22-11-1972 అవ్యక్త మురళి

* 22-11-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"అంతిమ సేవ యొక్క అంతిమ స్వరూపము" 

           మీ అంతిమ స్వరూపపు సాక్షాత్కారము జరుగుతూ ఉంటుందా? ఎందుకంటే ఎంతెంతగా దగ్గరకు వస్తూ ఉంటారో అంతగా సమ్ముఖములోని వస్తువు కనిపించినంత స్పష్టంగా అనుభవము కలుగుతుంది, ఇప్పుడిప్పుడే ఇలా తయారవుతాము అన్నటువంటి అనుభవము కలుగుతుంది. ఏవిధంగా వృద్ధాప్యపు స్థితిలో ఉన్నవారికి - ఇప్పుడు వృద్ధుడిగా ఉన్నాను, ఇప్పుడిప్పుడే వెళ్ళి చిన్నపిల్లవానిగా అవుతాను అన్న స్మృతి ఎప్పుడూ ఉంటుంది. అలాగే మీ అంతిమ స్వరూపపు స్మృతి కాదు కానీ సమ్ముఖములో, స్పష్టరూపములో - ఇప్పుడు ఇలా ఉన్నాము, మళ్ళీ ఇలా తయారవుతాము... అని సాక్షాత్కారము కలుగుతుంది. ఏవిధంగా ప్రారంభంలో కూడా వినిపించేవారము కదా గమ్యమునకు చేరుకుంటున్నట్లయితే ఇక అడుగు పెట్టడమే ఆలస్యము అని భావిస్తారు. ఒక అడుగును పెట్టేసారు, రెండోదానిని పెట్టాల్సి ఉంది అంతే, ఇంతే అంతరము ఉంటుంది. కావున ఇలా మీ అంతిమ స్టేజ్ యొక్క సమీప్యత అనుభవమవుతోందా? అపరోక్షంగా స్పష్ట సాక్షాత్కారము ఉంటోందా? ఏవిధంగా అద్దములో మీ రూపము స్పష్టంగా కనిపిస్తుందో, అలా ఈ జ్ఞాన దర్పణములో అంతగా మీ అంతిమ స్వరూపము స్పష్టముగా కనిపించాలి. ఏదైనా చాలా మంచి సుందరమైన డ్రెస్ మీ ముందు పెట్టబడి ఉండి, దానిని  ఇప్పుడు మేము ధరించాలి అన్నది కూడా మీకు తెలిసి ఉన్నప్పుడు, దానిని ధరించే సమయము దగ్గరకు వచ్చేకొద్దీ అనుకోకపోయినా కూడా అటెన్షన్ అనేది దాని వైపుకు వెళ్తుంది. ఎందుకంటే  ఎదురుగా కనిపిస్తూ ఉంది. అలాగే మీ అంతిమ స్వరూపము ఎదురుగా కనిపిస్తోందా? మరియు ఆ స్వరూపము వైపుకు అటెన్షన్ వెళుతోందా? దానిని ప్రకాశ స్వరూపము అని అన్నా అనండి లేక ప్రకాశ వస్త్రము అని అన్నా అనండి, ప్రకాశమే ప్రకాశము కనిపించాలి. ఫరిస్తాల  రూపము ఎలా ఉంటుంది? ప్రకాశము. చూసేవారు కూడా, వీరు ప్రకాశపు వస్త్రధారులు, ప్రకాశమే వీరి వస్త్రము, ప్రకాశమే వీరి అలంకారము అని అనుభవము చేసుకోవాలి. ఎక్కడ చూసినా ప్రకాశమే ప్రకాశము. మస్తకము పైన చూసినట్లయితే ప్రకాశ కిరీటము కనిపిస్తుంది. నయనాలలో కూడా ప్రకాశ కిరణాలు వెలువడుతున్నట్లు కనిపించాలి. మరి అటువంటి రూపము మీ ముందు కనిపిస్తోందా? ఎందుకంటే మైట్ రూపము అనగా శక్తి రూపము యొక్క పాత్ర ఏదైతే నడుస్తుందో అది దేని ద్వారా ప్రసిద్ధమౌతుంది? ప్రకాశరూపము ద్వారా, ముందుకు ఎవరు వచ్చినా వారు ఒక్క క్షణములో అశరీరులుగా అయిపోవాలి, అది లైట్ రూపము ద్వారానే అవుతుంది. అలా నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్ గా అయిపోవాలి, ఎవరికీ ఈ శరీరము కనిపించకూడదు. వినాశన సమయములో పరీక్షలో పాస్ అవ్వాలంటే, అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు లైట్ హౌస్ గా అవ్వవలసి ఉంటుంది. నడుస్తూ-తిరుగుతూ మీ ఈ రూపము అనుభవమవ్వాలి. ఈ అభ్యాసము చెయ్యాలి. శరీరమును పూర్తిగా మరిచిపోవాలి, ఒకవేళ ఏదైనా పని చెయ్యాలన్నా, నడవాలన్నా, మాట్లాడాలన్నా కూడా నిమిత్తంగా ఆకారీ లైట్ రూపమును ధారణ చెయ్యాలి. ఏవిధంగా పాత్రను అభినయించే సమయములో వస్త్రమును ధారణ చేస్తారో, కార్యము పూర్తి కావటంతోనే శరీరమును వదిలేస్తారో, ఒక్క క్షణములో ధారణ చేస్తారు, ఒక్క క్షణములో అతీతులుగా అయిపోతారు... ఎప్పుడైతే ఈ అభ్యాసము చాలా దృఢంగా అయిపోతుందో, అప్పుడిక ఈ కర్మభోగము సమాప్తమౌతుంది. ఏవిధంగా ఇంజక్షన్ ను  ఇచ్చి నెప్పిని తగ్గిస్తారో, హఠయోగులైతే శరీరము నుండి అతీతంగా అయ్యేందుకు అభ్యాసమును చేయిస్తారో అలాగే ఈ స్మృతి స్వరూపమనే ఇంజెక్షన్ ను వెయ్యటంతోనే దేహస్మృతి నుండి మాయమైపోవాలి. స్వయం కూడా తమను ప్రకాశరూపముగా అనుభవము చేసుకున్నట్లయితే ఇతరులు కూడా దానినే అనుభవము చేసుకుంటారు. అంతిమ సేవ ఇదే. దీని ద్వారా మొత్తము వ్యవహారమంతా లైట్ గా అనగా తేలికగా అయిపోతుంది. పర్వతము కూడా ఆవగింజలా అయిపోతుంది అన్న నానుడి లాగా లైట్ రూపులుగా అవ్వటం ద్వారా ఏ కార్యమైనా తేలికగా అయిపోతుంది, బుద్ధిని పెట్టే అవసరము కూడా ఉండదు. తేలిక పనిలో బుద్ధిని పెట్టవలసిన అవసరము లేదు. కావున ఈ లైట్ స్వరూపపు స్థితిలో మాస్టర్ జానీ జానన్ హార్(సర్వము తెలిసినవారు, శివబాబా) లేక త్రికాలదర్శి యొక్క లక్షణమేదైతే ఉందో, అది వచ్చేస్తుంది. చెయ్యాలా, వద్దా - అన్నది కూడా ఆలోచించవలసిన అవసరము లేదు. యథార్థంగా ఏది చెయ్యాల్సి ఉందో అదే బుద్ధిలో సంకల్పము కలుగుతుంది. ఈ స్థితి మధ్యలో ఎటువంటి కర్మభోగపు భావన ఉండదు. ఏవిధంగా ఇంజెక్షన్ నషాలో ఉంటూ మాట్లాడుతుంటారు, కదులుతుంటారు, అన్నీ చేస్తూ ఉన్నాకూడా గుర్తు అయితే ఉండదు. చేస్తున్నాము అన్న ఈ స్మృతి ఉండదు, స్వతహాగనే జరుగుతూ ఉంటుంది. అలాగే కర్మభోగము లేక ఏ రకమైన కర్మ అయినా జరుగుతూనే ఉంటుంది కానీ స్మృతి ఉండదు. అది తనవైపుకు ఆకర్షితము చెయ్యదు. అటువంటి స్థితినే అంతిమ స్థితి అని అంటారు. అటువంటి అభ్యాసము ఉండాలి. ఇటువంటి స్థితి ఎంత సమీపంగా ఉంది? పూర్తిగా సమ్ముఖము వరకు చేరుకున్నారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు లైట్ రూపమైపోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరములోకి రావాలి మరియు ఏది చెయ్యాలో అది చెయ్యాలి. సదాకాలము ఆ స్థితి ఏకరసంగా ఎప్పటివరకు ఉంటుందో అప్పటివరకు మధ్యమధ్యలో కొంత సమయమైతే ఉండాలి. మళ్ళీ అలా ఉంటూ-ఉంటూ సదాకాలమైపోతుంది. సాకారములో ఆకారపు అనుభవమును చేసుకునే వారు కదా! ఫస్ట్ లో ఉంటూ కూడా ఫరిస్తా స్థితిని అనుభవము చేసుకునేవారు. అటువంటి స్టేజ్ అయితే రావాలి కదా! ప్రారంభములో చాలామందికి ఈ సాక్షాత్కారము కలిగేది. ప్రకాశమే ప్రకాశము కనిపించేది. తమ ప్రకాశ కిరీటమును కూడా అనేకసార్లు సాక్షాత్కారము చేసేవారు. ఆదిలో ఏదైతే సాంపుల్ గా ఉందో అది అంతిమంలో ప్రాక్టికల్ స్వరూపము అవుతుంది. సంకల్ప సిద్ధి యొక్క సాక్షాత్కారము కలుగుతుంది ఏవిధంగా మీరు వాచ ద్వారా డైరెక్షన్ ఇస్తారో అలా సంకల్పము ద్వారా మొత్తము కార్యవ్యవహారములను నడపగలరు. సైన్స్ వారు కింది ఉన్న పృధ్వి నుండి పైవరకు డైరెక్షన్లను ఇస్తూ ఉంటారు, మరి శ్రేష్ఠ సంకల్పము ద్వారా కార్యవ్యవహారమును నడపలేరా? సైలెన్స్ నుండే సైన్స్ కాపీ చేసింది కదా! కావున ఉదాహరణను ఇచ్చేందుకు మొదటి నుండి స్పష్టరూపంలో మీ ఎదురుగా ఉంది. కల్పపూర్వము మొదట్లో అయితే మీరు చేసారు కదా. ఇక మాట్లాడే ఆవశ్యకతే లేదు. ఏవిధంగా మాట్లాడటంతో విషయాన్ని స్పష్టము చేస్తారో అలా సంకల్పము ద్వారా మొత్తము కార్యవ్యవహారము నడవాలి. ఎంతెంతగా అనుభవము చేసుకుంటూ ఉంటారో, ఇతరులకు సమీపంగా వస్తూ ఉంటారో అంతగా సంకల్పాలు కూడా ఇతరులతో కలుస్తూ ఉంటాయి. ప్రకాశరూపము ఉండటము ద్వారా వ్యర్థ సంకల్పము, వ్యర్థ సమయము సమాప్తము అయిపోయిన తరువాత ఏది జరగవలసి ఉందో ఆ సంకల్పమే తలెత్తుతుంది. మీ బుద్ధిలో కూడా అదే సంకల్పము వస్తుంది మరియు ఎవరు చెయ్యవలసి ఉందో వారి బుద్ధిలో కూడా దీనినే చెయ్యాలి అన్న సంకల్పమే కలుగుతుంది. నవీనత అంటే ఇదే కదా! ఈ వ్యవహారమును చూసినవారు, వీరి కార్యవ్యవహారమంతా మాటలతో కాకుండా, సంకేతాల ద్వారానే జరుగుతుంది, దృష్టితో చూసారు, అర్థమైపోయింది అని భావిస్తారు. సూక్ష్మవతనము ఇక్కడనే తయారు చెయ్యాలి. అటువంటి అభ్యాసమును చేయిస్తారా? ఇప్పటివరకు భాషణ చెయ్యటమును నేర్పించినట్లు టీచర్లకు ఇప్పుడు ఇది నేర్పిస్తారా? మీ స్టేజ్ మీది, మీరు ఆ స్టేజ్ ను దాటేసారు. నంబర్ వారీగా అయితే ఉంటారు కదా! భవిష్యత్తులో సింహాసనము, కిరీటమును పొంది మళ్ళీ వదిలేసి పోతారు కదా. అప్పుడు ఇతరులు వాటిని తీసుకుంటారు. ఇక్కడ కూడా మీరు స్టేజ్ ను దాటి వెళ్ళిపోతుంటారు, అప్పుడు ఇతరులు ఆ స్టేజ్ కు వస్తారు. భవిష్య రూపురేఖలు ఇక్కడ నడుస్తాయి కదా! ఆ స్టేజ్ నుండి ఎటువంటి లగనము దృఢంగా కలుగుతుందంటే, వారు తప్ప మరెవ్వరూ మంచిగా అనిపించరు. కోరుకోకపోయినా కూడా పదే పదే ఆ వైపుకు వెళ్తారు. అచ్ఛా!

Comments