24-04-1973 అవ్యక్త మురళి

* 24-04-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “అలౌకిక జన్మపత్రి"

              జ్ఞాన సాగరుడు, సర్వ మహాన్ శ్రేష్ఠ మత దాత, కర్మల రేఖల యొక్క జ్ఞాత,  సర్వాత్మల పిత శివబాబా చెప్తున్నారు...

          ఈ సమయంలో అందరూ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో స్థితులై ఉన్నారా? ఒక్క క్షణంలో మీ ఈ సంపూర్ణ స్థితిలో స్థితులవ్వగలరా? ఈ ఆత్మిక డ్రిల్లు యొక్క అభ్యాసకులుగా అయ్యారా? ఒక్క క్షణంలో స్వయమును ఏ స్థితిలో స్థిరము చేసుకోవాలనుకుంటే ఆ స్థితిలో స్థిరము చేసుకోగలరా? ఎంత సమయంలో మరియు ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో స్థితులైపోండి. ఈ విషయంలో అభ్యాసకులుగా అయ్యారా లేక ఇప్పటివరకు కూడా ప్రకృతి ద్వారా తయారైన పరిస్థితులు స్థితిని తమ వైపుకు ఎంతో కొంత ఆకర్షించుకుంటున్నాయా? అన్నింటికన్నా ఎక్కువగా మీ దేహపు లెక్కాచారాలు మిగిలియున్న కర్మ భోగాల రూపంలో రానున్న పరిస్థితులు తమ వైపుకు ఆకర్షిస్తున్నాయా? ఈ ఆకర్షణ కూడా సమాప్తమైపోవాలి. దీనినే సంపూర్ణ నష్టోమోహులుగా అవ్వడము అని అంటారు. ఏ వస్తువుపైనైతే మోహము లేక లగనము ఉంటుందో అది తన వైపుకు పదే పదే ఆకర్షిస్తుంది. ఏ విధమైన దేహపు లేక దైహిక ప్రపంచపు పరిస్థితి స్థితిని చలింపజేయజాలకూడదు. ఈ స్థితి యొక్క గాయనమే గానము చేయబడ్డది. అంగదుని రూపంలో కల్పపూర్వపు గాయనమేదైతే ఉందో అదే సంపూర్ణ స్థితి. బుద్ధిరూపీ పాదాన్ని ప్రకృతి యొక్క పరిస్థితులు చలింపజేయజాలకూడదు. ఈ విధంగా అయ్యారా? లక్ష్యమైతే ఇదే కదా! ఇప్పటివరకు లక్ష్యానికి మరియు లక్షణాలకు మధ్య తేడా ఉంది. కల్పపూర్వపు గాయనమునకు మరియు వర్తమాన ప్రాక్టికల్ జీవితంలో తేడా ఉంది. ఈ తేడాను సమాప్తం చేసేందుకు తీవ్ర పురుషార్థపు యుక్తి ఏమిటి? ఆ యుక్తులు తెలిసాక కూడా తేడా ఎందుకు ఉంది? మరి నేత్రాలు లేవా లేక నేత్రాలు ఉన్నా కూడా ఆ నేత్రాలను యోగ్య సమయంలో ఉపయోగించే యోగ్యత లేదా?

          ఎంతటి యోగ్యత ఉందో అంతటి మహానత కనిపిస్తోందా? ఆ మహానతలోని లోపమునకు కారణమేమిటో తెలుసా? ఆ ముఖ్యమైన మాన్యతను గూర్చి ఎల్లప్పుడూ వినిపిస్తుంటారు కూడా. ఆ మాన్యత యొక్క మహీనత లేదు. మహీనత రావడం ద్వారా మహావీరత వచ్చేస్తుంది. మహావీరత అనగా మహానత. మరి ఏ విషయం యొక్క లోపము మిగిలి ఉంది? మహీన(సూక్ష్మ)త యొక్క లోపము. మహీనమైన వస్తువు ఎందులో అయినా ఇమిడిపోగలదు. మహీనత లేకుండా ఏ వస్తువునూ ఎక్కడ ఎలా ఇమడ్చాలంటే అలా ఇమడ్చలేరు. ఎంతగా ఏ వస్తువు మహీనతతో ఉంటుందో అంతగా మాననీయంగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది.

           కావున మొట్టమొదటి మాన్యత లేక సర్వ మాన్యతలలోకి శ్రేష్ఠమైన మాన్యత ఏమిటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. శ్రీమతమే మీ మాన్యత. కావున మొట్టమొదటి మాన్యత ఏమిటి? (దేహ సహితంగా అన్నింటినీ మర్చిపోవడము). వదలండి లేక మర్చిపోండి. మరిచిపోవటం కూడా వదిలివేయటమే. సమీపంగా ఉంటూ కూడా మరిచిపోయినట్లయితే దానిని వదిలివేసినట్లే. మర్చిపోవడం కూడా వదలివేయడమే. సన్యాసులను గూర్చి మీరు వారు వదలలేదు అని ఛాలెంజ్ చేస్తారు. ఇల్లూ వాకిళ్ళను వదిలేసామని అంటారు కాని నిజానికి వదలలేదు ఎందుకంటే మరిచిపోలేదు. అలాగే పరిస్థితుల అనుసారంగా బాహ్యరూపంలో వదిలివేసినా కాని అనగా ప్రక్కకు తప్పుకున్నా కాని మనసుతో మరిచిపోనట్లయితే దానిని వదలడము అని అంటారా? ఇక్కడ వదలడం యొక్క అర్థం ఏమిటి? మనస్సుతో మరిచిపోవడము. మనస్సుతోనైతే మీరు మరిచిపోయారు కదా! కావున వదిలేసారు కదా! లేక ఇంకా వదలాలా? ఇప్పటివరకు కూడా వదలాలి అని అన్నట్లయితే చాలాకాలము వదిలేసిన వారి లిస్టు నుండి వైదొలగి ఇప్పటినుండి వదిలినవారి లిస్టులోకి వచ్చేస్తారు.

          ఎవరైతే ఎప్పటినుండో మనస్సు నుండి త్యాగము చేశారో, ఎటువంటి దేహపు బంధన, దేహపు సంబంధాల నుండైనా ఒక్క క్షణంలో త్యాగం చేసేశారో వారి యొక్క ఆ తిథి, తారీఖు మరియు వేళ అంతా డ్రామాలో బాప్ దాదా వద్ద రచింపబడి ఉంది. ఈ రోజుల్లోని జ్యోతిష్యులు, జ్యోతిష్య విద్యను గూర్చి తెలిసినవారు జన్మ యొక్క తిధి, వేళ అనుసారంగా తమ యధాయోగ్య జ్ఞానము ఆధారంతో భవిష్య జన్మపత్రిని తెలియజేస్తారు కదా! వారి ఆధారం కూడా తిధి, వేళ మరియు స్థితి. వారు ఏ పరిస్థితిలో జన్మించారు అని పరిస్థితిని చూస్తారు. కాని ఇక్కడ ఆ వేళా సమయంలో స్థితిని చూడడం జరుగుతుంది. జన్మ నుండి ఏ స్థితిలో ఉన్నారు అన్నదాని ఆధారముపై ఇక్కడ కూడా ప్రతిఒక్కరి భవిష్య ప్రాలబ్ధము ఆధారపడి ఉంది. కావున మీరు కూడా తిధి, వేళ మరియు స్థితి... ఈ మూడు విషయాలనూ తెలుసుకుంటూ మీ సంగమయుగపు ప్రాలబ్ధము లేక సంగమ యుగపు భవిష్య స్థితి మరియు భవిష్య జన్మ ప్రాలబ్ధమును మీకు మీరే తెలుసుకొనవచ్చు. ఒక్కొక్క విషయం యొక్క ప్రాప్తి లేక ప్రత్యక్ష జీవితముతో సంబంధించి ఉంటుంది. ఇది మీ భాగ్యమును జాగృత పర్చుకునే నేత్రము. దీనిద్వారా మీరు ప్రతి ఒక్కరూ మీ ఫైనల్ స్థితి యొక్క నెంబరును తెలుసుకోగలరు.

          ఏవిధంగా జ్యోతిష్యులు హస్తాల రేఖల ద్వారా ఎవరి జన్మపత్రినైనా తెలుసుకోగలరో అలా మీరు మాస్టర్ త్రికాలదర్శులు, త్రినేత్రులు లేక జ్ఞానస్వరూపులు అనగా మాస్టర్ జ్ఞానస్వరూపులుగా అయిన కారణంగా మీ మరజీవా జీవితం యొక్క ప్రాక్టికల్ కర్మరేఖల ద్వారా, సంకల్పాల సూక్ష్మ రేఖల ద్వారా సంకల్పాలను చిత్రాలలోకి తీసుకువచ్చినట్లయితే ఏ రూపంలో చూపిస్తారు? మీ సంకల్పాల రేఖల యొక్క ఆధారంపై లేక కర్మ రేఖల ఆధారంపై మీ జన్మపత్రిని తెలుసుకోగలరా? మీ సంకల్పాల రూపీ రేఖలు స్పష్టంగా ఉన్నాయా? చాలాకాలముగా స్థితిలో, సంపర్కములో శ్రీమతానుసారముగా గడిపానా అని పరిశీలించుకోండి. ఇది కాలమును అనగా సమయమును చూడడము. సమయము అనగా వేళ యొక్క స్వభావం కూడా జన్మపత్రిపై ఎంతగానో ఉంటుంది. ఇక్కడ కూడా సమయము అనగా చాలాకాలపు లెక్కతో సంబంధము ఉంటుంది. చాలాకాలము అనగా స్థూలమైన తారీఖు లేక సంవత్సరాలతో దాని లెక్క ఉంటుందని కాదు. కాని ఎప్పటినుండైతే జన్మ తీసుకున్నారో అప్పటినుండి చాలాకాలపు లగనము ఉండాలి. ఎంతవరకు అన్ని సబ్జెక్టులలోను యథార్థ రూపముతో ఎంతోకాలముగా ఉంటూ వచ్చారు అన్న దీని లెక్క జమ అవుతుంది. ఉదాహరణకు ఎవరైనా తమ పురుషార్థపు సఫలతలో చాలాకాలము గడిపి ఉండకపోతే వారి లెక్క బహుకాలములోకి రాజాలదు. మరొకరు 35 సంవత్సరాలకు బదులుగా 15 సంవత్సరాల నుండే వస్తున్నాకాని ఆ 15 సంవత్సరాలు బహుకాలపు పురుషార్థంలోని సఫలత ఆధారంపై వారు లెక్కింపబడతారు. మరి అది వేళ యొక్క ఆధారమే కదా!

           బహుకాలము లగనములో మగనమై ఉండేవారికి ప్రాలబ్ధము కూడా చాలా కాలం వరకు ప్రాప్తమవుతుంది. అల్పకాలపు సఫలత వారికి అల్పకాలము అనగా 21 జన్మలలో కొద్ది జన్మల ప్రాలబ్ధమే లభిస్తుంది, మిగిలినది సాధారణ ప్రాలబ్ధముగా ఉంటుంది. కావుననే ఆ జ్యోతిష్యులు కూడా వేళకు మహత్వమును ఇస్తారు. చాలాకాలం నుండి నిర్విఘ్నముగా అనగా కర్మల యొక్క రేఖలు స్పష్టముగా ఉండాలి. దాని ఆధారము జన్మపత్రిపై ఉంటుంది. ఏ విధంగా హస్తాల రేఖలలో కొద్దిగా అయినా మధ్యమధ్యలో రేఖలు ఖండితమైపోతే దానిని శ్రేష్ఠభాగ్యముగా లెక్కించడం జరుగదో, ఎక్కువ ఆయుషుగా లెక్కింపబడదో అలాగే ఇక్కడ కూడా మధ్య మధ్యలో విఘ్నాల కారణంగా బాబాతో జోడింపబడ వలసిన బుద్ధి రేఖలు ఖండితమవుతూ ఉన్నట్లయితే లేక అవి స్పష్టంగా లేకపోతే ఎక్కువ ప్రాలబ్ధము లభించజాలదు.

          మరి ఇప్పుడు మీ జన్మపత్రి ఏమిటో మిమ్మల్ని మీరు తెలుసుకో గలరా? మీకు ఏ పదవి రచింపబడి ఉందో తెలుసుకో గలరా? జన్మపత్రిలో దశలను కూడా చూస్తారు. బృహస్పతి దశ కూడా ఉంటుంది. చాలాకాలము బృహస్పతి దశ ఉంటోందా లేక పదే పదే దశ మారుతూ ఉంటోందా? కాసేపు బృహస్పతి దశ, మరి కాసేపు రాహుదశగా మారుతూ ఉంటోందా? పదే పదే దశ మారుతూ ఉన్నట్లయితే అనగా నిర్విఘ్నంగా లేనట్లయితే ప్రాలబ్ధమును కూడా చాలాకాలం వరకు నిర్విఘ్న రాజ్యంలో పొందజాలరు. కావున ప్రారంభం నుండి ఇప్పటివరకు ఏ దశలు మిగిలి ఉన్నాయో పరిశీలించండి.

           జన్మపత్రిలో రాశులను చూస్తారు. ఇక్కడ ఏ రాశి ఉంటుంది? ఇక్కడ మూడు రాశులు ఉన్నాయి. ఒకటి- మహారధుల రాశి, రెండవది గుర్రపు స్వారీ వారిది మరియు మూడవది- కాల్బలము వారిది. ఈ మూడింటిలోను ప్రారంభం నుండి అనగా జన్మ నుండి నా పురుషార్థపు రాశి మహారధిగా ఉందా, గుర్రపు స్వారీగా ఉందా, లేక కాల్బలము వారిదిగా ఉందా అని పరిశీలించుకోండి. ఈ రాశి యొక్క లెక్కతో కూడా జన్మపత్రిని గూర్చి తెలిసిపోతుంది. మాస్టర్ త్రికాలదర్శులుగా లేక జ్ఞాన స్వరూపులుగా అయి మీ జన్మపత్రిని స్వయమే పరిశీలించుకోండి మరియు మీ భవిష్యత్తును చూడండి. రాశిని లేక దశలను లేక రేఖలను మార్చవచ్చు కూడా, పరిశీలించిన తరువాత వాటిని పరివర్తనచేసే సాధనాన్ని కూడా ఉపయోగించాలి. స్థూలమైన జ్ఞానములో కూడా అనేక సాధనాలను తెలియజేస్తారు. ఇక్కడ సాధనమును గూర్చి అయితే తెలుసు కదా! కావున సాధనాల ద్వారా సంపూర్ణ స్థితిని ప్రాప్తించుకోండి. అర్థమైందా?

          ఈవిధంగా జ్ఞానస్వరూపపు బుద్ధి ద్వారా స్థితిని ప్రాప్తించుకునే, సంపూర్ణతను తమ జీవితంలో ప్రత్యక్షంగా చూపించేవారికి, సదా తమ స్వస్థితి ద్వారా పరిస్థితులపై విజయం ప్రాప్తించుకునే మహావీరులకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments