23-05-1974 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
హద్దు యొక్క ఆకర్షణలకు లేదా సాధనాలకు అతీతంగా ఉండేవారే సత్యమైన వైష్ణవులు.
పంచవికారాలతో పాటు పంచ తత్వాల ఆకర్షణకు అతీతంగా తీసుకువెళ్ళేటువంటి,సత్యమైన వైష్ణవులుగా తయారు చేసేటువంటి, మాటలకు అతీతంగా తీసుకువెళ్ళి వానప్రస్త స్థితిలో స్థితులు చేసేటువంటి మరియు పడిపోయేకళ నుండి ఎక్కేకళ వైపు తీసుకువెళ్ళే సత్యమైన శివబాబా ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నారు -
స్వయాన్ని ఒక సెకనులో మాటలకు అతీతంగా వానప్రస్థ స్థితిలో స్థితులు చేసుకోగలుగుతున్నారా? ఎలా అయితే మాటలలోకి సహజంగా వస్తున్నారో అంత సహజంగా మాటలకు అతీతంగా కాగలుగుతున్నారా? ఎటువంటి పరిస్థితి అయినా, వాతావరణం అయినా, వాయుమండలం అయినా లేదా ప్రకృతి యొక్క తుఫాను అయినా కానీ వీటన్నింటిలో ఉంటూ, చూస్తూ, వింటూ అనుభవం చేసుకుంటూ బయట ఎన్ని తుఫానులు ఉన్నా అంతగా స్వయం అచంచల, స్థిరమైన, శాంతి స్థితిలో స్థితులు కాగలుగుతున్నారా? శాంతిలో శాంతిగా ఉండటం గొప్ప విషయం కాదు. కానీ అశాంతి వాతావరణంలో కూడా శాంతిగా ఉండాలి. దీనినే జ్ఞానస్వరూప, శక్తిస్వరూప, స్మృతిప్వరూప మరియు సర్వగుణ స్వరూపం అని అంటారు. రకరకాలైన కారణాలు ఉన్నప్పటకీ స్వయం నివారణా రూపంగా అవ్వాలి. దీనినే పురుషార్థం యొక్క ప్రత్యక్ష ప్రమాణ రూపం అని అంటారు. ఇలా మహావీరులుగా అయ్యారా లేక ఇప్పటి వరకు వీరులుగానే ఉన్న
ఉన్నారా? ఏ స్థితి వరకు చేరుకున్నారు? మహావీర స్థితి ఎదురుగా మరియు సమీపంగా కనిపిస్తుందా లేదా స్వయం బాబా సమానస్థితి కనిపిస్తుందా?
బాబా సమాన స్థితిలో మూడు స్థితులు నెంబర్ వారీగా ఉంటాయి. ఒకటి -సమానత, రెండు - సమీపత, మూడు- ఎదురుగా ఉండటం. కనుక ఎంత వరకు చేరుకున్నారు? సమానంగా ఉండేవారి గుర్తు - ఒక సెకనులో ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా చేయగలరు. రెండవ స్థితి ఒక సెకనుకి బదులు కొన్ని సెకనులలో స్వయాన్ని స్థితులు చేసుకుంటారు. మూడవ స్తితి - కొన్ని గంటలలో లేదా కొన్ని రోజులలో స్వయాన్ని సెట్ చేసుకుంటారు. సమానంగా ఉండేవారు సదా బాబా సమానంగా, స్వయం యొక్క గొప్పతనాన్ని,స్వయం సర్వశక్తుల గొప్పతనాన్ని మరియు ప్రతి పురుషార్థీ యొక్క నెంబర్‌వారీ స్థితిని, గుణదానం, జ్ఞానధన దానం మరియు స్వయం సమయం యొక్క దానం, వీటన్నింటి గొప్పతనాన్ని తెలుసుకునేవారిగా మరియు నడుచుకునేవారిగా ఉంటారు. వారు కర్మల యొక్క స్వభావ, సంస్కారాలను తెలుసుకునే జ్ఞానస్వరూపంగా ఉంటారు. ఇలా జ్ఞానస్వరూపంగా అయ్యారా?
ఎంతగా వాణీ వినాలి మరియు వినిపించాలి అనే జిజ్ఞాస ఉంటుందో, తపన ఉంటుందో,అవకాశం కూడా తీసుకుంటున్నారో అలాగే వాణీకి అతీతమైన స్థితిలో స్థితులయ్యేటువంటి అవకాశం తయారు చేసుకునే మరియు తీసుకునే జిజ్ఞాస ఉంటుందా? ఈ సంలగ్నత స్వతహాగా స్వయంలో వస్తుందా లేదా సమయానుసారం, సమస్య అనుసరించి లేదా ప్రోగ్రామ్ అనుసరించి ఈ జిజ్ఞాస వస్తుందా? మొదటి స్థితి వరకు చేరుకున్న ఆత్మల మొదటి గుర్తు ఇదే ఉంటుంది. అటువంటి ఆత్మ ఈ అనుభూతి స్థితిలో నిమగ్నమై ఉన్న కారణంగా ఏ వైభవం లేదా ఏ హద్దు ప్రాప్తి యొక్క ఆకర్షణ వారిని సంకల్పంలో కూడా ముట్టుకోదు. ఒకవేళ ఏదైనా హద్దు ప్రాప్తి యొక్క ఆకర్షణ సంకల్పంలో అయినా ముట్టుకునే ధైర్యం చేస్తే వారిని ఏమంటారు? అటువంటి వారిని వైష్ణవులు అని అంటారా? ఎలా అయితే ఈ రోజుల్లో నామధారి వైష్ణవులు అనేక రకాలైన పత్యం చేస్తారు. కొంతమంది వ్యక్తులను మరియు కొన్ని రకాలైన వస్తువులను ముట్టుకోరు. ఒకవేళ అకారణంగా ఎప్పుడైనా ముట్టుకుంటే పాపంగా భావిస్తారు. మరి మీరు ఎటువంటి పేరుయో అటువంటి పని చేసే మరియు ఎటువంటి సంకల్పమో అటువంటి స్వరూపం తయారుచేసుకునే సత్యమైన వైష్ణవులు. మరి అటువంటి సత్యమైన వైష్ణవులను ఎవరైనా ముట్టుకునే ధైర్యం చేస్తారా? ఒకవేళ ముట్టుకుంటే కనుక చిన్న, పెద్ద పాపాలు తయారవుతాయి. ఈ విధమైన సూక్ష్మ పాపాలు ఆత్మను ఉన్నత స్థితి వైపుకి వెళ్ళటం నుండి ఆపేయడానికి నిమిత్తంగా అవుతాయి. ఎందుకంటే పాపం అంటే బరువు. బరువు ఫరిస్తాగా అవ్వనివ్వదు. బీజరూప స్థితిలో మరియు వానప్రస్త స్థితిలో స్థితులు అవ్వనివ్వదు. ఈ రోజుల్లో చాలా మంది మహారథీలుగా పిలవబడేవారు కూడా అమృతవేళ ఆత్మిక సంభాషణలో ఫిర్యాదు చేస్తున్నారు లేదా ప్రశ్నిస్తున్నారు - శక్తిశాలి స్థితిలో ఎందుకు ఉండటం లేదు? అని. ఈ స్థితి కొద్ది సమయమే ఎందుకు ఉంటుంది? దీనికి కారణం-సూక్ష్మ పాపం. ఇదే బాబా సమానంగా అవ్వనివ్వటం లేదు.
ఎలా అయితే పంచ వికారాలకు వశమై చేసిన కర్మను వికర్మ లేదా పాపం అని అంటారు.ఇది పాపాల స్థూల రూపం అలాగే లోతైన పురుషార్థి అంటే మహారథీల ఎదురుగా పంచతత్వాలు తమ వైపు రకరకాల రూపాలలో ఆకర్షించి లోతైన పాపాన్ని తయారు చేయడానికి నిమిత్తంగా అవుతాయి. పంచవికారాలను అర్థం చేసుకోవటం మరియు వాటిని జయించటం సహజమే కానీ పంచతత్వాల ఆకర్షణకు అతీతంగా అవ్వటమనేది మహారథీలకు విశేష పురుషార్థం. ఎప్పుడైతే ఇది తెలుసుకుని వాటిపై విజయం పొందుతారో అప్పుడే సత్యమైన దసరా జరుగుతుంది. ఈ స్థితికి స్మృతిచిహ్నమే విజయదశమి. మహారథీల పరిశీలన చాలా లోతుగా ఉండాలి. అటువంటి విజయీలే అష్టరత్నాలుగా ప్రసిద్ధం అవుతారు. ప్రత్యక్ష రూపాన్ని చూపించేవారు, ఇటువంటి లోతైన పురుషార్థుల సమక్షంలో చిన్న, చిన్న పొరపాట్లు ఎలా కనిపిస్తాయి?
ఈరోజుల్లో రాయల్ పురుషార్థుల రాయల్ స్లోగన్ (సూక్తి) ఏమిటి? రాయల్ పురుషార్థి అని ఎవరిని అంటారు? ఎవరికైతే ప్రతి విషయంలో రాయల్టీ లేదా సహజ సాధనాలు కావాలో వారికి రాయల్ అనే మాట వాడతారు. సాధనాల ఆధారంగా మరియు ప్రాప్తుల ఆధారంగా పురుషార్థం చేసేవారిని రాయల్ పురుషార్థి అని అంటారు. రాయల్టీకి మరో అర్థం కూడా ఉంది. ఇప్పుడు రాయల్ పురుషార్ధిగా ఉండేవారికి ధర్మరాజు పురిలో కూడా రాయల్టీ ఇవ్వబడుతుంది. రాయల్ పురుషార్థుల యొక్క గుర్తుల ద్వారా నేను రాయల్ పురుషార్థిని కాదు కదా? అని తెలుసుకొండి. ఇతరుల గురించి తెలుసుకోవటం కాదు, కానీ స్వయం గురించి తెలుసుకోవాలి. ఎలా అయితే స్థూల రాయల్టీలో ఉండేవారు స్వయాన్ని అనేక రూపాలుగా తయారు చేసుకుంటారో, అలాగే రాయల్ పురుషార్థులు బహురూపిగా మరియు చతురంగా ఉంటారు. వారు ఎటువంటి సమయమో అటువంటి రూపాన్ని ధారణ చేస్తారు. కానీ రాయల్టీలో రియాల్టీ ఉండదు. కల్తీ అయిపోతుంది, ఏకరస స్థితిలో స్వయాన్ని ఫిక్స్ చేసుకోలేరు. అటువంటి రాయల్ పురుషార్థులు ఏ ఆట ఆడతారు? అప్ అండ్ డౌన్. ఇప్పుడిప్పుడే చాలా ఉన్నత స్థితిలో ఉంటారు మరియు ఇప్పుడిప్పుడే చాలా క్రింది స్థితికి వచ్చేస్తారు. ఎగిరేకళలో కూడా హీరో పాత్రధారి మరియు పడిపోయే కళలో కూడా జీరోలో కూడా హీరోగా ఉంటారు. అటువంటి పురుషార్థుల కర్తవ్యం ఏమి ఉంటుంది? స్వయం ప్రకృతికి లేదా వికారాలకు వశమై అల్పకాలిక మాయతో నిర్భయంగా ఉండటం మరియు స్వయం ద్వారా ఇతరులకు భయం కలిగించే విషయాలు చెప్పటం. వారిలో స్లోగన్ ఏమిటి? ఇది చేస్తాము, అది చేస్తాము. ఎలా అయితే ఆత్మహత్య మహాపాపం యొక్క భయభీత నడవడికయో అలా మాట్లాడటం వారి కర్తవ్యం. ఇటువంటి రాయల్ పురుషార్థులుగా ఎప్పుడు అవ్వద్దు. ఎప్పుడు అటువంటి రాయల్ పురుషార్థుల సాంగత్యంలోకి కూడా రావద్దు. ఎందుకంటే మాయకు వశమైన ఆత్మలను లేదా పురుషార్ధం చేసే ఆత్మలను స్వయం యొక్క సాంగత్యంలోకి తీసుకువచ్చి ప్రభావితం చేసే విశేషత వారికి మాయ ద్వారా వరదాన రూపంలో లభిస్తుంది. అటువంటి సాంగత్యాన్ని బయటికి చాలా సుందరంగా ఉంటారు. కానీ లోపల నాశనం చేసేవారిగా ఉంటారు. అందువలన బాప్ దాదా పిల్లలందరికి వర్తమాన సమయంలో మాయ యొక్క రాయల్ స్వరూపం యొక్క జాగ్రత్త ముందుగానే ఇస్తున్నారు. అటువంటి సాంగత్యంతో సదా జాగ్రత్తగా మరియు తెలివిగా ఉండాలి. మాయ కూడా వర్తమాన సమయంలో రాయల్ పురుషార్థుల మాల తయారుచేయటంలో నిమగ్నమై ఉంది. తన మణులను చాలా మంచిగా మరియు తీవ్ర పురుషార్ధంతో వెతుకుతుంది. అందువలన మాయా మాలలో మణులుగా అవ్వకూడదు. ఒకవేళ ఆ మాయా మణి యొక్క ప్రభావంలోకి కనుక వస్తే విజయీమాలలో మణుల నుండి తొలగిపోతారు. ఎందుకంటే ఈ రోజుల్లో రెండు మాలలు ఒకటి- మాయా యొక్క మరియు రెండవది బాబా యొక్క విజయీమాల యొక్క సెలక్షన్ చాలా వేగంగా జరుగుతుంది. అటువంటి సమయంలో ప్రతి సెకను నలువైపుల ధ్యాస ఉండాలి. మంచిది.
సదా సత్యమైన పురుషార్థులకు, సదా బాబా వెంట సదా సత్యంగా ఉండేవారికి, పంచ వికారాలు మరియు పంచతత్వాల ఆకర్షణకు సదా దూరంగా ఉండేవారికి, సహజంగా వానప్రస్థ స్థితిలో స్థితులయ్యేవారికి, విజయీ మాలలో విజయీ మణులకు, సదా బాప్ దాదా వెంట ఉండే వారికి, సదా సత్యమైన సాంగత్యంలో ఉండేవారికి మరియు వ్యర్థ సాంగత్యానికి అతీతంగా ఉండే వారికి ఇలా ప్రియమైన బాబా యొక్క పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, శుభోదయం మరియు నమస్తే.
Comments
Post a Comment