23-10-1970 అవ్యక్త మురళి

* 23-10-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మహారథిగా అయ్యేటందుకు పురుషార్ధం.

           ఆత్మిక డ్రిల్లు వస్తుందా, డ్రిల్లులో ఏం చెయ్యవలసి ఉంటుంది? డ్రిల్ అనగా శరీరమును ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఒంచగలగటము. మరియు ఆత్మిక డ్రిల్లు అనగా ఆత్మను ఎక్కడ, ఎలా మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అక్కడ స్థితి చెయ్యగలగటము అనగా మీ స్థితిని ఎలా కావాలనుకుంటే అలా తయారు చేసుకోగలగటము, దీనినే ఆత్మిక డ్రిల్లు అని అంటారు. ఏవిధంగా సైన్యమునకు మార్షల్ లేక డ్రిల్ మాస్టర్ ఎలా సూచనలను ఇస్తుంటే అలాగే చేస్తారో అలాగే స్వయము కూడా మాస్టర్ లేక మార్షల్ గా తయారై ఎక్కడ మిమ్మల్ని స్థితులను చేసుకోవాలనుకుంటే అక్కడ చేసుకోగలగాలి. అలా మీకు మీరు డ్రిల్లు మాస్టర్లుగా అయ్యారా? మాస్టర్ చేతులు కిందకు దించండి అంటే పిల్లలు చేతులు పైకి ఎత్తటము, ఇలా అయితే లేరు కదా! మార్షల్ కుడివైపుకు తిరగండి అంటే సైన్యము ఎడమవైపుకు తిరగటము..... మరి ఇటువంటి సైనికులు లేక స్టూడెంట్లను ఏం చేస్తారు? డిస్మిస్(బర్తరఫ్). మరి ఇక్కడ కూడా తమకుతామే తమ అధికారమునుండి డిస్మిస్ అయిపోతారు. ఒక్క క్షణములో మీ స్థితిని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నిలపగలిగేంతటి అభ్యాసము ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధ స్థలములో ఉన్నారు. యుద్ధ స్థలములో సైన్యము ఒకవేళ ఒక్క క్షణములో డైరెక్షన్‌ను అమలులోకి తీసుకురానట్లయితే వారిని ఏమంటారు? ఈ ఆత్మిక యుద్ధములో కూడా స్థితిని నిలపటంలో సమయము వెచ్చించనట్లయితే అటువంటి సైనికులను ఏమంటారు? ఈరోజు బాప్ దాదా పురుషార్ధీ, మహారథీ పిల్లలను చూస్తున్నారు. స్వయమును ఎవరైతే మహారథులుగా భావిస్తున్నారో వారు చేతులెత్తండి.(కొద్దిమంది చేతులెత్తారు) ఎవరైతే మహారథులు కారో వారు స్వయాన్ని ఏమని భావిస్తున్నారు? ఎవరైతే స్వయమును గుర్రపుసవారీవారిగా భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఎవరైతే మహారథులలో చేతులెత్తలేదో వారిని బాప్ దాదా ఒక ప్రశ్నను అడుగుతున్నారు. స్వయాన్ని బాప్ దాదాల వారసులుగా భావిస్తున్నారా? ఎవరైతే తమను గుర్రపుసవారీవారిగా భావిస్తున్నారో వారు తమను వారసులుగా భావిస్తున్నారా? వారసత్వపు సంపూర్ణ అథికారమును తీసుకోవాలా లేక వద్దా? పూర్తి వారసత్వమును తీసుకోవాలన్న లక్ష్యము ఉన్నప్పుడు గుర్రపుసవారీ వారిగా ఎందుకు ఉన్నారు? ఒకవేళ గుర్రపుసవారీ వారిగా ఉంటే నంబరు ఎక్కడకు పోతుందో తెలుసా? సెకండుగ్రేడు వాళ్ళు ఎక్కడకు వెళతారు, ఇంతటి పాలనను తీసుకొన్న తరువాత కూడా సెకండ్ గ్రేడా! ఒకవేళ చాలా సమయము సెకండ్ గ్రేడ్ పురుషార్థమే ఉన్నట్లయితే వారసత్వమ కూడా చాలా సమయము సెకండ్ గ్రేడ్ దే లభిస్తుంది. కొద్ది సమయమే ఫస్ట్ గ్రేడ్ లో అనుభవము చేస్తారు. సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలుగా పిలిపించుకునేవారు మరియు వ్యక్తము, అవ్యక్తము ద్వారా పాలనను తీసుకొనేవారిగా ఉంటూ కూడా సెకండ్ గ్రేడా! నోటి ద్వారా ఇలా అనటము కూడా శోభించదు. లేదంటే ఈ రోజు నుండి తమను సర్వశక్తివంతుని పిల్లలు అని పిలుచుకోకండి. బాప్ దాదా ఇటువంటి పురుషార్ధీలను బచ్చే(పిల్లలు) అని అనకుండా ఏమంటారు? తెలుసా? బచ్చే కాదు కచ్చే(పిల్లలు కాదు అపరిపక్వులు). ఇప్పటివరకు కూడా ఇటువంటి పురుషార్థము చెయ్యటము పిల్లల స్వమానయోగ్యముగా కనిపించటం లేదు. అయినా కూడా బాప్ దాదా జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇప్పటినుండి మిమ్మల్ని మీరు మార్చుకోండి అని అంటారు. మహారథిగా అయ్యేందుకు కేవలము రెండు విషయాలను గుర్తు ఉంచుకోండి. అవి ఏవి? ఒకటి - స్వయమును ఎల్లప్పుడూ సహచరుని తోడుగా ఉంచండి. సాథీ(సహచరుడు) మరియు సారథి, వారే మహారథి. పురుషార్థములో బలహీనతకు రెండు కారణాలు ఉన్నాయి. తండ్రికి స్నేహీగా అయితే అయ్యారు కానీ తండ్రిని సహచరునిగా తయారుచేసుకోలేదు. ఒకవేళ బాప్ దాదాను ఎల్లప్పుడూ సహచరునిగా చేసుకున్నట్లయితే ఎక్కడైతే బాప్ దాదా తోడుగా ఉంటారో అక్కడ మాయ దూరము నుండే మూర్ఛితమైపోతుంది. బాప్ దాదాను అల్ప సమయము కొరకు సహచరునిగా చేసుకుంటారు, కనుకనే అంతటి శక్తి ప్రాప్తించదు. ఎల్లప్పుడూ బాప్ దాదా తోడుగా ఉన్నట్లయితే, బాప్ దాదాతో మిలనము చేసుకోవడంలో మగ్నమై ఉంటారు. ఎవరైతే మగ్నమై ఉంటారో వారి లగనము ఇతరవైపుల లగనమవ్వజాలదు. మొట్టమొదట్లో తండ్రితో పిల్లలు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? మీతోనే తింటాము, మీతోనే కూర్చుంటాము, మీతోనే ఆత్మకు సంతోషము. ఈ మీ ప్రతిజ్ఞను మర్చిపోయారా? ఒకవేళ మొత్తము దినచర్యలో ప్రతికార్యమును తండ్రితో కలిసి చేసినట్లయితే మాయ డిస్టర్బ్ చెయ్యగలదా? బాబాతోటి ఉన్నట్లయితే మాయ డిస్టర్బ్ చెయ్యదు. మాయ నశించిపోతుంది. కావున తండ్రికి స్నేహీలుగా అయ్యారు, కానీ సహచరులుగా చేసుకోలేదు. చేతిని పట్టుకున్నారు, తోడును తీసుకోలేదు, కనుకనే మాయ ద్వారా గాయమౌతుంది. పొరపాటుకు కారణము అజాగ్రత్త. అజాగ్రత్త పొరపాటును చేయిస్తుంది. ఒకవేళ ఆత్మను చూడకుండా రూపము వైపుకు ఆకర్షితము అయినట్లయితే శవముతో ప్రీతిని పెట్టుకుంటున్నామని భావించండి. శవముతో ప్రీతిని పెట్టుకునేవారు మా భవిష్యత్తు శ్మశానములో పని చేసేందుకు నిశ్చితమవుతోంది అని భావించండి. ఎప్పుడైతే అటువంటి సంకల్పము వచ్చినా కూడా శ్మశానంలోని పాత్రగా భావించండి. లక్ష్యమును మరియు గమ్యమును ఎదురుగా ఉంచుకోండి అని అందరికీ చెప్తారు కదా! కావున ఏ కార్యము చేసినా, ఏ సంకల్పము చేసినా అందుకొరకు కూడా లక్ష్యము మరియు ప్రాప్తి అనగా లక్ష్యమును మీ ఎదురుగా ఉంచండి. సర్వశక్తివంతుడైన తండ్రియగు వరదాత ద్వారా మీ కల్పకల్పపు ఈ పాత్ర యొక్క వారసత్వమును తీసుకొనేందుకు వచ్చారు. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించేవారు శ్మశానములో పాత్రను స్థిరం చేసుకొనేందుకు వచ్చారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పిల్లలెవరైతే తమ పొరపాట్లను ఒకసారి తండ్రి ముందు ఉంచుతారో వారు తండ్రి ముందు తమ లోపాలను పెట్టిన తరువాత కూడా ఒకవేళ మళ్ళీ చేసినట్లయితే క్షమాసాగరునితో 100రెట్ల శిక్ష కూడా డ్రామా అనుసారంగా స్వతహాగనే లభిస్తుంది అని భావించండి. స్వయమును 100 రెట్ల దండన నుండి రక్షించుకునేందుకు ఎల్లప్పుడూ బాప్ దాదాను మీ ముందు ఉంచండి. ప్రతి అడుగు బాప్ దాదాను అనుసరిస్తూ నడవాలి. ప్రతి సంకల్పమును, ప్రతి కార్యమును అవ్యక్త బలముతో అవ్యక్త రూపము ద్వారా వెరిఫై చేయించండి. ఏవిధంగా సాకారములో తోడుగా ఉన్నప్పుడు వెరిఫై చేయించిన తరువాత ప్రాక్టికల్ లోకి వచ్చేవారో, అలాగే బాప్ దాదాను అవ్యక్తరూపములో ఎల్లప్పుడూ సమ్ముఖముగా లేక తోడుగా ఉంచుకోవటం ద్వారా ప్రతి సంకల్పము మరియు ప్రతి కార్యము వెరిఫై చేయించి మళ్ళీ చేయటం ద్వారా ఎటువంటి వ్యర్థ వికర్మ ఉండదు. ఎవరిద్వారా అయినా ఏ విషయము విన్నాగానీ, విషయాల రాగములోకి వెళ్ళకుండా అందలి అర్థమును తెలుసుకోండి. రాజ్ (రహస్యము)ను వదిలి సాజ్ (రాగము)ను వినటం ద్వారా నాజూకుతనము వస్తుంది. ఫలానా వారు అలా అన్నారు, అప్పుడు అలా జరిగింది అని ఇలా ఎప్పుడూ కూడా ఆలోచించకండి కానీ ఎవరు చేస్తారో వారే పొందుతారు, దీనిని మీ ముందు ఉంచండి. ఇతరుల సంపాదన ఆధారమును తీసుకోవద్దు. ఇతరుల సంపాదనపైకి కళ్ళు పోకూడదు, ఆ కారణంగానే ఈర్ష్య కలుగుతుంది. ఇందుకొరకు 'తమలోని విశేషతల్ని ఎంత తల్చుకుంటారో అంత నషా పెరుగుతుంది' అన్న తండ్రి స్లోగన్ ను ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోండి. ఇతరుల నషాను మీ లక్ష్యముగా చేసుకోవద్దు. కానీ బాప్ దాదా గుణాలు మరియు కర్తవ్యములను మీ లక్ష్యముగా చేసుకోండి. బాప్ దాదాతో పాటు నేను కూడా అధర్మ వినాశనము మరియు సద్ధర్మ స్థాపనా కర్తవ్యమునకు నిమిత్తముగా అయి ఉన్నాను అని ఎల్లప్పుడూ బాప్ దాదాల కర్తవ్యమును స్మృతిలో ఉంచుకోండి. ఎవరైతే అధర్మ వినాశనము కొరకు నిమిత్తమై ఉన్నారో వారు స్వయం అధర్మ కార్యము లేక దైవీ మర్యాదలను అతిక్రమించే కర్తవ్యమును ఎలా చెయ్యగలరు? నేను మాస్టర్ మర్యాదా పురుషోత్తముడను, కావున మర్యాదలను అతిక్రమించలేను. ఇటువంటి స్మృతిని ఉంచటం ద్వారా సమానమైన మరియు సంపూర్ణ స్థితి తయారవుతుంది. అర్థమైందా! తక్కువగా ఆలోచించండి, కర్తవ్యమును అధికంగా చెయ్యండి. కేవలము ఆలోచించటములోనే సమయాన్ని వ్యర్థముగా పోనివ్వవద్దు. సృష్టి వినాశనమునకు ముందే బలహీనతలు మరియు లోపాల వినాశనమును చెయ్యండి.

          భట్టీ చేసినవారు భట్టీలో తమ రూపము, రంగు మరియు ప్రకాశమును మార్చుకున్నారు. అనేక రూపాలను మార్చటమును అంతం చేసుకున్నారా? సదాకాలము కొరకు ఆత్మిక రూపము కనిపించాలి, అలా మిమ్మల్ని మీరు తయారుచేసుకున్నారా? చిక్కుల అంశము కూడా ఉండనంతగా మిమ్మల్ని మీరు ఉజ్వలంగా తయారుచేసుకొన్నారా? అల్పకాలము కొరకు ప్రతిజ్ఞ చేసుకున్నారా లేక అంతిమకాలము వరకు ప్రతిజ్ఞ చేసారా? మీ పాత విషయాలను, పాత సంస్కారాలను అలా పరివర్తనలోకి తీసుకురావాలి. ఏవిధంగా జన్మ పరివర్తన అయిన తరువాత పాత జన్మ విషయాలు మర్చిపోతారో అలా పాత సంస్కారాలను భస్మము చేసారా లేక అస్థికలను(ఎముకలను) ఉంచారా? అస్థికలలో మళ్ళీ భూతము ప్రవేశిస్తుంది. కావున అస్థికలను సంపూర్ణ స్థితి అనే సాగరములో కలిపేసి వెళ్ళాలి. దాచి ఉంచుకొని వెళ్ళవద్దు. లేదంటే మీ అస్థికలు స్థితిని అలజడి చేస్తూ ఉంటాయి. సంకల్పాల సమాప్తిని చెయ్యాలి. అచ్ఛా!

          పిల్లలైన మీరందరూ సింహాసనాధికారులుగా అయ్యేందుకు పురుషార్థము చెయ్యాలి, అంతేకానీ సింహాసనాధికారుల ముందు ఉండేందుకు కాదు. ఎప్పుడైతే ఇప్పుడు సమీపంగా అవుతారో అప్పుడే సింహాసనాధికారులుగా అవుతారు. ఎవరు ఎంతగా సమీపంగా ఉంటారో అంతగా సమానతతో ఉంటారు. పిల్లలైన మీ నయనాలను ఎవరైనా చూసినట్లయితే వారికి ముక్తి-జీవన్ముక్తుల దారి కనిపించాలి. అలా నయనాలలో ఇంద్రజాలము ఉండాలి. మరి మీ నయనాలు ఎంత సేవ చేస్తాయి. నయనాలు కూడా సేవ చేస్తాయి మరియు మస్తిష్కము కూడా సేవ చేస్తుంది. మస్తిష్కము ఏం చూపిస్తుంది, ఆత్మలనా? తండ్రిని. మీ మస్తిష్కము ద్వారా తండ్రి పరిచయము ప్రాప్తించాలి, అటువంటి సేవను చెయ్యాలి. అప్పుడే సమీప సితారలుగా అవుతారు. ఏవిధంగా సాకారములో తండ్రిని చూసారు కదా, మస్తకము మరియు నయనాలు సేవ చేసేవి. మస్తిష్కములో జ్యోతి బిందువు ఉండేది, నయనాలలో ప్రకాశవంతమైన త్రిమూర్తి స్మృతి ఉండేది. అలా సమానంగా అవ్వాలి. సమానంగా అవ్వటంవలననే సమీపంగా అవుతారు. ఎప్పుడైతే మీరు స్వయం అటువంటి స్థితిలో ఉన్నట్లయితే మాయ ఏం చేస్తుంది! మాయ స్వయమే అంతమైపోతుంది. పిల్లలైన మీరు రెగ్యులర్‌గా అవ్వాలి. రెగ్యులర్ అని బాప్ దాదా ఎవరిని అంటారు? ఎవరైతే ఉదయము నుండి రాత్రి వరకు ఏ కర్తవ్యమును చేసినా దానిని శ్రీమతం ప్రమాణంగా చేస్తారో వారినే రెగ్యులర్ అని అంటారు. అన్నింటిలో రెగ్యులర్. సంకల్పములో, వాణిలో, కర్మలో, నడవడికలో, నిద్రించుటలో, అన్నింటిలో రెగ్యులర్. రెగ్యులర్ వస్తువు మంచిగా అనిపిస్తుంది. ఎవరు ఎంతగా రెగ్యులర్‌గా ఉంటారో అంతగా ఇతరుల సేవను మంచిగా చెయ్యగలరు. సర్వీసబుల్ అనగా ఒక్క సంకల్పము కూడా సేవ లేకుండా నడవకూడదు. ఇటువంటి సర్వీసబుల్ లు ఇతర ఋజువును తయారు చెయ్యగలరు. సేవ కేవలము నోటిదే కాదు కానీ, సర్వ కర్మేంద్రియాలు సేవ చెయ్యటంలో తత్పరమై ఉండాలి. ఏవిధంగా నోరు బిజీగా ఉంటుందో అలా మస్తిష్కము, నయనాలు సేవలో బిజీగా ఉండాలి. అన్నిరకాల సేవను చేసి సేవా ప్రమాణమును తయారు చెయ్యాలి. ఓకేవిధమైన సేవద్వారా ప్రమాణము వెలువడదు, కేవలము ప్రశంసిస్తారు. కావలసింది ప్రమాణము, కావున ప్రమాణమును ఇచ్చేందుకు అన్ని రకాల సేవలలో సదా తత్పరమై ఉండాలి. ఎంత సర్వీసబుల్ లుగా ఉంటారో అంతగా తమ సమానంగా తయారుచేస్తారు. మరల తండ్రి సమానంగా తయారుచేస్తారు. అచ్ఛా!

Comments