21-07-1973 అవ్యక్త మురళి

21-07-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఆత్మిక న్యాయమూర్తి మరియు లౌకిక న్యాయమూర్తి.

                   సదా సఫలతామూర్తిగా తయారుచేసేవారు, శక్తులతో సంపన్నం చేసి మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారుచేసేవారు, సర్వ ధారణలు చేయించి ధారణామూర్తులుగా తయారుచేసేవారు, ఉన్నత న్యాయాధికారి ప్రియ శివబాబా మాట్లాడుతున్నారు -
                  స్వయాన్ని న్యాయమూర్తిగా భావిస్తున్నారా? స్వయానికి స్వయం మరియు సర్వాత్మలకి  తీర్పు ఇవ్వగలుగుతున్నారా? ఆ న్యాయమూర్తి అయితే కేవలం మాట మరియు కర్మల గురించే తీర్పునిస్తారు. కానీ మీరు సంకల్పాల ఆధారంగా కూడా తీర్పునివ్వగలరు. మీరు ఎలాంటి  న్యాయమూర్తి అంటే మీ యొక్క మరియు ఇతరాత్మల యొక్క సంకల్పాలను కూడా పరిశీలించగలరు లేదా నిర్ణయించగలరు. ఈ విధంగా తయారైపోయారు కదా! ఇలాంటి న్యాయమూర్తిగా ఎవరు  తయారుకాగలరు? ఎవరి బుద్ధి రూపి ముల్లు ఏకాగ్రంగా ఉంటుందో వారే తయారుకాగలరు. ముల్లు ఏకాగ్రంగా ఉన్నప్పుడే త్రాసు యొక్క తూకాన్ని పరిశీలించగలం. అదే ముల్లు కదులుతూ  ఉన్నట్లయితే పరిశీలించలేము. ఎప్పుడైతే ముల్లు కదలటం ఆగిపోతుందో అప్పుడు రెండు వైపుల  సమానంగా ఉన్నట్లు. అదేవిధంగా ఎవరి బుద్ధి రూపి ముల్లు ఏకాగ్రంగా ఉంటుందో ఎవరి బుద్ధిలో ఏ అలజడి ఉండదో మరియు ఎవరికైతే నిర్వికల్ప స్థితి ఉంటుందో ఎవరి మాటలో అయితే నియమం మరియు ప్రేమ సమానంగా ఉంటాయో, స్నేహం మరియు శక్తి ఈ రెండు సమానంగా ఉంటాయో అలాంటి న్యాయమూర్తి మాత్రమే యదార్ధంగా తీర్పునివ్వగలరు. ఇలాంటి  ఆత్మ సహజంగానే ఎవరినైనా పరిశీలించగలరు. ఇలా పరిశీలనాశక్తి లేదా నిర్ణయశక్తిని స్వయంలో  అనుభవం చేసుకుంటున్నారా? లౌకిక న్యాయమూర్తి ఒకవేళ తప్పుగా తీర్పునిచ్చినట్లయితే ఒక ఆత్మ యొక్క ఒక జన్మ వ్యర్ధం అవ్వవచ్చు లేదా కొంత సమయం వ్యర్ధం అవ్వచ్చు లేదా వారికి అనేక రకాల నష్టం జరగటానికి నిమిత్తమవ్వవచ్చు. కానీ ఆత్మిక న్యాయమూర్తి అయిన మీరు ఎవరినైనా పరిశీలన చేయలేకపోతే ఆ ఆత్మ యొక్క అనేక జన్మల యొక్క అదృష్టానికి నష్టం కలిగించడానికి నిమిత్తమవుతారు. మీపై ఇంత భాద్యత ఉన్నట్లు భావిస్తున్నారా? మీరు సర్వాత్మల కళ్యాణం కోసం నిమిత్తమై ఉన్నారు. అనేకాత్మలను తండ్రితో కలపడానికి నిమిత్తమవుతున్నారు. అలాంటి ఆత్మలైన మీపై ఇంత పెద్ద భాద్యత ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎవరైనా తపించే ఆత్మ దప్పికతో ఉన్న ఆత్మ మీ ఎదురుగా వస్తే వారి తపన లేదా దప్పికను సమాప్తి చేసేటందుకు, వారి దాహాన్ని తీర్చేటందుకు ఎవరు నిమిత్తులు? బాబాయా లేక మీరా? బాబా అయితే వెన్నెముక, కానీ నిమిత్తంగా ఉన్నది - శక్తిసేన మరియు పాండవ సేనయే. నిమిత్తంగా అయిన వారిపై ఇంత పెద్ద భాద్యత ఉంది. ఏ ఆత్మను ఏ విషయం నుండి లేదా ఏ ప్రాప్తి నుండి వంచితం చేయకూడదు. ఈ విధంగా సర్వుల పట్ల మహాదాని, వరదాని అయ్యారా? ఒక్క సెకనులో ఎవరినైనా పరిశీలన చేయగలుగుతున్నారా? ఒకవేళ ఎవరికైనా శాంతి అవసరం అయితే మీరు వారికి సుఖానికి మార్గం చెప్తే (పరిశీలనాశక్తి తక్కువగా ఉన్న కారణంగా) వారు సంతుష్టం అవ్వరు. అందువలన ప్రతీ ఒక్కరి యొక్క కోరికను పరిశీలించేవారే సంపూర్ణంగా మరియు  యదార్థమైన తీర్పునివ్వగలరు. ఈ విధంగా సర్వుల కోరికలను తెలుసుకునేవారికి విశేషంగా ఏ లక్షణాలు ఉంటాయి? తద్వారా వారి బుద్ధి రూపి ముల్లు ఏకాగ్రంగా ఉంటుంది. ప్రేమ మరియు నియమం సమానంగా ఉండాలి, దాని కొరకు విశేష ముఖ్య ధారణ ఏమిటి? (అందరూ చెప్పారు). చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. వీటన్నిటి సారం - స్వయాన్ని ఇచ్చామాత్రం అవిద్యా స్థితిలో స్థితులు చేసుకోవటం. అలాంటి వారే ఎవరి కోరికలను అయినా పూర్తి చేయగలరు. ఒకవేళ స్వయంలోనే ఏ కోరికలు అయినా మిగిలిపోతే వారు ఇతరుల కోరికలను పూర్తి చేయలేరు. ఇచ్చామాత్రం అవిద్యా స్థితి ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే స్వయం యుక్తియుక్తంగా, సంపన్నంగా, జ్ఞాన సాగరులుగా, విజయీగా అనగా సఫలతామూర్తులుగా ఉంటారో అప్పుడు. ఎవరైతే స్వయం సఫలతా మూర్తిగా ఉండరో వారు అనేకాత్మలలో ఉన్న సంకల్పాలను ఎలా సఫలం చేస్తారు? ఎవరైతే సంపన్నంగా ఉండరో వారికి కోరికలు తప్పకుండా ఉంటాయి. సంపన్నం అయిన తర్వాతనే కోరికంటే ఏమిటో తెలియని స్థితి వస్తుంది. అప్పుడు ప్రాప్తించని వస్తువు ఏదీ ఉండదు. అలాంటి స్థితినే కర్మాతీత స్థితి లేదా ఫరిస్తా స్థితి అని అంటారు. ఇలాంటి స్థితి గలవారే  సర్వాత్మలను యదార్ధంగా పరిశీలించగలరు మరియు ఇతరులకు ప్రాప్తినివ్వగలరు. అనుభవం చేసుకుంటున్నారా లేక ఇప్పటికీ ఆ స్థితి చాలా దూరంగా ఉందా? ఎదురుగా ఉందా లేక సమీపంగా ఉందా? ఎంత సమీపంగా ఉండాలంటే కావాలంటే ఇప్పుడిప్పుడే అక్కడికి చేరుకునే విధంగా. వినాశనం యొక్క చప్పట్లు లేదా ఈల మ్రోగగానే మీరు మీ స్థితిలో స్థితులు అయిపోవాలి. సింహాసనానికి దగ్గరగా వెళ్ళిపోయారు కేవలం ఎక్కి కూర్చోవటం అంతే. అంటే ఈల మ్రోగగానే సింహాసనంపై కూర్చోవటమే. కుర్చీల ఆట ఆడతారు కదా! పరుగు పెడుతూ ఉంటారు, ఈల మ్రోగగానే కుర్చీలో కూర్చోవాలి. కూర్చున్నవారు విజయీ, ఏ కుర్చీలోను కూర్చోలేకపోతే ఓడిపోయినట్లు. అలాగే ఇక్కడ కూడా కుర్చీల ఆట నడుస్తుంది. దీంట్లో మీరు ఏవిధంగా ఉన్నట్లు భావిస్తున్నారు? మూడు చప్పట్లు మ్రోగించబడతాయి, మూడవది మ్రోగగానే కుర్చీలో కూర్చోవాలి. అంతగా తయారైపోయారా? కానీ ఈ మూడు చప్పట్లు వెనువెంటనే మ్రోగుతాయి. మధ్యలో ఎక్కువ సమయం ఉండదు. మూడవది మ్రోగేసరికి వెంటనే సీటులో కూర్చునే విధంగా  తయారైపోయారా? ఇది గ్యారంటీయే కదా! ప్రయత్నిస్తాము అని అన్నారంటే కొంచెం సంశయం ఉన్నట్లే. కల్పపూర్వం ఈ సీటులో కూర్చోలేదా? ఏదోక కుర్చీలో కూర్చోవటం అనేది గొప్ప విషయమేమీ కాదు, ఏదోక కుర్చీ అయితే ప్రజలకి కూడా లభిస్తుంది మరియు 9 లక్షల మందికి  సీటు లభిస్తుంది. కానీ మొదటి నెంబరు సీటు తీసుకునేటందుకు స్వయాన్ని ఎవరెడీగా తయారుచేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ నిమిత్తమైనవారే రెండవ స్థితి వరకు చేరుకున్నట్లయితే మీరు ఎవరికి నిమిత్తమయ్యారో వారు ఎంత వరకు చేరుకుంటారు? మీరు స్వయాన్ని విశ్వకళ్యాణకారిగా భావించి నడుస్తున్నారు. కనుక సదా చప్పట్లు కోసం లేదా ఈల కోసం  ఎదురుచూస్తూ ఉండాలి. ఎవరైతే ముందుగానే తయారైపోతారో వారే ఎదురుచూడగలరు. తయారుకాకపోతే ఎదురుచూడలేరు. ముందుగానే తయారవ్వటం అనేది మహారథీల యొక్క లేదా మహావీరుల యొక్క గుర్తు. కనుక ఇప్పుడు ఎవరెడీగా తయారయ్యేటందుకు ఇప్పటి నుండే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. జ్ఞానమంతా రివైజ్ కోర్సు చేయిస్తున్నారు. అదేవిధంగా మీ ప్రాప్తి లేదా పురుషార్ధం యొక్క చార్టుని కూడా మొదటి నుండి రివైజ్ చేసుకుని చూడండి, నాల్గింటినీ ఎదురుగా పెట్టుకోండి, ప్రతీ సబ్జెక్టులో పాస్ అయ్యానా అని చూసుకోండి. జ్ఞానం, యోగం, దైవీగుణ ధారణ, సేవ అనేవి ఎలాగైతే నాలుగు సబ్జెక్టులో అలాగే ఇక్కడ నాలుగు  సంబంధాలు స్పష్టంగా ఉన్నాయి. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు, కానీ నాల్గవ  సంబంధం - ప్రేయసి లేదా ప్రియుడు. ఇది కూడా విశేష సంబంధం, ఆత్మ పరమాత్మలు కలయిక లేదా నిశ్చితార్థం. ఈ సంబంధం కూడా పురుషార్థాన్ని సహజం చేస్తుంది. ఎలాగైతే  నాలుగు సబ్జెక్టులు ఉన్నాయో అలాగే నాలుగు సంబంధాలు ఎదురుగా తెచ్చుకోండి. ఈ నాలుగు సంబంధాల ఆధారంగా నాలుగు ధారణలు 1. తండ్రి సంబంధంతో విధేయులుగా ఉండాలి 2. శిక్షకుని సంబంధంతో నిజాయితీపరులుగా ఉండాలి 3. గురువు సంబంధంతో ఆజ్ఞాకారిగా ఉండాలి 4. ప్రియుని సంబంధంతో నమ్మకధారిగా ఉండాలి. నాలుగు సంబంధాలు నాలుగు  విశేష ధారణలు. అందరు రివైజ్ చేసుకుని చూస్కోండి. వీటితో పాటు నాలుగు సూక్తులు కూడా స్మృతిలో ఉంచుకోండి. అవి ఏమిటి? 1. తండ్రి సంబంధంతో స్లోగన్ - తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనగా సుపుత్రులై రుజువు చూపించాలి 2. శిక్షకుని సంబంధంతో స్లోగన్ - ఎంత వరకు జీవిస్తామో అంత వరకు చదువుకోవాలి అనగా అంతిమ ఘడియ వరకు చదువుకోవాలి. ఈ లక్ష్యం గట్టిగా ఉంటే సర్వప్రాపులు స్వతహాగానే లభిస్తాయి. 3. గురువు రూపంలో స్లోగన్ - ఎక్కడ కూర్చోబెడితే ఎలా నడిపిస్తే , ఎలా నిద్రింపచేస్తే అనగా అన్నీ కూడా యజమాని యొక్క ఆజ్ఞానుసారం నడవాలి. ఇది సద్గురువు యొక్క స్లోగన్. ప్రియుని రూపంలో - నీతోనే కూర్చుంటాను, నీతోనే తింటాను మరియు శ్వాసశ్వాస నీతోనే ఉంటాను ఇది ప్రియుని రూపంలో స్లోగన్. ఈ విషయాలన్నింటినీ మీ ఎదురుగా తెచ్చుకుని మీ పురుషార్థాన్ని పరిశీలించుకోండి. వీటన్నింటినీ రివైజ్ (పునరావృత్తం) చేసుకోవాలి. చాలాకాలం నుండి మరియు ఏకరసంగా అనగా సదా నాలుగు సంబంధాలను నిలుపుకుంటున్నానా లేక మధ్యమధ్యలో సంబంధం తెగిపోయిందా అని కూడా పరిశీలించుకోండి. ఒకవేళ మధ్యమధ్యలో తెగిపోయే అవకాశం ఉన్నట్లయితే తెగిపోయిన వస్తువు బలహీనంగా ఉంటుంది. అందువలన మీ జీవితాన్ని ఈ నాలుగు విషయాల ఆధారంగా చూస్కోండి. ఇలా పరిశీలించుకుని మీ యొక్క ప్రాప్తి లేదా ప్రాలబ్దం ఏమిటో తెలుసుకోవచ్చు. నేను సూర్యవంశీయుడినా లేక చంద్రవంశీయుడినా? సూర్యవంశీ రాజకుటుంబంలోకి వెళ్తానా లేదా నేనే మహారాజా మహారాణి అవుతానా? ఇప్పుడు సమయం సమీపంగా ఉంది. చివరి పరీక్ష సమయం ఇది, లౌకిక చదువులో కూడా చివర్లో అన్ని సబ్జెక్టులని తిరగేసుకుంటారో ప్రతీ సబ్జెక్టుని తిరగచూసుకుని లోటుని సంపన్నం చేసుకుంటారో అదేవిధంగా మీ పురుషార్థాన్ని ఈ రీతిగా తిరిగేసుకుని చూడండి. స్వయానికి స్వయం న్యాయమూర్తిగా ఎలా అవ్వాలో పద్దతి చెప్తున్నాను. ఎప్పుడైతే స్వయం గురించి నిర్ణయించుకోవటం వస్తుందో అప్పుడు సహజంగానే ఇతరులని పరిశీలించగలరు. ఎప్పుడైతే స్వయం ప్రాప్తి సంపన్నంగా అవుతారో అప్పుడు ఇతరులకు కూడా ప్రాప్తినివ్వగలరు. ఇలా పరిశీలించుకోవటం సహజమే కదా! ఒక సబ్జెక్టులో కానీ, ఒక సంబంధంలో కానీ, ఒక ధారణలో కానీ, ఒక స్లోగన్లో కానీ లోపం ఉండకూడదు. ఫలితం ప్రకటించబడే  సమయం వస్తూ ఉంది. ఫలితం ప్రకటించబడే ముందు ఫిర్యాదులు అన్నింటినీ సమాప్తం చేసుకోండి. మీ గురించి మీరే ఫిర్యాదులు చేస్తున్నారు. అమృతవేళ మీ గురించి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎప్పటి వరకు మీపై మీకే ఫిర్యాదులు ఉంటాయో అప్పటి వరకు సంపూర్ణంగా కాలేరు. అందువలన స్వయమే మాస్టర్ సర్వశక్తివంతులై మీ ఫిర్యాదులను సమాప్తం చేస్కోండి. ఇప్పుడు ఇంకా కూడా అంతిమ అవకాశానికి సమయం ఉంది. ఇప్పుడు లేకపోతే బాగా ఆలస్యం అనే బోర్డు పెట్టేస్తారు. ఇప్పుడు ఇంకా ప్రాప్తి పొందే సమయం ఉంది. చాలా గడిచిపోయింది కానీ కొద్దిగా మిగిలి ఉంది. ఆ తర్వాత ఇక పశ్చాత్తాప సమయం వచ్చేస్తుంది. పశ్చాత్తాప సమయంలో ప్రాప్తి చేసుకోలేరు. అందువలన ఇప్పుడు ఏదైతే సమయం కొద్దిగా మిగిలిఉందో; ఇతరుల కొరకు లేదా మీ కొరకు అవకాశం లభించింది. ఏదోక రకమైన అవకాశం అయితే ఉంది కదా! మరి అవకాశం తీస్కోవాలా లేక పోగొట్టుకోవాలా? మీ ప్రయత్నంతో మీరు ఏది కావాలంటే అది చేయగలరు. అందువలన ఇప్పటి నుండి రివైజ్ చేసుకోండి. ఎలా రివైజ్ చేసుకోవాలో, ఏ రూపంలో నిర్ణయించుకోవాలో చెప్పాను కదా! విధి అయితే చెప్పాను, సిద్ది తప్పక ప్రాప్తిస్తుంది. ఎవరైతే సంపూర్ణ స్థితికి అతి సమీపంగా ఉంటారో వారి సంకల్పంలో, మాటలో మరియు కర్మలో ఒక నషా ఉంటుంది, అది ఏమిటి? ఈశ్వరీయ నషా అయితే అందరికీ ఉంటుంది. ఈశ్వరుని ఒడిలోకి రాగానే ఈశ్వరీయ నషా యొక్క వారసత్వాన్ని ప్రాప్తింప చేసుకున్నారు. అది సరే కానీ, వారికి ఉండే విశేష నషా ఏమిటి? వారి యొక్క సంకల్పంలో, మాటలో ఏ నషా ఉంటుంది? నేను ఏదైతే చేస్తున్నానో దాంట్లో సంపూర్ణ సఫలత ఉంది. అవ్వాలి లేదా అవుతుంది అని అనరు, అవ్వాల్సిందే అని అంటారు. సంకల్పంలో కూడా ఇదే నషా ఉంటుంది - నా యొక్క ప్రతీ సంకల్పం తపుక సిద్ధిస్తుంది. కర్మలో కూడా ఇదే నషా ఉంటుంది - నా యొక్క ప్రతీ కర్మ వెనుక సఫలత నా నీడ వలె ఉంటుంది. నా మాట తప్పక సిద్ధిస్తుంది. సఫలత నా వెనుక వస్తుంది. సఫలత నా నుండి వేరు అవ్వలేదు. ఇలాంటి నషా ప్రతీ సంకల్పంలో, ప్రతీ మాటలో, కర్మలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు అతి సమీపంగా ఉన్నట్లు భావించండి

Comments