* 21-06-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"విశ్వమహారాజులుగా అయ్యేవారి విశ్వకళ్యాణకారీ స్థితి"
స్వయమును ఒక్క క్షణంలో శరీరం నుండి అతీతమైన అశరీర ఆత్మగా భావిస్తూ ఆత్మాభిమాన స్థితి లేక దేహీభిమాన స్థితిలో స్థితులవ్వగలరా? అనగా ఒక్క క్షణంలో కర్మేంద్రియాల ఆధారమును తీసుకొని కర్మ చేస్తూ మళ్ళీ ఒక్క క్షణంలోనే కర్మేంద్రియాల నుండి అతీతంగా వుండే ఇటువంటి అభ్యాసము ఉందా? ఏ కర్మనైనా చేస్తూ ఆ కర్మ యొక్క బంధనలోనైతే చిక్కుకోవడం లేదు కదా! కర్మచేస్తూ కర్మ యొక్క బంధన నుండి అతీతముగా అవ్వగలరా లేక ఇప్పటివరకు కూడా కర్మేంద్రియాల ద్వారా కర్మకు వశీభూతమైపోతున్నారా? ప్రతి కర్మేంద్రియమును ఎలా నడిపించాలనుకుంటే అలా నడిపించగలరా లేక మీరు ఒకటి కోరుకుంటూ ఉంటే కర్మేంద్రియాలు మరొకటి చేస్తున్నాయా? రచయితగా అయి మీ రచనను నడిపిస్తున్నారా? ఏ జఢమైన వస్తువుకైనా చైతన్య ఆత్మ లేక చైతన్య మనుష్య ఆత్మ ఎలాంటి రూపాన్ని ఇవ్వాలనుకుంటే ఆ రూపాన్ని ఇవ్వగలదు మరియు ఎలా కావాలనుకుంటే అలా అటువంటి కర్తవ్యంలో వినియోగించగలదు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టగలదు. జఢవస్తువు చైతన్యమైనదానికి వశమై ఉంది మరి చైతన్యమైన ఆత్మ ఎలా నడిపించాలనుకుంటే అలా నడిపించలేదా? ఏ విధంగా జడమైన వస్తువును ఏ రూపంలోకైనా పరివర్తన చేయగలరో అలా కర్మేంద్రియాలను వికారీ నుండి నిర్వికారిగా లేక వికారాల అగ్నిలో దహించబడి ఉన్న కర్మేంద్రియాలను శీతలతలోకి తీసుకురాలేరా? చైతన్య ఆత్మలోకి ఇటువంటి పరివర్తనా శక్తి రాలేదా?
ఏ కర్మేంద్రియం యొక్క చంచలతనైనా సహనశీలంగా, సరళచిత్తముగా మార్చలేరా? ఇంతటి శక్తిని స్వయములో అనుభవం చేసుకుంటున్నారా? మీరు శక్తిశాలీ ఆత్మలు కదా! భాగ్యశాలి ఆత్మలు శక్తిశాలిగా కూడా అయ్యారా లేక కేవలం బ్రహ్మాకుమారీ కుమారులుగా అయిన భాగ్యము కారణముగా భాగ్యశాలులుగా అయ్యారా? కేవలం భాగ్యశాలులుగా అవ్వడం ద్వారా కూడా మాయాజీతులుగా అవ్వలేరు. భాగ్యశాలులుగా అవ్వడంతోపాటు శక్తిశాలులుగా కూడా అవ్వాలి. రెండూ అనుభవమవుతున్నాయా? నేను భాగ్యశాలిని అనే నషా అవినాశిగా ఉంటుంది కదా! దానిని ఎవరూ నాశనం చేయలేరు. శక్తిశాలులుగా అయ్యే వరదానమును వరదాత నుండి తీసేసుకున్నారా లేక ఇంకా ఇప్పుడు కూడా తీసుకోవాలా? మీరు ఏం భావిస్తున్నారు? మీరు బ్రహ్మాకుమారీ కుమారులు, అది అవినాశీ ముద్రగా అంటుకొని ఉంది. ఇప్పుడు శక్తిశాలిగా అయ్యే వరదానమును తీసుకున్నారా లేక తీసుకోవాలా? ఎప్పుడైతే శక్తిశాలులుగా అయిపోయారో అప్పుడు ఇక మాయ యొక్క శక్తి యుద్ధం చేయగలదా? ఇది రచయిత యొక్క శక్తి, అది రచన యొక్క శక్తి, బలహీనులు శూరవీరులపై యుద్ధం చేసే ధైర్యమును ఉంచగలరా? ధైర్యము ఉంచినా దాని పరిణామం ఎలా ఉంటుంది? ఎవరు విజయులుగా అవుతారు? శూరవీరులే కదా! కావున రచయిత యొక్క శక్తి ఉన్నతోన్నతమైనది, మరి మాయతో యుద్ధము ఎలా జరుగగలదు లేక మాయతో ఓటమి ఎలా లభించగలదు? ఎప్పుడైతే స్వయమును శక్తిశాలిగా భావించరో లేక సదాకాలము శక్తిశాలీ స్థితిలో, స్మృతిలో స్థితులవ్వరో అప్పుడే ఓటమి జరుగుతుంది. ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ విస్మృతి కాజాలదు, అలా రావడము అసంభవము, ఏ విధంగా పగలు సమయంలో రాత్రి రావడం అసంభవమో అలా స్వయమును ఈ విధంగా తయారుచేసుకున్నారా లేక ఇప్పటివరకు అది రాగలగడం సంభవమా? ఎప్పుడూ మాయ యొక్క ఎటువంటి యుద్దము జరుగజాలదు అనే అవినాశీ నిశ్చయబుద్ధి కలవారిగా అయిపోయారా? సంకల్పంలో కూడా మాయ ఓడిస్తుందేమో అన్నది రాకూడదు. ఈ విధంగా అయిపోయారా లేక ఇప్పుడు ఇంకా మాయా వస్తే యుద్ధం చేసి విజయమును పొందుతారా? ఇప్పుడు దీనిని కూడా సమాప్తం చేయాలి. ఇప్పుడు ఇంకా చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అని ప్రపంచంలోనివారికి సందేశమునిస్తారు, మరి ఈ కొద్ది సమయామును యుద్ధం చేసే స్థితి లేక యుద్ధం చేసే చంద్రవంశీ స్థితిని సమాప్తం చేసి సూర్యవంశీ స్థితిని తయారుచేసుకోలేరా? సూర్యవంశీయులు అనగా జ్ఞానసూర్య స్థితి. సూర్యుని కర్తవ్యం ఏమిటి? సూర్యుడు అందరినీ భస్మం చేసేస్తాడు. సూర్యస్థితి అనగా అన్ని వికారాలను భస్మం చేసి విజయులుగా అయ్యే స్థితి. కావున ఇప్పుడు స్వయమును ఏ స్థితివారిగా భావిస్తున్నారు? మీరు సూర్యవంశీయులా లేక చంద్రవంశీయులా? యుద్ధం చేయడంలో సమయం పడుతున్నట్లయితే దానిని చంద్రవంశీ స్థితి అని అంటారు. ఇప్పటివరకు మీకు మీరే సమయాన్ని ఇచ్చుకుంటున్నట్లయితే బాబాకు సహాయకులుగా అయి ప్రత్యక్షంగా మాస్టర్ విశ్వకళ్యాణకారులుగా అయి విశ్వకళ్యాణము కొరకు మొత్తం సమయమును ఎప్పుడు ఇస్తారు? చివరి స్థితి ఏమిటి? విశ్వ కళ్యాణకారీ స్థితి కదా! రాత్రింబవళ్ళు, ప్రతి సంకల్పము, ప్రతి క్షణము విశ్వకర్తవ్యంలో లేక సేవలో నిమగ్నమవ్వాలి అన్న ప్రయత్నం చేయండి. లౌకిక రీతిలో కూడా ఎప్పుడైతే లౌకిక రచన యొక్క రచయితగా అవుతారో అప్పుడు రచయితగా అవ్వడం ద్వారా స్వయం కొరకు సమయమును ఇచ్చుకునేందుకు బదులుగా రచన కొరకే సమయాన్ని కేటాయిస్తారు. దీని అనుభవమైతే ఉంది కదా! అతిరోగులుగా, అతి దుఃఖితులుగా, అతి అశాంతులుగా రచన ఉన్నట్లయితే రచయిత అయిన మాతాపితల పూర్తి ధ్యానము వారివైపే ఉంటుంది కదా! స్వయమును మరిచిపోయినట్లుగా ఉంటారు. అది హద్దులోని రచన, కాని మీరైతే బేహద్ విశ్వపు మాస్టర్ రచయితలు కదా! మొదట మీకొరకు మీరు సమయాన్ని ఇచ్చుకునేవారు, కానీ ఇప్పటి మీ స్థితి మాస్టర్ రచయిత యొక్క స్థితి. ఇది కేవలం ఒకరిద్దరి విషయం కాదు, పూర్తి విశ్వంలోని ఆత్మలు దు:ఖితులుగా, అశాంతులుగా, రోగులుగా వ్యాకులత చెంది బికారులుగా ఉన్నారు. బేహద్ రచనను అనగా మొత్తం విశ్వమును కళ్యాణకారులుగా అయి సదాకాలికంగా సుఖవంతులుగా మరియు శాంతివంతులుగా తయారుచేయాలి. కావున బేహద్ రచయిత యొక్క అటెన్షన్ ఉండాలి. ఇప్పటివరకు స్వయముపట్లనే ఎంతో సమయం గతిస్తోంది, యుద్ధం చేయడంలోనే సమయం గతిస్తోందా లేక విశ్వకళ్యాణము కొరకు సమయాన్ని వినియోగిస్తున్నారా?
ఇప్పుడు ఈ కొద్ది సమయం ఏదైతే మిగిలి ఉందో అది విశ్వకళ్యాణం కొరకు అని కూడా భావించండి. భక్తిమార్గంలో మహాదానులు, కళ్యాణకారీ వృత్తిగల సేవాధారులెవరైతే ఉంటారో వారు ఏదైనా దానము మొదలగువాటిని తమ కొరకు వినియోగించుకోరు, సర్వాత్మల కొరకే సంకల్పం చేస్తారు. కావున ఈ ఆచార వ్యవహారాలు శ్రేష్ఠ లేక కళ్యాణకారీ ఆత్మలైన మీ నుండే ప్రారంభమయ్యాయి, అదే ఆచారాలు భక్తి కూడా కొనసాగుతాయి. తప్పకుండా ప్రాక్టికల్గా జరిగాయి, కావున స్మృతి చిహ్న రూపంలో ఆచారాలు కొనసాగుతున్నాయి. కావున ఇప్పుడు ఈ పరివర్తన తీసుకురండి. ఇతరుల కొరకు సేవాధారులుగా అవ్వడం ద్వారా లేక ఇతరుల కొరకు సమయాన్ని మరియు సంకల్పాలను వినియోగించడం ద్వారా, సేవాధారులుగా అవ్వడం ద్వారా స్వతహాగానే సదా విజయులుగా అయిపోతారు. ఎందుకంటే అనేక ఆత్మలను సుఖవంతులుగా లేక శాంతివంతులుగా తయారు చేసేందుకు ప్రతిఫలంగా ప్రత్యక్ష ఫలము రూపంలో స్వతహాగానే ప్రాప్తమవుతుంది. ఎప్పుడైతే సేవ చేస్తారో దాని ఖాతా కూడా జమ అవుతుంది మరియు సేవకు ప్రత్యక్షఫలంగా ప్రాప్తి స్వతహాగానే ప్రాప్తమవుతుంది. కావున మరి సదా సేవాధారులుగా ఎందుకు అవ్వకూడదు? తద్వారా స్వఉన్నతి స్వతహాగానే జరుగుతుంది, చేయవలసిన అవసరం ఉండదు. ఇతరులకు ఇవ్వడం అనగా స్వయంలో నింపుకోవడం. కావున స్వయం మీ ఉన్నతి కొరకు వేరుగా సమయాన్ని ఎందుకు కేటాయిస్తారు? ఒకే సమయంలో రెండు కార్యాలు జరిగినట్లయితే, డబుల్ ప్రాప్తి లభించినట్లయితే సింగిల్ ప్రాప్తిలో సమయాన్ని ఎందుకు వినియోగిస్తారు? మొత్తం రోజంతటిలో విశ్వకళ్యాణం కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? బ్రాహ్మణుల ఈ అలౌకిక జన్మ దేనికోసం ఉంది? విశ్వకళ్యాణార్ధము ఉంది కదా! కావున దేనికొరకైతే ఈ జన్మ ఉందో ఆ కర్మలను ఎందుకు చేయడంలేదు? ఏ కులములోనైతే జన్మ తీసుకుంటారో ఆ కులములోని సంస్కారాలు జన్మ తీసుకోవడంతోనే స్వతహాగానే ఏర్పడతాయి. స్థూలమైన పనులు చేసే కూలిపని చేసేవారి ఇళ్ళలో పిల్లలు పుట్టినప్పుడు, చిన్నప్పటినుండే మాతాపితలను చూస్తూ ఆ కార్యపు సంస్కారాలు స్వతహాగానే వారిలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. కావున ఎప్పుడైతే జన్మయే బ్రహ్మాకుమారీ కుమారులుగా ఉందో, అప్పుడు తండ్రి కార్యమేదైతే ఉందో అది స్వతహాగానే పిల్లల సంస్కారముగా ఉండాలి. ఏ విధంగా తండ్రిని ప్రత్యక్షంగా చూశారో, అప్పుడు రాత్రి నిదురించే సమయమును లేక తమ శరీరపు విశ్రాంతి సమయమును కూడా ఎక్కువగా ఎందులో గడిపేవారు? విశ్వకళ్యాణ కర్తవ్యంలో, సర్వాత్మల కళ్యాణం కొరకు సమయాన్ని గడిపారే కాని స్వయం కొరకు కాదు. వాణి ద్వారా కూడా సదా విశ్వకళ్యాణ సంకల్పాలనే చేసేవారు, వారినే విశ్వకళ్యాణకారులు అని అంటారు. కావున ఈ మనస్సు యొక్క విఘ్నాలతో యుద్ధం చేయడంతోనే సమయమునివ్వడము స్వయం కొరకు వ్యర్థముగా సమయమును ఇవ్వడమైంది కదా! దీనిని అవసరము అని అనరు, వ్యర్థము అని అంటారు. బాబా ఆవశ్యకత సమయాన్ని కూడా కళ్యాణము కొరకే ఇచ్చారు మరియు పిల్లలు వ్యర్థముగా సమయమును తమ కొరకు వినియోగించుకుంటున్నారు. మరి అది బాబాను అనుసరించినట్లా? బాబా సమానంగా అవ్వాలి కదా! కావున సదా ఎక్కువలో ఎక్కువ కూడా కాదు, సదా సమయము మరియు సంకల్పాలను విశ్వకళ్యాణార్థము వినియోగిస్తున్నామా అని పరిశీలించుకోండి. ఈ విధంగా సదా విశ్వకళ్యాణార్థము సమయమును మరియు సంకల్పాలను వినియోగించేవారు ఏమవుతారు? విశ్వమహారాజులుగా అవుతారు. ఒకవేళ స్వయం కోసమే సమయాన్ని వినియోగిస్తూ ఉన్నట్లయితే విశ్వమహారాజులుగా ఎలా అవుతారు? కావున విశ్వమహారాజులుగా అయ్యేందుకు విశ్వకళ్యాణకారులుగా అవ్వండి. ఎప్పుడైతే ఇంతగా బిజీగా అయిపోతారో అప్పడిక వ్యర్థ సమయము, వ్యర్థ సంకల్పాలు ఉంటాయా? వ్యర్థము స్వతహాగానే సమాప్తమైపోతుంది మరియు సదా సమర్థ సంకల్పాలు కొనసాగుతాయి. సదా విశ్వ సేవలో మీ సమయం గడుస్తుంది. ఈ స్థితి ముందు, చిన్న చిన్న విషయాలలో సమయాన్ని ఇవ్వడం బుద్ధి యొక్క శక్తిని వ్యర్థము చేసుకోవడం బాల్యపు ఆటగా అనిపించడంలేదు కదా! లౌకికరీతిలో కూడా రచయిత హద్దులోని బ్రహ్మగా, విష్ణువుగా అవుతారేకాని శంకరునిగా అవ్వరు. అలాగే హద్దులోని స్థితిలో ఉండేవారు కూడా వ్యర్థం సంకల్పాల రచయితగా అవుతారు. పాలన కర్తలుగా కూడా అవుతారు, కాని వినాశకారులుగా అవ్వలేరు ఎందుకంటే మీరు హద్దులోని స్థితిలో స్థితులై ఉన్నారు. బేహద్దులోని స్థితిలో స్థితులై ఉన్నట్లయితే మీలోపలి విషయాన్ని వదలండి, మొత్తం విశ్వంలోని వ్యర్థ సంకల్పాలు లేక వికర్మల లేక వికారాలను వినాశనం చేసే వినాశకారులుగా అవ్వగలరు! లాస్ట్ స్థితి వినాశకారీ స్థితి. ఎప్పుడైతే కళ్యాణకారులుగా అవుతారో అప్పుడు వినాశకారులుగా అవుతారు, ఇటువంటి స్థితి ఉంది కదా! హద్దులను ఇప్పుడు వదిలివేసారు కదా! అచ్ఛా!
ఈ విధంగా సదా విశ్వకళ్యాణకారీ స్మృతి మరియు సేవలో స్థితులై ఉండే మహాన్ ఆత్మలకు నమస్తే. ఓం శాంతి.
Comments
Post a Comment