23-04-1977 అవ్యక్త మురళి

23-04-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బాబా ద్వారా ప్రాప్తించిన సర్వ ఖజానాలను పెంచుకునేటందుకు ఆధారం-మహాదాని అవ్వటం.

                 సదా సర్వఖజానాలతో సంపన్నంగా, వ్యర్థాన్ని సమర్ధంగా చేసుకునేటువంటి, సదా ప్రాప్తి స్వరూపులు, ప్రతి సెకను మరియు సంకల్పంలో పదమాపదమ్ భాగ్యశాలిగా అయ్యేటువంటి, అఖండ ఖజానాలకు అధికారి ఆత్మలతో  బాబా మాట్లాడుతున్నారు -
                 బాప్ దాదా పిల్లలందరిని అన్ని ఖజానాలతో సంపన్న స్వరూపంగా చూస్తున్నారు. సర్వ అధికారాలు ఒకే సమయంలో అందరికి సమాన అధికార రూపంలో ఇస్తున్నారు, వేరు వేరుగా ఇవ్వటం లేదు. ఎవరికి గుప్తంగా విశేష ఖజానా వేరుగా ఇవ్వటం లేదు. కానీ ఫలితంలో నెంబర్ అనుసరించి తయారవుతున్నారు. సర్వ ఖజానాలకు అధికారిగా ఉంటూ, ఇచ్చేవారు సాగరునిగా, సంపన్నంగా ఉన్నప్పటికీ నెంబర్ ఎందుకు తయారవుతుంది? కారణం ఏమిటి? ఇముడ్చుకునే శక్తి తమ శాతంలో ఉంది. దీని కారణంగా అందరు సంపూర్ణంగా అవ్వటం లేదు. అంటే అందరు బాబా సమానంగా అవ్వటంలేదు. సంకల్పం అందరికీ ఉంది, కానీ స్వరూపంలోకి తీసుకురావటం లేదు. ప్రతి ఒక్కరు తమ ఖజానా యొక్క శాతాన్ని పరిశీలన చేసుకోవాలి. అన్నింటికంటే ఉన్నతమైన ఖజానా ఏమిటి, దానిని వ్యర్థం చేయటం ద్వారా అన్ని ఖజానాలు వ్యర్ధం అయిపోతాయి, ఆ ఖజానాను చాలా మంది వ్యర్థం  చేస్తున్నారు, ఆ ఖజానా ఏమిటి? సమయం యొక్క ఖజానా. సమయం యొక్క ఖజానాను స్వయం పట్ల మరియు సర్వుల కళ్యాణం పట్ల ఉపయోగిస్తూ ఉంటే ఇతర సర్వ ఖజానాలు స్వతహాగానే జమ అయిపోతాయి. సంకల్ప ఖజానాలో సదా కళ్యాణకారి భావన ఆధారంగా ప్రతి సెకను కోట్ల సంపాదన చేసుకుంటారు. సర్వశక్తుల ఖజానాను కళ్యాణం  చేసే కార్యంలో ఉపయోగిస్తే మహాదాని అవ్వటం ద్వారా ఒకటికి కోటాను కోట్లు సర్వశక్తుల ఖజానా పెరుగుతూ ఉంటుంది. ఒకటి ఇవ్వటం పది పొందటం కాదు, ఒకటి ఇవ్వటం కోట్లు పొందటం.
              జ్ఞాన ఖజనా సమయం యొక్క గ్రహింపుతో ఇప్పుడు లేకున్నా మరెప్పుడు ఇవ్వలేరు. ఇప్పుడు ఇస్తే భవిష్యత్తులో అనేక జన్మలు ప్రాప్తిస్తుంది. దీని ఆధారంగా సమయం యొక్క మహత్వంతో సదా విశ్వసేవాధారి అవ్వటం ద్వారా సేవకి ప్రత్యక్షఫలంగా సంతోషం యొక్క ఖజానా లెక్కలేనంతగా ప్రాప్తిస్తుంది. శ్వాస యొక్క ఖజానా, సమయానుసారం ఒకటికి కోటానుకోట్ల రెట్లు పొందే సమయంగా లేదా తయారయ్యే వరదాని సమయంగా భావించటం ద్వారా అంటే కర్మ మరియు ఫలం యొక్క గుహ్యగతిని తెలుసుకోవటం ద్వారా, వ్యర్థ శ్వాసలను సఫలం చేసుకునే స్మృతి సదా ఉండటం ద్వారా, శ్రేష్ఠ కర్మల ఖాతా లేదా శ్రేష్ఠ  కర్మల యొక్క సూక్ష్మ సంస్కార రూపంలో తయారైన ఖజానా స్వతహాగా నిండుతూ ఉంటుంది. సర్వ ఖజానాలను జమ చేసుకోవటానికి ఆధారం, సమయం యొక్క శ్రేష్ఠ ఖజానాలను సఫలం చేసుకోండి. అప్పుడు సదా మరియు సహజంగా సర్వ సఫలతా మూర్తులుగా అయిపోతారు. కానీ ఏమి చేస్తున్నారు? సోమరితనం అంటే చేసే సమయంలో చేస్తూ కూడా ఆ సమయంలో చేస్తున్నాను అని కూడా తెలియటం లేదు తర్వాత పశ్చాత్తాప పడుతున్నారు. దీని కారణంగా డబుల్, త్రిబుల్ సమయం ఒక విషయంలో పోగొట్టుకుంటున్నారు. ఒకటి - చేసే సమయం, రెండు - అనుభవం చేసుకునే సమయం, మూడు - పశ్చాత్తాప పడే సమయం, నాలుగు - దానిని పరిశీలన చేసుకున్న తర్వాత పరివర్తన చేసుకునే సమయం. ఇలా ఒక చిన్న విషయంలో ఇంత సమయం వ్యర్థం చేసుకుంటున్నారు మరియు మాటి మాటికి పశ్చాతాప పడుతున్న కారణంగా, కర్మల ఫలం సంస్కార రూపంలో పశ్చాతాపం సంస్కారంగా అయిపోతుంది. దీనినే మీరు సాధారణ భాషలో నా అలవాటు లేదా సంస్కారం అని అంటారు. సర్వ పాప్తులు బ్రాహ్మణుల స్వతహా సంస్కారం అంటే బ్రాహ్మణుల ఆది, అనాది సంస్కారం. విజయం అంటే సంపన్నంగా అవ్వటం. పశ్చాత్తాప సంస్కారం బ్రాహ్మణుల సంస్కారం కాదు, ఇది క్షత్రియుల సంస్కారం, చంద్రవంశీయుల సంస్కారం. సూర్యవంశీయులు సదా సర్వప్రాప్తి సంపన్న స్వరూపులు. చంద్రవంశీయులు మాటి మాటికి స్వయంతో లేదా బాబాతో అలా
ఆలోచించాలనుకోలేదు, మాట్లాడాలనుకోలేదు, చేయాలనుకోలేదు కానీ అయిపోయింది. ఇప్పటి నుండి చేయము అని ఇలా పశ్చాత్తాప పడతారు. ఎన్ని సార్లు ఆలోచిస్తారు మరియు చెప్తారు. ఇది కూడా రాయల్ రూపం యొక్క పశ్చాత్తాపమే. కనుక ఇది ఏ సంస్కారమో అర్థమైందా? సూర్యవంశీ సంస్కారమా లేక చంద్రవంశీ సంస్కారమా? చాలా సమయం యొక్క సంస్కారం సమయానికి మోసం చేస్తుంది. మొదట స్వయానికి స్వయం మోసం నుండి రక్షించుకోండి, అప్పుడు సమయం యొక్క మోసం నుండి కూడా రక్షించుకుంటారు. మాయ యొక్క అనేక రకాలైన మోసం నుండి కూడా రక్షించుకుంటారు. అంశమాత్రంగా కూడా దు:ఖం యొక్క అనుభవం నుండి రక్షించుకుంటారు. కానీ అన్నింటికి ఆధారం - సమయాన్ని వ్యర్ధంగా పోగొట్టుకోకండి. ప్రతి సెకను యొక్క లాభం పొందండి. సమయం యొక్క వరదానాలను స్వయం పట్ల మరియు సర్వుల పట్ల కార్యంలో ఉపయోగించండి.
           సదా సర్వ ఖజానాలతో సంపన్నులు, వ్యర్థాన్ని సమర్థంగా తయారు చేసుకునేవారికి, ప్రతి సెకను మరియు సంకల్పంలో కోటాను కోట్లకు అధిపతిగా అయ్యేవారికి, అఖండ ఖజానాకు అధికారి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments