23-09-1973 అవ్యక్త మురళి

* 23-09-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“విశ్వంలోని ఆత్మలకు ప్రకాశమును లేక శక్తిని ఇచ్చేవారే విశ్వ అధికారులు”

          ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క ఉన్నతమైన స్థితిలో సదా స్థితులై ఉండే శ్రేష్ఠ ఆత్మలుగా స్వయమును భావిస్తూ ప్రతి కర్మను చేస్తున్నారా? ఏ విధంగా "మీ పేరు ఉన్నతమైనది, మీ కార్యం ఉన్నతమైనది మరియు మీ ధామం ఉన్నతమైనది" అని బాబాను గూర్చి గాయనం ఉందో అదేవిధంగా మీరు స్వయమును కూడా బాబా సమానంగా ఉన్నతమైన నామము మరియు ఉన్నతమైన కార్యమును చేసే విశేష ఆత్మగా భావిస్తున్నారా? ఒక్క వ్యర్థమైన లేక సాధారణమైన సంకల్పం కూడా ఉత్పన్నమవ్వకూడదు అన్న ధ్యానమును ఉంచుతున్నారా? దీనినే ఉన్నతమైన స్థితి అని అంటారు. మీరు స్వయమును ఇటువంటి ఉన్నతమైన స్థితి కలవారిగా అనుభవం చేసుకుంటున్నారా? ఎప్పటివరకైతే వ్యర్థమైన సంకల్పాలు, మాటలు లేక కర్మలు జరుగుతాయో అప్పటివరకు శ్రేష్ఠముగా అవ్వలేరు. బెస్ట్ గా అయినా ఉంటారు లేక వేస్ట్ గా అయినా ఉంటారు. (శ్రేష్ఠముగా అయినా ఉంటారు లేక వ్యర్థంగా అయినా ఉంటారు) ఏ విధంగా పగలు ఉంటే రాత్రి ఉండదో అలాగే రాత్రి ఉంటే పగలు ఉండదో అలాగే ఎక్కడైతే వ్యర్థం ఉంటుందో అక్కడ శ్రేష్ఠంగా అవ్వలేరు. కావున శ్రేష్ఠంగా అయ్యేందుకు వ్యర్థమును అంతం చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే వ్యర్థం అంతమైపోతుందో అప్పుడు ఆత్మ ఎటువంటి కార్యమునైనా చేస్తూ, ఎటువంటి వాతావరణము లేక పరిస్థితులలోనైనా ఉంటూ అలాగే ఎటువంటి అలజడుల మధ్య ఉంటున్నా విశ్రాంతిగా ఉండడం గమనిస్తాము.

           ఏ విధంగా ఈ రోజుల్లో సైన్స్ వారు తమ విజ్ఞాన జ్ఞానము ఆధారంపై ఎటువంటి దు:ఖిత సమయంలోనైనా ఒక్క ఇంజెక్షన్ ద్వారా అల్పకాలికంగానైనా విశ్రాంతిని అనుభవం చేయిస్తారో అలాగే ఎటువంటి శబ్దం లేక ఎటువంటి తమోగుణ వాతావరణం ఉన్నాకాని సైలెన్స్ శక్తి ద్వారా వ్యర్థం సమాప్తమైపోయిన కారణంగా బెస్ట్ శ్రేష్ఠ) స్థితిలో స్థితులై ఉండడం ద్వారా సదా రెస్టును అనుభవం చేసుకుంటారు, అనగా సదా స్వయమును సుఖశాంతుల శయ్యపై విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. సాగరంలో ఎక్కడైతే అలల అలజడి ఉంటుందో అక్కడ సాగరంలో ఉంటూ కూడా, సర్పముల శయ్య ఉంటూ కూడా అనగా వాతావరణం లేక పరిస్థితులు దు:ఖమయంగా ఉంటూ కూడా విశ్రాంతిని అనుభవం చేసుకుంటారు. కావున దీని భావం ఏమిటంటే పరిస్థితులు లేక వాతావరణము ఖండించే విధంగా ఉన్నాకాని, చలింపజేసేవిధంగా ఉన్నాకాని, తమ విషం ద్వారా మూర్చితం చేసే విధంగా ఉన్నాకాని ఇటువంటి వాతావరణమును కూడా సుఖశాంతిమయమైన శయ్యగా మార్చెయ్యాలి అనగా విశ్రాంతి స్థానంగా చేసెయ్యాలి అనగా ఆత్మ సదా తన విశ్రాంత స్థితిలో ఉండాలి. కావున ఏ విధంగా స్మృతిచిహ్న చిత్రం ఉందో అలాగే ప్రత్యక్ష జీవితంలో కూడా అనుభవం చేసుకుంటున్నారా? శీతలతలో శీతలంగా ఉండడం పెద్ద విషయమేమీ కాదు. విశ్రాంత సాధనాలలో విశ్రాంతిగా ఉండడం కూడా సాధారణమైన విషయమే. కాని, విశ్రాంతిలేని స్థితిలో విశ్రాంతిగా ఉండడం, దీనినే పదమా పదమ భాగ్యశాలులు అని అంటారు. కావున ఇటువంటి విషయ సాగరం మధ్య ఉంటూ పంచవికారాలను మీ విశ్రాంతి లేక సుఖశాంతి శయ్యగా చెయ్యడం అనగా ఇప్పటినుండే వికారాలపై సదా విజయులుగా అయి సదా జ్ఞాన మననము మరియు బాబా మిలనంలో మగనమై ఉండడము.

           ఎవరైతే ఇటువంటి స్థితిలో స్థితులై ఉంటారో అనగా సదా మగనమై ఉంటారో వారే సదా నిర్విఘ్నులు. మగనమై లేరంటే తప్పకుండా ఏదో విఘ్నము ఉంది ఇప్పుడు విఘ్నము మీ పై యుద్ధం చేయడం ద్వారా మీరు ఓడిపోయారా లేక మీరు కూడా విఘ్నాలతో ఓటమిని చవిచూస్తున్నారా? ఇప్పటివరకు ఓడిపోతూ ఉండడం జరుగవచ్చా? ఇది అసంభవం కదా! ఇప్పుడు ఓటమిని చవిచూసేవారిలా ఉన్నారా లేక ఓటమిని చవిచూపించేవారిలా ఉన్నారా? మీరు స్వయం నిర్విఘ్నులుగా అయినట్లయితే మరి అలా తయారయ్యేవారి కర్తవ్యం ఏమిటి? కొందరు ఇప్పుడు తయారవుతున్నారు, మరికొందరు తయారైపోయారు. ఎవరైతే అవ్వనున్నారో వారు తమలోనే బిజీగా ఉన్నారు, ఎందుకంటే ఎప్పటివరకైతే వారు స్వయం అలా అవ్వరో అప్పటివరకు ఇతరులను తయారుచేయడంలో యథాశక్తిగానే కార్యం చేయగలరు. కాని, ఎవరైతే అలా తయారైపోయారో వారి కర్తవ్యం ఏమిటి? ఇతరులను తయారుచేయడం వారి కర్తవ్యము. కావున మీరు అలా తయారుచేస్తున్నారు కదా? మరి మొదట దానము ఇంటి నుండి ప్రారంభమవుతుందా? అనగా మీ సహచరులను కూడా అలా తయారుచేశారా? ఆ సహచరులు ఎవరు? బ్రాహ్మణ పరివారపు సహచరులు, కావున ఆ సహచరులను మీ సమానంగా తయారుచేసిన తర్వాత మళ్లీ బాబా సమానంగా తయారుచేయాలి. కాని, మొదటి స్థితిలో వారిని మీ సమానంగా తయారుచేసినా ఉన్నతమైనదే. 

           కావున ఎవరైతే తయారయ్యారో వారి కర్తవ్యం ఏమిటి? వారి స్వరూపం ఇప్పుడు ఎలా ఉండాలి? విఘ్నవినాశకులుగా ఉండాలి అని ఎవరో జవాబు చెప్పారు, అచ్ఛా! విఘ్నవినాశకులుగా ఎలా అవుతారు? ఏ రూపంతో సంహారం చేసినట్లయితే సహజంగానే విశ్వసేవ చేయగల్గుతారు? ఆ రూపం ఏమిటి? అది డబుల్ లైట్ మరియు మైట్ హౌస్ యొక్క రూపం. డబుల్ అని ఎందుకన్నారు? ఎందుకంటే మీరు రెండు కార్యాలను చేయాలి. కొందరికి ముక్తిమార్గాన్ని తెలియజేయాలి, మరికొందరికి జీవన్ముక్తి మార్గాన్ని తెలియజేయాలి. ఒక్క మార్గం కాదు రెండు మార్గాలను చూపించాలి మరియు ఒక్కొక్క ఆత్మను తమ తమ గమ్యస్థానానికి చేర్చాలి. కావున ఎవరైతే తయారయ్యారో వారి స్వరూపంగా ఇప్పుడు డబుల్ లైట్ గా మరియు మైట్ గా అవ్వాలి, తద్వారా ఒకే స్థానంలో ఉంటూ కూడా నలువైపులా తమ ప్రకాశము మరియు శక్తి ఆధారంపై భ్రమిస్తున్న ఆత్మలకు గమ్యస్థానాన్ని అందించాలి. మరి మీరు ఈ కార్యంలో బిజీగా ఉన్నారా? ఇప్పుడు ప్రకాశము మరియు శక్తి రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు కేవలం ప్రకాశం ద్వారాను పని నడువదు అలాగే కేవలం శక్తి ద్వారాను వని నడువదు. ఎప్పుడైతే రెండింటి యొక్క బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుందో అప్పుడు అంధుల పిల్లలైన అంధులకు (శాస్త్రాలలో కౌరవ సాంప్రదాయులను గూర్చి అంధుల పిల్లలు అంధులు అని ఉంది.) వారికి మీ ప్రకాశము మరియు శక్తి ద్వారా ఏ వరదానమును ఇస్తారు మరియు ఆ వరదానంలో వారు ఏమి పొందుతారు? డివైన్ ఇన్ సైట్ అనగా వారికి మూడవ నేత్రపు వరదానమును ఇవ్వండి.

           నేత్ర దానమును అన్నింటికన్నా శ్రేష్ఠమైన దానము అని అంటారు. నేత్రాలు లేకపోతే అసలు ప్రపంచమే లేదు. అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన ప్రాణదానము అనండి లేక వరదానము అనండి లేక మహాదానము అనండి అది నిజానికి ఇదే. కావున అంధులకు డివైన్ ఇన్ సైట్ అనగా మూడవనేత్రపు దానమును ఇవ్వండి. తద్వారా వారు ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క లక్ష్యమును చూడగల్గుతారు. వారు చూడకపోతే మరి ఎలా చేరుకోగలరు? కావున డబుల్ లైట్ గా మరియు మైట్‌హౌసుగా అయి రెండింటి యొక్క బ్యాలెన్స్ ను సరిగ్గా ఉంచుకొని ప్రతి ఆత్మకు మూడవ నేత్రపు వరదానమును ఇవ్వండి, ఇది శ్రేష్ఠ ఆత్మల కర్తవ్యము. ఆ ప్రకాశము మరియు శక్తిని కేవలం మీ కొరకే ఉంచుకున్నట్లయితే లైట్ హౌస్ గా పిలువబడరు. స్వయంలో ప్రకాశము మరియు శక్తి ఉన్నట్లయితే మీ సహచరులకు మరియు విశ్వంలోని సర్వ ఆత్మలకు మహాదానమును ఇవ్వండి మరియు వరదానమును ఇవ్వండి. ఏదైనా బల్బు నలువైపులా ప్రకాశమును వ్యాపింపజేయకుండా కేవలం ఎక్కడైతే వెలుగుతుందో ఆ  స్థానం పైననే ప్రకాశమునిస్తున్నట్లయితే ఇది ఎందుకూ పనికిరాదు అని అంటారు కదా! కావున నేను స్వయం వరకు ప్రకాశమును లేక శక్తిని ఇచ్చేవానిగా అయ్యానా లేక విశ్వం వరకు ప్రకాశమును, శక్తిని ఇచ్చేవానిగా అయ్యనా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇప్పుడు ఎంతవరకు ప్రకాశంనిచ్చేవారిగా అవుతారో అంతగానే చిన్న లేక పెద్ద రాజ్యానికి అధికారులుగా భవిష్యత్తులో అవుతారు. ఏదో కొద్దిమంది ఆత్మలకు మాత్రమే ప్రకాశమును మరియు శక్తిని ఇచ్చేందుకు నిమిత్తులుగా అయినట్లయితే అక్కడ కూడా కొద్ది ఆత్మలపైనే రాజ్యం చేసేందుకు అధికారులుగా అవుతారు. ఇక్కడ విశ్వసేవాధారులుగా అయినట్లయితే అక్కడ కూడా విశ్వరాజ్యాధికారులుగా అవుతారు.

           ఒకరేమో రాజ్యాధికారులుగా అయ్యేవారు, వారిని టీచర్లు అని అంటారు. వారు రాజ్యకార్య వ్యవహారాలను నేర్పించేవారిగా అవుతారే కాని రాజ్యం చేసేవారిగా అవ్వరు. ఇప్పుడు మీరు నేర్పించేవారిగా అవుతారా లేక చేసేవారిగా అవుతారా? అక్కడ సత్యయుగంలో కూడా నిమిత్త మాత్రంగా చదివిస్తారు కదా! రాజ్య కార్యవ్యవహారాలను నేర్పించే శిక్షకులెవరైతే ఉంటారో వారిని రాజ్య ఆధారులు అని అంటారు, కాని రాజ్య అధికారులు అని అనరు. రాజ్యాధారులుగానైనా అవుతారు లేక రాజ్య అధికారులుగానైనా అవుతారు. ఎవరైతే ఇప్పటినుండే తమ స్వభావ సంస్కారాలకు మరియు సంకల్పాలకు అధీనులుగా అవ్వరో వారే అధికారులుగా అవుతారు. ఎవరైతే ఇప్పుడు కూడా తమ సంకల్పాలకు అధీనులుగా ఉంటారో వారు అధికారులుగా ఉన్నట్లా? వారు సంకల్పాలకు కూడా అధీనులుగా ఉన్నట్లే కదా! కావున ఇప్పుడు సంకల్పాలకు కూడా అధీనులుగా అవ్వకండి. స్వభావ సంస్కారాలకు కూడా అధీనులుగా అవ్వకూడదు. ఎవరైతే ఇప్పటినుండే వీటన్నింటిపై అధికారులుగా అవుతారో వారే అక్కడ రాజ్య అధికారులుగా అవుతారు. కావున ఇప్పుడు ఎంతగా అధీనులుగా ఉంటున్నారు మరియు ఎంతగా అధికారులుగా ఉంటున్నారు అన్న లెక్కను చూడండి! మరియు దాని రిజల్టు ద్వారా మీ భవిష్యత్తును మీరే సాక్షాత్కరింపజేసుకోగలరు అనగా మిమ్మల్ని మీరు పరిశీలించుకునే అద్దంలో మీ వర్తమానము మరియు భవిష్య 21 జన్మల కొరకు మన భవిష్యత్తు యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయో అది కూడా చూడగలరు. మీరు మీ 21 జన్మల రూపురేఖలను కూడా చూడగలరు. మీకు మిమ్మల్ని మీరు పరిశీలించుకునే శక్తి లేక అద్దము ఇంతటి శక్తిశాలిగా ఉన్నప్పుడు ఇది జరుగగలదు. ఆ అద్దంలో కేవలం వర్తమానాన్ని చూడగలరు. అద్దం ఎంత శక్తిశాలిగా ఉన్నా దాని ద్వారా ఎంతో దూరంగా ఉన్న వస్తువునైనా చూడగలరు. కాని, అది కూడా ఈ ప్రపంచానికి సంబంధించిందే కదా! దాని ద్వారా భవిష్యత్తునైతే చూడలేరు కదా! కాని, మీకు పరిశీలించుకునే శక్తిరూపీ అద్దం ఎంత శక్తిశాలిగా లభించిందంటే దాని ద్వారా మీరు కేవలం వర్తమానమును చూడటం కాదు దాని ద్వారా భవిష్యత్తు యొక్క ఒక్క జన్మ కాదు 21 జన్మలను చూడగలుగుతారు మరియు మళ్ళీ 21 జన్మల  ఆధారంపై, భవిష్య పదవి యొక్క ఆధారంపై మీ పూజారి స్థితి యొక్క పాత్రను కూడా చూడగల్గుతారు. కావున బాప్ దాదా ద్వారా ప్రాప్తించిన ఇంతటి శక్తిశాలి అద్దమును చూస్తూ ఉన్నారా? మిమ్మల్ని మీరు క్లియర్ గా చూడగలరా లేక చూసేందుకు ఇంకెవరి అవసరమైనా ఉందా? త్రికాలదర్శులకు ఇంకెవరి అవసరమైనా ఉంటుందా? త్రికాలదర్శులు ఇతరుల భవిష్యత్తును కూడా తెలుసుకోగలరు. మరి మీరు మీ భవిష్యత్తును తెలుసుకోలేరా?

           త్రికాలదర్శులుగా అయ్యారా లేక ఏకదర్శులుగా అయ్యారా? ఏకదర్శులు అనగా కేవలం వర్తమానమును చూసేవారు. మీరైతే త్రికాలదర్శులుగా అయి అందరికీ సందేశమును ఇవ్వండి. ఏకదర్శులుగా అయి సందేశమును ఇచ్చినట్లయితే రిజల్ట్ ఒక్క శాతమే వెలువడుతుంది. త్రికాలదర్శులుగా అయి సందేశమును ఇచ్చినట్లయితే మూడు భాగాల రిజల్ట్ వెలువడుతుంది అనగా 75 శాతం రిజల్ట్ లభిస్తుంది. ఇప్పుడైతే కేవలం 25 శాతం మాత్రమే ఉంది. మరి ఇప్పుడేం చేస్తారు? మొత్తం పాండవసైన్యం అంతటి విజయ జెండా ఎగురవేస్తారా? ఆ తర్వాత ఏం చేస్తారు? రెండింటినీ ఎగురవేస్తారు కదా! ఈ జెండాను ఎగురవేయటమైతే సహజమే. ఒకటికి బదులుగా 100 ఎగురవేయండి. ప్రతిఒక్కరూ తమ తమ స్థానాలలో ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎగురవేయండి. కాని, ఈ జెండాను ఎగురవేయడము అంటే దాని అర్థం ఏమిటి? విజయ జెండాను ఎగురవేయడము. ఇప్పుడు అందరూ కలసి తనువు, మనస్సు, ధనములను ఏవైతే వినియోగిస్తున్నారో దానిని ఎందుకు వినియోగిస్తున్నారు? దానిని ఏ లక్ష్యంతో వినియోగిస్తున్నారు? కేవలం శివుని చిత్రం ఉన్న జెండాను ఎగురవేసే లక్ష్యంతో ఎగురవేస్తున్నారా? అందరూ కలిసి మన రాజధానిపై విజయ జెండా ఎగురవేస్తాము మరియు అందరిపై విజయమును పొందుతాము అన్న లక్ష్యమును ఉంచండి. విశ్వమునకు నోరు ఏమిటి? వార్తాపత్రికలు, కరపత్రాలు మరియు మ్యాగజీన్లు, ఇప్పుడు విశ్వపు నోటి ద్వారా మాట్లాడుతూ ఉంటారు కదా! కాని వారు మౌనమైపోవాలి. అంతం చేయలేకపోతే అంతం చేయలేకపోయారు, కాని కనీసం మూర్చితమైతే చేయండి. మూర్చితమైన వ్యక్తి కూడా మాట్లాడడు కదా! ఇప్పుడు ఈ రిజల్ట్ వెలువడాలి. బూడిదగా ఎవరు అవుతారు మరియు కోట్లాదిమంది ఎందరు వెలువడుతారు? లక్షలాదిమంది నుండి ఒక్కరుగా ఎవరు వెలువడుతారు? అది కూడా చూద్దాము. కాని ఇది ఎలా జరుగుతుంది? దీని కొరకు రెండు విషయాలను వదలాలి మరియు ఒక్క విషయాన్ని ధారణ చేయాలి. ఏ రెండు విషయాలను వదలాలి? రెండు మతాలను వదిలి ఏకమతమును ధారణ చేయాలి. కాని రెండు మతాలు ఎందుకు ఉంటాయి? ఒక్క మతానికి బదులుగా రెండు మతాలలోకి వచ్చేందుకు కారణం ఏమిటి? ఆ వదలవలసిన రెండు విషయాలు ఏమిటి మరియు ధారణ చేయవలసిన విషయం ఏమిటి? ఒకటేమో- స్తుతిని వదిలేయాలి మరియు రెండవది పరిస్థితులు. ఎందుకంటే పరిస్థితుల కారణంగానైనా అలజడి చెందుతారు మరియు ఇంకొకటి స్తుతిలోకి రావడం ద్వారా స్థితి ఏర్పడదు. కావున ఈ స్తుతి ప్రభావంలోకి ఎప్పుడూ రాకండి. ఇక్కడ తమ స్తుతి జరగాలి అని సంకల్పమును చేసినా అర్థకల్పం నుండి ఏ స్తుతి అయితే జరగాలో అందులో 100 రెట్లు అంతమైపోతుంది. ఎందుకంటే ఇప్పటి అల్పకాలికమైన స్తుతి సదాకాలికమైన స్థితిని అంతం చేసేస్తుంది. కావున ఇప్పుడు పరిస్థితి అన్న పదమును కూడా వాడకండి అలాగే స్తుతి యొక్క సంకల్పాన్ని కూడా చేయకండి.

           ఎంతగా నిర్మాణచిత్తులుగా ఉంటారో అంతగానే నిర్మాణ కార్యం సఫలమవుతుంది. నిర్మాణత లేనట్లయితే నిర్మాణము చేయలేరు. నిర్మాణం చేసేందుకు మొదట నిర్మాణచిత్తులుగా అవ్వవలసి ఉంటుంది. అందుకు ఒక స్లోగన్ ను సదా గుర్తుంచుకోండి. ఎటువంటి కార్యమునైనా, ఎటువంటి పరిస్థితులు ముందుకు వచ్చినా కాని ఏ విధంగా అజ్ఞానకాలంలో మొదట మీరు అనగా ఇతరులను ముందు ఉంచడమే స్వయమును ముందు ఉంచుకోవడము అన్న నానుడి ఉందో అలాగే స్వయమును వంచుకోవడము లేక స్వయమునకు నేర్పించుకోవడము. స్వయం వంగడమే విశ్వమును మీ ముందు వంగేలా చేయడము. కావున ఎల్లప్పుడూ పరస్పరంలో దృష్టి, వృత్తి మరియు వాణిలో మొదట మీరు అన్నదే ఉండాలి. ఈ స్లోగన్ ను ఎప్పుడూ మరిచిపోకూడదు. ఏవిధంగా బాప్ దాదా సంకల్పాలలో లేక మాటలలో లేక కర్మలలో మొదట నేను అన్నది ఏ విధంగా చూపించలేదో, ఎల్లప్పుడూ పిల్లలను ముందు ఉంచారో, ఇదే వృత్తిని లేక దృష్టిని ముందు ఉంచారు. ఇదేవిధంగా బాబాను అనుసరించే ప్రతి ఆత్మ ఈ విషయంలో బాబాను అనుసరించినట్లయితే సఫలత 100 శాతం కంఠహారంగా అయిపోతుంది. మొదట మీరు అని అనేందుకు బదులుగా మొదట నేను అని సంకల్పమైనా చేస్తే, ఒక్క ఆత్మ అయినా ఇది సంకల్పం చేస్తే లేక వాణి మరియు కర్మలోకైనా తీసుకువచ్చినట్లయితే సఫలతా మాలలోని ఒక మణి తెగిపోయిందని భావించండి. మాలలో ఒక్క మణి అయినా తెగిపోతే మొత్తం మాల అంతటిపైన దాని ప్రభావం పడుతుంది. కావున స్వయమును ఈ విషయంలో పక్కా చేసుకోవడమే కాదు స్వయంతోపాటు సంఘటనను కూడా ఈ పాఠంలో లేక ఈ స్లోగనులో సఫలంగా చేసుకునే ప్రయత్నంలో ఉండాలి. తద్వారా విజయమాలలోని ఒక్క మణి కూడా వేరవ్వకాలకూడదు. ఎప్పుడైతే ఇటువంటి పురుషార్థం చేస్తారో లేక ఈ కార్యమును చేస్తారో అప్పుడు విజయ జెండాను మన రాజధానిపై నిలుపగలరు.

           పాత్రను అభినయించేందుకు ముందు రిహార్సల్ చేస్తారు. ఆ తర్వాత డ్రెస్సు మరియు మేకప్ మొదలైనవి చేయడం జరుగుతుంది. అప్పుడే పాత్ర సక్సెస్ ఫుల్ గా అవుతుంది. కావున ఈ విధంగా అలంకరింపబడి ఎవర్రడీగా అయి ఎప్పుడైతే స్టేజీ పైకి వస్తారో అప్పుడు అందరి నోటి నుండి హియర్, హియర్ అని, వన్స్ మోర్ అని వెలువడుతుంది, కేవలం స్టూలమైన ఏర్పాట్లు చేయడంలోనే బిజీగా అయిపోలేదు కదా! మొదట మీ డ్రెసును  తయారుచేసుకోండి, ఆ తర్వాత మేకప్ సామానులను తయారుచేయండి. మేకప్ చేసుకోవడం అనగా స్థితిలో స్థితులవ్వడము. ఈ ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారా? ఈ మీటింగులను కూడా చేస్తున్నారా? ఎక్కువ మీటింగులలో పడి ఈ పాయింట్‌ను మర్చిపోకండి. స్టాలులను అలంకరిస్తూ అలంకరిస్తూ సమయమైపోయి మీరు స్వయమే అలా ఉండిపోయేవిధంగా అయితే లేరు కదా! అనేక సెంటర్లలో ఫంక్షన్ల కొరకు ఏర్పాట్లు చేస్తూ, చేస్తూ స్వయం అలాగే నిలుచుండిపోతారు, కాని స్వయం తయారవ్వరు. ఇక్కడ ఇప్పుడు అలా చేయకండి.

           దానం తీసుకునేవారు వచ్చేసిన ఆ సమయంలో, మీరు, నేను పంచడానికి ఏమి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉండడం కాదు. కావున స్టాకు మొదటి నుండే పోగుచేసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో పోగుచేసుకునే ప్రయత్నం చేసినట్లయితే అనేకులు వంచితులుగా ఉండిపోతారు. ఏ విధంగా ఇతర వస్తువుల స్టాకును పోగుచేస్తారో అలాగే ఈ స్టాకును మొదట పోగుచేయాలి. ఎవరికి ఏది కావాలనుకుంటే అది, సుఖశాంతులు కావాలా లేక కేవలం ప్రజా పదవి కావాలా లేక కొందరికి షావుకారు పదవి కావాలి, మరికొందరు కేవలం విశ్వమహారాజులకు నమస్కరించాలనుకుంటారు, మరికొందరు మేము ఎల్లప్పుడూ చరణదాసులుగా ఉండాలనుకుంటారు. కావున భక్తులెవరైతే నమస్కరించాలనుకుంటారో అటువంటివారి స్టాకును కూడా నింపేయండి, ఎవరికి ఏ వస్తువు కావాలనుకుంటే మరియు ఏ వస్తువు యొక్క కోరిక ఉంటే వారి ఆ కోరికను అవినాశిగా పూర్తి చేయగలగాలి. ఆ కోరికలు ఈ మట్టి ప్రపంచానికి కాక స్వర్ణిమ ప్రపంచానిది పూర్తి చేయగలగాలి. ఇటువంటి స్టాక్ ఎప్పుడైతే పోగవుతుందో అప్పుడు త్వరగా మీ స్టాకు ద్వారా ఆ ఆత్మలకు అందివ్వగల్గుతారు. మరి ఈ ఏర్పాట్లను కూడా చేసుకున్నారా? ఈ లెక్కాపత్రాన్ని కూడా తీశారా లేక కేవలం ప్రతి ఒక్క జోను ఎంత  తనువును-ధనాన్ని ఇస్తారు, ఎన్ని బ్యానర్లు మరియు దుప్పట్లు మొదలైనవి ఇస్తారు అన్న లెక్కను చూస్తున్నారా? మీ మస్తకంపై కూడా బ్యానర్లను పెట్టాలి.

           మొదట మీ మూర్తి యొక్క చైతన్య ప్రదర్శనిని పెట్టాలి. అందులో నయనాలు కమల సమానంగ కనిపించాలి, మీ పెదాలపై ఆత్మిక మందహాసం కనిపించాలి మరియు మస్తకం ద్వారా ఆత్మ యొక్క ముఖం కనిపించాలి. మరి మీరు ఈ విధంగా మీ మూర్తిని అలంకరించుకున్నారా? ఈ ప్రదర్శినిని కూడా సంసిద్ధం చేసుకుంటున్నారా లేక కేవలం స్టాలు యొక్క ప్రదర్శినిని తయారుచేస్తున్నారా? దీని ఇనాం కూడా లభిస్తుంది కదా! మీరు పరస్పరంలో ఒకరికొకరు స్టాలు యొక్క అలంకరణకు చెందిన బహుమానమును ఇస్తారు మరియు బాప్ దాదా చైతన్య ప్రదర్శని యొక్క అలంకరణకు ఇస్తారు. కావున ఇప్పుడు డబుల్ ఇనాం లభిస్తుంది. ఎవరెవరు తమ చైతన్య ప్రదర్శని లేక తమ మస్తకం యొక్క బ్యానర్ ద్వారా సేవ చేశారు అన్నదానికి బహుమానమును ఇస్తారు. ఈ రిజల్ట్ ను చూస్తారు. రిజల్టయితే రావాలి కదా! ఫస్ట్, సెకండ్ మరియు థర్డ్ మూడు నెంబర్లకు కానుక లభిస్తుంది. ఇప్పుడు రిజల్ట్ ను చూద్దాము. రిజల్టయితే రావాల్సిందే కదా! ఫస్ట్, సెకండ్ మరియు థర్డ్ ఈ మూడు నెంబర్లకు కానుక లభిస్తుంది. బాప్ దాదా కూడా మూడు కానుకలను ఇస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పటినుండే మేము అందరికన్నా ముందు కానుకను తీసుకుంటాము అని ఆలోచిస్తున్నారు. అధికంగా కూడా అందించడం జరుగుతుంది. అందరూ మొదటి నెంబర్ లోకి వచ్చేసినా కానుకలు ఇద్దాము. ఇందులో పెద్ద విషయమేమీ లేదు. ఎప్పుడైతే ఇంతమంది విజయులుగా అయిపోతారో అప్పుడు విజయీ రత్నాల ముందు కానుక ఏమంత పెద్ద విషయం! అందరూ ఫస్ట్ నెంబర్ వారిగా అవ్వండి, అప్పుడు కానుక కూడా అందరికీ లభిస్తుంది, స్థూలంగా లభిస్తుంది. సూక్ష్మంగా అంటే పెద్ద విషయమేమీ కాదు. సాకార సృష్టి నివాసులుగా ఉన్న కారణంగా సాకారంలో కూడా ఇస్తారు. ఏమి ఇస్తారు అన్నది ఇప్పుడు చెప్పరు, అది ఆ సమయంలో ప్రసిద్ధమౌతుంది. యోగ్యత ఎలా ఉంటుందో ఆ యోగ్యత అనుసారంగా కానుక లభిస్తుంది. బంగారం కూడా ఏమంత పెద్ద విషయము! కొద్ది సమయం తర్వాత ఈ బంగారమంతా మీ చరణాలవద్దకు రానున్నది. విశ్వానికి అధిపతులుగా అయ్యేవారి ముందు ఈ విషయాలన్నీ ఏమంత పెద్ద విషయం! బాప్ దాదాల కానుకలు ఉన్నాయి కదా! ఎంతగ నెంబర్‌ను ముందు తీసుకుంటారో అంతగా కానుకలు లభిస్తాయి. ఎంతగా ఎక్కువగా సేవ యొక్క సఫలతను చూపిస్తారో అంత ఎక్కువగా వారికి కానుక లభిస్తుంది. ఈ స్టాలుల సబ్జెక్టు సంబంధించిన కానుకను ఈ దాదీ దీదీలు ఇస్తారు మరియు దానిని బాప్ దాదా ఇస్తారు. కేవలం ఏదో సంతోషపెట్టడానికి కాదు, ప్రాక్టికల్ గా ఇస్తారు.

           అచ్ఛా! ఈ విధంగా సదా విజయులు, సదా సఫలతామూర్తులు, సదా స్వస్థితితో సదా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే, సదా నిర్మాణచిత్తులుగా అయి విశ్వనవనిర్మాణం చేసే మరియు అడుగడుగులోను ఒక్క బాబా స్మృతిలో ఐకమత్యం కలవారిగా అయి ఒక్కరి పేరును ప్రఖ్యాతం చేసే శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments