20-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సర్వప్రాప్తులను పొందేటందుకు సహజ సాధనం పత్యం.
సర్వప్రాప్తులను మరియు శక్తులను సహజంగా అనుభవం చేయించే ఆత్మిక తండ్రి శివబాబా మాట్లాడుతున్నారు -
స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా భావిస్తున్నారా? బాబా ద్వారా ఏవైతే సర్వశక్తుల యొక్క జ్ఞానమంతటి యొక్క స్వయంపై రాజ్యం చేసే మరియు విశ్వంపై రాజ్యం చేసే అధికారం లభించిందో ఆ అధికారాన్ని ఎంతవరకు స్వరూపంలోకి తీసుకువచ్చారు. ఈ ఆత్మికనషా నిరంతరం బుద్ధిలో ఉంటుందా? రోజంతటిలో స్వయంపై రాజ్యంచేసే అధికారం ఎంతవరకు ప్రత్యక్షంలో ఉంటుంది - ఇది పరిశీలించుకుంటున్నారా? జ్ఞానం యొక్క అధికారంతో శక్తిశాలి స్వరూపం ఎంత వరకు వచ్చింది? ప్రాప్తించిన సర్వశక్తుల అధికారంతో మాయాజీత్ లేదా ప్రకృతిజీత్ గా తయారవడంలో ఎంతవరకు ప్రత్యక్ష అనుభవం వచ్చింది? ఎప్పుడు ఏ శక్తి ద్వారా ఏ కార్యం చేయాలనుకుంటే ఆ కార్యం సఫలతా రూపంలో కనిపించాలి. ఇలాంటి అధికారాన్ని అనుభవం చేసుకుంటున్నారా, బేహద్ తండ్రి పిల్లలందరినీ తన సమానంగా సర్వశక్తివంతులుగా తయారుచేస్తున్నారు. మరయితే బాబా సమానంగా తయారయ్యారా? ఎంతవరకు తయారయ్యారు. ఈ పరిశీలన చేసుకోవడం వస్తుందా? కొంతమంది పిల్లలు బాప్ దాదాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఒక విషయాన్ని తరచుగా చెప్తున్నారు. అదేమిటంటే మేము పరిశీలించుకుంటున్నాము కాని పరివర్తన కాలేకపోతున్నాము. అన్నీ తెలుసు, అంగీకరిస్తున్నాము మరియు అనుకుంటున్నాము కూడా కానీ చేయలేకపోతున్నాము. యుక్తిని ఉపయోగిస్తున్నా కానీ ముక్తిని పొందలేకపోతున్నాము, దీనికోసం ఏమి చేయాలి? దీనికి కారణం - ఒక చిన్న పొరపాటు లేదా తప్పు అదే చక్రవ్యూహంలో చిక్కుకునేలా చేస్తుంది. అది ఏమిటి? మందు ఎంత గొప్పదైనా కానీ మోతాదులు అన్నీ సమయానికి తీసుకుంటున్నా కాని ఒక్కసారైనా గానీ పత్యం చేయకుండా ఏదైనా పదార్ధం స్వీకరించినట్లయితే లేదా స్వీకరించాల్సినవి స్వీకరించకపోయినట్లయితే మందు ద్వారా ఆ వ్యాధి నుండి ముక్తులు కాలేరు. అదేవిధంగా ఇక్కడ కూడా జ్ఞానమనే మందు తీసుకుంటున్నారు అనగా జ్ఞానాన్ని బుద్ధిలో త్రిప్పుతూ ఉన్నారు. ఇది యదార్ధం, అది అయదార్థం, ఇది చేయాలి లేదా ఇది చేయకూడదు, ఇది పొరపాటు, ఇది నిజం, ఇది గెలుపు, ఇది ఓటమి.. ఈ తెలివంతా బుద్దిలో ఉంది అంటే సమయానికి మోతాదులు కూడా తీసుకుంటున్నారు. ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. క్లాసు చేస్తున్నారు, సేవ చేస్తున్నారంటే అన్ని మోతాదులు తీసుకుంటున్నారు. కానీ మొట్టమొదటి పత్యం లేదా మర్యాద ఏమిటంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు ఇదే స్మృతిలో మరియు సమర్ధతలో ఉండాలి. కానీ ఈ పత్యాన్ని నిరంతరం చేయడం లేదు ఎక్కడో అక్కడ ఏదో ఒకటి చెప్పి స్వయాన్ని మోసగించుకుంటున్నారు. నేను శివబాబా బిడ్డను, నాకు బాబా తప్ప మరెవ్వరున్నారు అని అంటున్నారు. కానీ ప్రత్యక్షంలో అలాంటి స్మృతిస్వరూపంగా ఉండాలి అంటే సంకల్పంలో కూడా ఒక్క బాబా తప్ప ఇతర ఏ వ్యక్తి, వైభవం, సంబంధ సంప్రదింపులు లేదా ఏ సాధనం స్మృతిలోకి రాకూడదు. ఇది కఠినమైన మరియు ముఖ్యమైన పత్యం. ఈ పత్యం చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటున్న కారణంగా, మన్మతం కారణంగా, వాతావరణం యొక్క ప్రభావం కారణంగా లేదా సాంగత్యదోషం కారణంగా నిరంతరం ఈ విధంగా ఉండలేకపోతున్నారు. ఎంత ధ్యాస పెట్టాలో అంతపెట్టలేకపోతున్నారు. కొద్ది సమయం పాటు పూర్తి ధ్యాస పెడుతున్నారు. ఆ తరువాత మెల్లమెల్లగా పూర్తి ధ్యాస అనేది సమాప్తం అయిపోయి కేవలం ధ్యాస మాత్రమే ఉంటుంది. ఆ తరువాత అటెన్షన్ అనేది అనేకరకాల టెన్షన్లలోకి వెళ్ళిపోతుంది. పరిస్థితులకు లేదా పరీక్షలకు వశమైపోయి అటెన్షన్ కు బదులు టెన్షన్ రూపంగా అయిపోతున్నారు. ఈ కారణంగానే స్మృతి ఎలా మారిపోతుందో సమర్థత కూడా అలా మారిపోతుంది. సర్వశక్తివంతులకు బదులు మాయకు వశీభూతం అయిపోతున్న కారణంగా వశీకరణ మంత్రం పనిచేయడం లేదు. అనగా యుక్తి అనేది ముక్తిని ఇవ్వడం లేదు, ఆ తరువాత అరుస్తున్నారు. అనుకుంటున్నా కానీ ఎందుకు అవ్వడం లేదని, కనుక ముఖ్య పత్యం చేయాలి. ఈ ఒక్క విషయం పై నిరంతరం ధ్యాస పెట్టండి.
రెండవపత్యం - బాబా మీకు అధికారం ఇచ్చారు. మీపై మీరు యజమానులు అయ్యేటందుకు లేదా రచయిత స్థితి యొక్క అధికారం ఇచ్చారు. కానీ రచయితగా అవ్వడానికి బదులు, స్వయాన్ని రచన అనగా దేహంగా భావిస్తున్నారు. ఎప్పుడైతే రచయిత స్థితి మరిచిపోతారో అప్పుడు మాయ అనగా దేహాభిమానం రచయిత అయిన మీపై రచయిత అయిపోతుంది అంటే తన అధికారం చెలాయిస్తుంది. వాస్తవానికి రచయితపై ఎవరూ అధికారం చేయలేరు. విశ్వయజమానిపై ఎవరూ యజమాని కాలేరు కానీ మాయ ముందు రచనగా అయిపోతున్నారు మరియు ఆధీనం అయిపోతున్నారు. కనుక ఇలా యజమాని స్థితి లేదా అధికారి స్థితి యొక్క స్మృతి స్వరూపంగా ఉండే పత్యం నిరంతరం చేయడం లేదు.
మూడవ పత్యం - బాబా ద్వారా అన్నింటికి మీరు నిమితులయ్యారు. ఈ దేహానికి కూడా నిమిత్తులు మనస్సు అనగా సంకల్పానికి కూడా మీరు నిమిత్తులు. లౌకిక లేదా అలౌకిక ప్రవృతి ఏదైతే లభించిందో దాంట్లో కూడా మీరు నిమిత్తులు. కానీ నిమిత్తులకు బదులు గృహస్థిగా అయిపోతున్నారు. గృహస్థి యొక్క దుర్దశ గురించి మీరు ఒక ఉదాహరణ చిత్రం తయారుచేశారు. గృహస్థిని అన్ని వైపుల నుండి అన్ని బంధనాలు లాగుతూ ఉన్నట్లు. గృహస్థిని గాడిద రూపంలో చూపించారు, అంటే అనేకరకాలైన బరువులు చూపించారు. ఇలాంటి ఉదాహరణ మీరు తయారుచేస్తారు కదా! ఎప్పుడైతే గృహస్థిగా అయిపోతారో నాది అనే అనేకరకాలైన బరువులు వచ్చేస్తాయి. అన్నింటికంటే రాయల్ రూపం యొక్క భారం ఏమిటంటే ఇది నా బాధ్యత, దీనిని నేను నిలుపుకోవాలి మరికొంతమంది గృహస్థీలు తమ కర్మేంద్రియాలకు వశమై అనేక రసాలలో సమయాన్ని పోగొట్టే గృహస్థీలు చాలామంది ఉన్నారు. ఈ రోజు చెవుల యొక్క రసానికి వశమై సమయాన్ని పోగొట్టారు, రేపు నాలుక యొక్క రసానికి వశమై సమయాన్ని పోగొడతారు. ఇలా గృహస్థంలో చిక్కుకుంటున్న కారణంగా నిమిత్త స్థితిని మరిచిపోతున్నారు. ఈ తనువు కూడా నాది కాదు, తనువుకు కూడా నేను నిమిత్తుడను. నిమిత్తులు యజమాని లేకుండా ఏ వస్తువును తమకోసం ఉపయోగించరు. ఈ విధంగా కర్మేంద్రియాల యొక్క రసనాల్లో నిమగ్నమైపోవడాన్ని కూడా గృహస్థి అనే అంటారు, నిమిత్తులు కారు. ఎందుకంటే శ్రేష్టాతి శ్రేష్ట యజమాని నిమిత్తులు అయిన మీరు యజమాని యొక్క శ్రీమతం అనుసారంగా ఒకని రసంలోనే సదా ఏకరసంగా స్థితులై ఉండాలి. ఈ కర్మేంద్రియాల ద్వారా ఒకని యొక్క రసనాలే పొందాలి. మరయితే అనేక కర్మేంద్రియాల ద్వారా భిన్న భిన్న రసాలు ఎందుకు పొందుతున్నారు? ఈ విధంగా లౌకిక లేదా అలౌకిక ప్రవృత్తిలో గృహస్థిగా అయిపోతున్నారు. అందువలన అనేక రకాలైన భారాలు. వాటికోసమే బాబా ఆజ్ఞ ఇస్తారు, వాటన్నింటినీ నాకిచ్చేయండి. కానీ ఆ భారమైన పనులన్నీ స్వయంపై వేసుకుని ఆ భారంతో ఎగరాలనుకుంటున్నా ఎగరలేకపోతన్నారు. ఈ పత్యం లోపం కారణంగా యుక్తి ఉపయోగిస్తున్నా కానీ ముక్తి పొందలేకపోతున్నారు. ఇలాంటి పిల్లలపై బాప్ దాదాకు కూడా జాలి వేస్తుంది. మాస్టర్ సాగరులు కానీ ఒక దోసిలి నీటి కోసం దాహంతో ఉన్నారు. అనగా జ్ఞాన యోగాల ద్వారా ఏదైతే అనుభవాల యొక్క ప్రాప్తి లభిస్తుందో ఆ అనుభవం యొక్క దోసిలికి దాహంతో ఉన్నారు కనుక ఇప్పుడు ఈ పత్యాన్ని చేయండి. దీని ద్వారా సర్వ ప్రాప్తులు సదా అనుభవం అవుతాయి. సర్వ ప్రాప్తులనే ఆస్తికి యజమానులు, పిల్లల నుండి యజమానులు అయినవారు ప్రాప్తుల నుండి వంచితులుగా ఉంటారా? బాబా కూడా ఇలా చూడలేకపోతున్నారు. ఇప్పుడు 63 జన్మల యొక్క గృహస్థీ స్థితి యొక్క సంస్కారాన్ని వదిలేయండి, తనువుకి మరియు మనసుకు నిమిత్తులుగా అవ్వండి. బాధ్యత అంతా బాబాది. నా బాధ్యత కాదు, ఈ స్మృతి నుండి తేలికగా ఉండండి అప్పుడు మీరు ఏది ఆలోచిస్తారో అది అవుతుంది అనగా హైజంప్ చేయగలరు. కనుక ఏడవడం, అరవడం ఇవన్నీ ఆత్మిక సంభాషణలోకి పరివర్తన అయిపోవాలి, ఆత్మిక సంభాషణ ద్వారా ఆత్మల్లో శక్తిని నింపాలి. లేకపోతే ఒకసారి స్వయం యొక్క ఫిర్యాదులు మరోసారి పరిస్థితుల యొక్క ఫిర్యాదులు దీనిలోనే ఆత్మిక సంభాషణ యొక్క సమయం అంతా సమాప్తి అయిపోతుంది. కనుక ఇప్పుడు ఫిర్యాదులను ఆత్మీయతలోకి పరివర్తన చేయండి. అప్పుడు సంగమయుగీ సుఖాలను అనుభవం చేసుకోగలరు. అరమైందా!
ఈవిధంగా సదా ఆత్మీయతలో ఉండేవారికి, అడుగడుగు శ్రీమతంపై నడిచేవారికి, ఆజ్ఞాకారియై ప్రతి ఆజ్ఞను స్వరూపంలోకి తీసుకువచ్చేవారికి, బాబాకి ప్రియమైనటువంటి జ్ఞానీ,యోగి ఆత్మలైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment