనీయమూర్తిగా కూడా ఉండదు, ఈ నియమం ఉంది. డ్రామా అనే పరదా తేరుచుకునేసరికి మూర్తి సంపన్నంగా కాకపోతే ఇది శోభిస్తుందా? శృంగారాలలో కూడా 16 శృంగారాలు ప్రసిద్ధమైనవి, మరి అలా సంపూర్ణంగా 16 కళా సంపన్నంగా అయ్యారా? లేదా ఏ సమయంలో ఏ కళ అవసరమో ఆ కళ స్వరూపంలోకి రావటం లేదా? స్మృతిలో ఉంటుంది. కానీ స్వరూపంలోకి రావటం లేదు అంటే మీకు సఫలత ఎలా వస్తుంది? యుద్ధస్థలంలో సమయానికి శస్త్రం ఉపయోగపడకపోతే విజయీగా అవుతారా? మొదట స్వయాన్ని సంపన్నంగా చేసుకునే ప్రత్యక్ష ప్లాన్ తయారుచేసుకోండి. అప్పుడు సహజంగా సఫలత మీ ఎదురుగా వస్తుంది.
ఇప్పటి వరకు ఫలితం ఏమి చూసారు? స్వయం యొక్క మరియు ఇతరాత్మల యొక్క సేవ రెండు సేవలు వెనువెంట మరియు సదా ఉండాలి. రెండింటి సమానత సమానంగా ఉండాలి. ఇది కనిపిస్తుందా? రెండింటి సమానత విశ్వం యొక్క సర్వాత్మల నుండి ఆశీర్వాదాలు ఇప్పించేటందుకు నిమిత్తం అవుతుంది. అన్ని కార్యాలు బాబావే, కానీ ఎలా అయితే ఇతర కార్యాలలో నిమిత్తంగా అవుతున్నారు కదా! మరి ఈ కార్యాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? భక్తులు ఏదైనా కార్యం కష్టం అనిపించినప్పుడు భగవంతునిపై పెట్టేస్తారు కదా? సహజంలో స్వయం మరియు కష్టంలో భగవంతుడు. ఇప్పుడు బాబా సర్వ శక్తులకు మరియు సర్వ కర్తవ్యాలకు మిమ్మల్ని నిమిత్తంగా చేసారు కదా? ఎందుకంటే బాబా స్వయాన్ని వానప్రస్థీగా చేసుకుని మిమ్మల్ని కిరీటధారిగా మరియు సింహాసనాధికారిగా చేసారు. బాబా యొక్క భాద్యతలు ఏవైతే ఉండి పోయాయో, అవన్ని పిల్లలైన మీరే చేయాలి. బాబా తప్పకుండా సహాయకారి అవుతారు. కానీ సాకార స్వరూపంలో మరియు పేరుని ప్రసిద్ధం చేయటంలో పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేయాలి. దీని కొరకు మీరందరు బాధ్యతాధారి ఆత్మలు, సాధారణ ఆత్మలు కాదు. మీరు జ్ఞానీఆత్మలు, విజయీ రత్నాలు. అర్ధమైందా! ఇది మహారథీల కార్యం.
ప్రత్యక్షఫలం యొక్క ప్రత్యక్ష ప్లాన్ తయారు చేసేవారికి, సదా విజయం మా జన్మసిద్ధ అధికారం అని ఇలా అధికారాన్ని పొందేవారికి, ప్రతిజ్ఞను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చేవారికి, సదా సంపన్న, సాక్షాత్కారమూర్తులకు, త్రిమూర్తి లైట్స్ ధారణ చేసే త్రిమూర్తి వంశీయులకు, ఒక సెకనులో మూడు శక్తుల ద్వారా వెనువెంట పని చేసేవారికి మరియు బాప్ దాదాకు సదా సహయోగి, ఇటువంటి మహావీరులకు బాప్ దాదా యొక్క ప్రియస్కృతులు మరియు శుభరాత్రి. మంచిది.
Comments
Post a Comment