22-07-1972 అవ్యక్త మురళి

* 22-07-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“నష్టోమోహులుగా అయ్యేందుకు భిన్న భిన్న యుక్తులు"

             ప్రతి ఒక్కరూ స్వయమును స్మతిస్వరూపులుగా భావిస్తున్నారా? స్మృతి స్వరూపులుగా అయిపోవడం ద్వారా స్థితి ఎలా తయారవుతుంది మరియు ఎప్పుడు తయారవుతుంది? ఎప్పుడైతే నష్టోమోహులుగా అయిపోతారో అప్పుడు స్మృతి స్వరూపులుగా అవుతారు. కావున ఈ విధంగా నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అయ్యారా లేక ఇప్పటికీ విస్మృతి స్వరూపులుగా ఉన్నారా? స్మృతి స్వరూపుల నుండి విసృతి స్వరూపంలోకి ఎందుకు వచ్చేస్తారు? తప్పకుండా ఏదో ఒక మోహము అనగా ఆకర్షణ ఇప్పటివరకు మిగిలి ఉంది. కావున బాబాతో మొట్టమొదట ఇతర సాంగత్యాలను వదిలి ఒకే సాంగత్యాన్ని జోడిస్తాము అన్న ప్రతిజ్ఞనేదైతే చేశారో ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం రాదా? మొదటి ప్రతిజ్ఞనే నిలబెట్టుకోకపోతే మొదటి నెంబర్ లోని రాజ్య అధికారులుగా లేక రాజ్యసంబంధంలోకి ఎలా వస్తారు? మరుజన్మలోని రాజ్యంలోకి వస్తారా? నష్టోమోహులుగా అయ్యే మొట్టమొదటి ప్రతిజ్ఞను ఎవరైతే నిలబెట్టుకుంటారో వారు మొదటి జన్మలోని రాజ్యంలోకి వస్తారు. మొదటి ప్రతిజ్ఞ అనండి లేక మొదటి పాఠము అని అనండి లేక జ్ఞానపు మొదటి విషయము అనండి లేక అలౌకిక జన్మ యొక్క శ్రేష్ఠ సంకల్పము అనండి, దీనిని నిర్వర్తించడం కష్టమనిపిస్తుందా? మీ స్వరూపంలో స్థిరవ్వడం లేక మీ స్మృతిలో ఉండడం ఇది ఏదైనా జన్మలో కష్టమనిపించిందా? సహజముగానే స్మృతిలోకి రావడం ద్వారా స్మృతి స్వరూపులుగా అవుతూ వచ్చారు కదా! కావున ఈ అలౌకిక జన్మ యొక్క స్వస్వరూపమును స్మృతిలో ఎందుకు కష్టముగా అనుభవం చేసుకుంటున్నారు? దీనిని గూర్చి మనుష్య ఆత్మలు ఏది కావాలనుకుంటే అది చేయగలిగే విశేషత వారికి ఉంది అని సాధారణ మనుష్యులను గూర్చి కూడా ఎందుకు అంటారు. పశువులకు మరియు మనుష్య ఆత్మలకు మధ్య ఉన్న తేడా ఇదే. కావున ఎప్పుడైతే సాధారణ మనుష్య ఆత్మలు ఏది కావాలనుకుంటే అది చేసి చూపించగలుగుతున్నారో అప్పుడిక శ్రేష్ఠ మనుష్య ఆత్మలైన మీరు, శక్తిస్వరూప ఆత్మలు, జ్ఞానస్వరూప ఆత్మలు, బాబా సమీప సంపర్కంలోకి వచ్చే ఆత్మలు, బాబా డైరెక్ట్ పాలనను తీసుకునే ఆత్మలు, పూజ్యనీయ ఆత్మలు, బాబా కన్నా శ్రేష్ఠమైన పదవిని పొందే ఆత్మలు ఏది కావాలనుకుంటే అది చేయలేరా? కావున సాధారణమైనదానికి మరియు శ్రేష్ఠమైనదానికి తేడా ఎందుకు ఉంది? సాధారణ ఆత్మలు ఏది కావాలనుకుంటే అది చేయగలరు. కాని, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలనుకుంటే అలా చేయలేరు ఎందుకంటే వారిలో ప్రకృతి శక్తి ఉందే కాని ఈశ్వరీయ శక్తి లేదు. ఈశ్వరీయ శక్తి గల ఆత్మలు ఏది కావాలనుకుంటే అది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలనుకుంటే అలా చేయగలరు. కావున ఏ విశేషత అయితే ఉందో దానిని ప్రాక్టికల్ లోకి తీసుకురాలేరా లేక మీరు ఇప్పటివరకు కూడా మేమైతే కోరుకోవడం లేదు కాని జరిగిపోతోంది, ఏదైతే కోరుకుంటున్నామో అది చేయలేకపోతున్నాము అని అంటున్నారా? ఈ మాటలు మాస్టర్ సర్వశక్తివంతులు లేక శ్రేష్ఠ ఆత్మలవి కావు, ఇవి సాధారణ ఆత్మలవి. మరి మీరు స్వయాన్ని సాధారణ ఆత్మలుగా భావిస్తున్నారా? మీ అలౌకిక జన్మను, అలౌకిక కార్యమును మరిచిపోతున్నారా? ఏ వస్తువు లేక ఏ వ్యక్తి యొక్క ఎటువంటి వ్యక్తభావంతోను మోహం ఎందుకు ఉంటుంది? ఏ వస్తువునైతే చూస్తారో ఆ వస్తువులతో పోల్చి చూస్తే అలౌకిక జన్మ యొక్క ప్రాప్తి ఏదైతే లభించిందో దానికి మరియు ఈ వస్తువులకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా అనుభవమవ్వలేదా? వ్యక్తభావము ద్వారా ప్రాప్తించిన దు:ఖము, అశాంతి యొక్క అనుభవము ఇప్పటివరకు ఇంకా పూర్తిచేయలేదా? ఏ వ్యక్తులనైతే చూస్తారో ఆ సర్వవ్యక్తులతో పాత ప్రపంచపు సంబంధాలను ఈ అలౌకిక జన్మతో సమాప్తము చేయలేరా? ఎప్పుడైతే క్రొత్త జన్మ లభించిందో అప్పుడిక ఏ వ్యక్తులనైతే చూస్తారో ఆ సర్వవ్యక్తులతో, పాత జన్మ యొక్క వ్యక్తులతో పాత సంబంధాలు సమాప్తమైపోలేదా? క్రొత్త జన్మలో పాత సంబంధాల మోహము ఎక్కడైనా ఉంటుందా? మరి వ్యక్తులతో కూడా మోహమును ఎలా ఉంచగలరు? జన్మయే మారిపోయినప్పుడు ఆ జన్మతో పాటు సంబంధాలు మరియు కర్మలు మారవా లేక ఇప్పటివరకు ఇంకా అలౌకిక జన్మను తీసుకోలేదు అనైనా అనండి. సాధారణరీతిగా కూడా ఎక్కడైతే జన్మ లభిస్తుందో ఆ జన్మ అనుసారంగానే కర్మలు జరుగుతాయి, సంబంధ సంపర్కాలు ఉంటాయి. మరి ఇక్కడ జన్మ అలౌకికంగా మరియు సంబంధాలు లౌకికంగా ఎందుకు ఉన్నాయి మరియు కర్మలు మళ్ళీ అలౌకికంగా ఎందుకు ఉన్నాయి? మరి ఇప్పుడు నష్టోమోహులుగా అవ్వడము సహజమా లేక కష్టమా చెప్పండి! కష్టముగా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఏ సమయంలోనైతే మోహము ఉత్పన్నము అవుతుందో ఆ సమయంలో మీ ముఖము చూసుకోరు. మీకు అద్దమైతే లభించింది కదా! ఆ అద్దము మీతో పాటు ఉండదా? ముఖాన్ని చూసుకున్నట్లయితే మోహము అంతమైపోతుంది. ఇది చూసే అభ్యాసము ఉన్నట్లయితే అభ్యాసము తర్వాత వద్దనుకున్నాక కూడా పదే పదే స్వతహాగానే అద్దము వైపుకు ఆకర్షితులవుతారు. స్థూలముగా కొందరికి పదే పదే అద్దములో చూసుకునే అలవాటు ఉంటుంది. చూసుకోవాలి అని నిర్ధారించుకోరు కాని దానంతట అదే అద్దం వైపుకు వెళ్ళిపోతారు ఎందుకంటే అభ్యాసము ఉంటుంది. అలాగే ఇది కూడా జ్ఞానమురూపీ దర్పణంలో తమ స్వమానమురూపీ దర్పణంలో పదే పదే చూసుకుంటూ ఉన్నట్లయితే వెంటనే దేహాభిమానం నుండి , స్వమానంలోకి వచ్చేస్తారు.

           ఏ విధంగా స్థూల శరీరంలో ఏదైనా తేడా తెలిస్తే అద్దంలో చూసుకోవడం ద్వారా దానిని వెంటనే సరిచేసుకోగలరో అలాగే ఈ అలౌకిక దర్పణంలో వాస్తవిక స్వరూపమేదైతే ఉందో దానిని చూసుకోవడం ద్వారా, దేహాభిమానంలోకి రావడం ద్వారా వ్యర్థ సంకల్పాల స్వరూపము, వ్యర్థమైన మాటల స్వరూపము లేక వ్యర్ధ కర్మలు లేక సంబంధాల స్వరూపమును స్పష్టముగా చూడడం ద్వారా వ్యర్థమును సమర్థములోకి మార్చివేస్తారు మళ్ళీ అప్పుడు ఈ మోహము ఉంటుందా? అలాగే ఎప్పుడైతే నష్టోమోహులుగా అయిపోతారో  అప్పుడిక నష్టోమోహాతో పాటు సదా స్మృతి స్వరూపులుగా స్వతహాగానే అయిపోతారు, మరి ఇది సహజము కాదా? ఎప్పుడైతే సర్వప్రాప్తులు ఒక్కరి ద్వారా లభిస్తాయో అప్పుడు అందులో తృప్త ఆత్మలుగా అవ్వరా? ఏదైనా అప్రాప్త వస్తువు లభించినప్పుడే తృప్తులుగా అవ్వరు, మరి మీకు సర్వప్రాప్తుల అనుభవము కలగడం లేదా? ఇప్పుడు తృప్త ఆత్మలుగా అవ్వలేదా? ఏదైతే తండ్రి ఇవ్వగలరో దానిని ఈ వినాశీ ఆత్మలు ఇన్ని జన్మలలో ఇవ్వగలిగారా? ఎప్పుడైతే అనేక జన్మలలో కూడా అనేక ఆత్మలు ఆ వస్తువులను, ఆ ప్రాప్తిని జయించలేకపోయారు మరియు బాబా ద్వారా ఒకే జన్మలో ప్రాప్తి లభిస్తుంది, మరి బుద్ధి ఎటువైపుకు వెళ్ళాలో చెప్పండి! భ్రమింపచేసేవారిలో, ఏడిపించేవారిలో, తిరస్కరించేవారిలోకి వెళ్ళాలా లేక ఆధారమునిచ్చేవారిలోకి వెళ్ళాలా? ఏ విధంగా మీరు ఇతర ఆత్మలతో చాలా ప్రశ్నలు అడుగుతారో అలాగే బాబా కూడా ఆత్మలైన మిమ్మల్ని ఈ ఒక్క ప్రశ్న అడుగుతారు. ఈ ఒక్క ప్రశ్నకు జవాబును ఇప్పటివరకు ఇవ్వలేకపోయారు. ఎవరైతే ఈ ఒక్క ప్రశ్నకు జవాబును ఇచ్చారో వారు సదాకాలికంగా ప్రసన్నంగా ఉంటారు. ఎవరైతే జవాబును ఇవ్వలేదో వారు పదే పదే దిగే కళలో దిగుతూనే ఉంటారు.

           నష్టోమోహులుగా అయ్యేందుకు మీ స్మృతి స్వరూపమును మార్చవలసి ఉంటుంది. మేము గృహస్థులము అన్న స్మృతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మోహము అటువైపుకు వెళుతుంది. మా ఇల్లు, మా సంబంధాలు ఉన్నాయి అని ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు అటువైపుకు మోహము వెళుతుంది. కావున ఈ హద్దులోన బాధ్యతలను బేహద్ బాధ్యతలలోకి పరివర్తన చేసుకున్నట్లయితే బేహద్ బాధ్యతల ద్వారా హద్దులోని బాధ్యతలు స్వతహాగానే పూర్తయిపోతాయి. ఈ బేహద్ ను మరిచి హద్దులోని బాధ్యతలను నిర్వర్తించేందుకు ఎంతగా సమయమును మరియు సంకల్పాలను వెచ్చిస్తారో అంతగానే వాటిని నిర్వర్తించేందుకు బదులుగా అవి పాడైపోతూ ఉంటాయి. మేము బాధ్యతను నిర్వర్తిస్తున్నాము లేక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాము అని భావిస్తారు. కాని, అది నిర్వర్తించడము లేక సంభాళించడము కాదు.

           ఇంకా తమ హద్దులోని స్మృతిలో ఉన్న కారణంగా ఆ నిమిత్తమై ఉన్న ఆత్మల భాగ్యము తయారయ్యేందుకు బదులుగా దానిని పాడుచేసుకునేందుకు నిమిత్తులుగా అవుతారు. అప్పుడిక ఆ ఆత్మలు కూడా మీ అలౌకిక నడవడికను చూడకుండా అలౌకిక తండ్రితో సంబంధాన్ని జోడించడంలో వంచితమైపోతారు. కావున బాధ్యతకు బదులుగా ఇంకా తమలో తామే మర్జ్  అయిపోతారు. ఇది మోహము యొక్క మర్జ్ మరియు అదే దు:ఖము అనేక ఆత్మలలో కూడా స్వతహాగానే ఏర్పడిపోతుంది. కావున దేన్నైతే బాధ్యతగా భావిస్తున్నారో అది  బాధ్యత రూపం నుండి మారి దు:ఖరూపంగా అయిపోతుంది. కావున సదా మీ ఈ స్మృతి పరివర్తన చేసే పురుషార్థమును చేయండి. నేను పురుషార్థిని, ఫలానా బంధనగల ఆత్మను లేక నేను ఫలానా బాధ్యతగలవాడిని అని భావించేందుకు బదులుగా మీ ముఖ్యమైన ఐదు స్వరూపాలను స్మృతిలోకి తీసుకురండి. ఏవిధంగా పంచముఖీ బ్రహ్మను చూపిస్తారో అలాగే త్రిముఖ, పంచముఖ బ్రహ్మలను కూడా చూపిస్తారో అలా బ్రాహ్మణులైన మీరు కూడా ఐదు ముఖ్య స్వరూపాల స్మృతిలో ఉన్నట్లయితే ఈ దు:ఖాలు తొలగిపోయి విశ్వకళ్యాణకారీ బాధ్యతలో ముందుకు వెళ్ళిపోతారు. ఆ స్వరూపం ఏమిటి? ఏ స్మృతి స్వరూపంలో ఉండడం ద్వారా ఈ రూపాలన్నీ మర్చిపోగలరు? స్మృతిలో ఉంచుకోవలసిన ఐదు స్వరూపాలను గూర్చి తెలియజేయండి. ఏవిధంగా బాబా యొక్క మూడు రూపాలను తెలియజేస్తారో అలా మీ యొక్క ఐదు రూపాలు- 1. నేను బాబా సంతానమును, 2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, 3. నేను ఆత్మిక యాత్రికుడను, 4. యోద్ధుడను మరియు 5. ఈశ్వరీయ సేవాధారిని, ఈ ఐదు స్వరూపాలు స్మృతిలో ఉండాలి. ఉదయం లేవగానే బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తారు కదా! పిల్లల రూపంలో బాబాతో మిలనము జరుపుతారు కదా! కావున ఉదయం లేవడంతోనే నేను బాబా సంతానమును అన్న స్వరూపము గుర్తుండాలి అప్పుడిక గృహస్థము ఎక్కడి నుండి వస్తుంది? అలాగే ఆత్మ బాబాతో మిలనము జరపాలి. మిలనముతో సర్వప్రాప్తుల అనుభవము కలగాలి అప్పుడిక బుద్ధి అటూ ఇటూ ఎందుకు వెళుతుంది? దీని ద్వారా అమృతవేళ యొక్క ఈ మొదటి స్మృతిలోనే బలహీనత ఉందని కావుననే తమ దిగే కళ యొక్క రూపము సృతిలోకి వస్తుందని నిరూపణ అవుతుంది. అలాగే మొత్తం రోజంతటిలో ఈ ఐదు రూపాలు సమయ ప్రతి సమయము భిన్న భిన్న కర్మల అనుసారంగా వృతిలో ఉంచుకున్నట్లయితే స్మృతి స్వరూపులుగా అవ్వడం ద్వారా నష్టోమోహులుగా అవ్వరా? కావున కష్టానికి కారణం ముఖమును చూసుకోవడం లేదు అని తెలియజేయడం జరిగింది. కావున ఎల్లప్పుడూ కర్మ చేస్తూ మీ దర్పణంలో ఈ స్వరూపాలను చూసుకోండి. ఈ స్వరూపాలకు బదులుగా ఇతర స్వరూపాలు రాలేదు కదా, రూపము పాడైపోలేదు కదా అని పరిశీలించుకోండి. చూసుకోవడం ద్వారా పాడైపోయిన రూపమును తీర్చిదిద్దుకోగలరు మరియు సహజముగానే సదాకాలికంగా నష్టోమోహులుగా అయిపోతారు, అర్థమైందా? ఇప్పుడిక నష్టోమోహులుగా ఎలా అవుతాము అనైతే అనరు కదా! కాదు, నష్టోమోహులుగా ఇలా అవ్వండి, ఎలా అన్న పదమును ఇలా అన్న పదములోకి మార్చివేయాలి. మేమే ఇలా ఉండేవారము మళ్ళీ ఇప్పుడు ఇలా అవుతున్నాము అన్నది ఏ విధంగానైతే సృతిలోకి తెచ్చుకుంటారో అలా ఎలా అన్న పదమును ఇలా అన్న పదములోకి మార్చివేయాలి. ఎలా అవ్వాలి అనేందుకు బదులుగా ఇలా అవ్వాలి అని భావించాలి. ఇందులోకి పరివర్తన చేసుకున్నట్లయితే ఎలా ఉండేవారో అలా అయిపోతారు, ఎలా అన్న పదము సమాప్తమై ఇలా అయిపోతారు.

           అచ్ఛా- ఈ విధంగా క్షణంలో స్వయమును విస్మృతి నుండి స్మృతి స్వరూపంలోకి తీసుకువచ్చే నష్టోమోహుములకు, సదా స్మృతి స్వరూపులుగా అయ్యే సమర్థ ఆత్మలకు బాప్ దాదాల ప్రియసృతులు మరియు నమస్తే.

Comments