* 23-01-1973 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"సంపూర్ణమూర్తులుగా అయ్యేందుకు నాలుగు స్తంభములు"
అందరూ తమను సంపూర్ణంగా తయారుచేసుకొనే పురుషార్థములో నడుస్తున్నారా? సంపూర్ణమూర్తులుగా అయ్యేందుకు ముఖ్యంగా నాలుగు విశేషతలను ధారణ చెయ్యాలి, వీటి వలన సహజముగానే సంపూర్ణమూర్తులుగా అవ్వగలరు. ఏవిధంగా ఇతరులకు యోగస్థితిలో సదా ఏకరస స్థితిలో స్థితులై ఉండేందుకు, నాలుగు ముఖ్య నియమాలను స్తంభాల రూపములో చూపిస్తారో లేక చెప్తారో, అలాగే సదా సంపూర్ణ మూర్తులుగా అయ్యేందుకు ఈ నాలుగు విశేషతలు స్తంభముల రూపములో ఉన్నాయి. అవి ఏవి? 1. జ్ఞానమూర్తి. 2.గుణమూర్తి. 3. మహాదానీమూర్తి. 4. స్మృతిమూర్తి అనగా తపస్వీమూర్తి. ఈ నాలుగు విశేషతలను స్వయములోకి తీసుకురావటము ద్వారా సంపూర్ణస్థితిని తయారుచేసుకోగలరు. ఇప్పుడు మీ మూర్తిలో ఈ నాలుగు విశేషతలూ ప్రత్యక్ష రూపములో అనుభవమవుతాయా మరియు ఇతర ఆత్మలకు కూడా కనిపిస్తాయా? అని చూసుకోండి.
జ్ఞానమూర్తి అనగా ఎల్లప్పుడూ బుద్ధిలో జ్ఞాన సిమిరణ కొనసాగుతూ ఉండాలి. ఎల్లప్పుడూ వాణిలో జ్ఞానపు మాటలనే వర్ణిస్తూ ఉండాలి. ప్రతి కర్మ ద్వారా జ్ఞానస్వరూపపు అనగా మాస్టర్ జ్ఞానసంపన్నులు మరియు మాస్టర్ సర్వశక్తివంతులు - ఈ ముఖ్య స్వరూపాల సాక్షాత్కారము ఉండాలి. వీరినే 'జ్ఞానమూర్తి' అని అంటారు. ఈవిధంగా మనసు-వాణి మరియు కర్మ ద్వారా గుణమూర్తి, మహాదానీ మూర్తి మరియు స్మృతి అనగా తపస్యామూర్తి ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. ఏవిధంగా లౌకిక చదువులో 3 నెలలకు, 6 నెలలకు, 9 నెలలకు పరీక్షలు ఉంటుంటాయి, వీటి వలన ప్రతి ఒక్కరికీ తమ చదువు గురించి తెలిసిపోతుంది, అలాగే ఈశ్వరీయ చదువులో ఇప్పుడు చాలా సమయము గడిచిపోయింది. కావున ఈ విశేష మాసములో స్మృతియాత్రలో ఉండి స్వయమును పరిశీలించుకొనేందుకు అనగా తమకు తామే శిక్షకులుగా అయ్యి, సాక్షీలుగా అయ్యి తమను పరీక్షించుకొని చూసుకొనేందుకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేవలము ఫైనల్ పేపరే ఉండిపోయింది. కావున మీ రిజల్టును చూసి ఈ నాలుగు విశేషతల నుండి ఏ విశేషతలో మరియు ఎంత శాతములో లోటు ఉంది అని పరిశీలించుకోండి. అంతిమ పరీక్షలో సంపూర్ణంగా ఉత్తీర్ణులయ్యేందుకు యోగ్యంగా సర్వ యోగ్యతలు ఉన్నాయా? ఈ మాసములో పరిణామమును చూడాలి. పర్సెంటేజ్ తక్కువగా ఉన్నట్లయితే సంపూర్ణ స్థితిని ఎలా పొందగలరు? కావున మీ లోపాలను తెలుసుకొని వాటిని నింపుకొనేందుకు తీవ్ర పురుషార్థము చెయ్యండి. ఇప్పుడు ఈ కొద్ది సమయము డ్రామానుసారంగా పురుషార్థము కొరకు లభించింది. కానీ అంతిమ పరీక్షకు ముందే స్వయమును సంపూర్ణంగా చేసుకోవాలి. మీ రిజల్టును చూసుకున్నారా? ఏవిధంగా ఈ మాసములో నలువైపులా స్మృతియాత్ర యొక్క ఉల్లాస-ఉత్సాహాలను ఉంచారు కదా! దీని రిజల్టును ఎలా భావిస్తున్నారు? ఎన్ని మార్కులను ఇస్తారు? ప్రతి ఒక్కరికీ తమ తమ మార్కులైతే ఉంటాయి, అయినా కూడా నలువైపులా గల వాతావరణము మరియు వాయుమండలము మరియు పురుషార్థపు ఉల్లాసము మరియు ఉత్సాహపు రిజల్టులో ఎన్ని మార్కులని అంటారు? టోటల్ అడుగుతున్నాము. అందరి పురుషార్థపు ప్రభావము మధువనము వరకు చేరుకుంటుంది కదా? త్రికాలదర్శులు కాదా? మీ సమీప పరివారపు ఆత్మల పురుషార్థమునకు త్రికాలదర్శులు కారా? భవిష్యత్తు గురించే త్రికాలదర్శులా? వర్తమానమునకు కాదా? వైబ్రేషన్లు మరియు వాయుమండలము ద్వారా పరిశీలించలేరా?
సైన్స్ వారు భూమిపై నుండి అంతరిక్షములోని వారి ప్రతి గతిని మరియు ప్రతి విధిని తెలుసుకోగలిగినప్పుడు మరి మీరు స్మృతి శక్తి ద్వారా మీ శ్రేష్ఠ పురుషార్థపు గతి మరియు విధిని తెలుసుకోలేరా? ఆవశ్యకత లేనప్పుడు, చివర్లో తెలుసుకుంటారా? ఇప్పటి నుండి దీనిని తెలుసుకొనే అభ్యాసము కూడా ఉండాలి, కేచింగ్ పవర్ కావాలి, ఏవిధంగా సైన్స్ దూరంగా ఉన్న శబ్దాన్ని అందుకొని నలువైపులా వినిపించగలదో, మరి అలా మీరు కూడా శుద్ధ వైబ్రేషన్లు, శుద్ధ వృత్తులు మరియు శుద్ధ వాయుమండలమును అందుకోలేరా? ఈ కేచింగ్ పవర్ ప్రత్యక్ష రూపంలో అనుభవమవుతుందా! ఏవిధంగా ఈ రోజుల్లో దూరంగా ఉన్న దృశ్యము టెలివిజన్ ద్వారా స్పష్టంగా కనిపిస్తుందో, అలాగే దివ్యబుద్ధి కలవారిగా అవ్వటం ద్వారా, కేవలము ఒక్కరి స్మృతి యొక్క శుద్ధ సంకల్పములో స్థితులై ఉండటం ద్వారా మీ అందరికి కూడా ఇతరుల స్థితి మరియు పురుషార్థపు గతి-విధులు అంతగానే స్పష్టంగా కనిపిస్తాయి, ఈ సైన్స్ కూడా ఎక్కడ నుండి వెలువడింది? సైలెన్స్ శక్తి నుండే సైన్స్ శక్తి వెలువడింది. సైన్స్ మీ వాస్తవిక స్థితి మరియు సంపూర్ణ స్థితిని తెలుసుకొనేందుకు ఒక సాధనంగా వెలువడింది. ఎందుకంటే సూక్ష్మ శక్తిని తెలుసుకొనేందుకు తమోగుణీ బుద్ధికలవారికి స్థూలంగా ఏదో ఒక సాధనము అవసరము. ఏ శ్రేష్ఠ ఆత్మలో అయితే ఈ నాలుగు విశేషతలూ సంపూర్ణ శాతములో అనగా దేనినైతే 100 శాతము అని అంటారో, అలా ఇమర్జ్ అయి ఉంటాయో అటువంటి ఆత్మలో సర్వ సిద్ధుల ప్రాప్తి కనిపిస్తుంది. ఈ స్థితి మీ ఇప్పటి సమయవు పురుషార్థములో కనిపిస్తుందా? కొంత శాతములో కూడా కనిపిస్తుందా లేక ఈ స్థితి ఇప్పుడు దూరంగా ఉందా? కొంత సమీపంగా కనిపిస్తుందా? మీరైతే నలువైపులా ఈ మాసపు రిజల్టునైతే చాలా మంచిగా చేసారు. ఇప్పుడు ఇక ముందు ఏం చేస్తారు? స్మృతియాత్రలో ఉండటం ద్వారా ఏదైనా నూతన పధకము ప్రాక్టికల్ లో తీసుకువచ్చేందుకు ఇమర్జ్ అవ్వాలి.
ఏవిధంగా నలువైపులా సంగఠన రూపంలో స్మృతి శక్తిని తమలో నింపుకొనే పురుషార్థము చేసారో అలా ఇప్పుడు మళ్ళీ రాబోయే రెండు మాసాలు విశేషంగా అతి బిగ్గరగా నలువైపులా బాబాను ప్రత్యక్షము చేసే నగారాను మ్రోగించాలి. ఈ నగారా శబ్దమును విని నిద్రిస్తున్న ఆత్మలు మేల్కొనాలి. నలువైపులా వినిపిస్తున్న ఈ శబ్దము ఏంటి మరియు ఈ సమయములో ఎటువంటి శ్రేష్ఠ కర్తవ్యము నడుస్తూ ఉంది? అని మేల్కొనాలి.
ప్రతి ఆత్మ తన శ్రేష్ఠ భాగ్యమును ఇప్పుడే తయారుచేసుకోగలదు. ఈ విధంగా నలువైపులా భిన్న భిన్న యుక్తుల ద్వారా, భిన్న-భిన్న ప్రోగ్రాముల ద్వారా బాబాను పరిచయపు నగారాలను మ్రోగించండి. ఈ రెండు మాసాలలో అందరూ ఈ విశేష కార్యములో తమ విశేషతను చూపించాలి. ఏవిధంగా స్మృతియాత్రలో ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము ప్రమాణంగా రేస్ లో ముందుకు వెళ్ళే పురుషార్థము చేసారో, అలా ఇప్పుడు ఈ రెండు మాసాలలో తండ్రిని ప్రత్యక్షము చేసే క్రొత్త క్రొత్త ప్లాన్ లను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చే రేస్ ను చెయ్యండి. మళ్ళీ అప్పుడు ఈ రేస్ లో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతిని తీసుకునేందుకు ఎవరెవరు నిమిత్తంగా అయ్యారు అని రిజల్టును వినిపిస్తాము. అవకాశము చాలా మంచిగా ఉంది, మరి రిజల్టును చూస్తాము. ఒక మాసము లోపల యోగబలపు ప్రాప్తి యొక్క ఏ అనుభవమును చేసారు? ఇప్పుడు యోగబలము ద్వారా ఆత్మలను మేల్కొలిపే కర్తవ్యమును చెయ్యండి మరియు ప్రమాణమును చూపించండి. ఏవిధంగా బాప్ దాదా ద్వారా కూడా పురుషార్థపు ప్రత్యక్ష ఫలము ప్రాప్తిస్తుందో అలా రిటర్నుగా ప్రత్యక్ష ఫలమును చూపించండి మరియు సర్వ శక్తివంతుడైన తండ్రి పాలనకు ప్రత్యక్ష స్వరూపమును చూపించండి. సాకారరూపము ద్వారా కూడా చాలా పాలనను తీసుకున్నారు మరియు అవ్యక్తరూపములో కూడా పాలనను తీసుకున్నారు. ఇప్పుడు ఇతర ఆత్మల జ్ఞాన పాలనను చేసి వారినికూడా బాబా సమ్ముఖములోకి తీసుకురండి మరియు తండ్రి సమీపంగా తీసుకురండి.
డ్రామాలో ఇప్పుడు ఏ సమయమైతే జరుగుతోందో మరియు ఇప్పటి సంవత్సరమేదైతే నడుస్తోందో ఇందులో చాలా అద్భుతమైన విషయాలను చూస్తారు. ఇందుకొరకు ప్రారంభములో విశేషమైన స్మృతిశక్తిని నింపుకొనే అవకాశము లభించింది. ఇప్పుడు చాలా త్వరగా క్రొత్త క్రొత్త దృశ్యాలు మరియు క్రొత్త క్రొత్త విషయాలను వింటారు మరియు చూస్తారు. ఇందుకొరకు అవ్యక్త స్థితి మరియు అవ్యక్త మిలనపు విశేష అనుభవము చెయ్యాలి. దాని వలన ఏ సమయములోనైనా మిలనము ద్వారా బుద్ధిబలముతో తమ పురుషార్థములో మరియు విశ్వసేవ యొక్క అన్ని కార్యాలలో సఫలతామూర్తులుగా అవ్వగలరు. ఇప్పుడు అవ్యక్త మిలనపు అనుభవమును చేసుకున్నారా? ఏ సమయములో కావాలంటే, లేక ఏ పరిస్థితిలో కావాలంటే ఆ సమయములో ఆ రూపము ద్వారా మిలనము చేసుకొనే అనుభవమును చెయ్యగలరా? ఈ అభ్యాసము అయిపోయిందా? కొంత అభ్యాసము చేసినప్పుడు దానిని ఎక్కువ చేసుకోగలరు కదా? పద్ధతి అయితే అందరికీ వచ్చేసిందా? ఇది చాలా సహజమైన పద్ధతి. దీని ద్వారా ఏ దేశములో, ఏ రూపములో కలవాలనుకుంటే అలా తమ వేషాన్ని తయారుచేసుకోండి. ఒకవేళ మీ వేషాన్ని తయారుచేసుకున్నట్లయితే ఆ వేషములో మరియు ఆ దేశములోకి తప్పక చేరుకుంటారు మరియు ఆ దేశపువాసిగా అయి తండ్రితో అనేకరూపాల ద్వారా మిలనము జరుపుకోగలరు. కేవలము ఆ దేశము సమానంగా వేషాన్ని ధారణ చెయ్యండి అనగా స్థూల వేషము మరియు స్థూల శరీరపు స్మృతి నుండి అతీతంగా సూక్ష్మ శరీరము అనగా సూక్ష్మ దేశపు వేషధారిగా అవ్వండి. బహురూపులు కారా? వేషధారణను చేసుకోవటము రాదా? ఏవిధంగా ఇప్పటి ప్రపంచములో ఎటువంటి కర్తవ్యమో అటువంటి వేషాన్ని ధారణ చేస్తారో, అలా మీరు కూడా బహురూపులేనా? మరి ఏ సమయములో, ఏ కర్మను చెయ్యాలనుకుంటారో అటువంటి వేషమును ధారణ చెయ్యలేరా? ఇప్పుడిప్పుడే సాకారి మరియు ఇప్పుడిప్పుడే ఆకారి, ఏవిధంగా స్థూలమైన వస్త్రాన్ని సహజంగా మార్చుకోగలరో, మరి అలా మీ బుద్ధి ద్వారా మీ సూక్ష్మ శరీరమును ధారణ చెయ్యలేరా? కేవలము బహురూపులుగా అయినట్లయితే సర్వ స్వరూపాల సుఖపు అనుభవమును చెయ్యగలరు. చాలా సహజము. మీ స్వరూపమే. ఏదైనా ఇతరుల నకిలీ రూపమును ఏమన్నా ధారణ చేస్తున్నారా? ఇతరుల వస్త్రమైతే క్రిందకు-పైకి కావచ్చు, సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, కానీ మీ వస్త్రమైతే సహజముగానే ధారణ అవుతుంది. మరి ఇది మీ రూపమే. సహజము కదా? డ్రామానుసారంగా ఈ విశేష అభ్యాసము కూడా ఏదో రహస్యముతో రచింపబడి ఉంది. ఏ రహస్యము నిండి ఉంది? టచ్ అవుతుందా? అందరూ ఏవైతే చెప్తున్నారో అవన్నీ యథార్థమే, ఎందుకంటే ఇప్పుడు యథార్థ స్థితిలో స్థితులై ఉన్నారు కదా? వ్యర్థ స్థితి అయితే లేదు కదా? సమర్థ శక్తి స్వరూపపు స్థితి ఉంది కదా?
ఇప్పుడు డ్రామా రీలు త్వర్వరగా పరివర్తితమవ్వాలి, ఇప్పుడు వర్తమాన సమయములో ఏదైతే నడుస్తుందో, ఈ అన్ని విషయాలు పరివర్తనమవ్వాలి. వ్యక్తము ద్వారా అవ్యక్త మిలనము - ఇవన్నీ తీవ్ర పరివర్తనమవ్వాలి. ఈ కారణంగా అవ్యక్త మిలనపు విశేష అనుభవము విశేషరూపము ద్వారా చేయించారు మరియు ముందు కూడా అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనపు విచిత్ర అనుభవమును చాలా చేస్తారు. ఈ సంవత్సరమునకు అవ్యక్త మిలనము ద్వారా విశేష శక్తుల ప్రాప్తి యొక్క వరదానము లభించింది. కావున ఈ మాసము సమాప్తమైపోయింది అని భావించకండి, కానీ ఎవరైతే ఎడతెగకుండా ముందు ముందుకు ఉన్నతి చెందుతూ ఉంటారో వారికి ఈ అభ్యాసము మరియు అనుభవము వలన చాలా క్రొత్త క్రొత్త అనుభవాలు కలుగుతూ ఉంటాయి. అర్థమైందా?
ఇలా, సర్వ గుణాలలో తమను సంపన్నంగా తయారుచేసుకొనే వారికి, తమ సంకల్పము, వాణి మరియు కర్మ ద్వారా సర్వ విశేషతలను ప్రత్యక్షము చేసేవారికి, బాప్ దాదాల దివ్య పాలనకు ప్రత్యక్ష ఫలమును చూపించే వారికి, తండ్రికి సదా స్నేహులు, సదా సహయోగులు, సర్వ శక్తులలో సమానంగా అయ్యేవారికి మరియు సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకొనే శ్రేష్ఠ ఆత్మలకు మరియు తీవ్ర పురుషార్ధీ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment