* 20-11-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
''స్థితికి దర్పణము - సేవ"
సదా స్వయమును విజయులుగా అనుభవము చేసుకుంటున్నారా? మీరు విశ్వముపై విజయులుగా అయ్యి రాజ్యము చేసేవారు, మరి ఇప్పుడు స్వయం సదా విజయులుగా అయ్యారా? ఏ విశ్వముపై అయితే రాజ్యము చేసేవారో ఆ రాజ్యమునకు అధికారులుగా మిమ్మల్ని మీరు ఇప్పటినుండే భావిస్తున్నారా? మొదట స్వయము యొక్క సర్వ అధికారాలను ప్రాప్తి చేసుకున్నారా లేక ఇప్పుడు చెయ్యాల్సి ఉందా? ఎవరైతే స్వయము యొక్క సర్వ అధికారాలను ప్రాప్తి చేసుకుంటారో వారే విశ్వ అధికారిగా అవుతారు. కావున స్వయము యొక్క సర్వ అధికారాలను ఎంతవరకు ప్రాప్తి చేసుకున్నాను? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సర్వ అధికారులు ఏమేమిటో తెలుసా? ఆత్మ యొక్క ముఖ్య శక్తులైన మనసు-బుద్ధి మరియు సంస్కారములనేవైతే వర్ణన చేస్తారో, స్వయము యొక్క ఈ మూడు శక్తులపై విజయులుగా అనగా అధికారిగా అయ్యారా? మీ శక్తులకు అధీనముగా అయితే అవ్వడం లేదు కదా? ఎవరైతే విశ్వ సేవకు నిమిత్తముగా అయ్యారో, వారి యొక్క ఈ స్థితి అయితే సహజముగా మరియు స్వతహాగనే ఉంటుంది కదా లేక పురుషార్థము చేసి స్థితులవ్వాల్సి వస్తుందా? పురుషార్థపు సిద్ధి యొక్క అనుభవమును స్వయములో చేసుకుంటూ వెళ్తున్నారా లేక సంగమ సమయము కేవలము పురుషార్థమునకు మరియు సిద్ధి భవిష్యత్తుకు చెందిన విషయమా? సంగమయుగములోనే సిద్ధి స్వరూపము మరియు మాస్టర్ సర్వ శక్తివంతుని స్వరూపమును అనుభవము చెయ్యాలా, వద్దా? ఇప్పటినుండే అనుభవము చేసుకోవాలా లేక అంతిమములో ఏదో కొద్ది సమయము అనుభవము చేసుకోవాలా? కేవలము ఆశా సితారలుగానే ఉండాలా? ఇప్పటినుండే సిద్ధి స్వరూపపు అనుభవము ఉండాలి. ఎప్పుడైతే స్వయం యొక్క సర్వ అధికారాలు ప్రాప్తిస్తాయో అప్పుడే సిద్ధి ప్రాప్తిస్తుంది. మనసు-బుద్ధి-సంస్కారాలు మూడింటినీ స్వయం ఎలా కావాలనుకుంటే అలా నడిపించగలగాలి, అలా ఇప్పుడు ఉన్నప్పుడే అన్య ఆత్మల మనసు-బుద్ది మరియు సంస్కారాలను మార్చగలరు. ఒకవేళ స్వయమును మార్చుకోవటంలో సమయము పట్టిందంటే లేక సదా విజయులుగా కానట్లయితే ఇతరులను విజయులుగా చెయ్యటంలో సమయము మరియు శక్తి ఎక్కువగా వెచ్చించవలసి ఉంటుంది. సేవ మీ అందరి స్థితికి దర్పణము. మరి అద్దములో ఏం కనిపిస్తుంది? ఏవిధంగా పురుషార్ధీ ఆత్మలైన మీ స్థితి తయారైందో, అలా ఎవరి సేవనైతే చేస్తారో వారికి అనుభవము ఉంటుందా? మీ స్థితిని ఎంతవరకు తయారుచేసుకున్నారు - దీని సాక్షాత్కారమును సేవ ద్వారా చేసుకుంటున్నారు. ఏ స్టేజ్ తయారైంది? ఎంతవరకు చేరుకున్నారు? సేవ మంచిగా అనిపిస్తుంది కదా! సేవ సిద్ధిని చూసి సంతోషము కలుగుతుంది కదా? తండ్రి పరిచయమును తీసుకొని వెళ్తారు. బ్రాహ్మణ ఆత్మలలో మెజారిటీ వారి స్థితిలో విశేషంగా రెండు గుణాలు ప్రసిద్ధంగా కనిపిస్తాయి, అవి 1. పవిత్రత 2. స్నేహము. ఈ రెండు విషయాలలో మెజారిటీ పాస్ అయ్యారు. అలాగే సేవ రిజల్టులో స్నేహము మరియు పవిత్రతలు స్పష్టంగా కనిపిస్తాయి మరియు రాబోయేవారు అనుభవము చేసుకుంటారు. కానీ నవీనత మరియు నాలెడ్జ్ లో విశేషత ఏదైతే ఉందో, ఆ నాలెడ్జ్ ఫుల్ స్టేజ్ మరియు మాస్టర్ సర్వశక్తివంతుని స్టేజ్ మరియు సర్వ శక్తివంతుడైన తండ్రి యొక్క ప్రాక్టికల్ కర్తవ్యము యొక్క విశేషతలేవైతే విశేషరూపంతో అనుభవము చెయ్యాల్సి ఉందో, అది ఇప్పుడు తక్కువగా ఉంది. శక్తి అవతారము అన్న పేరు ఏదైతే ప్రసిద్ధమవ్వవలసి ఉందో ఆ శక్తిరూపము యొక్క మరియు సర్వ శక్తివంతుడైన తండ్రి యొక్క పూర్తి పరిచయమును అనుభవము చేసుకుంటున్నారా? మీ జీవితము ద్వారా ప్రభావితమయ్యారు. స్నేహము మరియు సహయోగము ద్వారా ప్రభావితమయ్యారు. కానీ శ్రేష్ఠ జ్ఞానము మరియు నాలెడ్జ్ ఫుల్ పైన అంతగా ప్రభావితులయ్యారా? ఏవిధంగా నిమిత్తంగా అయిన బ్రాహ్మణులు స్వయం శక్తిరూపులుగా అయ్యే అనుభవమును తమలో కూడా పర్సంటేజ్ లో చేసుకుంటారో, అలాగే సేవా దర్పణంలో స్నేహము మరియు సహయోగములతో పోలిస్తే శక్తిరూపపు అనుభవమును తక్కువగా చేసుకుంటారు. ఏదైతే నడుస్తుందో, ఏదైతే చేస్తున్నారో అవి డ్రామా అనుసారంగా చాలా మంచిగా ఉంది, కానీ ఇప్పుడు సమయ ప్రమాణంగా, సమీపతా ప్రమాణంగా శక్తిరూపపు ప్రభావమును స్వయం శక్తిరూపులుగా అయి ఇతరులపై వేసినప్పుడే అంతిమ ప్రత్యక్షతను సమీపంగా తీసుకురాగలరు. శక్తి పతాకమును ఎగురవేయండి. ఏవిధంగా ఏదైనా జెండాను ఎగురవేసినప్పుడు, అది ఎత్తుగా ఉన్న కారణంగా అందరి దృష్టి దానంతట అదే దాని వైపుకు వెళ్తుంది, అలాగే శక్తి జెండాను, మీ శ్రేష్ఠతతో మరియు మొత్తము సృష్టిలో నవీనతా జెండాను ఇప్పుడు ఎగురవేయండి. ఎక్కడ ఉన్న ఏ ఆత్మకైనా అనుభవము జరుగకుండా ఉండజాలదు, ఇలాంటి విశేష అనుభవమును సర్వ ఆత్మలకు చేయించండి. మరి సేవ దర్పణమైంది కదా!
అచ్ఛా, ఇలా తమ సర్వ శక్తుల స్వరూపము ద్వారా సర్వ శక్తివంతుడైన తండ్రి పరిచయమును ఇచ్చేవారికి, తమ శక్తి ద్వారా సర్వ శక్తుల సాక్షాత్కారమును చేయించేవారికి, విశ్వముపై శక్తి జెండాను ఎగురవేసే స్నేహీ, సహయోగీ మరియు శక్తిరూపపు శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment