23-10-1975 అవ్యక్త మురళి

23-10-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఎదురుచూడడాన్ని వదిలిపెట్టి తయారవ్వండి.

                  విశ్వం యొక్క అదృష్టాన్ని ఉన్నతంగా తయారుచేసేవారు, మాయాసృష్టిని మహావినాశనం చేసి దైవీ సృష్టిని స్థాపన చేసేవారు, రచయిత శివబాబా నవనిర్మాణ తయారీలు ఒక్కదెబ్బతో చేసేటటువంటివారిని ఆహ్వనం చేస్తూ మాట్లాడుతున్నారు -
                  ఈరోజు బాప్ దాదా విశ్వం యొక్క అదృష్టాన్ని తయారుచేసే అదృష్టవంతులైన పిల్లల యొక్క చిత్రాలను చూస్తున్నారు. ఏయే ఆత్మల్లో ఏయే అదృష్ట గీతలు కనిపిస్తున్నాయో చూస్తున్నారు మరియు ఏవి ఇప్పుడు స్పష్టం కానున్నవి అని చూస్తున్నారు. ప్రతి ఒక్కరి అదృష్టరేఖలు ఎవరివారికి కనిపిస్తుంటాయి అదృష్టరేఖల్లో ముఖ్యంగా నాలుగు సబ్జెక్టుల యొక్క నాలుగు రేఖలు కనిపిస్తున్నాయి. నాలుగింటి యొక్క నాలుగురేఖలు స్పష్టంగా అనగా నాలుగు సబ్జెక్టుల్లో కృషి ద్వారా తమ అదృష్టాన్ని తయారుచేసుకునే పిల్లలు చాలా కొద్దిమంది ఉన్నారు. దీని ఆధారంగానే పాస్ విత్ ఆనర్ మరియు ఫస్ట్ క్లాస్ అనగా ఫస్ట్ డివిజన్ లోకి ఇలాంటి అదృష్టవంతులే వస్తారు. వీరి యొక్క నాలుగు రేఖలు స్పష్టంగా ఉంటాయి. పాస్ విత్ ఆనర్ అయ్యేవారి యొక్క అదృష్ట రేఖలు నలువైపులా ఒకేలా మెరుస్తూ స్పష్టంగా కనిపిస్తున్నాయి వారే అష్టరత్నాలు. ఇక రెండో నెంబర్ లోకి అనగా మొదటి తరగతిలోకి వంద రత్నాలు. వీరి యొక్క రేఖలు నాలుగు కనిపిస్తున్నాయి. కాని సమానంగా మరియు స్పష్ట రూపంలో లేవు. కొన్ని ఎక్కువ స్పష్టంగా మరియు కొన్ని తక్కువగా ఉన్నాయి. ఆ తరువాత సెకెండ్ డివిజన్ 16వేలు. ఈ పదహరువేల మందిలో మొదటి రెండు, మూడువేల మంది యొక్క రేఖలు నాలుగు సబ్జెక్టులకు సంబంధించి మూడు సబ్జెక్టుల్లో 50% మార్కుల్లో పాసయ్యారు. ఒక సబ్జెక్టులో 25% మార్కులతో పాసయ్యారు. ఇలా అదృష్టవంతుల యొక్క అదృష్టాన్ని చూసారు. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల యొక్క జాతకాన్ని చూస్తున్నారు. జాతకం చూస్తూనే వర్తమాన సమయంలో ఎక్కువమందిలో ఒక సంకల్పం విశేషంగా నడుస్తుంది. అదిఏఎమిటి? విశ్వానికి ఆధారమూరులైన ఆత్మలు కూడా కొన్ని ఆధారాలపై నిల్చుని ఉన్నారు. ఆ ఆధారాలు ఏమిటి? ప్రపంచం యొక్క వినాశకారీ సాధానాలను చూస్తున్నారు. లేదా ప్రకృతి యొక్క అలజడి ఎప్పుడవుతుంది, ఎక్కడవుతుంది. అసలు అవుతుందా... అవ్వదా.... వీటి ఆధారంగా ఆధారమూర్తులు నిల్చుని ఉండడం చూశారు. ఇలాంటి ఆధారాలపై నిల్చుని ఉన్న పిల్లలను బాప్ దాదా ప్రశ్నిస్తున్నారు. స్థాపన చేసేవారు వినాశనం ఆధారంగా ఉంటారా? అయితే అలా ఉంటే స్థాపన చేసేవారి భవిష్యత్తు ఏవిధంగా ఉంటుంది? వినాశనజ్వాలను ప్రజ్వలితం చేసేటందుకు ఎవరు ఆధారమూర్తులవుతారు? ప్రకృతిని పరివర్తన చేసేవారు ఎవరు? ప్రకృతి లేదా వినాశీ సాధనాల ఆధారంపై నిల్చుని ఉండే పురుషులు ఉత్తమపురుషులుగా కాగలుగుతారా? లేక పురుషోత్తముల ఆజ్ఞానుసారం అనగా శ్రేష్ట సంకల్పం ఆధారంగా సర్వ ఆధారమూర్తులు సంపూర్ణంగా తయారయ్యే ఆధారంగా వినాశీ సాధనాలు లేదా ప్రకృతి తమ పనిచేస్తాయా? ఆజ్ఞాపించేవారు ఎవరు? అధికారి ఎవరు? ప్రకృతియా లేక పురుషోత్తములా? ఆధారమూర్తులు ఏదోక ఆధారంగా ఉంటే వారిని అధికారి అని అంటారా? కనుక ఏమి చూశారు? తయారవ్వాల్సినవారు ఎదురుచూడడంలో ఉన్నారు. తయారవ్వడంలో సోమరిగా ఉన్నారు. ఎదురుచూడడంలో సంసిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వారిని చూసి బాప్ దాదాకు నవ్వు వచ్చింది మరియు దయ కూడా వచ్చింది. ఎందుకు? మాయ యొక్క చతురతను పిల్లలు ఇప్పటి వరకు కూడా పరిశీలించలేకపోయారు. ఎదురుచూడడం అనే మధురమైన నిద్రలో మాయ పిల్లలను నిద్రింపచేస్తుంది మరియు పిల్లలు అర్ధకల్పం నిద్రపోయే సంస్కారానికి వశం అయి అనేక సెకెండ్లు గుటకలు మింగుతూ ఉన్నారు. ఆ తరువాత తెలివిలోకి వస్తున్నారు మరలా తయారయ్యే తెలివిలోకి వస్తున్నారు. కొంతమంది అయితే కొన్ని నిమిషాలపాటు నిద్రపోతున్నారు కూడా. ఆ తరువాత ఆవేశంలోకి మరియు తెలివిలోకి వస్తున్నారు. మూడవరకం పిల్లలు బాగా విశ్రాంతిగా నిద్రపోతూ, నిద్రపోతూ మధ్యమధ్యలో కళ్ళు తెరచి చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఏమీ జరగలేదు. ఇప్పటి వరకు ఇంకా ఏమీ అవ్వలేదు. అయినప్పుడు చూద్దాం అని అనుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూస్తే నవ్వురాదా? మూడవ నేత్రం లభించినా కానీ మాయను పరిశీలించలేకపోతున్నారు. అందువలన మాయను మంచిగా పరిశీలించేటందుకు స్వయంలో పరిశీలనా శక్తిని విశేష రూపంలో ధారణ చేయండి. ఇంకా రెండు నెలలు ఉంది లేదా నాలుగు నెలలు ఉంది... ఇలా సమయాన్ని లెక్కించుకుంటూ ఉండకండి. స్వయాన్ని సమర్థవంతంగా తయారుచేసుకోండి. అవుతుందా అవ్వదా?ఏమవుతుందో మరియు ఎప్పుడవుతుందో? ఇలాంటి సంకల్పాలకు బదులు పురుషోత్తమ స్థితిలో స్థితులై సంఘటనను సంపూర్ణంగా తయారుచేయాలని సంకల్పం ఆధారంగా ప్రకృతికి ఆజ్ఞ ఇచ్చే అధికారిగా అవ్వండి. జరగాలి కానీ జరుగుతుందో లేదో తెలీదు బహుశా అవుతుందేమో రెండునాలుగు నెలల్లో ఏమీ కనిపించడం లేదు. సంగమయుగం 40 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు ఇలాంటి సంకల్పాలు కూడా సంపూర్ణ నిశ్చయం ముందు లేదా బాబా యొక్క లేదా స్వయం యొక్క స్థాపనా కార్యంలో విఘ్నం వేస్తాయి. ఇది అతి సూక్ష్మరూప రాయల్ సంశయాలు. ఎప్పటి వరకు ఈ సంశయాలుంటాయో అప్పటి వరకు సంపూర్ణ విజయీగా కాలేరు. నిశ్చయబుద్ధి విజయంతి ఇది మహిమ. విజయీ ఆత్మకు సంశయంతో కూడిన సంకల్పాలు రాయల్‌ రూపంలో కూడా రాకూడదు సంపూర్ణ నిశ్చయబుద్ధి  అయ్యి రేయింబవళ్ళు విశ్వపరివర్తనా కార్యంలో బిజీగా ఉంటారు. ఏదైనా విశేష కార్యం యొక్క బాధ్యత ఉన్నట్లయితే రాత్రిపగలు ఆ తయారీలోనే నిమగ్నమై ఉంటారు కదా లేక ఎప్పుడు సమయం వస్తే అప్పుడు వేదికను అలంకరిద్దాం లేదా సాధనాలను సమకూర్చుకుందాం అనుకుంటారా? సమయం కన్నా ముందే తయారీలు చేసుకుంటారు కదా! అలాగే ఇది కూడా విశ్వపరివర్తన యొక్క బాధ్యత, ఇది పరివర్తనా సమారోహం. దీనిని ఇప్పుడు జరుపుకోవాలి. సర్వాత్మలు తమతమ పాత్ర అనుసారంగా సతో ప్రధానంగా తయారవ్వాలి. బాబా పరిచయాన్ని ఇచ్చేటందుకు విశాల విశ్వాన్ని సమ్మేళనం చేయాలి. దీనికొరకు ముందుగానే మీరు మీ స్థితిని తయారుచేసుకుని తయారీలు చేసుకోవాలా లేక ఆ సమయంలో చేస్తారా? వేదిక లేకుండా ఉపన్యాసం చెప్పటం లేదా సందేశం ఇవ్వడం చేయలేరు కదా! అదేవిధంగా అంతిమసమయంలో కూడా స్వయం యొక్క సంపూర్ణ స్థితి అనే స్టేజి లేకుండా విశాల విశ్వసమ్మేళనంలో సందేశం ఏవిధంగా ఇవ్వగలరు! అనగా తండ్రిని ప్రసిద్ధంగా లేక ప్రఖ్యాతి ఎలా చేయగలరు? వేదికను ముందే చేస్తారా లేక ఆ సమయంలో చేస్తారా అందువలన ఎదురుచూడడం మాని తయారీలో మగ్నం అవ్వండి.. ఈ సంకల్పాలు కూడా వ్యర్థ సంకల్పాలు ఈ వ్యర్థాన్ని సమర్ధంలోకి పరివర్తన చేయండి, అధికారి అవ్వండి ప్రకృతిని ఆజ్ఞాపించే సమర్ధస్థితిని తయారుచేసుకోండి. సంఘటిత రూపంలో సర్వబ్రాహ్మణులలో దయాభావన, విశ్వకళ్యాణభావన, సర్వ ఆత్మలను దు:ఖాల నుండి విడిపించాలనే శుభకామనలు ఎప్పటి వరకు హృదయం నుండి ఉత్పన్నం అవ్వవో అప్పటి వరకు విశ్వపరివర్తన ఆగి ఉంటుంది. ఇప్పుడు అలజడిలో ఉన్నారు. ఒకే సంకల్పంలో అచంచలంగా మరియు స్థిరంగా లేరు. అంగదుని సమానంగా స్థిరంగా అవ్వడం అనగా అంతిమ ఘడియను తీసుకురావడం. కనుక సంఘటిత రూపంలో ఈ విధంగా ఒక సంకల్పాన్ని తీసుకోండి అనగా దృఢ సంకల్పం అనే వ్రేలు అందరూ కలిసి ఇవ్వండి అప్పుడే కలియుగీ పర్వతం పరివర్తన అయ్యి స్వర్ణిమ ప్రపంచాన్ని తీసుకురాగలరు. అర్ధమైందా!  ఏమి తయారుచేసుకోవాలో మంచిది.
                      అంతిమంలో ఒకే సంకల్పంలో అంగదుని సమానంగా అచంచలంగా ఉండేవారికి, ఇవన్నీ జరగవలసిందే అని అనుకునే సంపూర్ణ నిశ్చయబుద్ది ఆత్మలకు, ప్రతి సంకల్పం మాట మరియు కర్మలో సదా విజయీ ఈ విధమైన అధికారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments