23-01-1974 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
శక్తిసేన అనే పేరుని ఇప్పుడు సార్థకం చేసుకోండి.
నిర్భల ఆత్మకు శక్తినిచ్చే శక్తిదాత, వృద్ధికళ వైపుకి తీసుకువెళ్ళే ఆత్మిక పండా మరియు అన్ని ఆధారాలతో నిరాధారంగా తయారుచేసే నిరాకార శివబాబా శక్తుల సంఘటనను సంభోదిస్తూ అన్నారు-
మిమ్మల్ని మీరు శక్తి సేనలోని యుద్ధవీరులుగా భావిస్తున్నారా? మీ సంఘటన యొక్క పేరు - శక్తిసేన ఎలాగో, అలాగే మిమ్మల్ని మీరు శక్తిగా భావిస్తున్నారా? ఈ పేరు మీ పరిచయాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది కర్తవ్యం ఆధారంగా ఉంది. శక్తిసేన అంటే సర్వశక్తులతో సంపన్నమైన ఆత్మల యొక్క సంఘటన అని అర్థం. కనుక ప్రశ్న ఏమిటంటే పేరు ఏవిధంగా అయితే కర్తవవ్యాన్ని రుజువు చేస్తుందో, అదేవిధంగా ఆ కర్తవ్యం ప్రత్యక్షంగా ఉందా?
సర్వశక్తిసంపన్నంగా అయ్యే యుక్తి చెప్తూ బాబా అన్నారు - బాబా యొక్క పేరు ఏమిటి మరియు బాబా యొక్క మహిమ ఏమిటి? అనేది సదా స్మృతిలో ఉంచుకోండి. ఆ తర్వాత బాబా యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో నా కర్తవ్యం కూడా అదేవిధంగా ఉందా? అని ఆలోచించండి. ఒకవేళ బాబా పేరుని ప్రఖ్యాతి చేసే పని చేయలేదు, అంటే బాబా పేరు ఏవిధంగా ప్రఖ్యాతి చేయగలరు?సర్వశక్తివంతుడు అని బాబాకి ఏదైతే మహిమ ఉందో, అదేవిధంగా నా స్వరూపం కూడా ఉందా అని ఆలోచించండి. ఎందుకంటే బాబా యొక్క మహిమ అనుసారంగానే మీ స్వరూపాన్ని తయారుచేసుకోవాలి. తండ్రి సర్వశక్తివంతుడు మరియు పిల్లలు శక్తిహీనం, తండ్రి జ్ఞాన సాగరుడు మరియు పిల్లలు చదువుకోనివారిగా ఉంటే బావుంటుందా? కనుక ప్రతి సెకను వృద్ధి కళ వైపు ఉందా? అని చూసుకోవాలి. ఒక్క సెకను కూడా వృద్ధి కళకి బదులు ఆగిపోయే కళలో ఉండకూడదు. పడిపోయే కళ అనే విషయం అయితే లేనే లేదు. మీరు పండాలు. పండాలు ఆగిపోయే కళలోకి వచ్చేసారు లేదా ఆగిపోయారంటే మీ వెనుక నడవాల్సిన విశ్వాత్మలందరూ కూడా ఆగిపోతారు. ఇంజన్ ఆగిపోతే వాహనమే ఆగిపోతుంది కదా! మీ అందరి వెనుక విశ్వాత్మలు ఉన్నారు. మీరు ఒక్క సెకను ఆగినా సాధారణ విషయం కాదు. ఇంత భాద్యత ఉన్నట్లు భావించి నడుస్తున్నారా? విశేష స్థానంలో విశేష రూపంలో అందరి దృష్టిలో ఉన్నారు కదా? అయితే డ్రామానుసారం విశేష స్థానంలో విశేష పాత్ర అభినయించే అవకాశం లభిస్తే మీ విశేష పాత్రకి విశేష గొప్పతనం ఇచ్చి నడవాలి. ఒకవేళ మీకు మీరే గొప్పతనం ఇవ్వకపోతే ఇతరులు కూడా మీకు గొప్పతనం ఇవ్వరు. అందువలన ఇప్పుడు మీరు మీ పాత్ర యొక్క విలువని తెలుసుకోండి. మాకు ఏ భాద్యతా లేదు అనే సంకల్పం కూడా చేయకూడదు. ఇప్పుడు. మిమ్మల్ని చూసి అనేకమంది వ్యాపారం చేస్తున్నారు అంటే వ్యాపారం చేయించేవారే మీరు కదా?
స్థాపన యొక్క తయారీలు తక్కువ అయితే వినాశనం యొక్క తయారీలు ఎలా జరుగుతాయి? ఇది అయితే అర్ధం చేసుకోగలరు కదా! ఈ రెండింటికీ పరస్పరం సంబంధం ఉంది కదా? సమయానికి తయారైపోతాం అని భావించటం కూడా తప్పు, ఒకవేళ చాలాకాలం నుండి మహావినాశనాన్ని ఎదుర్కునే అభ్యాసం లేకపోతే, ఆ సమయంలో కూడా సఫలులు కాలేరు. దీనికోసం చాలా సమయం నుండి అభ్యాసం కావాలి. లేకపోతే అభ్యాసం కొరకు అన్ని సంవత్సరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? చాలాకాలంతో సంబంధం ఉంది. అందువలనే డ్రామానుసారం పురుషార్ధం కోసమే చాలా సమయం ఇవ్వబడింది. చాలాకాలం యొక్క ప్రాప్తి కొరకు చాలాకాలం యొక్క పురుషార్థం కూడా చేయాలి. ఇలా చాలాకాలం యొక్క పురుషార్థం ఉందా? మహావినాశనం కొరకు విజ్ఞానం వారిని ఆజ్ఞాపించమంటారా? ఒక్క సెకను విషయమే, సైగ లభించగానే చేసేస్తారు. ఈవిధంగా శక్తిసేన తయారుగా ఉన్నారా? మీకు ఒక్క సెకను యొక్క ఆజ్ఞ ఏమిటంటే సదా దేహి అభిమాని. అల్పకాలికంగా కాదు, సదాకాలికంగా అయిపోండి. ఒక్క సైగ లభించగానే మీరు దేహీ అభిమాని అయిపోతారా లేక ఆ సమయంలో సాధనం వెతుకుతారా? పాయింట్స్ ఆలోచిస్తారా? స్వయాన్ని స్థితులు చేసుకోవడానికి ప్రయత్నిస్తారా? అందువలన ఇప్పటి నుండి ఇటువంటి పురుషార్థం చేయండి. సైన్యానికి ఆజ్ఞ అకస్మాత్తుగానే లభిస్తుంది కదా?
మీకు మీరే కార్యక్రమాన్ని తయారుచేసుకోండి, మీ ఉన్నతి మీరే చేసుకోండి. కార్యక్రమం తయారుచేస్తే అప్పుడు తయారవుతాం అనే ఆధారాన్ని కూడా పెట్టుకోకండి. భట్టీ పెడితే మూడు రోజులు మంచిగా గడుపుతారు, ఎందుకంటే భట్టీలో సంఘటన యొక్క సహయోగం లభిస్తుంది. కానీ దీనిని కూడా ఆధారంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఈ సహయోగం కూడా అప్పుడప్పుడు లభించవచ్చు, అప్పుడప్పుడు లభించకపోవచ్చు. అందువలన అభ్యాసం అనేది నిరాధారంగా ఉండాలి. అవకాశం లభిస్తే మంచిదే, కానీ ఒకవేళ లభించకపోయినా కానీ అభ్యాసం నుండి తొలగకూడదు. కార్యక్రమం ఆధారంగా మీ ఉన్నతి చేసుకోవటం కూడా బలహీనత. మీకు అయితే అనాది కార్యక్రమం లభించింది కదా? దానిని ఎందుకు గుర్తు పెట్టుకోవటం లేదు? ప్రతి సమయం భట్టీలోనే ఉండాలి, ఈ కార్యక్రమం అనాదిగా లభించింది.
మంచిది, ఎలాంటి పేరుయో అలాంటి పని చేసేవారికి, బాబా పేరుని ప్రఖ్యాతి చేసేవారికి, ఆజ్ఞాపించగానే ఒక్క సెకనులో తయారైపోయేవారికి మరియు నిరాధారంగా పురుషార్ధం చేసేవారికి, ఆత్మిక సైన్యానికి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment