23-03-1970 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సత్యమైన హాలీ జరుపుకోవటం అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది అని భావించటం.
బాప్ దాదా ఏమి చూస్తున్నారు? మరియు మీరందరూ ఏమి చూస్తున్నారు? చూడటం అయితే మీరూ చూస్తున్నారు. బాబా చూస్తున్నారు కాని మీరు ఏమి చూస్తున్నారు మరియు బాప్ దాదా ఏమి చూస్తున్నారు? తేడా ఉందా లేక ఒకటే చూస్తున్నారా? బాబా ఆత్మిక పిల్లలని చూస్తూ ఈరోజు విశేషంగా ఏ విషయం చూస్తున్నారు? ప్రతి నడవడికకు విశేషత ఉంటుంది. కనుక ఈరోజు సంభాషణలో విశేషంగా ఏ విషయం చూస్తున్నారు? దానిని చూసి బాబా సంతోషిస్తున్నారు. బాప్ దాదా ప్రతి ఒక్కరి పురుషార్థం యొక్క వేగాన్ని (స్పీడ్) మరియు స్థితి యొక్క ఉత్సాహాన్ని (స్పిరిట్) చూస్తున్నారు. ఎంతెంత ఉత్సాహం ఉంటుందో అంతంత వేగం ఉంటుంది. ఇది చూసి సంతోషిస్తున్నారు. వేగం తీవ్రంగా ఉన్నప్పుడు సేవలో సఫలత ఎక్కువ ఉంటుంది. ఈరోజు హోలీని ఎలా జరుపుకున్నారు? (సూక్ష్మవతనంలో జరుపుకున్నాం) వతనంలో కూడా ఎలా జరుపుకున్నారు? కేవలం వతనంలోనే జరుపుకున్నారా లేక ఇక్కడ కూడా జరుపుకున్నారా? కేవలం అవ్యక్తరూపంలోనే జరుపుకున్నారా? హోలీ జరుపుకోవటం అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది అనే పాఠాన్ని ఈరోజు పక్కా చేసుకోవాలి. హోలీ జరుపుకోవటం అంటే ఇదే. మీరు కూడా హోలీ యొక్క అర్థం చెప్తారు కదా! హోలీ అంటే ఏ విషయం అయితే జరిగిపోయిందేదో జరిగిపోయిన దానిని పూర్తిగా సమాప్తి చేయాలి. జరిగిపోయిందేదో జరిగిపోయింది అని భావించి ముందుకి వెళ్ళటమే హోలీ జరుపుకోవటం. అంటే హోలీ యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకురావాలి. ప్రతి రోజు మీ పురుషార్థాన్ని పెంచుకునేటందుకు ఏదోక విషయాన్ని ఎదురుగా ఉంచుకోవాలి. ఈ ప్రతిజ్ఞ చేయటమే హోలీ జరుపుకోవటం. జరిగిపోయిన విషయం చాలా పాత జన్మలో విషయంగా అనుభవం అవ్వాలి. ఎప్పుడైతే ఈ విధమైన స్థితి తయారవుతుందో అప్పుడే పురుషార్థం యొక్క వేగం తీవ్రం అవుతుంది.
పురుషార్ధం బలహీనం అవ్వడానికి ముఖ్య విషయం ఇదే - జరిగిపోయిన విషయాలను చింతనలోకి తీసుకురావటం. తమ యొక్క జరిగిపోయిన విషయాల గురించి లేదా ఇతరుల జరిగిపోయిన విషయాల గురించి చింతన చేయటం మరియు మనస్సులో పెట్టుకోవటం. ఒకటి - మనస్సులో పెట్టుకోవటం మరియు రెండు - చింతనలోకి తీసుకురావటం. మనస్సులో కూడా పెట్టుకోకూడదు, చింతనలోకి కూడా రాకూడదు. మూడవది - వర్ణన చేయటం. ఈ రోజు బాప్ దాదా హోలీ జరుపుకునేటందుకు వచ్చారు. హోలీ జరుపుకునేటందుకే పిలిచారు కదా! కనుక ఈ రంగుని పక్కాగా వేసుకోవటమే హోలీ జరుపుకోవటం. హోలీ రోజున ఒకటి - రంగులు చల్లుకుంటారు, ఇంకా ఏమి చేస్తారు? ఈరోజు ముందు కాలుస్తారు, రెండవరోజు జరుపుకుంటారు. కాల్చిన తర్వాత జరుపుకోవటం. జరుపుకునేటప్పుడు మిఠాయి తింటారు. ఇక్కడ మీరు ఏ మిఠాయి తింటారు? ఏ రంగు అంటించుకోవాలో రంగు గురించి అయితే చెప్పాను. ఇప్పుడు మిఠాయి ఎందుకు తింటున్నారు? ఎప్పుడైతే ఈ రంగు అంటుకుంటుందో అప్పుడు మధురత అనే గుణం స్వతహాగానే వస్తుంది అని అర్థం. మీ యొక్క మరియు ఇతరుల యొక్క జరిగిపోయిన విషయాలు చూడకుండా ఉండటం ద్వారా సరళచిత్త్ అయిపోతారు. మరియు ఎవరైతే సరళచిత్త్ అవుతారో వారిలో ప్రత్యక్ష రూపంలో ఏ గుణం కనిపిస్తుంది? మధురత. వారి నయనాలలో మధురత, వారి మాటలో మధురత మరియు వారి నడవడిక ద్వారా మధురత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. ఈ రంగు ద్వారా మధురత వస్తుంది. అందువలనే మిఠాయి తినే నియమం ఉంది.
హోలీ రోజు ఇంకేమి చేస్తారు? (మంగళ కలయిక) మంగళ కలయిక యొక్క అర్థం ఏమిటి? ఇక్కడ మంగళ కలయిక ఎలా జరుపుకుంటారు? మధురత వచ్చిన తర్వాత ఏ మంగళ కలయిక ఉంటుంది? సంస్కారాల కలయిక ఉంటుంది. రకరకాలైన సంస్కారాల కారణంగానే ఒకరికొకరు దూరంగా ఉంటారు. ఎప్పుడైతే ఈ రంగు ద్వారా మధురత వస్తుందో అప్పుడు ఏ కలయిక జరుగుతుంది? మీరందరు సమ్మేళనం చేసి వచ్చారు కదా! బాప్ దాదా ఈ భట్టీ ఏదైతే పెట్టారో అది సంస్కారాల కలయిక కోసం పెట్టారు. ఎప్పుడైతే సంస్కారాల కలయిక యొక్క సమ్మేళనం జరుగుతుందో అప్పుడు ఆ సమ్మేళనం యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. మీరు సమ్మేళనం చేశారు. బాప్ దాదా సంస్కారాల కలయిక చేస్తున్నారు. కనుక ఈ కలయికకు గుర్తే మంగళ కలయిక. బాప్ దాదా మరియు పిల్లల యొక్క కలయిక అయితే జరుగుతుంది కాని అన్నింటికంటే ఉన్నతోన్నతమైన కలయిక - సంస్కారాల యొక్క కలయిక. ఎప్పుడైతే ఈ కలయిక జరుగుతుందో అప్పుడు జైజై కారాలు వస్తాయి. దేవీలకి మహిమ ఉంది కదా - అందరికి సిద్ధి ఇస్తారు అని. ఎవరికైనా రిద్ధి, సిద్ది కావాలంటే ఎవరిని అడుగుతారు? రిద్ధి, సిద్ది ఇచ్చేవారు ఎవరు? దేవతలు. ఎప్పుడైతే పురుషార్ధం యొక్క విధి సంపూర్ణం అవుతుందో అప్పుడు సిద్ధి కూడా లభిస్తుంది.
ఏ సిద్దిని అయినా పొందడానికి బాప్ దాదా దగ్గరికి రారు. దేవిల దగ్గరికే వెళ్తారు. దేవతలు స్వయం సిద్ధి పొందారు కనుకనే ఇతరులకు సిద్ధి ఇవ్వగలరు. సంస్కారాల కలయిక జరిగినప్పుడే మీ పురుషార్థానికి కూడా సిద్ది లభిస్తుంది. అందరికంటే ఎక్కువ భక్తుల క్యూ ఎవరి వద్ద ఉంటుంది? (దేవిల వద్ద ఉంటుంది). హనుమంతుని మందిరంలో లేక దేవతల మందిరాల దగ్గర ఎక్కువ గుంపు ఉంటుంది అంటే దీని ద్వారా ఏమి రుజువు అవుతుంది? సాకార రూపంలో కూడా క్యూ ఎవరు చూస్తారు? ప్రత్యక్షత తర్వాత క్యూ ఉంటుంది. ఆ క్యూ కూడా ఎవరు చూస్తారు? పిల్లలే చూస్తారు. బాప్ దాదా గుప్తంగా ఉంటారు. పిల్లలే ప్రత్యక్షరూపంలో చూస్తారు. దీనికి స్మృతి చిహ్నంగానే ప్రత్యక్ష రూపంలో కూడా పిల్లల ముందే ఎక్కువ క్యూ ఉంటుంది. కానీ ఈ క్యూ ఎప్పుడు ఉంటుంది? సంస్కారాలు కలవటంలేదు అనే ఒక మాట తొలగిపోయినప్పుడే ఈ క్యూ ఉంటుంది. ఈ భట్టిలో చదువుకోవటం కాదు, అంతిమ సిద్ధి స్వరూపంగా అయ్యి చూపించాలి. ఈ సంఘటన సంస్కారాల కలయిక కొరకు. ఒక పదార్థాన్ని మరో పదార్థంలో కలపాలంటే ఏమి చేయాలి?
ఒకదానికొకటి సమీపంగా తీసుకురావాలంటే వాటిని కలపవలసి ఉంటుంది. అదేవిధంగా సంస్కారాలను కలుపుకునేటందుకు మనస్సులను కలపవలసి ఉంటుంది. మనస్సు కలవటం ద్వారా సంస్కారాలు కూడా కలుస్తాయి. సంస్కారాలను కలుపుకునేటందుకు మర్చిపోవటం, తొలగించటం మరియు ఇముడ్చుకోవటం ఈ మూడు విషయాలు చేయాలి. కొన్ని తొలగించుకోవలసి ఉంటుంది, కొన్ని మరిచిపోవలసి ఉంటుంది, కొన్ని ఇముడ్చుకోవలసి ఉంటుంది, అప్పుడే సంస్కారాలు కలుస్తాయి. అంతిమ సిద్ధి స్వరూపంగా అవ్వటం అంటే ఇదే. ఇప్పుడు అంతిమ స్థితిని సమీపంగా తీసుకురావాలి. ఒకరి విషయాలను ఒకరు స్వీకరించాలి మరియు గౌరవం ఇవ్వాలి. స్వీకరించడం మరియు గౌరవం ఇవ్వటం ఈ రెండు విషయాలు వచ్చేస్తే సంపూర్ణత మరియు సఫలత రెండూ సమీపంగా వస్తాయి. కేవలం ఈ రెండు విషయాలపై ద్యాస ఉంచాలి. రెండు విషయాలను సమీపంగా తీసుకురావాలి. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడమే భవిష్య అధికారం తీసుకోవటం. ఇది ఎవరి భట్టియో తెలుసా? ఈ భట్టి యొక్క పేరు ఏమిటి? మీరు తిలకం పెట్టుకోవటం కాదు, మీకు తిలకానికి బదులు వేరే విషయం చెప్తున్నాను. మిగిలినవారందరికీ తిలకం పెట్టారు. ఈ భట్టీలో మీరు పెట్టుకోవలసినది పాపిటబొట్టు(భాగ్యానికి గుర్తు). తిలకం అయితే చిన్న వాళ్ళు పెట్టుకుంటారు కాని పాపిటబొట్టు పెద్దవాళ్ళు పెట్టుకుంటారు. ఎప్పటినుండి అయితే మీపై బాధ్యత పెట్టుకునే ధైర్యం పెట్టుకున్నారో అప్పటి నుండి పాపిటబొట్టు ధరిస్తున్నారు. తిలకం మంచిగా అనిపిస్తుందా లేక పాపిటబొట్టు మంచిగా అనిపిస్తుందా! మీరందరు సర్వుల శుభచింతకులు, సేవాధారులు అంటే శుభచింతకులు. ఈ శుభచింతకుల గ్రూపుకి గుర్తు - చందనం మరియు పేరు - శుభచింతకుల గ్రూప్. మీరు శుభచింతకులుగా అవ్వటం ద్వారా అందరి చింతలు తొలగిపోతాయి. మీరు అందరి చింతలను తొలగించే శుభచింతకులు మరియకు స్లోగన్ ఏమిటి? ఎలా అయితే వారు ఆత్మే పరమాత్మ అంటారు కదా! అలాగే ఈ గ్రూప్ యొక్క స్లోగన్ ఏమిటి? బాలక్ సో మాలిక్. ఇదే ఈ గ్రూప్ యొక్క స్లోగన్. ఇప్పుడు పేరు కూడా లభించింది, స్లోగన్ కూడా లభించింది, పని కూడా లభించింది. ఇక ఈ భట్టీలో ఏమి చేయాలి? సంస్కారాల కలయిక ఎలా జరుగుతుంది అనేదే ఉపన్యాసంగా కూడా చెప్పాలి.
ఈ భట్టీలో ఇదే అద్భుతం చేయాలి - అనేకులలో ఒక సంస్కారాన్ని మీ సమానంగా తయారు చేయండి. సంపూర్ణ సంస్కారాలు మీ సంస్కారాలుగా కాదు, అనేకుల యొక్క సంస్కారం సంపూర్ణ సంస్కారంగా తయారుచేస్తే ఏమి అవుతుంది? సమాప్తి అవుతుంది. ఈ గ్రూప్ సమాప్తి చేసేవారు మరియు స్థాపన చేసేవారు కూడా. వేటిని సమాప్తి చేయాలి, వేటిని పాలన చేయాలి, మరియు వేటిని స్థాపన చేయాలి ఈ మూడు విషయాలనే ఈ భట్టీలో స్పష్టం చేయాలి. అందువలన త్రిమూర్తి బిందువులను పెడుతున్నారు. స్థాపన, పాలన మరియు సమాప్తి అంటే వినాశనం. ఏమేమి చేయాలి అనేది సరళ రీతిలో మరియు స్పష్టంగా ప్రత్యక్షరూపంలోకి రావాలి. కేవలం వర్ణన వరకు కాదు, ప్రత్యక్షంలోకి రావాలి. ఇతరులచే చేయించగలిగే విషయాలను స్పష్టం చేయాలి. కానీ బిందురూపంగా అయినప్పుడే ఈ మూడు కర్తవ్యాలు సఫలం చేయగలరు. అందువలనే మీ కర్తవ్యానికి స్మృతి చిహ్నంగానే పాపిటబొట్టు ఇస్తున్నాను. ఈ స్మృతిచిహ్నంలో స్మృతి, స్థితి, కర్తవ్యం మూడూ ఉన్నాయి. విశేష గ్రూప్ కి విశేష విషయాలు ఉంటాయి. మీరందరు హోలీ జరుపుకునేటందుకు వచ్చారా లేక ఈ గ్రూపులోని శిరోమణిని (పెద్ద పెద్ద అక్కయ్యలు మహోత్సవం జరుగుతుంది) చూసేటందుకు వచ్చారా? ఇలాంటి శ్రేష్టాత్మలకు సమీపంగా ఉండే పాత్ర కూడా డ్రామాలో ఉంది, ఇది కూడా సౌభాగ్యంగా భావించండి. శిరోమణిని చూడటం అంటే మిమ్మల్ని మీరు ఆవిధంగా శ్రేష్టంగా చేసుకోవటం. ఈ గ్రూప్ కి సాకారంగా ఎలా అయితే సమీపంగా వచ్చారో అలాగే సంబంధంలో కూడా సమీపంగా వచ్చే విధంగా తయారవ్వండి. చూసేవారు కూడా తక్కువ కాదు. చూసేవారు కూడా సమీప మరియు శ్రేష్ట ఆత్మలు. బాప్ దాదా మనస్సుకి ఇష్టమైన రత్నాలు. మొదట ఎవరు వస్తారు? బాప్ దాదా అందరినీ ఒకే వేగంలో చూస్తున్నారు. అందువలనే ఒకటి, రెండు అని నెంబర్ చెప్పలేకపోతున్నారు. ఈ సమయంలో అందరు ఒకని స్మృతిలో ఉన్నారు, కనుక అందరూ నెంబర్ వన్.
ఓంశాంతి, శిరోమణి అని ఎవరిని అంటారు మరియు వారిని చూడటం వలన స్వయానికి కలిగే లాభం ఏమిటి? అంతిమ సిద్ధి స్వరూపంగా అవ్వటం అంటే ఏమిటి? పురుషార్ధం బలహీనం అవ్వడానికి ఏ మూడు విషయాలు కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు.
ReplyDelete