21-01-1971 అవ్యక్త మురళి

 * 21-01-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“అవ్యక్త వతనపు అలౌకిక నిమంత్రణ"
            
                 ఈ రోజు మిలనము చేసేందుకు పిలిచారు. అవ్యక్త స్థితిలో స్థితులయినప్పుడే ఈ అవ్యక్తమిలనమును జరుపుకోగలరు, అర్థం చేసుకోగలరు. ఎవరెవరు ఎంత శక్తి స్వరూపంగా అయ్యారు అన్నదానిని ఈ రోజు చూస్తున్నారు. మీ చిత్రాలలో నెంబర్ వారీగా శక్తుల స్మృతి చిహ్నము కనిపించింది. ఏ చిత్రాల ద్వారా శక్తుల పరిశీలనను చెయ్యగలరు, తెలుసా? మీకు మీ శక్తులను పరిశీలించే చిత్రాలు తెలియదు. భిన్న భిన్నమైన నెంబర్ వారీ శక్తుల స్మృతి చిహ్నము తయారుచేయబడింది. మీ చిత్రాలను మర్చిపోయారా! శక్తుల చిత్రాలలో భిన్న భిన్నరూపాల ద్వారా మరియు భుజాల రూపంలో నెంబర్ వారీగా శక్తుల స్మృతి చిహ్నము ఉంది. ఆ చిత్రాలలో ఒక్కో దాంట్లో కొన్ని, ఒక్కో దాంట్లో మరికొన్ని భుజాలనూ చూపిస్తారు. కొన్నింటిని అష్ట శక్తులను ధారణ చేసేవిగా తయారుచేస్తారు, కొన్నింటిని వాటికంటే అధికంగా, కొన్నింటిని వాటికంటే తక్కువగా తయారుచేస్తారు. కొన్నింటికి 4 భుజాలు, కొన్నింటికి 8 భుజాలు, కొన్నింటికి 16 భుజాలు ఉన్నట్లుగా కూడా చూపిస్తారు, నెంబర్ వారీగా ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరూ ఎన్ని శక్తులను ధారణ చేసారు అన్నదానిని ఈ రోజు చూస్తున్నారు. మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారు కదా! మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సర్వ శక్తులనూ ధారణ చేసేవారు. మీ శక్తి స్వరూపము సాక్షాత్కారమౌతుందా? అవ్యక్త వతనములో ప్రతి ఒక్కరి శక్తిరూపము చూసినప్పుడు ఏం కనిపించి ఉండవచ్చు? వతనములో కూడా బాప్ దాదాల అలౌకిక ప్రదర్శని(ఎగ్జిబిషన్) ఉంది. అందులో ఎన్ని చిత్రాలు ఉండచ్చు? మీ చిత్రాలను లెక్కపెట్టవచ్చు, కానీ బాప్ దాదాల ప్రదర్శనీలోని చిత్రాలను లెక్కపెట్టగలరా? బాప్ దాదా నిమంత్రణను ఇస్తున్నారు. నిమంత్రణ ఇచ్చేవారు నిమంత్రణను ఇస్తారు, కానీ చేరుకోవటము వచ్చేవారి పని. బాప్ దాదా మీ అందరికీ కోటానురెట్లు ఎక్కువ సంతోషంతో నిమంత్రణను ఇస్తారు. ప్రతి ఒక్కరికీ అనుభవమవ్వగలదు. అవ్యక్తస్థితి అనుభవమును కొద్ది సమయము నిరంతరంగా చేసినట్లయితే, ఎలా అనుభవమవుతుందంటే, ఏవిధంగా సైన్సు ద్వారా దూరపు వస్తువులు ఎదురుగా ఉన్నట్లుగా కనిపిస్తాయో అలాగే అవ్యక్త వతనపు ఏక్టివిటీ(కార్యక్రమము) ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. బుద్ధిబలము ద్వారా మీ సర్వశక్తివంతమైన స్వరూపపు సాక్షాత్కారమును చెయ్యగలరు. వర్తమాన సమయములో స్మృతి తక్కువైన కారణంగా సమర్థులుగా కూడా లేరు. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థమైన కర్మలు జరుగుతున్న కారణంగా సమర్థులుగా అవ్వలేరు. వ్యర్థమును తొలగించినట్లయితే సమర్థులుగా అయిపోతారు. ప్రతి ఒక్కరి పురుషార్థపు భిన్న భిన్న స్వరూపాలను వతనములో చూస్తూ ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది. వతనములో ప్రతి ఒక్కరి అనేక రూపాలను చూసినట్లుగా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు అంతగా చూడకపోవచ్చు. మీరు కూడా ఒకరోజు పూర్తి అటెన్షన్ ను ఇచ్చి మొత్తము రోజంతటిలో నా రూపాలు ఎన్ని ఉన్నాయి మరియు ఎలాంటి రూపాలు ఉన్నాయి అన్నదానిని చూసుకోండి, అప్పుడు మీ భిన్న భిన్న ఫోజు(భంగిమ)లను చూసి మీకు చాలా నవ్వు వస్తుంది. ఈ రోజుల్లో ఒక్కరికే అనేక ఫోజులను తీస్తుంటారు. కావున మీవి కూడా చూసుకోవాలి. మీ బహురూపాల సాక్షాత్కారమును చేసుకోండి. వతనములోకి రావాలన్న మనసైతే అందరికీ ఉంటుంది, కానీ బ్రాహ్మణత్వపు కర్తవ్యమేదైతే చేయాలో దానినంతా చేసానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అన్ని కర్తవ్యాలను సంపన్నంగా చేసిన తరువాతనే సంపూర్ణంగా అవుతారు. ఇప్పటి సమయము ఎలా నడుస్తుందంటే, ప్రతి ఒక్క అడుగూ అటెన్షన్ ను పెట్టి నడవాల్సి ఉంటుంది. అటెన్షన్ లేని కారణంగా పురుషార్థమును గురించి కూడా టెన్షన్ లో ఉంటారు. ఒకవైపు వాతావరణపు టెన్షన్ ఉంటే మరొకవైపు పురుషార్థపు టెన్షన్ ఉంటుంది. కావున కేవలము ఒక్క మాటను గుర్తుంచుకోండి - అటెన్షన్. అప్పుడీ బహురూపాల స్వరూపము ఒక్క సంపూర్ణరూపంగా అయిపోతుంది. కావున ఇప్పుడు అడుగడుగులో అటెన్షన్. ఈ రోజుల్లో ఆత్మలందరూ సుఖశాంతులను అనుభవము చేసుకోవాలని కోరుకుంటున్నారని వినిపించడం జరిగింది కదా, ఎక్కువ వినాలని కోరుకోవటం లేదు! అనుభవము చేయించేందుకు స్వయం అనుభవ స్వరూపంగా అయినప్పుడు సర్వ ఆత్మల కోరికను పూర్తి చెయ్యగలరు. ఏవిధంగా ధనము లేని బికారి భిక్ష తీసుకొనేందుకు వస్తాడో అలా శాంతి అనుభవము లేని బికారీ ఆత్మలు భిక్షను తీసుకోవాలని నానాటికీ తపించడం రోజు రోజుకీ ఎక్కువవ్వడం చూస్తారు. ఇప్పుడు కేవలము ఒక్క దుఃఖపు అల వచ్చినా అలలలో తేలుతున్న ఆత్మలు లేక అలలలో మునిగిపోతున్న ఆత్మలు ఒక్క గడ్డిపోచ ఆధారమునకైనా ఎలా అయితే వెతుకుతారో అలా మీ ముందుకు అనేక బికారీ ఆత్మలు ఇటువంటి భిక్షను యాచించేందుకు వస్తారు. మరి అటువంటి తపిస్తున్న లేక బికారీ, దాహార్తి ఆత్మల దాహమును తీర్చేందుకు మీరు అతీంద్రియ సుఖము మరియు సర్వ శక్తులతో నిండుగా అయి ఉన్న అనుభవమును చేస్తున్నారా? మీ స్థితిని స్థిరంగా ఉంచుకొనేంతగా మరియు అన్య ఆత్మలను కూడా సంపన్నంగా తయారుచెయ్యగలిగేంతగా సర్వ శక్తుల ఖజానాలు, అతీంద్రియ సుఖపు ఖజానా అంతగా జమ అయి ఉండాలి. సర్వుల ఒడిని నింపే దాత పిల్లలు కదా! ఇప్పుడు ఇటువంటి దృశ్యము చాలా త్వరగా మీముందుకు వస్తుంది.

                    ఈ రోగమునకు మందును డాక్టర్లు కూడా ఇవ్వలేకపోతారు, అప్పుడు ఈ మందును తీసుకొనేందుకు మీవద్దకు వస్తారు. సుఖ-శాంతుల అనుభవము బ్రహ్మాకుమారీల వద్ద దొరకుతుంది అన్న విషయము నెమ్మది-నెమ్మదిగా వ్యాపిస్తుంది. అనేక ఆత్మలు తిరుగుతూ-తిరుగుతూ అసలైన ద్వారము వద్దకు వచ్చి చేరుకుంటాయి. మరి అలా అనేక ఆత్మలను సంతుష్టపరిచేందుకు స్వయం మీ ప్రతి కర్మతో సంతుష్టంగా ఉండాలి. సంతుష్ట ఆత్మలే ఇతరులను సంతుష్టపరచగలరు. ఇప్పుడు ఇటువంటి సేవను చేసేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. అలా తపిస్తున్న ఆత్మలు 7 రోజుల కోర్సు వరకు కూడా ఆగలేరు, కావున ఆ సమయములో ఆ ఆత్మలకు ఏదో ఒక అనుభవమునకు చెందిన ప్రాప్తిని చేయించవలసి ఉంటుంది, కావున ఇప్పుడు మీ బ్రాహ్మణత్వపు కర్తవ్యమును సంపన్నము చేసేందుకు మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తయారుచేసుకుంటూ ఉండండి అని చెప్పడం జరిగింది. ఎటువంటి సేవను చెయ్యాలో ఇప్పుడు అర్థమైందా? ఎప్పటివరకైతే మీరు వ్యక్తములో బిజీగా ఉంటారో అప్పటివరకూ బాప్ దాదా అవ్యక్తములో కూడా సహాయకులుగా ఉన్నారు కదా. ధైర్యము పిల్లలది సహాయము తండ్రిది. కావున చెప్పండి, ఎక్కువ బిజీగా ఎవరు ఉన్నారు? ప్రారంభములో వతనపు అనుభవమును చేయించేవారు కదా, అప్పుడు ధ్యానములోకి వెళ్ళే వారి కంటే బాగా అనుభవము చేసుకునేవారు (బాబా, ఇప్పుడు కూడా మీరు అలా అనుభవము చేయించండి) అనుభవము చేసుకోండి, బుద్ధి విమానమైతే ఉండనే ఉంది. కొంతమంది పిల్లలు ఏదో కావాలని పట్టుపడుతూ  ఉంటారు, అప్పుడు తండ్రి దానిని గౌరవించవలసి ఉంటుంది. ఇప్పుడు అనుభవము చేసుకోవాలని పట్టు పట్టండి. అచ్ఛా!

"పార్టీలతో  మిలనము"
                  
                  ప్రజలైతే త్రేతాయుగపు అంతిమములోని వారు కావాలి. ద్వాపరయుగము కొరకు భక్తులు కావాలి. భక్తులను కూడా తయారుచెయ్యండి మరియు ప్రజలను కూడా తయారుచెయ్యండి. ఇప్పుడైతే ఎటువంటి సమయము వస్తుందంటే ఇస్తూ వెళ్ళండి, ఒడిని నింపుతూ వెళ్ళండి. ఎంతగా తపిస్తున్న ఆత్మలు వస్తారంటే, వారికి బిందువంత ఇచ్చినా గానీ సంతోషపడిపోతారు. అటువంటి సమయము ఇప్పుడు రానుంది. మినిట్ మోటార్( క్షణములో తయారుచేసే యంత్రాలు) అని ఏవిధంగా వారు వినిపిస్తారో అటువంటి మషినరీలా నడుస్తుంది. దృష్టి, వృత్తి, స్మృతి, వాణి అన్నింటితో సేవ జరుగుతుంది. మీ ఇల్లు కూడా ఆశ్రమమే, వాటి నుండి ఎవరైతే తయారవుతారో వారు స్వయం సెంటరుకు వెళ్లే వరకు ఆగలేకపోతారు. వీరైతే సేవ స్థాపనలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. మీరైతే తయారైయున్న సమయములో వచ్చారు. వీరు కష్టపడి వెన్నను తీసారు, తినే సమయానికి మీరు వచ్చారు, కానీ వెన్నను తినేవారు ఎంతటి శక్తివంతంగా ఉండాలి! ఎల్లప్పుడూ దీనినే ధ్యానములో ఉంచుకోండి - సంపర్కములోకి ఏ ఆత్మలు వచ్చినా గానీ వారికి ఏది ఆవశ్యకమో అది లభించాలి. రొట్టె అవసరమైనవారికి నీటిని ఇచ్చినట్లయితే.... కొందరికి గౌరవమును ఇవ్వవలసి ఉంటుంది, అటువంటి వారిని వెళ్లి చాపపై కూర్చో అని చెప్పినట్లయితే వారు ఎలా కూర్చుంటారు! కొందిరిని చాపపై కూర్చోపెట్టి కోర్సు ఇవ్వవలసి ఉంటుంది, కొందరిని సోఫాపై కూర్చోపెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు గవర్నరు వచ్చినప్పుడు ఏం చేసారు? గౌరవాన్ని ఇచ్చారు కదా! ఒకవేళ అలవాటు ప్రకారం నడిపించినట్లయితే నడవలేరు. కొన్నిచోట్ల గౌరవాన్ని ఇచ్చి, తీసుకోవలసి ఉంటుంది. అందరికీ ఒకే విధమైన డోస్(మోతాదు) ఇచ్చినట్లయితే అనారోగ్యులుగా కూడా అయిపోతారు. ఈ రోజుల్లో డాక్టర్ల వద్దకు పేషంటు వెళ్ళినప్పుడు దీర్ఘకాలిక కోర్సును ఇష్టపడరు, రాగానే ఇంజెక్షన్ ఇవ్వాలి, అయిపోవాలి. ఇక్కడ కూడా అలాగే, రాగానే ఎగిరేలా చేయాలి. అటువంటి సేవను చేస్తున్నారా? స్వభావము ద్వారా కూడా సేవను చెయ్యగలరు. డ్రామా అనుసారంగా ఎవరి స్వభావమైనా మంచిది లభించినట్లయితే ఆ స్వభావము కూడా సహాయకారి అవుతుంది. ఎవరినైనా సహచరిగా చేసుకొని అనుభవముతో కూడా ప్రభావితము చెయ్యగలరు. వీరు జ్ఞానమును విననే వినరు అని వదిలెయ్యకండి. మొదట సంపర్కములోకి తీసుకొని వచ్చి పిదప సంబంధములోకి తీసుకురండి. స్వభావముతో కూడా ఎవరినైనా సమీపములోకి తీసుకురాగలరు. ఈ ప్రయోగము చెయ్యండి.

          1. మీరందరూ విశ్వ కల్యాణమునకు ఆధారమూర్తులు. మిమ్మల్ని మీరు ఆధారమూర్తులుగా భావించినట్లయితే చాలామందిని ఉద్ధారము చెయ్యగలరు. ఎవరు ఇటువంటి సేవను చేస్తారో వారు ఆ ఖాతాలో జమచేసుకుంటారు. బ్యాంకులో కూడా భిన్న-భిన్న ఖాతాలు ఉంటాయి కదా! ఎవరెవరు ఎవరి సేవను చేసేందుకు నిమిత్తులుగా అవుతారో వారు ఆ సమయములో అటువంటి ఖాతాలోనే జమ అవుతారు. పునాదిని ఎంత లోతుగా వేస్తే అంత దృఢంగా ఉంటుంది. పునాదినైతే వేస్తారు కానీ లోతుగా వెయ్యాలి. సంపర్కములోకైతే తీసుకువచ్చారు. కానీ సంబంధములోకి తీసుకురావాలి అని వినిపించటం జరిగింది కదా, ఎవరైతే అనేకులను సంబంధములోకి తీసుకువస్తారో వారు దగ్గరి సంబంధములోకి వస్తారు. ఎవరైతే అనేకులను సంపర్కములోకి తీసుకువస్తారో వారు అక్కడ కూడా దగ్గరి సంపర్కములోకి వస్తారు.

           2. మొత్తము రోజంతటి లెక్కను సరియైన రీతిలో చూసుకోగలరా? గూడ్స్ బండిలా నెమ్మదిగా నడుస్తోందని అర్థమవుతోందా? బాప్ దాదాల సంస్కారాలతో కలవాలి. మీరు, ఎవరైతే సాకారరూపములో తోడుగా ఉండి ఒక్క క్షణములో సంకల్పములను, సంస్కారములను అనుభవము చేసుకున్నారో అలా వాటితో కలపాలి. ఇతరులు తమ బుద్ధియోగము ద్వారా వాటిని అనుభవము చేసుకోవలసి ఉంటుంది, కానీ మీరు కేవలము స్మృతులను మీ ముందుకు తీసుకురావలసి ఉంటుంది. కావున సంకల్పములను, సంస్కారములను కలుపుతూ ఉండాలి, సమయాన్ని నష్టము చేసుకోకూడదు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అన్న నిర్ణయాన్ని వెంటనే చెయ్యాలి. ఇలా చెయ్యటంలో సమయం కూడా మిగుల్తుంది మరియు బుద్ధి శక్తి ఏదైతే నష్టపోతుందో అది కూడా నష్టపోదు. మీ పురుషార్థముతో సంతుష్టంగా ఉన్నారా? సంపూర్ణంగా అయ్యేందుకు ఏ ప్లానును తయారుచేసారు? మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మార్చుకుంటారో అప్పుడే ఇతరుల సేవను చేస్తారు. సంతుష్టతలో సర్టిఫికేట్ లభించిందా? మీ మనస్సుకు ఇష్టులుగా అవ్వడముతో పాటు లోకమునకు కూడా ఇష్టులుగా అవ్వాలి. ఒకటి, ఎవరైతే నిమిత్తులుగా ఉంటారో వారు సర్టిఫికేటు ఇచ్చినట్లయితే లోకపసందులుగా అయినట్లు, రచనను కూడా సంతుష్టంగా ఉంచాలి. సంతుష్టంగా ఉన్నారా అన్నదానిని వారి నడవడిక నుండే క్యాచ్ చెయ్యాలి. మధువనమునకు వచ్చినప్పుడు నిమిత్త అక్కయ్యల ద్వారా మీ సర్టిఫికేట్‌ను తీసుకోవాలి. ఈ అన్ని సర్టిఫికేట్ లు ధర్మరాజపురిలో పనికివస్తాయి. దారిలో కారు నడిపేవారికి సర్టిఫికేట్ ఉన్నట్లయితే దానిని చూపించటం ద్వారా మార్గాన్ని ఏ విధంగా దాటుతాడో అలా ధర్మరాజపురిలో కూడా ఈ సర్టిఫికేట్ లు పనికి వస్తాయి. కావున ఎంత వీలైతే అంత సర్టిఫికెట్లు తీసుకువెళ్ళండి. ఎందుకంటే ట్రిబ్యునల్ లో కూడా ఈ మహారధులే కూర్చుంటారు. వీరి సర్టిఫికెట్లు పనికొస్తాయి. ఇక్కడ నుండి సర్టిఫికేట్‌ను తీసుకొని వెళ్ళటం ద్వారా ఇతర ఆత్మలను సంతోషపరిచే విశేషత వస్తుంది. అనుభవీ సోదరీలు అనేకులను సంతృప్తపరిచే శిక్షణను ఇస్తారు. అనేకులను సంతోషపరిచేందుకు యుక్తి - సర్టిఫికేట్.

          స్నేహులుగా అవ్వటం వస్తుందా లేక శక్తులుగా అవ్వటం వస్తుందా? శక్తిని నింపే రచయితల రచన కూడా శక్తిశాలి అయిన కారణంగా పురుషార్థములో ఒక్కోసారి ఒకలాగా, ఒక్కోసారి మరొకలాగా కింద మీదకు అవ్వటం జరుగదు. ఒకవేళ విద్యార్థులు పైకీ క్రిందకూ అవుతున్నారంటే, దాని ద్వారా వీరికి శక్తిని నింపే యుక్తి లేదు అని తెలుసుకోవచ్చు. సమీపంగా తీసుకురావటమే విశేషత. మాయను ఎదుర్కొనే విధంగా శక్తిశాలిగా తయారు చెయ్యాలి. దీనిని అదనంగా చేర్చాలి. విఘ్నాలు వచ్చినా గానీ ఎక్కువ సమయము ఉండకూడదు. రావాలి, వెళ్ళిపోవాలి - ఇదే శక్తి రూపమునకు గుర్తు. ఎవరైతే స్వయముతో సంతుష్టంగా ఉంటారో వారు ఇతరులతో కూడా సంతుష్టంగా ఉంటారు. ఇతరులెవరైనా అసంతుష్టంగా చేసినా కూడా స్వయం సంతుష్టంగా ఉన్నట్లయితే అందరూ వారితో సంతుష్టమైపోతారు. ఇతరుల లోపాన్ని తమ లోపంగా భావించి నడిచినట్లయితే స్వయం కూడా సంపూర్ణంగా అయిపోతారు. ఈ కారణంగా నా పురుషార్థం మంచిగా జరగటం లేదు అని ఎప్పుడూ భావించకండి. నా బలహీనత అని భావించటం ద్వారా ఉన్నతి త్వరగా జరగగలదు. లేదంటే ఇతరుల లోపాల తీర్పులలోనే ఎంతో సమయం గడిచిపోతుంది.

            సాకార స్నేహులా లేక నిరాకార స్నేహులా? ఎవరైతే నిరాకార స్నేహులుగా ఉంటారో వారిలో నిరాకారీ స్థితిలో ఎక్కువ సమయము స్థితులై ఉండే విశేషత ఎక్కువగా ఉంటుంది, సాకార స్నేహులు చరిత్రవంతులుగా ఉంటారు. వారి ఒక్కొక్క చరిత్ర సేవాయుతంగా ఉంటుంది. మరొకటి, వారు ఇతరులను కూడా స్నేహములోకి ఎక్కువగా తీసుకురాగలరు. నిరాకారీ, నిరహంకారీ - రెండూ సమానంగా ఉండాలి.

            బాలకులుగా అవ్వటం మంచిగా అనిపిస్తుందా లేక మాలికులు(యజమానులు)గా అవ్వటం మంచిగా అనిపిస్తుందా? ఎంత వీలైతే అంత సేవా సంబంధంలో బాలక్ పన్(పిల్లలుగా ఉండటము), మీ పురుషార్థపు స్థితిలో మాలిక్ పన్(యజమానులుగా ఉండటము). సంపర్కము మరియు సేవలో పిల్లలుగా, సృతియాత్ర  మరియు మంథనము చెయ్యటంలో యజమానులుగా, సహచరులు, సంగఠనలో పిల్లలుగా మరియు వ్యక్తిగతములో యజమానులుగా ఉండాలి - ఇదే యుక్తియుక్తముగా నడవటమంటే.

            సదా ఉల్లాన ఉత్సాహాలలో ఏకరసంగా ఉండేందుకు ఏ పాయింటు గుర్తు ఉండాలి? అందుకొరకు ఎల్లప్పుడూ ఎవరైతే సంబంధములోకి వస్తారో - వారు స్టూడెంట్లు అయినా, సహచరులయినా అందరినీ సంతుష్టపరచాలన్న ఉత్కంఠ ఉండాలి, ఉత్సాహంలో ఉండటం ద్వారా ఈశ్వరీయ ఉమంగ ఉల్లాసాలేవైతే ఉన్నాయో అవి సదా ఏకరసంగా ఉంటాయి. ఎవరిని చూసినా వారినుంచి అన్నివేళలా గుణాలనే స్వీకరిస్తూ ఉండండి. సర్వుల గుణాల బలము లభించడముతో సదాకాలము కొరకు ఉత్సాహము ఉంటుంది. ఉత్సాహము తక్కువగా ఉన్న కారణంగా ఇతరులలోని భిన్న భిన్న స్వరూపాలు, భిన్న భిన్న విషయాలను చూడటము, వినటము జరుగుతుంది. గుణాలను స్వీకరించాలన్న ఉత్కంఠత ఉన్నట్లయితే ఏకరస ఉత్సాహము ఉంటుంది. గుణలను దోచుకోవడము ద్వారా ఇతర చోరులు పారిపోతారు. సర్వులపై విజయులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? విజయులుగా అయ్యేందుకు ప్రతి ఒక్కరి హృదయములోని రాజ్(నిగూఢమైన రహస్యము)ను తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి నోటి నుండి వచ్చే మాటలనే చూసినట్లయితే వారి మనసులోని రహస్యమును తెలుసుకోలేరు. మనసులోని రహస్యమును తెలుసుకోవడం ద్వారా సర్వుల హృదయాలకు విజయులుగా అవ్వగలరు. మనసులోని రహస్యమును తెలుసుకొనేందుకు అంతర్ముఖత అవసరము. ఎంతగా రహస్యమును తెలుసుకుంటారో అంతగా సర్వులను రాజీ పరచగలరు. ఎంతగా రాజీ చేస్తారో అంతగా రహస్యమును తెలుసుకుంటారు, అప్పుడు విజయులుగా అవ్వగలరు.

            సరళచిత్తుల గుర్తు ఏమిటి? ఎవరైతే స్వయం సరళచిత్తులుగా ఉంటారో వారు ఇతరులను కూడా సరళచిత్తులుగా తయారు చెయ్యగలరు. సరళచిత్తము అనగా ఏ విషయాన్ని విన్నా, చూసినా, చేసినా అది సారయుక్తంగా ఉంటుంది మరియు సారమునే స్వీకరిస్తారు మరియు స్వయం ఏ మాటను విన్నా లేక కర్మను చేసినా అందులో కూడా సారము నిండియుంటుంది. కావున పురుషార్థము కూడా సరళమౌతుంది మరియు ఎవరైతే సరళ పురుషార్థులుగా ఉంటారో వారు ఇతరులను కూడా సరళ పురుషార్థులుగా తయారుచేస్తారు. సరళ వురుషార్థులు అన్ని విషయాలలో, ఆల్ రౌండ్ గా ఉంటారు. ఏ విషయమును గురించి కూడా లోపము కనిపించదు. ఏ విషయములోనూ ధైర్యము తక్కువ అవ్వదు. 'దీన్ని ఇప్పుడు చెయ్యలేము' లాంటి మాటలు నోటినుండి ఎప్పుడూ వెలువడవు. ముఖ్యమైన ఈ ఒక్క అభ్యాసమును ప్రాక్టికల్ (ఆచరణ)లోకి తీసుకురావటం ద్వారా అన్ని విషయాలలో శాంపుల్ గా అవ్వగలరు. అన్ని విషయాలలో శాంపుల్ గా అవ్వటం ద్వారా పాన్ విత్ హానర్‌గా అవ్వగలరు. అభ్యాసము లేదు అని అప్పుడప్పుడూ కొన్ని విషయాలలో అంటారు. ఆల్ రౌండర్ గా అవ్వటం వేరే విషయం, అది సంపాదన. ఆల్ రౌండ్ ఉదాహరణగా అవ్వటం వేరే విషయము. ప్రతి విషయములో ఇతరుల ముందు శ్యాంపుల్ గా అయ్యి చూపించాలి. ప్రతి విషయములో అడుగును ముందుకు వెయ్యాలి, మీ ద్వారా అందరికీ సంపాదనలో ఉల్లాసమును కలిగించాలి, ఆల్ రౌండ్ ఉదాహరణగా అవ్వటం అంటే ఇదే.

           సెన్స్ లో ఎక్కువగా ఉంటారా లేక ఎసెన్స్ లో ఎక్కువ ఉంటారా? ఎవరైతే సెన్సిబుల్ గా ఉంటారో వారు అంతగా సఫలతామూర్తులుగా అవ్వజాలరు, ఎసెన్స్ లో ఉండేవారి పరిమళం ఎక్కువ సమయం ఉంటుంది. వారి ప్రభావము సదాకాలము ఉంటుంది. ఎవరైతే సెన్స్ లో ఉంటారో వారి ప్రభావమైతే ఉంటుంది కానీ, అన్ని వేళలా ఉండదు. అందరి మెడలలో విజయమాల ఉంది, కానీ నెంబర్ వారీగా ఉంది. కొందరి మెడలో పెద్ద మాల అయితే కొందరి మెడలో చిన్న మాల ఉంది. దీనికి కారణము ఏమిటి? మొదటినుండి మనసులో, వాచలో, కర్మణలో వచ్చే సమస్యలు మరియు విఘ్నాలపై ఎంతెంతగా విజయులుగా అయ్యారో దాని అనుసారంగా ప్రతి ఒక్కరి విజయమాల తయారవుతుంది. మొదటినుండీ చూసినట్లయితే, నా విజయమాల ఎంత పెద్దది అన్నది తెలియగలదు. ఈ రోజుల్లో చిన్న మాలను కూడా తయారుచేస్తారు, పెద్ద మాలను కూడా తయారుచేస్తారు. ఎవరు ఎంతెంతగా విజయులుగా అవుతారో అంతగానే పెద్ద విజయమాలను ధరిస్తారు. చతుర్జుజునిలోని విజయమాల గుర్తు ఏదైతే ఉందో అది కేవలము ఒక్కరిది కాదు, అది విజయీ రత్నాల గుర్తు. కావున ప్రతి ఒక్కరూ వారి వారి విజయమాల సాక్షాత్కారమును చెయ్యగలరు. ఎంతగా విజయమాలను ధరించేందుకు అధికారిగా అవుతారో అంతగానే కిరీటము, సింహాసనములు దాని ప్రమాణంగా ప్రాప్తిస్తాయి. కావున ఈ సమయములోని విజయమాల ప్రమాణంగా మీ భవిష్య సింహాసనమును కూడా తెలుసుకోగలరు. ఇక్కడే మీ అందరికీ సాక్షాత్కారమవ్వాలి. సాక్షాత్కారము కేవలము దివ్య దృష్టితో కాకుండా, ప్రత్యక్ష సాక్షాత్కారము కూడా జరగాలి. ప్రత్యక్షమునకు ప్రమాణము ఈ సాక్షాత్కారము కూడా, కావుననే విజయమాల ఎంత పెద్దది అని అడిగాము, ఒకటి సేవా బలమైతే, మరొకటి స్నేహ బలము కావున అదనపు బలము లభించిన కారణంగా విశేషమైన సేవ జరుగుతూ ఉంది. ఎవరైనా శరీరము లెక్కలో శక్తి లేనట్లుగా భావించినా కానీ ఈ బలము ఉన్న కారణంగా ఎవరో నన్ను నడిపిస్తున్నారు అని అనుభవము చేసుకుంటారు. నిమిత్తముగా అవ్వటం ద్వారా చాలా శక్తి అదనంగా లభిస్తుంది. ఏవిధంగా సాకార రూపంలో నిమిత్తంగా అవ్వటం ద్వారా అదనపు శక్తి ఉండేదో, అలాగే ఇందులో కూడా ఉంటుంది. అతీంద్రియ సుఖపు అనుభవము ఉన్న కారణంగా ఏమవుతుంది? అతీంద్రియ సుఖము లభించటం ద్వారా ఇంద్రియాల సుఖమేదైతే ఉందో అది సమాప్తమైపోతుంది. దుఃఖాన్నిచ్చే వస్తువు ఏది? ఇంద్రియాల ఆకర్షణ, సంబంధాల ఆకర్షణ మరియు ఏ కర్మేంద్రియమునకైనా వశమైన కారణంగా కలిగే భిన్న భిన్న ఆకర్షణలేవైతే ఉంటాయో అవి అతీంద్రియ సుఖము మరియు సంతోషాన్నివ్వటంలో బంధనాలను కలిగిస్తాయి. ఒక్కచోట బుద్ధి స్థిరమవ్వటం ద్వారా ఏకరస స్థితి ఉంటుంది కావున ఎల్లప్పుడూ బుద్ధిని ఒక్కచోటనే ఉంచేందుకు యుక్తి ఏదైతే లభించిందో  దానిని స్మృతిలో ఉంచుకోండి. చలించనివ్వకండి. కదలటము అనగా అలజడి కలగటము. అప్పుడు సమయము కూడా చాలా వ్యర్థమౌతుంది. యుద్ధములో చాలా సమయము పోతుంది. శక్తుల చిత్రాలలో శక్తుల గుర్తుగా దేనిని చూపిస్తారు? ఒకటి వారు అలంకారులు, రెండు సంహారకులు కూడా. అలంకారము ఎందుకు? సంహారము చేసేందుకు. అటువంటి అలంకారీ, సంహారకారీ మూర్తులుగా మిమ్మల్ని మీరు భావించుకొని నడుస్తూ ఉండండి. నేను సంహారమూర్తిని అన్నది ఎప్పుడైతే స్మృతిలో ఉంటుందో, అప్పుడు వారు ఎప్పుడూ మాయకు వశమవ్వరు. అలంకారాలన్నింటినీ మంచిరీతిలో ధరించి ఉన్నానా అని ఎల్లప్పుడూ పరిశీలించుకోవాలి. ఏ అలంకారమునైనా ధరించనట్లయితే విజయులుగా అవ్వజాలరు. సుమంగళులు ఎవరైతే ఉంటారో వారు ఎల్లప్పుడూ వారి సౌభాగ్యమునకు ఉన్న గుర్తును స్థిరంగా ఉంచుకుంటారు కావున మీరు శక్తులైనప్పుడు ఆ శక్తి అలంకారాల గుర్తు స్థిరంగా ఉందా? చూడండి, ఎప్పుడైనా మీ స్థూల అలంకారము తక్కువైనా, పైకి క్రిందకు అయినా దానిని పదేపదే సరిచేసుకుంటూ ఉంటారు కావున ఏ అలంకారరూపీ అలంకారమైనా చెదిరినట్లయితే దానిని సరిచేసుకోవాలి. ఎవరైతే చాలా పాతవారు ఉంటారో వారు పూర్తి అధికారమును తీసుకొని వెళ్ళాలి. అధికారమును తీసుకొనేందుకే, మీపై ముద్రను వేయించుకొనేందుకే మధువనమునకు వస్తారు. ఈ మధువనము ఫైనల్ స్టాంపు లేక ముద్రను వేసే స్థానము. పోస్టాఫీసులో ఫైనల్ ముద్రను వేసినప్పుడే ఉత్తరం వెళ్తుంది. స్వర్గ అధికారిగా అయ్యేందుకు ముద్ర ఈ మధువనము. మధువనములోకి రావటము అనగా కోటానురెట్ల సంపాదన చేసుకోవటము. విఘ్నాలను వినాశనము చేసేవారు కదా? ఎవరైతే విఘ్న వినాశకులుగా ఉంటారో వారు విఘ్నాలకు ఓడిపోయేవారిగా అవ్వజాలరు. మిమ్మల్ని కంబైండుగా భావించండి. బాప్ దాదా అయితే క్షణ-క్షణపు సహచరుడు. ఎప్పటినుండైతే జన్మ తీసుకున్నారో అప్పటినుండీ సహచరుడు. ఇక్కడ జన్మ కూడా ఈ సమయమే ఉంటుంది, సహచరుడు కూడా ఈ సమయములోనే లభిస్తాడు. లౌకికములో జన్మ ముందు ఉంటుంది, సహచరుడు తరువాత లభిస్తాడు. ఇక్కడైతే ఇప్పుడిప్పుడే జన్మ, ఇప్పుడిప్పుడే సహచరుడు.

           ముంబై నగరంలో ఉంటున్నదానికి ప్రూఫ్ (ప్రమాణము) ఉందా? ఎవరైతే స్వయం ప్రూఫ్ గా ఉండరో వారు ఇతరుల ముందు ప్రూఫ్ గా అవ్వజాలరు. ధారణాయుక్త జీవితము ఇతరుల ముందు ఫ్రూఫ్ గా అవుతుంది. ప్రూఫ్ గా ఎవరు అవుతారు? ఎవరైతే ప్రూఫ్ గా ఉంటారో. ముంబైలో ఎవరి పూజను ఎక్కువగా చేస్తుంటారు? గణేశుని పూజ. అతడిని విఘ్న వినాశకుడు అని అంటారు, గణేశుడు అనగా మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ (జ్ఞాన ప్వరూపుడు), విద్యాపతి. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా ఉండేవారు ఎప్పుడూ ఓటమిని పొందజాలరు ఎందుకంటే జ్ఞానాన్నే లైట్-మైట్ అని అంటారు, ఇక గమ్యమును చేరుకోవటము కూడా సహజమౌతుంది. గమ్యమును చేరుకొనేందుకు లైట్, మైట్(శక్తి) రెండూ అవసరము. మీ ముఖము ద్వారా బాప్ దాదాలిరువురూ కనిపించేటంతగా మీ ముఖాన్ని తయారుచేసుకోవాలి. ఏ కర్మను చేసినా చేసే ప్రతి కర్మలో బాప్ దాదా గుణము ప్రత్యక్షమవ్వాలి. బాప్ దాదా ముఖ్య గుణాలుగా వేటిని వర్ణిస్తారు?

            జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు, ఆనందసాగరుడు, సుఖ-శాంతుల సాగరుడు. ఏ కర్మనైనా చెయ్యండి, కానీ అవి అన్నీ జ్ఞాన సహితంగా ఉండాలి, ప్రతి కర్మ ద్వారా సర్వ ఆత్మలకు సుఖ-శాంతుల, ఆనందపు అనుభవము కలగాలి, దీనినే తండ్రి గుణాల సమానత అని అంటారు. అర్థం చేయించాల్సిన అవసరం మీకు ఉండదు. మీ కర్మను చూసిన వారి మనస్సులలో వీరు ఎవరి పిల్లలు, ఎవరి ద్వారా ఇలా తయారయ్యారు అన్న సంకల్పము ఉత్పన్నమౌతుంది. విద్యార్థులు కూడా ఒకవేళ చదువులో మంచి స్కాలర్ షిప్ తీసుకొనేవారైతే వారిని చూసినప్పుడు వారి టీచరు గుర్తుకు వస్తారు అందుకనే స్టూడెంట్ షోస్ టీచర్(విద్యార్థులు తమ టీచర్ ను ప్రత్యక్షము చేస్తారు) అన్న నానుడి ఉంది, ఇది కూడా సేవ చేసే విధానమే. అలౌకిక జన్మలోని ప్రతి కర్మ సేవ కొరకే ఉండాలి, ఎంత సేవ చేస్తారో అంతగా భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. ఎంతగా మిమ్మల్ని మీరు సేవలో బిజీగా ఉంచుకుంటారో అంతగా మాయ యుద్ధం నుండి రక్షింపబడతారు. బుద్ధిని ఎంగేజ్(ఏ పనిలోనైనా నిమగ్నము) చేసినట్లయితే ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు. ఇది కూడా సంగమయుగపు వరదానము-ఏకరస స్థితి, ఒక్కరి ధ్యానము, ఒక్కరి సేవలో ఎవరు ఎన్ని వరదానాలనైనా తీసుకోవటము. ఏదైనా మత్తులో ఉన్నవారు ఏవిధంగా ఇతరమైనవాటినేమీ పట్టించుకోరో అలా ఈ ఈశ్వరీయ నషాలో ఉండటం ద్వారా ఇతర ప్రపంచపు ఆకర్షణల నుండి దూరంగా, అయిపోతారు.

           ఒక బంధేలీ ఆత్మ బాబాను ఇలా అడిగారు బాబా, మేము బంధేలీలము(బంధనలో ఉన్నవారము), మేము సేవ చెయ్యమా? అన్న సంకల్పము మాకు కలుగుతుంది.

           స్వతంత్రంగా ఉండేవారికన్నా బంధేలీలుగా ఉన్నవారిది బాగుంది. స్వతంత్రులు నిర్లక్ష్యులుగా  ఉంటారు. బంధేలీల లగనము మంచిగా ఉంటుంది. స్మృతిని శక్తిశాలిగా చేసుకోండి. స్మృతి తక్కువైనట్లయితే శక్తి లభించదు. స్మృతిలో ఉంటూ మేము సేవ చెయ్యటం లేదు అన్న వ్యర్థాన్ని ఆలోచించకండి. ఆ సమయములో కూడా స్మృతిలో ఉన్నట్లయితే సంపాదన జమ అవుతుంది. ఇలా ఆలోచించటంద్వారా స్మృతి శక్తి తక్కువైపోతుంది. బంధనమునుండి ముక్తులయ్యేందుకు వీరు మారిపోయారు అని ఇంట్లోనివారుకూడా గమనించేంతగా మీ నడవడికను మార్చుకోండి. కఠిన సంస్కారమేదైతే ఉందో దానిని మార్చుకోండి. వారు వారి పనిని చేస్తారు, మీరు మీ పనిని చెయ్యండి. వారి పనిని చూసి గాభరా చెందకండి. వారు వారి పనిని ఎంత ఫోర్స్ తో చేస్తుంటారో, అంతగా మీరు మీ ఫోర్స్ తో  చెయ్యండి. వారు వారి కర్తవ్యాన్ని ఎలా నిర్వహిస్తున్నారని వారి గుణాన్ని తీసుకోండి, మీరుకూడా చెయ్యండి. మొత్తము సృష్టిలోని ఆత్మలతో పోలిస్తే ఎంతమంది ఆత్మలకు ఈ భాగ్యము ప్రాప్తించింది! మరి ఎంత సంతోషము ఉండాలి! కండ్లలో, మస్తకములో, పెదవులపై సంతోషము ప్రకాశిస్తూ ఉండాలి. ఎవరైతే సంతోషపు ఖజానాకు యజమానిగా ఉన్నారో, వారికి పిల్లలుగా ఉన్నారు, మరి ఇక ఖజానాలకు అధికారులుగానే ఉంటారు కదా! 5000 సంవత్సరాల ముందుకూడా వచ్చి ఉన్నారు, ఈ అనుభవము ఉందా? స్మృతి వస్తోందా? స్పష్టమైన స్మృతికి గుర్తు ఏమిటి? స్పష్ట స్మృతికి గుర్తు- ఎవరిని కలిసినా ఆత్మీయత అనుభవమవుతుంది మరియు నా స్థానములోకి చేరుకున్నాను, నేను వెతుకుతున్న స్థానము ఇదే అని అనిపిస్తుంది. ఏదైనా వస్తువు వెతికిన తరువాత దొరికితే ఎలా అనుభవమవుతుందో అదే విధముగా, అసలైన పరివారముతో కలిసాను అన్న భావన కలుగుతుంది మరియు ఆత్మీయత అనుభవమవుతుంది, దీనినే స్పష్టమైన అనుభవము అని అంటారు. మరొక విషయము-ఏ మాటను విన్నా అది వారికి సహజంగా స్పష్టంగా అర్థమౌతుంది. ఏవిధంగా పవిత్రతా విషయము మనుష్యులకు కష్టమనిపిస్తుంది కానీ ఎవరైతే కల్పపూర్వపు వారిగా ఉంటారో, అధికారిగా ఉంటారో వారు ఇది మా స్వధర్మమే అని అర్థం చేసుకుంటారు. వారికి సహజమనిపిస్తుంది. ఏవిధంగా ఎన్నోసార్లు చూసిన వారిని చూడటంతోనే వీరైతే మనవారే అన్న అనుభవము కలుగుతుందో అలా ఎంత సమీప సంబంధములోకి వచ్చేవారుగా ఉంటారో వారు అంతగా స్పష్టముగా అనుభవము చేసుకుంటారు. అటువంటి అనుభవీ ఆత్మలకు కర్మబంధనాలను తొలగించటంలో ఆలస్యము అవ్వదు. నకిలీ వస్తువును వదలటము కష్టమనిపించదు. అచ్ఛా!

Comments