20-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
త్యాగమూర్తి మరియు తపస్వీమూర్తి అయిన సేవాధారులే యధార్థ టీచర్.
టీచర్స్ అనగా సేవాధారి. సేవాధారి అనగా త్యాగి మరియు తపస్వీమూర్తులు. టీచర్లు తమను తాము లోతైన రూపంలో పరిశీలించుకోవాల్సి ఉంటుంది, పైపై రూపంలో కాదు. లోతైన రూపంలో ఏమి పరిశీలించుకోవాలంటే రోజంతటిలో అన్నిరకాలుగా త్యాగమూర్తిగా ఉన్నానా లేక త్యాగమూర్తికి బదులు ఏ సాధనాన్ని అయినా లేక ఏ వస్తువునైనా స్వీకరిస్తున్నానా? ఎవరైతే త్యాగమూర్తులుగా ఉంటారో వారు ఎప్పుడు కూడా ఏ వస్తువును కూడా స్వీకరించరు. ఎక్కడైతే స్వీకరించాలనే సంకల్పం వస్తుందో అక్కడ తపస్సు కూడా సమాప్తం అయిపోతుంది. త్యాగం తపస్వీమూర్తిగా తప్పక తయారుచేస్తుంది. ఎక్కడ త్యాగం మరియు తపస్సు సమాప్తి అయిపోతాయో అక్కడ సేవ కూడా సమాప్తి అయిపోతుంది. బాహ్యరూపంగా ఎవరు ఎంత సేవ చేసినా కానీ, త్యాగం మరియు తపస్సు లేకుండా సేవలో సఫలత రాదు. కొంతమంది టీచర్లు అనుకుంటున్నారు. సేవలో సఫలత ఎందుకు రావడం లేదని? సేవలో వృద్ధి జరగకపోవడం అనేది వేరే విషయం. కానీ విధిపూర్వకంగా నడవడం ఇదే సేవ యొక్క సఫలత. విధిపూర్వకంగా ఎప్పుడు నడవగలరంటే ఎప్పుడైతే త్యాగం మరియు తపస్సు ఉంటుందో అప్పుడే. నేను టీచర్ ను, నేను ఇన్ చార్జ్ ని, నేను జ్ఞానిని, నేను యోగిని... ఇదే స్వీకరించడం. దీనిని కూడా త్యాగం అనరు. ఇతరులు అనినా కానీ స్వయానికి స్వయం మాత్రం అనుకోకూడదు. ఒకవేళ స్వయానికి స్వయం అనుకుంటే దానిని కూడా " స్వ అభిమానం " అంటారు. కనుక త్యాగం యొక్క పరిభాష సాధారణమైనది కాదు. పైపై త్యాగం ప్రజలు కూడా చేస్తారు కానీ ఎవరైతే నిమిత్తమయ్యారో వారి త్యాగం లోతైనరూపంలో ఉండాలి. ఏ పదవిని లేదా ఏ వస్తువును ఏ వ్యక్తి ద్వారా కూడా స్వీకరించకూడదు, ఇదే త్యాగం.
ఇక్కడ కూడా సిద్ధిని స్వీకరించడము అంటే జ్ఞాన యోగాల ద్వారా లభించే గౌరవ మర్యాదలు కావాలనుకోవటం కూడా విధి ద్వారా సిద్ధి స్వరూపమే అవుతుంది అంటే వీటిలో ఏవి స్వీకరించాలనుకున్నా సిద్ధిని కోరుకున్నట్లే అవుతుంది. ఎవరైతే సిద్ధిని స్వీకరిస్తారో వారి యొక్క ప్రాలబ్దము ఇక్కడే సమాప్తి అయిపోతుంది, వారి భవిష్యత్తుకి రాదు .కనుక టీచర్స్ యొక్క చెకింగ్ చాలా లోతైన రూపంలో ఉండాలి. సేవాధారి రూపంలో త్యాగము మరియు తపస్సు నిరంతరం ఉండాలి. తపస్య అంటే ఒక్క బాబా యొక్క సంలగ్నతలో ఉండడం. ఒకవేళ బుద్ధి అల్పకాలిక ప్రాప్తి వైపుకు ఆకర్షితం అయితే, వారు సేవలో సఫలతామూర్తిగా అవ్వలేరు. సఫలతామూర్తి అవ్వడానికి త్యాగం మరియు తపస్సు కావాలి. త్యాగం అంటే సంబంధాలను వదిలి ఇక్కడకు వచ్చి కూర్చోవడం కాదు. త్యాగము అంటే - మహిమ యొక్క త్యాగం , గౌరవము యొక్క త్యాగము , మరియు ప్రకృతికి దాసి అవ్వడం యొక్క త్యాగము. అప్పుడు చూడండి శ్రమ తక్కువ, సఫలత ఎక్కువ వెలువడుతుంది. ఇప్పుడు శ్రమ ఎక్కువగా, సఫలత తక్కువగా ఎందుకు ఉంటుంది?ఎందుకంటే త్యాగము మరియు తపస్సు ఈ రెండు విషయాలలో లోపం ఉన్నది. ఎవరిలోనైతే త్యాగము మరియు తపస్సు రెండూ ఉంటాయో వారే యదార్ధమైన టీచర్ అనగా కర్తవ్యమును నిర్వర్తించే టీచర్. లేకపోతే నామమాత్రపు టీచర్ అని అంటారు.
టీచర్స్ కి ఏ సబ్జెక్టులోనూ బలహీనత ఉండకూడదు. ఒకవేళ టీచర్ బలహీనంగా ఉంటే, వారు ఎవరికైతే నిమిత్తులుగా ఉన్నారో వారు కూడా బలహీనంగా ఉంటారు.కాబట్టి టీచర్ అన్ని సబ్జెక్టులో పర్ఫెక్టుగా ఉండాలి. ఏమి చేయను, ఎలా చేయను , చేయటం రావట్లేదు - ఇవి టీచర్ యొక్క మాటలు కావు, ఇవి ప్రజల యొక్క మాటలు. మిమ్మల్ని మీరు సఫలతామూర్తులుగా భావిస్తున్నారా ? చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఏదైనా విఘ్నము ఉందా అని ? అందుకే సఫలతామూర్తులు కాదు. ఎక్కడైతే త్యాగము, తపస్య యొక్క ఆకర్షణ ఉంటుందో అక్కడ సర్వీస్ పట్ల ఆకర్షణ కూడా స్వతహాగానే వచ్చేస్తుంది. అర్దమైందా?ఇలాంటి సఫలతామూర్త టీచర్ గా అవ్వండి. ఇటువంటి టీచరే సేవ యొక్క వృద్ధికి ఆధారము. అటువంటివారిని భాగ్యవంతులు అంటారు. దీనినే అంటారు - మట్టి కూడా బంగారం అవుతుంది అని. మట్టి కూడా బంగారం అవుతుంది అంటే సఫలతామూర్తిగా అయిపోతారు. టీచర్లు ఇటువంటి సఫలతామూర్తులుగా అయ్యారా ? నంబరువారీగా అయితే ఉంటారు. కానీ టీచర్స్ నెంబర్ అయితే ముందుగా ఉంటుంది. మంచిది. ఈ విధంగా సఫలతామూర్తులుగా ఇంకా అవ్వలేదంటే, ఇప్పుడైనా అవ్వాలి.
బాబాతో ప్రీతి పెట్టుకునేవారి ముఖ్య లక్షణాలు
బాబాని జీవితం యొక్క తోడుగా చేసుకున్నారా?తోడుగా చేసుకున్నవారి తోడుని నిభాయించాలి. తోడు నిభాయించడం అంటే ప్రతి అడుగులోనూ వారి మతంఫై నడవాల్సి ఉంటుంది. కనుక ప్రతి అడుగులోనూ వారి మతముపై నడవడము అనగా తోడును నిభాయించడం. ఈ విధంగా నిలుపుకునే వారా కేవలం ప్రీతి పెట్టుకొనే వారా?కానీ కొంతమంది ఇంకా ప్రీతి పెట్టుకోవడంలోనే ఉన్నారు. అందుకే యోగం కుదురడం లేదు అని అంటారు. ఎవరి యోగం అయితే కొద్ది సమయం ఉండి, మరలా కట్ అయిపోతుందో అటువంటివారిని ప్రీతి పెట్టుకునేవారు అని అంటారు. ప్రీతిని నిభాయించేవారు ప్రీతిలో నిమగ్నమై ఉంటారు. దేహము మరియు దేహ సంబంధీకులను మనస్పూర్వకంగా మరచిపోయి, బాబాతో ప్రీతిని నిలబెట్టుకునే వారైతే వారికి మరల దేహం మరియు దేహ సంబంధీకులు ఎలా స్మృతిలోకి రాగలరు ?
ప్రశ్న:- బాబా ద్వారా ప్రాప్తించిన శక్తులను ప్రత్యక్ష జీవితంలో చూపించిన దానికి గుర్తులు ఏమిటి ?
జవాబు:- 1. శక్తికి గుర్తు - ఏ విషయంలోనూ ఆసక్తి లేకపోవడం.
2) శక్తి స్వరూపులు సదా సేవలో తత్పరులై ఉంటారు. సేవలో ఉండేవారికి ఎప్పుడూ ఏ విధమైన ఆసక్తి ఉండదు. సేవ చేసేవారే త్యాగం మరియు తపస్వీమూర్తులుగా ఉంటారు కనుక వారికి ఏ విషయంలోనూ ఆసక్తి ఉండదు అనగా వారికీ దేహభ్రాంతి ఉండదు.
3) వారికీ శక్తులు ఇచ్చేటటువంటి బాబా మరియు బాబా ద్వారా లభించేటటువంటి శక్తులే స్మృతిలో ఉంటాయి. ఇటువంటి శక్తి అవతారులే మాయాజీత్ గా అవుతారు.
Comments
Post a Comment