21-09-1975 అవ్యక్త మురళి

21-09-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శక్తి ఉన్నా కానీ జీవితంలో సఫలత మరియు సంతుష్టత ఎందుకు లేదు? 

                      సర్వశక్తులు, సిద్ధులు మరియు నిధుల యొక్క దాత శివబాబా మాట్లాడుతున్నారు -
                           ఏవిధంగా అయితే బాబా సర్వ గుణ సాగరుడో, అదేవిధంగా మీరు కూడా మిమ్మల్ని మీరు మాస్టర్ సాగరులుగా భావిస్తున్నారా? సాగరం అఖండంగా అచంచలంగా మరియు స్థిరంగా  ఉంటుంది. సాగరానికి విశేషంగా సదా రెండు శక్తులు కనిపిస్తుంటాయి, ఒకటి ఇముడ్చుకునే శక్తి - ఎంతగా ఇముడ్చుకునే శక్తి ఉంటుందో అంతగానే ఎదుర్కునే శక్తి ఉంటుంది. అలల ద్వారా తనలో  ఇముడ్చుకుంటుంది. ప్రతి వస్తువు లేదా వ్యక్తిని స్వయంలో ఇముడ్చుకుంటుంది. అదేవిధంగా సాగరులు అయిన కారణంగా మీలో కూడా ఈ రెండు శక్తులు ఎంత వరకు వచ్చాయో అని  చూసుకోండి. అనగా ఎంత శాతంలో ఉన్నాయి. ఈ రెండు శక్తులను సమయ ప్రమాణంగా ఉపయోగించగలుగుతున్నారా? శక్తుల ద్వారా సఫలత అనుభవం అవుతుందా? కొంత మంది పిల్లలు స్వయంలో సర్వశక్తులను అనుభవం చేసుకుంటున్నారు. నాలో ఈ  శక్తులున్నాయి అని భావిస్తున్నారు. కానీ శక్తులు ఉండి కూడా అక్కడక్కడ సఫలతను అనుభవం చేసుకోలేకపోతున్నారు. స్వయాన్ని జ్ఞాన స్వరూపంగా, ఆనంద, ప్రేమ, సుఖ మరియు శాంతి స్వరూపంగా భావిస్తూ కూడా స్వయంతో సదా సంతుష్టంగా లేరు. లేదా పురుషార్థీ అయ్యి  ఉండి  కూడా  ప్రాలబ్దం అనగా ప్రాప్తి యొక్క ప్రత్యక్షఫల రూపంలో ఏదైతే అనుభవం అవ్వాలో దానికి  అప్పుడప్పుడు మాత్రమే అనుభవం చేసుకోగలుగుతున్నారు. నియమాలు పాలన చేస్తున్నారు అయినా కానీ స్వయాన్ని సదా హర్షితంగా అనుభవం చేసుకోవడం లేదు. శ్రమ చాలా చేస్తున్నారు. కానీ ఫలం యొక్క అనుభవం తక్కువ అవుతుంది. మాయను కూడా దాసిగా తయారు చేసుకుంటున్నారు కానీ అప్పుడప్పుడు ఉదాసీనత కూడా అనుభవం చేసుకుంటున్నారు. దీనికి  కారణం ఏమిటి? శక్తులు కూడా ఉన్నాయి, వెనువెంట జ్ఞానం కూడా ఉంది, నియమాలు కూడా పాటిస్తున్నారు. అలాంటప్పుడు ఏ విషయంలో లోపం ఉంది. దాని కారణంగా స్వయంతో స్వయమే అయోమయం అయిపోతున్నారు. లోపం ఏమిటంటే లభించిన శక్తిని లేదా జ్ఞానం యొక్క పాయింట్లను ఏ సమయంలో, ఏ రీతిలో కార్యంలో ఉపయోగించాలో ఆ సమయంలో ఆ రీతిలో ఉపయోగించడం రావడం లేదు. బాబాతో ప్రీతి ఉంది, జ్ఞానంతో కూడా ప్రీతి ఉంది, దివ్యగుణ సంపన్న జీవితంతో కూడా ప్రీతి ఉంది, కానీ ప్రీతితో పాటు రీతి రావడం లేదు. లేదా రీతితో  పాటు ప్రీతి రావడం లేదు. అందువలన అమూల్య వస్తువు ఉన్నప్పటికీ సాధారణ ప్రాప్తికే ఆధారం  అవుతుంది. మామూలుగా కూడా స్థూలంలో కూడా ఏదైనా పెద్ద యంత్రం లేదా విలువైన వస్తువు మన దగ్గర ఉన్నప్పటికీ ఉపయోగించుకునే పద్ధతి రాకపోతే దాని ద్వారా ఏదైతే ప్రాప్తి పొందాలో అది పొందలేరు. అదేవిధంగా జ్ఞానవంతులైన పిల్లలు కూడా జ్ఞానము మరియు శక్తుల ద్వారా ఏదైతే ప్రాప్తి పొందాలో దానిని పొందలేకపోతున్నారు. ఇలాంటి ఆత్మలపై బాప్  దాదాకి కూడా దయ వస్తుంది. ఏ పద్ధతి రాని కారణంగా ప్రాప్తి యొక్క అనుభవం అవ్వడం లేదో ఆ పద్దతి ఏవిధంగా వస్తుంది? దీంట్లో నిర్ణయశక్తి కావాలి, నిర్ణయ శక్తి లేని కారణంగా ఎక్కడ ఇముడ్చుకునే శక్తి ఉపయోగించాలో అక్కడ ఎదుర్కొనే శక్తిని ఉపయోగిస్తున్నారు. ఎక్కడ సర్దుకునే శక్తిని ఉపయోగించాలో అక్కడ విస్తారం చేసే శక్తిని ఉపయోగిస్తున్నారు. అందువలన సఫలత గురించి సంకల్పిస్తున్నారు కానీ స్వరూపంలో లేదా ప్రాప్తిలో సంకల్పాన్ని అనుసరించి సఫలత రావడం లేదు. విశేష శక్తి యొక్క ప్రాప్తికి ముఖ్య ఆధారం ఏమిటి, నిర్ణయశక్తిని పెంచుకునేటందుకు ఏ విషయం అవసరం? ఏ యంత్రమైనా స్పష్టంగా నిర్ణయించలేకపోతుంటే దానికి కారణం ఏముంటుంది? నిర్ణయశక్తిని పెంచుకునేటందుకు మీ స్థితి శ్రేష్టంగా, నిరాకారి, నిరహంకారి, నిర్వికారి మరియు నిర్వికల్పంగా ఉండాలి. ఒకవేళ ఈ నాలుగింటిలో ఒక్క విషయం లోటు వచ్చినా శ్రేష్ట ధారణ లేని కారణంగా స్పష్టత ఉండదు. శ్రేష్టమైనదే స్పష్టంగా ఉంటుంది.  అలజడి అనేది బుద్ధిని స్వచ్చంగా ఉండనివ్వదు. స్వచ్ఛతయే శ్రేష్టత, అందువలన మీ నిర్ణయశక్తిని  పెంచుకోండి. అప్పుడే బాబా సమానంగా సర్వగుణాల్లో మాస్టర్ సాగరులుగా అనుభవం చేసుకోగలరు. ఎలాగైతే సముద్రం అనేక వస్తువులతో సంపన్నంగా ఉంటుందో అలాగే స్వయాన్నికూడా సర్వశక్తులతో సంపన్న స్వరూపంగా అనుభవం చేసుకోండి. ఎందుకంటే సంపన్నత యొక్క వరదానం సంగమయుగంలోనే లభిస్తుంది. సంపన్న స్వరూపం యొక్క అనుభవం సంగమయుగంలో తప్ప మరెక్కడా పొందలేరు. మీ దైవీ జీవితానికి సర్వగుణ సంపన్నం అని మహిమ ఉంది. 16 కళల యొక్క మహిమ కూడా ఉంది. కానీ సంపన్న స్వరూపం ఏవిధంగా  ఉంటుంది? గుణాలు మరియు కళల యొక్క జ్ఞానం ఈ ఈశ్వరీయ జీవితంలోనే ఉంటుంది.అందువలన సంపన్నంగా అయ్యే జ్ఞానాన్ని ఈ ఈశ్వరీయ జ్ఞానంలోనే పొందగలరు. రీతి నేర్చుకునేటందుకు బాబా ద్వారా ఏదైతే ప్రాప్తిస్తున్నాయో అనగా జ్ఞానం, శక్తులు వీటన్నింటినీ సమయప్రమాణం కార్యంలో ఉపయోగిస్తూ వెళ్ళండి. చాలా మంచి విషయాలు, చాలా బాగున్నాయి  ఇలా అనుకుని స్వయంలో నింపుకోవడం కాదు అనగా బుద్ధి అనే బీరువాలో పెట్టుకుని ఉంచేయకండి. బ్యాంకు బాలన్సును పెంచుకుంటూ వెళ్ళడం కాదు, వృద్ధుల వలె మూటకట్టి లోపల పెట్టకండి, కేవలం వినటము మరియు బుద్ధిలో పెట్టుకోవడంలో పెట్టుకునే ఆనందమే పొందకండి. కాని వాటిని తరచుగా స్వయం పట్ల, సర్వాత్మల పట్ల ఉపయోగించండి. ఎందుకంటే ఈ సమయంలో  ఏవైతే ప్రాప్తిస్తాయో ఆ ప్రాప్తులన్నింటిని ఉపయోగించడం ద్వారా ఈశ్వరీయ నియమ ప్రమాణంగా ఎంత ఉపయోగిస్తూ ఉంటారో అంతగా వృద్ధి అవుతూ ఉంటాయి. దానం గురించి చెబుతారు కదా - ధనం ఇస్తే ధనం ఎప్పుడూ తరగదు అనగా ఇవ్వడమే పెంచుకోవడం. అదేవిధంగా ఈ  ఈశ్వరీయ ప్రాప్తులను అనుభవంలోకి తీసుకురావడం ద్వారా ప్రాప్తి తక్కువ అవ్వదు మరింత ప్రాప్తి స్వరూపం యొక్క అనుభవం చేసుకుంటారు. తరచుగా ఉపయోగించడం ద్వారా ఎలాంటి  సమయమో అలా మీ స్వరూపాన్ని తయారుచేసుకోగలరు. ఏ సమయంలో ఏ శక్తి ఉపయోగించాలో ఆ శక్తిని ఆ రీతిగా ఉపయోగించగలరు. సమయానికి మోసపోవడం నుండి రక్షించబడతారు. మోసం నుండి రక్షించబడడం అంటే దు:ఖం నుండి రక్షించబడడం. అప్పుడు ఏవిధంగా అయిపోతారు? సదా హర్షితం అనగా సదా సుఖీ మరియు అదృష్టవంతులుగా అయిపోతారు. ఇప్పుడు మీపై మీరు దయ చూపించుకుని ప్రాప్తులను ఉపయోగించుకుంటూ ప్రీతితో పాటు  రీతిని కూడా తెలుసుకుని సదా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వండి, శక్తి సాగరులుగా అవ్వండి మరియు సర్వప్రాప్తుల సాగరంగా అవ్వండి. మంచిది.
        ఈవిధంగా సర్వ అనుభవాలతో సంపన్న మాయాజీత్, జగజ్జీత్, తమ అనుభవాల ద్వారా సర్వులను అనుభవిగా తయారుచేసే బాప్  దాదాకి పిల్లలు మరియు యజమానులైన వారికి, బాబాకి కూడా యజమాని మరియు విశ్వానికి కూడా యజమానిగా అయ్యే ఆత్మలకు బాప్ దాదా యొక్క  ప్రియ స్మృతులు మరియు నమస్తే.

Comments