21-05-1970 అవ్యక్త మురళి

* 21-05-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "భిన్నతను తొలగించేందుకు యుక్తి."
                   
ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరిలో రెండు విషయాలను చూస్తున్నారు, ఏ రెండు విషయాలను చూస్తున్నారు? బాప్ దాదా చూస్తున్నది కూడా చూస్తున్నారా? అటువంటి స్థితి ఇప్పుడు రానుంది. ఏవిషయమునైనా వాణి ద్వారా విన్న తరువాత తెలునుకున్నంత స్పష్టంగా ఇతరుల సంకల్పాలను తెలుసుకుంటారు. మాస్టర్ జానీ జానన్ హార్(సర్వమూ తెలిసినవారు) అన్న ఈ డిగ్రీ కూడా యథా యోగ్యంగా యథా శక్తిగా తప్పక ప్రాప్తిస్తుంది. మరి ఈ రోజు ఏం చూస్తున్నారు? పురుషార్థులైన ప్రతి ఒక్కరి పురుషార్థములో ఇంతవరకు ఏ మార్జిన్ ఉండిపోయింది. ఒకటేమో ఆ మార్జిన్ ను చూస్తున్నారు, రెండవది - ప్రతి ఒక్కరి మైట్ ను (శక్తిని) చూస్తున్నారు. మార్జిన్ ఎంత ఉంది, శక్తి ఎంత ఉంది? రెండింటికీ ఒకదానితో మరొకదానికి సంబంధము ఉంది. ఎంత మైటో అంత మార్జిన్. కావున పురుషార్థుల ప్రతి ఒక్కరి మైట్ మరియు మార్జిన్ ను చూస్తున్నారు. కొందరు చాలా సమీపము వరకు చేరుకున్నారు, కొందరు చాలా దూరములో ఉండిపోయి గమ్యమును చూస్తున్నారు. మరి భిన్న భిన్న పురుషార్థుల భిన్న భిన్న స్థితులను చూసి ఏమి ఆలోచిస్తూ ఉండవచ్చు? భిన్నతను చూసి ఏమని ఆలోచిస్తూ ఉండవచ్చు?

బాప్ దాదా పిల్లలందరికీ మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా అయ్యే చదువును చదివిస్తారు. ప్రాక్టికల్ లో భగవంతునికి ఎంతగా సాకార సంబంధములో సమీపంగా వస్తారో అంతగా పురుషార్థములో కూడా సమీపంగా వస్తారు. మీ పురుషార్థము మరియు ఇతరుల పురుషార్థమును చూసి ఏం ఆలోచిస్తారు? బీజమైతే అవినాశి. అవినాశీ బీజమునకు సాంగత్యమనే జలమును పొయ్యాలి, అప్పుడే ఫలాలు వస్తాయి. కావున ఇప్పుడు ఫల స్వరూపమును చూపించాలి. ఫలాల కోసమే వృక్షమును గురించి శ్రమ తీసుకుంటారు కదా! కావున ఎవరైతే జ్ఞాన పోషణను తీసుకున్నారో దానికి ఫలితంగా ఫల స్వరూపులుగా అవ్వాలి. మరి ఈ భిన్నత ఏదైతే ఉందో అది ఎలా తొలగిపోతుంది? భిన్నతను తొలగించేందుకు సహజ ఉపాయము ఏది? ఇప్పటి ఈ భిన్నత అంతిమం వరకు ఉంటుందా లేక తేడా వస్తుందా? సంపూర్ణ స్థితిని ప్రాప్తి చేసుకున్న తరువాత ఇప్పటి పురుషార్టీ జీవితములోని భిన్నత ఉంటుందా? ఇప్పటి ఈ భిన్నతను, ఐక్యతలోకి తీసుకురావాలి. ఐక్యత కొరకు వర్తమానములోని భిన్నతను తొలగించవలసి ఉంటుంది. బాప్ దాదా ఈ భిన్నతను చూస్తూ కూడా ఐక్యతనే చూస్తారు. ఐక్యత కొరకు రెండు విషయాలను తీసుకురావలసి ఉంటుంది. ఒకటి ఏకనాములుగా అయ్యి ఎల్లప్పుడూ ప్రతి విషయములో ఒక్కరి నామన్నే ఉచ్ఛరిస్తూ ఉండండి, రెండవది ఎకానమీ గలవారిగా (పొదుపు కలవారిగా) అవ్వండి. ఎందులో ఎకానమీ? సంకల్పాలలో కూడా ఎకానమీ కావాలి, సమయము మరియు జ్ఞాన ఖజానాల విషయములో కూడా ఎకానమీ అవసరము. అన్ని రకాల పొదుపును నేర్చుకున్నప్పుడు ఏమౌతుంది? అప్పుడిక నేను అన్నది తొలగిపోయి అన్ని భిన్నత్వాలు ఒక్క తండ్రిలో ఇమిడిపోతాయి. ఒక్కదానిలో ఇమిడ్చే శక్తి కావాలి. అర్ధమైందా? ఈ పురుషార్థము ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే అంతగానే దానిని ఎక్కువ చెయ్యాలి. ఏ కార్యములోనూ ఏవిధముగానూ నాది అనేది ఉండకూడదు, ఒక్కరి పేరే ఉండాలి. అప్పుడేమౌతుంది? బాబా - బాబా అని అనటం ద్వారా మాయ పారిపోతుంది. నేను - నేను అని అంటే మాయ హతమార్చేస్తుంది. కావున ప్రతి విషయంలో భాషను మార్చేయ్యండి అని ఇంతకు ముందు కూడా వినిపించడం జరిగింది. బాబా - బాబా అనే ఢాలును ఎల్లప్పుడూ మీ తోడుగా ఉంచుకోండి. ఈ ఢాలు ద్వారా ఏ విఘ్నాలైనా సమాప్తమైపోతాయి. దీనికి తోడుగా ఎకానమీ చెయ్యటం వలన వ్యర్థ సంకల్పాలు కలుగవు. అలాగే వ్యర్ధ సంకల్పాల ఘర్షణ కూడా ఉండదు - ఇదీ స్పష్టీకరణ. అచ్చా! ఎవరెవరైతే వెళ్ళనున్నారో, వారు ఏమిచేసి వెళతారు? ఎవరైనా ఎక్కడినుండైనా వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడినుండైతే వెళ్ళిపోతారో అక్కడ తమ స్మృతి చిహ్నమును ఇచ్చి వెళ్ళవలసి ఉంటుంది. కావున వెళ్ళేవారందరూ ఏదో ఒక విశేషమైన స్మృతి చిహ్నమును ఇచ్చి వెళ్ళాలి.

సరళమైన స్మృతి ఎవరికి ఉంటుంది? తెలుసా? స్వయము ఎవరు ఎంత సరళంగా ఉంటారో వారి స్మృతి కూడా అంతగానే సరళంగా ఉంటుంది. స్వయములోని సరళతా లోపము కారణంగా స్మృతి కూడా సరళంగా ఉండదు. సరళచిత్తులుగా ఎవరు ఉండగలరు? ప్రతి విషయములో ఎవరు ఎంతగా స్పష్టంగా ఉంటారో అనగా స్వచ్ఛంగా ఉంటారో వారు అంత సరళంగా ఉంటారు. ఎంత సరళంగా ఉంటారో అంతే సరళ స్మృతి కూడా ఉంటుంది. అంతేగాక ఇతరులను కూడా సరళ పురుషార్థులుగా తయారు చెయ్యగలరు. స్వయం ఎవరు ఎలా ఉంటారో అలాగే వారి రచనలో కూడా అదే సంస్కారము ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ వారి విశేష స్మృతి చిహ్నమును ఇచ్చి వెళ్ళాలి. అచ్ఛా!

Comments

  1. ఓంశాంతి, స్మృతి సరళంగా ఎవరికి ఉంటుంది? ఏ విఘ్నం అయినా సమాప్తి చేయడానికి ఏ ఢాలు సదా మీ వెంట ఉంచుకోండి? అన్ని రకాల పొదుపు నేర్చుకున్న వారు ఎలా అవుతారు? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete

Post a Comment