21-04-1973 అవ్యక్త మురళి

* 21-04-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "ఎలాంటి పేరో అలాంటి పని."

          పూజ్యనీయులుగా తయారుచేసే పరమపూజ్యపిత, రాజయుక్తులుగా తయారుచేసే రక్షకుడు,  వరదాని, మహాదాని, మధువన నివాసీ సోదరీలను చూస్తూ శివబాబా చెప్తుతున్నారు...

           ఈ గ్రూపును ఏ పేరుతో పిలవాలి? మధువన నివాసులను ఏమని పిలుస్తారు? ఇక్కడ ఎవరెవరైతే కూర్చున్నారో అందరూ స్వయమును ఈ విధంగా పదమా పదమ భాగ్యశాలులుగా భావిస్తూ నడుచుకుంటున్నారా? మధువన నివాసుల కారణంగానే మధువనానికి మహిమ ఉంది. మధువనపు వాతావరణమును తయారుచేసేవారు ఎవరు? కావున మధువనం యొక్క మహిమ ఏదైతే గాయనం చేయబడ్డదో అదే మహిమను ప్రతి ఒక్కరూ మీ జీవితంలో అనుభవం చేసుకుంటున్నారా?

           మధువనమును మహాన్ భూమి అని అంటారు. మహాన్ భూమిలో నివసించేవారు తప్పకుండా మహాన్ ఆత్మలే కదా! కావున ఆ మహాన్ ఆత్మలము మేమే అన్న ఆత్మిక నషాలో ఉంటున్నారా? ఎవరి యొక్క ప్రతి కర్మ మరియు ప్రతి సంకల్పము మహాన్‌గా ఉంటుందో వారే మహాన్ ఆత్మలు. ఎవరి యొక్క ఒక్క సంకల్పము కూడా సాధారణంగా లేక వ్యర్థంగా ఉండదో, ఒక్క కర్మ కూడా సాధారణంగా లేక అర్థరహితంగా ఉండదో అలా ఉన్నారా? ఎందుకంటే వారి ప్రతి అడుగు అర్థసహితంగా ఉంటుంది. మరి ఈ విధంగా అర్థస్వరూపమైన మహాన్ ఆత్మలుగా ఉన్నారా? వారినే మహాన్ అనగా మధువన నివాసులు అని అంటారు.

           వారి పేరే మధువన నివాసులు. మరి తప్పకుండా వారి పేరు అర్థ సహితంగా ఉంటుంది కదా! కావున ఈ విధంగా ప్రతిరోజూ మీ లెక్కాచారమును- ఈ కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మలు జరిగినా అవి అర్థ సహితంగా జరిగాయా అని లెక్కాపత్రమును పరిశీలించుకోండి. సమయం కూడా ఏదైతే గతించిందో అది సఫలమైందా అనగా దానిని మహాన్ కార్యంలో వినియోగించామా? ఈ విధంగా మీ లెక్కాపత్రమును పరిశీలించుకుంటున్నారా లేక కేవలం బాహ్యంగా స్థూలమైన రూపాల్లో మాత్రమే చూస్తున్నారా? ఈ విధంగా మేము మా పరిశీలనను చేసుకుంటున్నాము అని భావించేవారు చేతులెత్తండి. మహాన్ ఆత్మల ప్రతి కర్మ చరిత్ర రూపంలో గాయనం చేయబడుతుంది. మహాన్ ఆత్మల హర్షితమూర్త, ఆకర్షణామూర్త మరియు అవ్యక్తమూర్త రూపంలో స్మృతి చిహ్నము ఉంది. కావున రోజంతటిలో మా మూర్తి లేక స్థితి ఏదైతే ఉందో అది మూర్తిగా అయి పూజింపబడేందుకు యోగ్యంగా ఉందా? మా కర్మలు చరిత్ర రూపంలో గాయనం చేయబడే విధంగా ఉన్నాయా? అని పరిశీలించుకోండి. ఈ లక్ష్యమైతే ఉంది కదా!

           ఇక్కడకు చూసేందుకు, చదువుకునేందుకు వచ్చినప్పుడు మరి మీ అంతిమ లక్ష్యము ఏమిటి? లేక సంగమ యుగపు లక్ష్యము ఏమిటి? ఇదే కదా! సంగమ యుగపు కర్మలే చరిత్ర రూపంలో గాయనము చేయబడతాయి. సంగమ యుగపు ప్రత్యక్ష జీవితము దేవతా రూపంలో పూజింపబడుతుంది. కావున అది ఎప్పుడు జరుగుతుంది? అది ఇప్పటి గాయనమైనప్పుడు మరి అది కూడా ఇప్పుడే జరుగుతుంది కదా! లేక సత్యయుగంలో అలా అవుతారా? అక్కడైతే అందరూ హర్షితంగా ఉంటారు. కావున వీరు హర్షితముఖులుగా ఉన్నారు అని ఎవరంటారు? అలాగని ఇప్పుడే అంటారు కదా? ఎవరైతే సదా హర్షితంగా ఉండరో వారే వీరు హర్షితముఖులుగా ఉన్నారు అని వర్ణన చేస్తారు. మరి ఇటువంటి మూర్తి లేక ఇటువంటి కర్మలు ప్రాక్టికల్ గా ఉన్నాయా?

           ఇప్పుడు వినే సమయములో నవ్వుతున్నారు అనగా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు నవ్వుతున్నారు? అర్థం చేసుకుంటున్నారు, కావుననే నవ్వుతున్నారు. అలాగే ప్రతిరోజూ మీ కర్మలను అర్థం చేసుకుంటూ పరిశీలించుకోవటము ద్వారా ఎవరయినా అడిగినా వెంటనే జవాబును ఇవ్వగలరు. చేతులు ఎత్తాలా వద్దా అని ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, వెంటనే చేతులు ఎందుకు ఎత్తడం లేదు? సంకోచము కూడా ఎందుకు కలుగుతుంది? దానికి కారణము ఏమిటి? అలాగే మీ సంపూర్ణ స్థితిని స్వరూపములోకి తీసుకురండి. కేవలం వాణిలోకి కాదు, స్వరూపములోకి తీసుకురండి. మీ ముందుకు ఎవరు వచ్చినా, మీ జడ చిత్రాల ముందుకు వెళ్ళగానే వారిని చాలా మహాన్ గా మరియు స్వయమును పాపులుగా, నీచులుగా సహజముగానే భావిస్తారు అనగా ఒక్క క్షణములో స్వయమును సాక్షాత్కరింప జేసుకుంటారు. నీవు నీచముగా ఉన్నావు అని మూర్తి అనదు, కానీ స్వయమే సాక్షాత్కారము చేసుకుంటారు. అలాగే మీ ముందుకు కూడా ఎవరైనా వచ్చినప్పుడు వీరు ఎలా ఉన్నారు మరియు నేను ఎలా ఉన్నాను అన్నది అనుభవం చేసుకోవాలి. ఈ స్థితి అయితే రావలసిందే కదా! అది ఎప్పుడు వస్తుంది? జ్ఞానపు కోర్సు సమాప్తమై రివైజ్ కోర్సు జరుగుతున్నప్పుడు, మరి కేవలం థియరీలో రివైజ్ అవుతోందా లేక ప్రాక్టికల్ లో రివైజ్ అవుతోందా? ప్రాక్టికల్ లో కూడా కోర్సు పూర్తవ్వాలి కదా? లేక ఎప్పుడైతే రివైజ్ సమాప్తమవుతుందో అప్పుడు ప్రాక్టికల్ లో చూపిస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? దీని కొరకు సమయం కోసం ఎదురు చూస్తున్నారా? సమయమొస్తే అన్నీ సరైపోతాయి అని భావిస్తున్నారా? ఇలా అనుకుంటున్నారా? ఈ క్లాసును ఎప్పుడైనా చేసారా? మీ పురుషార్ధమును తీవ్రతరం చేసేందుకు మీ శక్తి అనుసారముగా ఎప్పుడయినా ప్లానును తయారు చేస్తున్నారా లేక ప్లాను తయారయి లభిస్తే దాని అనుసారముగా నడుచుకుంటారా?

           మధువన నివాసులు ఎవరైతే ఉన్నారో వారు అందరి ముందు ఉదాహరణ మూర్తులుగా ఉన్నారు అనే బాప్ దాదా చూస్తూ ఉంటారు. సాంపుల్ ను మొదట తయారుచేస్తారు కదా! మధువన నివాసులు సాంపుల్ గా ఉన్నారా లేక సాంపుల్ గా ఇంకా తయారవ్వాలా? ఎప్పుడైతే సాంపుల్ తయారవుతుందో దానివైపుకు సూచిస్తూ ఇటువంటి సామాను తయారవుతోంది అని చూపిస్తారు, అప్పుడు దానిని చూసి ఇతరులు వ్యాపారము చేస్తారు. మొదట సాంపుల్ తయారవ్వడము ద్వారా బాప్ దాదా ఇలా తయారవ్వాలి అని సూచిస్తారు. సాంపుల్ గా అయ్యేందుకు కష్టమైన పురుషార్థమేమీ లేదు. చాలా సింపుల్ పురుషార్థమే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాబా సింబల్‌ను మీ తోడుగా మీ ముందు ఉంచుకోండి. ఒక్క విషయపు పురుషార్థము చాలా సహజము కదా? సదా బాబా సింబల్ మీ ముందు ఉన్నట్లయితే పురుషార్థము సింపుల్‌గా అయిపోతుంది. పురుషార్థము సింపుల్‌గా అయిపోతే సాంపుల్ గా అయిపోతారు.

           మధువన నివాసులకు ఎన్ని ఇంజన్లు ఉన్నాయి? (నాలుగు అని ఒకరు అన్నారు) మరి ఒక్క క్షణములో చేరుకోవాలి కదా! అందరికన్నా  సహజ పురుషార్థపు లాభము లేక గోల్డెన్ చాన్స్ మధువన నివాసులకు లభించింది. ఇది కూడా ఒప్పుకుంటారు, ఒప్పుకోవడము మరియు అంగీకరించడములోనూ చురుకుగా ఉన్నారు, అలాగే చెప్పడంలో కూడా చురుకుగా ఉన్నారు, కానీ మాననీయ యోగ్యులుగా అవ్వడంలో ఆలస్యము ఎందుకు? ఎంతగా మాననీయ యోగ్యులుగా అవుతారో అంతగా అక్కడ పూజనీయ యోగ్యులుగా అవుతారు. ఇక్కడ మీ కర్మలను చూసేవారు శ్రేష్టముగా భావించకపోతే మరి పూజించేవారు కూడా శ్రేష్టముగా భావిస్తూ పూజారులుగా ఎలా అవుతారు? ఎంతగా మాననీయులుగా అవుతారో అంతగా పూజ్యనీయులుగా అయ్యే లెక్క ఉంది. ఎవరయితే పూజ్యనీయులుగా అవుతారో వారిని ఇతరులు చూసి హర్షితులుగా అవుతారు. ఇప్పుడు అలా అవ్వాలా లేక కేవలం చూస్తూ హర్షితులుగా అవ్వాలా? ఎంతగా వినిపించేవారిగా అవుతారో అంతగానే సారయుక్తముగా కూడా అవ్వండి. వినాలనుకునే వారు కూడా ఎందరు ఉంటారు! ఇందులో అయితే పాస్ అయ్యారు కదా! ఎంతగా వినిపించే వారిగా ఉంటారో అంతగా సార యుక్తులుగా అవ్వండి. ఎవరయితే రహస్యమునెరిగిన వారిగా ఉంటారో వారి ప్రతి అడుగులోనూ రహస్యము ఇమిడి ఉంటుంది. ఈ విధముగా రహస్యమునెరిగిన వారిగా లేక వినిపించే వారిగా అవ్వడంలో బ్యాలెన్సు సరిగ్గా ఉంచుకోవాలి.

           మధువన నివాసులు చాలా అదృష్టతారలు. ఎంతగా అదృష్టవంతులుగా ఉన్నారో అంతగా సర్వులకు ప్రియమైనవారిగా కూడా అవ్వండి. కేవలం అదృష్టములోనే సంతోషపడిపోకండి, అదృష్టవంతులను తమ ప్రియత్వాన్నిబట్టే గుర్తించడం జరుగుతుంది. ఎవరైతే అదృష్టవంతులుగా ఉంటారో వారు సర్వులకు ప్రియమైనవారిగా తప్పకుండా ఉంటారు. ఇప్పుడు చూస్తూ, నడుస్తూ అందరికీ స్నేహమును ఇచ్చే లేక చేసే కార్యమును చేయాలి. జ్ఞానమును ఇవ్వడము మరియు తీసుకోవడము అనే స్టేజినయితే దాటివేసారు, ఇప్పుడిక ఇచ్చిపుచ్చుకోవడం చేయండి. మీ ముందుకు ఎవరు వస్తారో, సంబంధములోకి ఎవరు వస్తారో వారికి స్నేహమునివ్వాలి, తీసుకోవాలి, దీనినే సర్వులకు స్నేహులుగా లేక లవ్లీగా అవ్వడము అని అంటారు. జ్ఞానదానమును బ్రాహ్మణులకు ఇవ్వనక్కరలేదు, దానిని అజ్ఞానులుకు ఇవ్వడం జరుగుతుంది. బ్రాహ్మణ పరివారములో ఈ దానము యొక్క మహాదానులుగా అవ్వండి. దానము ఇస్తే గ్రహణము వదులుతుంది అన్న గాయనము ఉంది కదా! ఏయే బలహీనతలైతే మిగిలి ఉన్నాయో ఆ గ్రహణాలన్నీ ఈ మహాదానము ద్వారా విముక్తమైపోతాయి. అర్థమయ్యిందా? ఇప్పుడు ఈ దానములో ఎవరెవరు మహాదానులుగా అవుతారో చూద్దాము. స్నేహము కేవలం వాణిది కాదు, సంకల్పములో కూడా ఎవ్వరిని గూర్చి స్నేహము తప్ప ఇంకేమీ ఉత్పన్నమవ్వకూడదు. ఎప్పుడైతే అందరి పట్లా స్నేహము ఉంటుందో అప్పుడు స్నేహానికి ఫలముగా సహయోగము లభిస్తుంది. సహయోగానికి ఫలితముగా సఫలత లభిస్తుంది. ఎక్కడయితే సర్వుల సహయోగము ఉంటుందో అక్కడ సఫలత తప్పక లభిస్తుంది. కావున అందరూ సఫలతామూర్తులుగా అయిపోతారు కదా! ఇప్పుడు ఈ రిజల్టును చూద్దాము. అచ్ఛా!

Comments