* 23-06-1973 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"అలౌకిక ఖజానాకు యజమానులు”
స్వయమును లైట్ హౌస్ గా మరియు మైట్ హౌస్ గా రెండింటిగాను భావిస్తున్నారా? వర్తమాన సమయపు స్థితి అనుసారంగా మీ అందరి యొక్క ఏ స్వరూపము విశ్వకళ్యాణ కర్తవ్యమును చేయగలదు? ఆ స్వరూపమును గూర్చి మీకు తెలుసా? ఈ సమయంలో మైట్ హౌస్ స్వరూపం యొక్క అవసరం ఉంది. ఆల్మైటీ తండ్రి సంతానమైన మనము కూడా మైట్ హౌస్ గా అయ్యాము అని అనుభవం చేసుకుంటున్నారా? సర్వశక్తులు స్వయంలో ఇమిడి ఉన్నాయి అని భావిస్తున్నారా? శక్తివంతులుగా కాదు సర్వశక్తివంతులుగా అవ్వాలి. ఎవరికైతే సర్వశక్తి సంపన్నులు అన్న గాయనము ఉందో వారికి బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అనే శక్తి ఏదీ లేదు అన్న గాయనం కూడా ఉంది.
దేవతల ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేదీ లేదు అన్న గాయనం దేవతలకు ఏ విధంగా ఉందో అలాగే బ్రాహ్మణులైన మీకు బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అనే శక్తి ఏదీ లేదు అన్న గాయనం ఉంది. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నారు. ఎప్పుడైతే తండ్రి పేరే సర్వశక్తివంతుడు, ఆల్ మైటీ అథారిటీ అని ఉందో, అనగా సర్వశక్తుల ఖజానాల యజమానికి బాలకులుగా ఉన్నారు. కావున ఇటువంటి బాలకులు ఎవరైతే బాబా యొక్క సర్వ శక్తులకు యజమానులుగా ఉన్నారో వారి వద్ద ఎటువంటి అప్రాప్తి అయినా ఉండగలదా? వారు బాలకుల నుండి యజమానులుగా అవుతారు. ఎవరైనా స్వయమును పిల్లల నుండి యజమానులుగా అవుతాము అని భావించనివారు ఎవరైనా ఉన్నారా? అందరూ యజమానులే కూర్చున్నారు కదా! సర్వశక్తుల ఖజానాకు యజమానులుగా ఉన్నారు కదా! ఎవరైతే యజమానులుగా ఉంటారో వారు ఎప్పుడైనా మా వద్ద సహనశక్తి లేదు లేక మాయను గుర్తించే శక్తి లేదు లేక జ్ఞాన ఖజానాలు సంభాళించే శక్తి లేదు లేక సంకల్పాలను ఇముడ్చుకునే శక్తి లేదు లేక ఖజానాలను స్మరించే శక్తి లేదు అని భావిస్తారా? ఏ కార్యంలోనైనా బుద్ధి ఎంత విస్తారంలోకి వెళ్ళి ఉన్నాకాని ఆ విస్తారమును ఒక్క క్షణంలో ఇముడ్చుకునే శక్తి లేదా? అటువంటి యజమానులకు ఇటువంటి మాటలు లేక సంకల్పాలు కూడా కలుగవచ్చా? అలా కలుగుతున్నాయంటే దానిని ఏమంటారు? ఆ సమయంలోని స్థితిని యజమానత్వపు స్థితి అని అనవచ్చా?
యజమానులు సదా యజమానులుగానే ఉంటారు. ఇప్పుడిప్పుడే యజమానులుగా, ఇప్పుడిప్పుడే బికారులుగా మాస్టర్ సర్వశక్తివంతులు ఇలా ఉంటారా? యజమానులుగా ఉన్న మీరు పదే పదే రాయల్ బికారులుగా ఎందుకు అవుతారు? బాబా ముందుకు కూడా పిల్లలు వచ్చి - బాబా, మాకు సహాయం చేయండి, శక్తిని ఇవ్వండి మరియు ఆధారమును ఇవ్వండి అని అన్నట్లయితే మరి దీనిని ఏమంటారు? దీనిని రాయల్ బికారీతనము అని అనరా? ఇవి భక్తి యొక్క సంస్కారాలు. దేవతల ముందుకువెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు మరియు నేను... అని అంటారు. అలాగే బాబా ముందుకు కూడా మాస్టర్ సర్వశక్తివంతులు వచ్చి, బాబా మీరైతే సర్వశక్తి సాగరులు కాని నాలో ఆ శక్తి లేదు, నేను నిర్బలంగా ఉన్నాను, మాయతో ఓడిపోతున్నాను, వ్యర్థ సంకల్పాలను కంట్రోల్ చేయలేకపోతున్నాను మరియు మాయ విఘ్నాలకు భయపడుతున్నాను అని అన్నట్లయితే మరి ఇది ఆ భక్తి యొక్క సంస్కారము కాదా?
బాబా ఎలా ఉన్నారో అలా గుర్తించకుండా భావనకు వశమై సర్వవ్యాపి అని కూడా అంటారు, దానిని కూడా మీరు బాబాను అవమానపర్చడం అని అంటారు కదా! అది అన్నింటికన్నా అశుద్ధమైన తిట్టు అని అంటారు, అలాగే మాస్టర్ సర్వశక్తివాన్, మాస్టర్ జ్ఞానసాగరులు, ప్రేమసాగరులు, ఆనందసాగరులు అన్నింటిలోను సాగర సమానమైనవారు అన్న శ్రేష్ఠ స్వమానము కలిగినవారు స్వయమును గూర్చి కాస్త శక్తిలో లోపం ఉంది అని అంటే మరి వారిని మాస్టర్ సాగరులు అని అంటారా? ఒకవైపేమో స్వయమును మాస్టర్ జ్ఞానసాగరులు, ఆనంద సాగరులు అని అంటూ మళ్ళీ ఇంకొకవైపు ఇలా అన్నట్లయితే అది తమను తాము అవమానపర్చుకున్నట్లు కాదా! స్వయమును స్వయమే అవమానపర్చుకోవడము బ్రాహ్మణుల స్వమానమా? ఈ విధంగా అనడము లేక సంకల్పము చేయడం ద్వారా మిమ్మల్ని మీరే అవమానపర్చుకుంటున్నారు మరియు బాబాను కూడా అవమానపరుస్తున్నారు, ఎలాగ?
ఒక వైపేమో బాబాను దాత అని, వారు స్వయమే ఇచ్చేవారు అని, ఎవరో చెప్పడం ద్వారా వారు ఇవ్వరు అని అంటారు, మళ్ళీ ఇంకొకవైపు ఇటువంటి దాతను ఒక సాధారణ మానవునిగా చేసెయ్యడం వారిని అవమానపర్చడం కాదా? చెప్తే చేసేవారు ఎవరు? మనుష్యులే కదా! ఇంకొక విషయం ఏమిటంటే ఇంకొకవైపు బాబాకు కూడా స్మృతిని కలిగించేవారిగా అవుతారు, దీని ద్వారా ఏమి నిరూపింపబడుతుంది? బాబా తమ కర్తవ్యమును మరిచిపోయారా? అందుకే మీరు బాబాకు వారి కర్తవ్యపు స్మృతిని కలిగిస్తున్నారా? బాబా, మీరు సహాయం చేయువారు, కావున మాకు సహాయం చేయండి... ఇలా అనడమును ఏమంటారు? బ్రాహ్మణులు అంటేనే సర్వప్రాప్తి స్వరూపులు. ప్రాప్తీస్వరూపుల వద్దకు అప్రాప్తి ఎక్కడి నుండి వస్తోంది? కావుననే బ్రాహ్మణుల స్థితి పవర్ హౌస్ వంటిది అని అనడం జరిగింది. ఇప్పుడు పవర్ హౌసుకు అనుకూలము కాని భాషను అర్థం చేసుకున్నారా? పవర్ హౌసుగా ఉన్నవారి మాటలు ఇలా ఉండవు. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ అవుట్ అయ్యే సమయం కూడా సమీపంగా వస్తోంది. ఫైనల్ రిజల్ట్ సమయంలో కూడా ఎవరైనా మొదటి పాఠమే చదువుతూ ఉన్నట్లయితే అందులో కూడా దృఢంగా లేకపోతే ఇటువంటివారి రిజల్ట్ ఎలా ఉంటుంది? కావుననే బాప్ దాదా కూడా ఎవ్వరు హైజంప్ చేయాలన్నా లేక ఎవ్వరు ముందుకు వెళ్ళాలనుకున్నా ఇప్పటినుండి 6 మాసాలలో అనగా స్వయమును ఏ స్థితిలో స్థిరం చేసుకోవాలనుకుంటే ఆ స్థితిలో చేరుకునేందుకు అవకాశం ఉంది అని కొంత సమయం క్రితం వినిపించారు. ఇలా కొద్ది సమయం లోపల తమను తాము సంపన్నంగా చేసుకునేందుకు సాధారణ పురుషార్థం సరిపోదు. ఇప్పుడు తీవ్ర పురుషార్థం అనగా సంకల్పాలు, మాటలు మరియు కర్మలు ఈ మూడింటిలోను సమానత యొక్క అభ్యాసమును చేయాలి. అటువంటివారినే తీవ్ర పురుషార్థులు అని అంటారు.
బుద్ధిలో మేము దాత పిల్లలము అని భావిస్తారు కాని మాటలు మరియు కర్మలలో తేడా ఉంటుంది. మేము సర్వ ఆత్మలలోకెల్లా ఉన్నతమైన బ్రాహ్మణులము అని సంకల్పాలలో భావిస్తారు. కాని మాటలు మరియు కర్మలోకి వచ్చేసరికి తేడా వచ్చేస్తుంది. మేము విశ్వకళ్యాణకారులము అని ఆలోచిస్తారు. కాని మాటలు మరియు కర్మలలో తేడా ఉంది. కాని ఈ మూడు సమానంగా అయిపోవడమునే తీవ్ర పురుషార్థము అనగా బాబా సమానంగా అవ్వడము అని అంటారు. మరి స్వయమును ఈ విధంగా బాబా సమానంగా తయారుచేసుకునేందుకు సమయమునిస్తున్నారా? 6 మాసాల తర్వాత ఈ ఆత్మిక సేనలోని మహావీరులు, గుర్రపుస్వారీవారు మరియు కాల్బలమువారు అనగా ప్రజలు అందరూ ప్రత్యక్షమవుతారా? ఎప్పటివరకైతే పరస్పరంలోనే ప్రత్యక్షమవ్వరో అప్పటివరకు విశ్వం ముందు ఎలా ప్రత్యక్షమవుతారు? విశ్వం ముందు ప్రత్యక్షమవ్వకపోతే ప్రత్యక్షత ఎలా జరుగుతుంది? కావున స్వయమును మరియు బాబాను ప్రఖ్యాతము చేసేందుకు లేక బాబా ప్రత్యక్షతను చేసేందుకు ఇప్పుడు లాస్ట్ పురుషార్థము లేక లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థము ఏది మిగిలింది? ఫాస్ట్ పురుషార్థము ఏమిటి? ఏదైతే ఫాస్ట్ లాస్టవుతుందో దాన్ని గూర్చి మీకు తెలుసా? ఏ పురుషార్థము మీ ముందుకు వస్తుంది? ఫాస్ట్ పురుషార్థపు విధి ఏమిటి? దేని ద్వారా బాబా సమానంగా అయిపోతారు? ఈ సిద్ధి లభిస్తుందా? విధి లేకుండా సిద్ధి లభించజాలదు కేవలం ఒక్క పదమే ఉందని అనేకసార్లు వినిపించడం జరిగింది. లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థానికి విధి - ప్రతిజ్ఞ, ఎట్టి పరిస్థితిలోనూ ఇది చేయకూడదు, ఇది ఇప్పుడు చేయాలి అంటూ ఏ విషయంలోనైనా ప్రతిజ్ఞ చేయాలి. ప్రతిజ్ఞ యొక్క విధి - లాస్ట్ ఈజ్ ఫస్ట్. ప్రతిజ్ఞ అనగా సంకల్పం చేయగానే స్వరూపంగా అయిపోతారు. ప్రతిజ్ఞ చేయడంలో ఒక్క క్షణం పడుతుంది. కావున ఇప్పుడు ఫాస్ట్ పురుషార్థము ఒక్క క్షణకాలికంగానే ఉండాలి. చివరి పరీక్ష యొక్క రిజల్టు ఏదైతే అవుట్ అవ్వనున్నదో ఆ చివరి పరీక్షలో ఎంత సమయం లభిస్తుంది? ఒక్క క్షణం. చివరి పరీక్ష యొక్క సమయం కూడా ఫిక్స్ అయ్యే ఉంది మరియు పరీక్ష కూడా ఫిక్స్ అయ్యే ఉంది. నష్టోమోహులుగా, స్మృతిస్వరూపులుగా అయ్యే పరీక్షను గురించి వినిపించారు కదా! నష్టోమోహులుగా అయిపోండి అని ఒక్క క్షణంలో ఆర్డర్ లభిస్తే, ఒక్క క్షణంలో అలా నష్టోమోహులుగా, స్మృతిస్వరూపులుగా అవ్వకపోతే స్వయమును ఆ స్వరూపంగా తయారుచేసుకోవడంలో అనగా యుద్ధం చేయడంలోనే సమయాన్ని గడిపేస్తే మరియు బుద్ధిని లక్ష్యంపై నిలుపుకోవడంలో సమయాన్ని గడిపేస్తే ఏమౌతుంది? ఫెయిలైపోతారు. అప్పుడు సమయం కూడా ఒక్క క్షణమే లభిస్తుంది. ఇది కూడా మొదటే వింటున్నారు, పరీక్షను కూడా మొదటే వింటున్నారు, కావున ఎంతమంది పాసవ్వాలి? ఫాస్ట్ పురుషార్థానికి విధి - 'ప్రతిజ్ఞ' ద్వారా 'మిమ్మల్ని మీరు ప్రఖ్యాతము చేసుకోండి. బాబాను ప్రఖ్యాతం చేయండి అనగా ప్రతిజ్ఞ ద్వారా ప్రత్యక్షతను చేయండి, ఇదేమన్నా కష్టమా? ధైర్యము మరియు ఉల్లాసము, నషా మరియు లక్ష్యములను సదా తోడుగా ఉంచుకున్నట్లయితే అనేక కల్పాలలో జరిగినట్లుగా ఫుల్ పాసయ్యే తీరుతారు, ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. కేవలం ఈ 6 మాసాలలో మీ ముఖ్యమైన నాలుగు సబ్జెక్టులను మీ ముందు ఉంచుకొని ఈ నాలుగింటిలోనూ పాస్ మార్కులు ఉన్నాయా అని పరిశీలించుకోండి. ఇవి తక్కువలో తక్కువ పాస్ మార్కులు. కాని ఎవరైతే విశేష ఆత్మలుగా ఉన్నారో వారు పూర్తి మార్కులను తీసుకునే లక్ష్యమును ఉంచాలి. రెండు, మూడు సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చి, ఒకటి రెండు సబ్జెక్టులలో తక్కువ వచ్చినా పాస్ అయిపోతాములే అని భావించకూడదు. ఎవరైనా ఒక్క సబ్జెక్టులో ఫెయిలైనా ఏమౌతుంది? వారు మళ్ళీ పరీక్ష రాయవలసి వస్తుంది. వారి యొక్క ఆ సంవత్సరమైతే పోతుంది కదా! వారు సూర్యవంశంనుండైతే తప్పిపోతారు కదా!సూర్యవంశపు మొట్టమొదటి రాజ్య భాగ్యము మరియు ప్రకృతి యొక్క మొట్టమొదటి సర్వప్రాప్తి సంపన్నమైన ప్రారబ్ధం నుండైతే వంచితులైపోతారు కదా! పైకి ఎక్కే కళ ఏర్పడుతూ, ఏర్పడుతూ చివరిలో ఫుల్ మార్కులు తీసుకున్నట్లయితే త్రేతా యుగంలో కొన్ని శ్రేష్ఠ ప్రాలబ్ధాలను పొందుతారు. కావున ఇది కూడా ఆలోచించకండి. నాలుగు సబ్జెక్టులలోనూ మొట్టమొదటి పురుషార్థము - ఫుల్ పాసవ్వడము అనగా పూర్తి మార్కులను తీసుకోవడము. రెండవ పురుషార్థము - అన్ని సబ్జెక్టులలోనూ పాస్ మార్కులు తీసుకోవడము. ఇక మూడవ పురుషార్థమైతే చేసేది లేదు, ఎందుకంటే మూడవదాని గురించి ఆలోచించనే కూడదు. బాబా అయినా సమయాన్ని ఇస్తున్నారు. మిమ్మల్ని మీరు అన్ని సబ్జెక్టులలోను కంప్లీట్ గా చేసుకోండి, అర్థమైందా? మూడు గ్రూప్ లను అవుట్ చేయాలి. ఒకటి - ఎవర్రడీ గ్రూపు, రెండు - రెడీ గ్రూపు, మూడు - లేజీ గ్రూపు. ఈ 6 మాసాల లోపల స్వయమును పరివర్తితము చేసుకొని ఫస్ట్ గ్రూపులోకి తీసుకురావాలి, అనగా ఎవర్రడీ గ్రూపులోకి రావాలి. ఆర్డర్ లభించగానే చేయాలి. ఆర్డర్‌ను స్వీకరించడంలో లేజీగా అవ్వకూడదు. ఈ మూడు గ్రూపులలో స్వయమే స్వయమునకు దర్పణంలో సాక్షాత్కారమైపోతారు. ఏ విధంగా కల్పపూర్వము బ్రహ్మాకుమార్ (నారదుడు) దర్పణంలో తన సాక్షాత్కారమును చేసుకున్నాడో అలా జ్ఞానమురూపీ దర్పణంలో నేను ఏ గ్రూప్ లో ఉన్నాను మరియు ఏ గ్రేడ్ లో ఉన్నాను అని స్వయమే స్వయం యొక్క సాక్షాత్కారమును చేసుకుంటారు. ఎటువంటి గ్రూవు ఉంటుందో అటువంటి గ్రేడులు ఉంటాయి కదా! అచ్ఛా!
సదా స్వయం పట్ల మరియు విశ్వం పట్ల శుభచింతక స్థితిలో స్థితులై ఉండేవారికి, ప్రతి మాట, ప్రతి క్షణము, ప్రతి సంకల్పమునూ శ్రేష్ఠంగా గడిపేవారికి, సదా తమ ఖజానా యొక్క స్మృతి మరియు స్మరణలో ఉండేవారికి, సదా సంతోషపు నషాలో నిండుగా ఉండేవారికి, సర్వ బలహీన ఆత్మలకు శక్తిని ఇచ్చేవారికి, సర్వ ఆత్మల తమోగుణ స్వభావాలు మరియు సంస్కారాలను పరివర్తన చేసేవారికి, సాక్షి మరియు సదా సహచరుని తోడును అనుభవం చేసుకునేవారికి ఇటువంటి కోట్లాదిమందిలోను ఏ కొందరిగానో ఆ కొందరిలో ఏ ఒక్కరిగానో ఉండే పదమా పదమ భాగ్యశాలీ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment