22-10-1970 అవ్యక్త మురళి

* 22-10-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంపూర్ణస్థితికి గుర్తు  “నిండుతనానికి గుర్తు - మచ్చ లేకుండుట."లోపం లేనివారిగా అవ్వటం.

        మాస్టర్ జానీ జానన్ హార్(సర్వమూ తెలిసినవారు)గా అయ్యారా? మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ (జ్ఞాన సంపన్నులు)గా అయ్యారా? మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అవ్వటం ద్వారా జ్ఞానమునంతటినీ తెలుసుకున్నారా? మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ లుగా, మాస్టర్ జానీ జానన్ హార్ అయిపొయ్యారా లేక అవుతూ ఉన్నారా? ఇప్పటివరకు కూడా అవుతూ ఉన్నారా? నాలెడ్జ్ ఫుల్ గా అయ్యారా లేక నాలెడ్జ్ ఫుల్ గా అవుతున్నారా? నాలెడ్జ్ ఫుల్ గా అవుతున్నారా లేక బ్లిస్ ఫుల్ (ఆనందమయం)గా అవుతున్నారా? అవుతున్నారా లేక అయిపొయ్యారా? (అవుతున్నాము). ఎంతవరకైతే అంతిమ స్థితిని సాకారరూపములో చూసారో అంతవరకు నాలెడ్జ్ ఫుల్ గా, జానీ జానన్ హార్ గా అయ్యారా? సాకారతండ్రి సమానంగా అవ్వటంలో అంతరము మిగిలిపోయింది. కావుననే ఫుల్ (సంపూర్ణము) అని అనరు. ఎంతవరకు ఫుల్ గా అవ్వాలి అన్నదానికి  ఎగ్జాంపుల్(ఉదాహరణ) స్పష్టంగా ఉంది కదా! ఎక్కువగా మాస్టర్ రచయిత నషాలో ఉంటున్నారా లేక రచన నషాలో ఉంటున్నారా? ఏ నషాలో ఎక్కువ సమయము ఉంటున్నారు? ఈ రోజు ఈ ప్రశ్నను ఎందుకు అడిగారు? ఎంతవరకు ఫ్లాలెస్(మచ్చలేని విధం)గా ఉన్నారు అనగా ఫుల్ గా ఉన్నారు అని ఈ రోజు అన్ని రత్నాలను చూసి, పరిశీలించారు. ఒకవేళ ఫుల్ గా లేనట్లయితే ఫెయిల్. కావున ఈ రోజు ఫుల్ మరియు ఫెయిల్ రేఖలను చూసారు. కావుననే ఫుల్ గా అయ్యారా అన్న ప్రశ్నను అడిగారు. అన్ని విషయాలలో ఫుల్ గా ఉంటడము తండ్రి మహిమ కదా, కావున పిల్లలు కూడా మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అయితే అవ్వవలసిందే. కేవలము జ్ఞానములో కాదు, మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అవ్వాలి. కావున మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అయ్యారా అన్న ప్రశ్నను కూడా అడిగారు. మాస్టర్లు కదా! మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ లో కూడా ఉండలేరా? ఒకవేళ మీకు రెండు లెక్కలు ఉంటే బాప్ దాదాకు కూడా రెండు రహస్యాలు ఉన్నాయి. ఈ రోజు ఒక్కొక్కరిలో మూడు విషయాలను విశేష రూపములో చూసారు. ఈ రోజు అమృతవేళలోని దినచర్యలో ఏం చూసారు అన్నదానిని వినిపిస్తున్నాము. ఈ రోజు బాప్ దాదా ఒక్కొక్క రత్నములో మూడు విషయాలను చూసారు. అవి ఏవి? వీరు కూడా ఒక డ్రిల్లును చేయిస్తారు. ఈ రోజు ఈ మూడు విషయాలను చూసారు ఒకటి ప్రతి ఒక్కరి లైట్, రెండు మైట్(శక్తి), మూడవది రైట్. రైట్ అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి రైట్ ను యథార్థమునకు వాడుతారు, రెండవది రైట్ అని అధికారమును గూర్చి వాడతారు. రైట్ గా, అధికారిగా కూడా ఎంతమంది తయారయ్యారు మరియు తోడుతోడుగా యథార్థరూపములో ఎంతవరకు ఉన్నారు? కావున లైట్, మైట్, మరియు రైట్. ఈ మూడు విషయాలను చూసారు. రిజల్టు ఏం వెలువడిందో దానిని కూడా చెప్తారు. ఇప్పుడు చాలా సేవను చేసారు కదా! మరి దాని రిజల్టును చూసారు. ఇప్పటివరకు కేవలము శబ్దము వ్యాపించే వరకు రిజల్టు ఉంది. శబ్దమును వ్యాపింపచేయటంలో పాస్ అయ్యారు, కానీ ఆత్మలను తండ్రి సమీపంగా తీసుకువచ్చేందుకు ఆహ్వానమును ఇప్పుడు చెయ్యాలి. శబ్దము వ్యాపించింది కానీ ఆత్మల ఆహ్వానమును చెయ్యాలి. ఆహ్వానము చెయ్యటము మరియు తండ్రి సమీపంగా తీసుకురావటము ఇప్పుడు ఈ పురుషార్థము మిగిలియుంది. ఎందుకంటే స్వయముకూడా శబ్దము నుండి దూరంగా ఉండాలనే కోరిక కలవారిగా ఉన్నారు. అభ్యాసులుగా కాదు. కావున శబ్దముతో శబ్దము వ్యాపిస్తుంది. కానీ ఎంతగా స్వయం శబ్దము నుండి దూరంగా అయ్యి మీలో సంపూర్ణతను ఆహ్వానము చేస్తారో అంతగా ఆత్మల ఆహ్వానమును చెయ్యగలరు. ఇప్పుడు ఆహ్వానమునైతే చేస్తున్నారు కూడా. కానీ రిజల్టు రాకపోకలలో ఉంది. రాకపోకలలోకి వస్తూ ఉన్నారు కూడా, పోతూ ఉన్నారు కూడా. కానీ ఆహ్వానము తరువాత ఆహుతి అయిపోవటము, ఈ పనిని ఇప్పుడు చెయ్యాలి. నాలెడ్జ్ కు ఆకర్షితమవుతున్నారు కానీ నాలెడ్జ్ ఫుల్ పైన ఆకర్షితము చెయ్యాలి. ఇప్పటివరకు మాస్టర్ రచయితలు అక్కడక్కడ రచన ఆకర్షణలో ఆకర్షితమవుతున్నారు. కావున ఎవరు ఎంతగా మరియు  ఎలా స్వయం ఉన్నారో అంతగానే మరియు అలానే ఋజువును ఇస్తున్నారు. ఇప్పటివరకు శక్తిరూపము,  శూరవీరతా స్వరూపము దృష్టి-వృత్తిలో లేదు. శక్తి మరియు శూరవీరతతో కూడిన ముఖము ఎలా కనిపించాలంటే , ఆసురీ లక్షణాలు కలిగినవారు ఎవరు కూడా ధైర్యమును ఉంచలేకపోవాలి. కానీ ఇప్పటివరకు ఆసురీ లక్షణాలతో పాటు, ఆసురీ లక్షణాలు కలిగినవారు కూడా అక్కడక్కడా ఆకర్షితము చేస్తున్నారు. వాయుమండలము అలా ఉంది, వైబ్రేషన్లు అలా ఉన్నాయి లేక సమస్య అలా ఉంది, కావుననే ఓటమి కలిగింది అని దీనిని రాయల్ మాయరూపములో మీరు అంటారు. కారణము ఇవ్వటము అంటే స్వయమును కారాగారములోకి ప్రవేశింపజేయటము. ఇప్పుడు సమయము గడచిపోయింది, ఇప్పుడు ఇక కారణమును వినరు. చాలాకాలము కారణమును విన్నారు, కానీ ఇప్పుడు ప్రత్యక్ష కార్యమును చూడాలి, కారణమును కాదు. ఇప్పుడు కొద్ది సమయములో ధర్మరాజు రూపమును ప్రత్యక్షముగా అనుభవము చేస్తారు. ఎందుకంటే ఇది అంతిమ సమయము. ఇంత సమయము తండ్రి రూపంలో కారణాన్ని విన్నారు, స్నేహాన్ని కూడా ఇచ్చారు, దయ చూపించారు, చాలా క్షమించారు కూడా,కానీ ఇప్పుడు ఈ రోజులు చాలా తక్కువ అయిపోయాయి అని అనుభవము చేస్తారు. తరువాత ఒక్క పొరపాటు సంకల్పమునకు, ఒకటికి వందరెట్లు దండన ఎలా లభిస్తుంది అన్నదానిని కూడా అనుభవము చేస్తారు. ఇప్పుడిప్పుడే చేసారు మరియు ఇప్పుడిప్పుడే దాని ఫలము లేక దండనను ప్రత్యక్ష రూపములో అనుభవము చేస్తారు, ఇప్పుడు ఆ సమయము చాలా త్వరగా వచ్చేస్తూంది. కనుకనే బాప్ దాదా సూచనను ఇస్తున్నారు, ఎందుకంటే ఎంతైనా కూడా బాప్ దాదా పిల్లల స్నేహీలు కదా!

         ఇప్పుడు మాస్టర్ రచయితత్వపు నషాను ధారణ చేసి రచన యొక్క సర్వ ఆకర్షణల నుండి మిమ్మల్ని మీరు దూరము చేసుకుంటూ వెళ్ళండి. తండ్రి ముందు రచనయే కానీ, ఇప్పుడు ఎటువంటి సమయము వచ్చేదుందంటే ఎవరైతే మాస్టర్ రచయిత, మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ లుగా అయ్యి ఆ ఆకర్షకమైన శక్తి శాలీ స్థితిలో స్థితులై ఉండనట్లయితే రచన ఇంకా భిన్న-భిన్న రంగులను, రూపాలను రచిస్తుంది. కావున ఫుల్ గా అయ్యేందుకు స్టేజ్ పై పూర్తిగా స్థితులైనట్లయితే ఇక ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వరు. ఇప్పుడు చిన్నతనపు పొరపాట్లు, నిర్లక్ష్యపు పొరపాట్లు, సోమరితనపు పొరపాట్లు, లెక్కలేనితనపు పొరపాట్లు మిగిలి ఉన్నాయి. సత్యయుగ ప్రపంచములో మరచిపోయినట్లుగా ఈ నాలుగురకాల పొరపాట్లను మరచిపోవాలి. కావున అటువంటి పవర్‌ఫుల్ శక్తిస్వరూపము, శస్త్రధారీ స్వరూపము, సదా వెలుగుతున్న జ్యోతి స్వరూపమును మీ ప్రత్యక్ష రూపముగా చూపించండి. ఇప్పుడు మీ మీ భక్తులు గుప్త వేషధారీ దేవతలైన మిమ్మల్ని మరల పొందేందుకు తపిస్తూ ఉన్నారు. మీ సంపూర్ణ మూర్తి ప్రత్యక్షమైనప్పుడే మీ భక్తులు ప్రత్యక్ష రూపములో తమ ఇష్టులను పొందగలరు. ఇప్పుడైతే అనేకరకాలుగా ఉన్నారు. శబ్దమునైతే వింటారు, కానీ ఒకవైపు ఆసురీ ఆత్మల శబ్దము ఇంకా కూడా ఆకర్షక రూపంలో మరియు ఫుల్ ఫోర్స్ లో ఉంటుంది. మరొకవైపు మీ భక్తుల శబ్దము కూడా అనేక రకాలుగా ఇంకా ఫుల్ ఫోర్స్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో ఏం తీసుకురావాలి మరియు ఏం తీసుకురాకూడదు అన్నదానిని పరిశీలించటము బుద్ధి పని. కావున ఇప్పుడు రియాయత్ (క్షమించే) సమయము గడచిపోయింది, ఇప్పుడు ఇది రుహానియత్(ఆత్మికత) సమయము. ఇప్పుడు ఆత్మికత లేనట్లయితే భిన్న-భిన్న రకాల మాయ దృశ్యాలలో వచ్చేస్తారు. కావున బాప్ దాదా ఈ రోజు మళ్ళీ సూచనను ఇస్తున్నారు. ఏవిధంగా మిలట్రీ మార్షల్ లు మొదట ఒక విజిల్ ను మ్రోగిస్తారు, మరల ఫైనల్ లో లాస్ట్ విజిల్ ను మ్రోగిస్తారు. మరి ఈ రోజు నాజూకు సమయపు సూచన యొక్క మొదటి విజిల్ ఇది. తయారైపోవాలని విజిల్ మ్రోగిస్తారు. కావున ఇప్పుడు పరీక్షల పేపరును ఇచ్చేందుకు సిద్ధమైపోండి. బాప్ దాదా అయితే అవ్యక్తమయ్యారు, మనం వ్యక్తములో ఏమైనా చెయ్యచ్చు అని కాదు. ప్రతిఒక్కరి ఒక్కొక్క క్షణములోని సంకల్ప చిత్రము అవ్యక్త వతనములో స్పష్టమౌతూ ఉంటుంది. కావున నిర్లక్ష్యులుగా అవ్వవద్దు. ఈశ్వరీయ మర్యాదలలో నిర్లక్ష్యులుగా అవ్వవద్దు, ఆసురీ మర్యాదలు మరియు మాయలను లక్ష్యపెట్టకండి, అంతేకానీ ఈశ్వరీయ మర్యాదల నుండి నిర్లక్ష్యులుగా అవ్వవద్దు. లక్ష్యపెట్టనివారి కొన్నికొన్ని ప్రవాహాలు వతనము వరకు చేరుకుంటాయి. కావుననే ఈరోజు బాప్ దాదా మళ్ళీ గుర్తు తెప్పిస్తున్నారు. సంపూర్ణతను సమీపంగా తీసుకురావాలి, సమస్యలను దూరంగా తరిమికొట్టాలి మరియు సంపూర్ణతను సమీపంగా తీసుకురావాలి. ఒక్కోచోట సంపూర్ణతకు బదులుగా సమస్యలను చాలా ముందు ఉంచుతారు. సమస్యలను ఎదుర్కొన్నట్లయితే సమస్య సమాప్తమైపోతుంది. ఎదుర్కోవటము రానట్లయితే ఒక సమస్య నుండి అనేక సమస్యలు వచ్చేస్తాయి. పెరగటంతోనే అంతము చేసినట్లయితే వృద్ధి చెందవు. సమస్యను వెంబడే సమాప్తము చేసినట్లయితే ఇక మళ్ళీ వంశము ఉత్పన్నమవ్వదు. అంశము ఉన్నట్లయితే వంశమైపోతుంది. అంశమునే సమాప్తము చేసినట్లయితే ఇక వంశము ఎక్కడినుండి వస్తుంది! కావున అర్థమైందా, సమస్యల జన్మను కంట్రోల్ చెయ్యాలి. ఇప్పుడు సూచనతో అంటున్నారు మరల అందరూ ప్రత్యక్ష రూపంలో మీ స్థితిని చెప్పుకొంటారు. దాగి ఉండజాలరు. నారదుని ముఖము సభముందు దాగిందా? ఇప్పుడైతే బాబా గుప్తముగా ఉంచుతున్నారు, కాని కొద్ది సమయము తరువాత గుప్తముగా ఉండజాలదు. వారి ముఖము చరిత్రను ప్రత్యక్షము చేస్తుంది. సైన్స్ లో ఈ రోజుల్లో ఏవిధంగా ఏ గుప్త వస్తువైనా ప్రత్యక్షమైపోయే విధముగా ఇన్వెన్షన్లు చేస్తూ వెళ్తున్నారో, అలాగే సైలెన్సు శక్తికి కూడా స్వతహాగనే ప్రత్యక్ష రూపమైపోతుంది. చెప్పటము మరియు చెయ్యటము ద్వారా అవ్వదు. అర్థమైందా?

         కావున భవిష్య సమయపు సూచనను ఇస్తున్నారు. కావున ఇప్పుడు నాజూకు నమయమును ఎదుర్కొనేందుకు నాజూకుతనమును వదలాలి, అప్పుడే నాజూకు సమయమును ఎదుర్కోగలరు. అచ్ఛా! హర్షితముఖంగా ఉండేందుకు ఏ గుణమైతే ఉందో అది పురుషార్థములో చాలా సహాయకారిగా అవ్వగలదు. ఏవిధంగా ముఖము హర్షితంగా ఉంటుందో అలా ఆత్మ కూడా ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి. ఈ సహజ గుణమును ఆత్మలోకి తీసుకురావాలి. సదా హర్షితంగా ఉన్నట్లయితే ఎటువంటి మాయ ఆకర్షణ ఉండదు. ఇది తండ్రి ఇచ్చే గ్యారంటీ. కానీ ఎప్పుడైతే ఆత్మను సదా హర్షితంగా ఉంచుకుంటారో అప్పుడే అది అవుతుంది. అప్పుడు మాయ ఆకర్షణ నుండి దూరంగా ఉంచటము తండ్రి పని. ఈ గ్యారంటీని తండ్రి మీకు విశేషంగా ఇస్తున్నారు, అందరికి ఇవ్వటం లేదు, ఎందుకంటే ఎవరైతే ఆది రత్నాలుగా ఉంటారో వారితో ఆదిదేవునకు విశేష స్నేహము ఉంటుంది. కావున ఆదిని అనాది చెయ్యండి. ఎప్పుడైతే అనాదిగా అయిపోతారో అప్పుడిక మాయ ఆకర్షణ ఉండదు. సమస్యలు ఎదురుగా రావు. ఎప్పుడైతే తండ్రి స్నేహము స్మృతిలో ఉంటుందో అప్పుడు సర్వ శక్తివంతుని స్నేహము ముందు ఈ మాయ ఎంత? ఎక్కడ ఆ స్నేహము మరియు ఎక్కడ సమస్య? అది ఆవగింజ, ఇది పర్వతము. అంత అంతరము ఉంది. కావున అనాది రత్నంగా అయ్యేందుకు సర్వశక్తివంతుని శక్తి మరియు స్నేహమును ఎల్లప్పుడూ తోడుగా ఉంచుకోవాలి. మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరివారిగా భావించవద్దు. సహచరుడు లేకుండా జీవితంలో ఒక్క క్షణము కూడా ఉండకూడదు. స్నేహీ సహచరులు ఎప్పుడూ వేరుగా ఉండరు సహచరుని తోడుగా పెట్టుకోనందువలన, ఒంటరిగా ఉన్నందువలన మాయ గెలిచేస్తుంది. అచ్ఛా!

Comments