21-09-1975 అవ్యక్త మురళి

21-09-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఫరిస్తా అనగా వారికి ఒక్క బాబా తప్ప ఇతర ఆత్మలతో ఏ సంబంధం ఉండదు. 
  
               ఒకని ద్వారా సర్వ సంబంధాల యొక్క సుఖాన్ని అనుభూతి చేయించేవారు, కష్టాన్ని సహజం చేసేవారు, దేహ రూపి భూమి నుండి సదా అతీతంగా ఉండేవారు, చేసి చేయించే  శివబాబా మాట్లాడుతున్నారు -
             ఓహో నేను అనే నషా స్మృతి ఉందా? ఆ రోజులు, ఆ మెరుపు, ఆ నషా స్మృతిలోకి వస్తున్నాయా? నషా యొక్క ఆ రోజులు అలౌకికమైనవి. ఇలాంటి నషా యొక్క రోజులు స్మృతిలో రావడంతోనే నషా వచ్చేస్తుంది. ఎంత నషా, ఎంత సంతోషం వస్తుందంటే స్థూల పాదాలు కూడా సహజంగా నాట్యం చేస్తాయి. కార్యక్రమం ద్వారా నాట్యం కాదు, మనస్సులో కూడా నాట్యం మరియు తనువు కూడా సహజంగా నాట్యం చేస్తుంటుంది. ఇలాంటి సహజ నృత్యం నిరంతరం చేస్తున్నారా? కళ్ళ ద్వారా చూడడం, చేతులను కదపడం, పాదాలను కదిలించడం అన్ని సంతోషంగా సహజంగానే డాన్స్ చేస్తుంటాయి, దానిని ఫరిస్తాల నాట్యం అని అంటారు. ఇలాంటి నాట్యం చేస్తున్నారా? ఫరిస్తాల పాదం భూమిపై ఆనదు అని చెబుతారు కదా! అదేవిధంగా ఫరిస్తాలుగా అయ్యే ఆత్మలు కూడా ఈ దేహం అనే భూమి, ఎలాగైతే భూమి మట్టియో అలాగే ఈ దేహం కూడా మట్టియే కదా! కనుక ఫరిస్తాల యొక్క పాదం నేలపై ఉండదు అనగా ఫరిస్తాగా అయ్యే ఆత్మల యొక్క బుద్ధి రూపి పాదం ఈ దేహం అనే భూమిపై ఉండదు. ఫరిస్తా స్థితికి గుర్తు ఇదే. ఫరిస్తా స్థితికి ఎంతగా సమీపంగా వెళ్తుంటారో, అంతగా దేహ రూపీ భూమి నుండి పాదం స్వతహాగానే పైన ఉంటుంది. పాదం పైన ఉండడం లేదు భూమిపైన ఉంటుందంటే భారం ఉన్నట్టే. భారం గల వస్తువు పైన ఉండలేదు. తేలికతనం లేదు భారం ఉందంటే ఈ దేహ రూపీ భూమిపైకి మాటిమాటికి పాదం వచ్చేస్తుంది. అప్పుడు ఫరిస్తాగా అనగా తేలికగా కాలేరు. ఫరిస్తాల పాదం భూమి నుండి స్వతహాగానే అతీతంగా ఉంటుంది. అతీతం చేయరు కానీ అతీతంగా ఉంటుంది. ఎవరైతే తేలికగా ఉంటారో వారి గురించి చెబుతారు కదా. మీరు గాలిలో  ఎగిరిపోతున్నారని, నడవడం లేదు ఎగిరిపోతున్నారని. అదేవిధంగా ఫరిస్తాలు కూడా ఉన్నత స్థితిలో ఎగురుతూ ఉంటారు. ఇలాంటి సహజ సిద్ధమైన ఫరిస్తాల డ్యాన్స్ చూడడం మరియు చేయడంలో కూడా మజా వస్తుంది. మహారథీ టీచర్లు సహజ సిద్ధమైన ఫరిస్తాల నాట్యం చేస్తూ ఉంటున్నారు కదా! చేసిచేయించే శివబాబా తన ఎదురుగా కూర్చున్న టీచర్లను అడుగుతున్నారు.(ఎవరో అన్నారు బాబా.. మాయ యొక్క చేతులను వధించండి అని)
                    ఒకవేళ బాబా మాయ యొక్క చేతులు వధిస్తే ఎవరు వధిస్తారో వారు పొందుతారు. బాబా అయితే అన్నీ చేయగలరు. ఒక సెకెను యొక్క ఆర్డర్ అంతే. కానీ భవిష్యత్తును తయారుచేసుకునేవారి యొక్క భవిష్యత్తు ఏవిధంగా తయారవుతుంది? అందరి కోసం బాబా చేయాలా? లేక కేవలం మీకోసం చేయాలా? అందువలన నేపాల్ లో చిన్న పిల్లలకు కూడా చేతితో కత్తిని పట్టుకునేలాగా చేస్తారు, చేసేది స్వయం కానీ చేయి మాత్రం పిల్లలది ఉంటుంది. అలాగే బాబా కూడా ఇంత మాత్రం చేయగలరు. ధైర్యం అనే చేయి స్వయం తప్పకుండా ఇవ్వాలి. ఇంత మాత్రం అయితే చేయాలి కదా మీరు. ఇది టీచర్స్ యొక్క టాపిక్ రోజంతటిలో ఎంత సమయంలో ఫరిస్తాగా ఉంటున్నారు మరియు ఎంత సమయం మృత్యులోకం యొక్క మానవులుగా ఉంటున్నారు. దైవీ పరివారం యొక్క సంబంధంలోకి కూడా ఫరిస్తాలు రారు, వారు సదా అతీతంగా ఉంటారు. అన్ని సంబంధాలు ఎవరితో ఉంటాయి, ఒకవేళ ఎవరినైనా సఖునిగా చేసుకుంటే బాబాతో సఖుడు యొక్క సంబంధం తక్కువ అయిపోతుంది. ఏ సంబంధం అయినా కానీ సోదరి లేక సోదరుడు లేదా ఇతర ఏ సంబంధం మీరు జోడించినా కానీ ఒక్కనితో ఆ సంబంధం తక్కువ అయిపోతుంది.ఎందుకంటే పంచారు కదా! మనస్సు ముక్కలుగా అయిపోయింది, మనస్సు పగిలిపోయినదిగా అయిపోయింది, పగిలిపోయిన మనస్సుని బాబా కూడా స్వీకరించరు. సంబంధాల యొక్క ఫిలాసఫీ, ఇది కూడా చాలా గుహ్యమైనది. కేవలం ఒక్కనితో తప్ప ఇతర ఎవ్వరితోనూ సంబంధం లేదు, సఖుడు లేరు, సఖి లేరు, సోదరి లేరు, సోదరుడు లేరు ఎందుకంటే ఆ సంబంధంలో కూడా ఆత్మయే జ్ఞాపకం వస్తుంది. ఫరిస్తా అంటే ఆత్మలతో ఏ సంబంధం ఉండదు. ప్రీతి జోడించడం అనేది సహజం కానీ నిలుపుకోవడం కష్టం. నిలుపుకోవడంలోనే నెంబరు ఉంటుంది, జోడించడంలో ఉండదు. నిలుపుకోవడం కొందరికే వస్తుంది. అందరికీ రావడం లేదు. నిలుపుకునే వరుస మారిపోతుంది. లక్ష్యం ఒకటి ఉంటుంది లక్షణాలు మరొకటి  ఉంటున్నాయి. అందువలన నిలుపుకునేది కొందరే, జోడించేది అందరూ. భక్తులు కూడా జోడిస్తారు కానీ నిలుపుకోరు. పిల్లలు నిలుపుకుంటారు కానీ వారిలో కూడా నెంబర్ వారీ, కోట్లలో కొద్దిమందిలో కొద్దిమంది మాత్రమే నిలుపుకుంటారు. ఏదైనా ఒక్క సంబంధం నిలుపుకోవడంలో అయినా లోటు వస్తే లేదా సంబంధాన్ని జోడించడంలో కొంచెం అయినా లోటు వేస్తే అంటే 75%  సంబంధం బాబాతో, 25% సంబంధం ఏదోక ఆత్మతో జోడించారంటే వారు కూడా నిలుపుకునేవారి జాబితాలోకి రారు. బాబాతో 75% పెట్టుకుంటున్నారు మరియు అప్పుడప్పుడు 25% ఎవరి తోడైనా తీసుకున్నారంటే నిలుపుకునే వారి జాబితాలోకి రారు. నిలుపుకోవడం అంటే నిలుపుకోవడమే; ఇది కూడా గుహ్యమైన గతి. సంకల్పంలో కూడా ఏ ఆత్మ రాకూడదు దీనినే సంపూర్ణంగా నిలుపుకోవడం అని అంటారు. ఎలాంటి పరిస్థితి అయినా మనసు యొక్క ,తనువు యొక్క సంప్రదింపుల్లో ఏది ఏమైనా ఏ ఆత్మ సంకల్పంలోకి రాకూడదు. సంకల్పంలో కూడా  ఏ ఆత్మ అయినా స్మృతి వచ్చిందంటే ఆ సెకెను యొక్క లెక్క తయారైపోతుంది. అందువలనే  ఎనిమిదిమంది పాస్ అవుతారు. విశేషంగా ఎనిమిదిమందికే మహిమ ఉంది కనుక తప్పకుండా  ఇంత గుహ్యగతి ఉంటుంది కదా! చాలా పెద్ద పేపర్ ఇది, కనుక ఫరిస్తా అని ఎవరిని అంటారంటే ఎవరి సంకల్పంలో అయితే ఎవరూ ఉండరో వారినే ఫరిస్తా అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టంలో కూడా ఎవరూ ఉండకూడదు, సెకెను కొరకు కూడా, సంకల్పంలో కూడా ఎవరూ ఉండకూడదు. కష్టంలో కూడా గట్టిగా ఉండాలి, అప్పుడే ఫరిస్తా అని అంటారు. గమ్యం చాలా ఉన్నతమైనది కానీ దీనిలో ఏదీ నష్టం లేదు. ఇది సహజమైనది కూడా ఎందువలన అంటే దీనికి  ప్రాప్తి కోటాను కోట్ల రెట్లు ఉంటుంది. బాబాతో సంబంధం జోడించడం ద్వారా ఏదైతే ప్రాప్తి లభిస్తుందో అది ఆ సెకెనులో స్మృతిలోకి రావడం లేదు మర్చిపోతున్నారు అందువలన ఎవరో  ఒకరిని ఆధారంగా తీసుకుంటున్నారు. ప్రాప్తి ఏదీ తక్కువైనది కాదు, కష్టాన్ని సహజం చేసేవారు అని బాబాకే మహిమ ఉంది. ఏ ఆత్మకు లేదు. కనుక కష్ట సమయంలో బాబా ఒక్కరినే తోడు తీసుకోవాలి, ఏ ఆత్మ యొక్క తోడు తీసుకోకూడదు. కానీ ఆ సమయంలో ఆ ప్రాప్తిని మర్చిపోతున్నారు. బలహీనం అయిపోతున్నారు. మునిగిపోయేవారికి ఏది లభించినా కానీ దానిని సహాయంగా తీసుకుంటారు, ఆ సమయంలో అలజడిగా ఉంటారు. కనుక ఏది దొరికితే దానినే సహాయంగా తీసుకుంటారు. కానీ ఆ తరువాత నిస్సహాయంగా అయిపోతారనేది స్మృతిలో ఉండడం లేదు. మంచిది

Comments