* 20-08-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“అన్నింటికన్నా శ్రేష్ఠమైన సింహాసనము మరియు కిరీటము"
నేడు ఈ భట్టీ గ్రూపు డబుల్ భట్టీ చేసేందుకు వచ్చారు. డబుల్ భట్టీ ఏది? డబుల్ భట్టీ రహస్యమును గూర్చి తెలుసా? మధువనం అంటేనే భట్టీ. కాని మధువనం భట్టీలో కూడా విశేషంగా ఏ భట్టీలో మీ మిగిలి ఉన్న సంస్కారాలను భస్మం చేసేందుకు వచ్చారు? మరి డబుల్ భట్టీ ఫోర్స్ కూడా పెరుగుతుంది కదా! ఎందుకంటే కోర్సు లభిస్తుంది. ఒకటేమో- జనరల్, ఇంకొకటేమో- పర్సనల్, డబుల్ కోర్సు ఉన్న కారణంగా డబుల్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. ఏ విధంగా డబుల్ ఫోర్స్ పెరుగుతుందో అలాగే సదా స్వయమును డబుల్ కిరీటధారులుగా భావిస్తూ నడుచుకున్నట్లయితే ఈ డబుల్ కోర్స్ సదా ఫోర్స్ లో ఉండాలి. డబుల్ కిరీటము ఏమిటి? ఇప్పుడు డబుల్ కిరీటధారులుగా ఉన్నారా లేక భవిష్యత్తులో అలా అవుతారా? ఇప్పటి డబుల్ కిరీటము ఏమిటి? ఒకటేమో- లైట్ అనగా పవిత్రతకు గుర్తు మరియు ఇంకొకటి - సంగమ యుగంలో సర్వప్రాప్తులు ఏవైతే లభిస్తాయో ఆ శక్తి ద్వారానే బాధ్యతను ధారణ చేయగలుగుతారు. కావున ప్రకాశ కిరీటము ఉంది మరియు శక్తి కిరీటము కూడా ఉంది. పవిత్రత యొక్క కిరీటము ఉంది మరియు శక్తి కిరీటము కూడా ఉంది. ఈ డబుల్ కిరీటమును నిరంతరము ధారణ చేసేవారిగా ఉన్నారు కదా! కావున మరి డబుల్ ఫోర్స్ సదా నిలిచి ఉండదా? రెండింటి అవసరము ఉంది మరియు రెండు సదా నిలిచి ఉండడం ద్వారా సదా శక్తిశాలీ స్వరూపము కనిపిస్తుంది. సేవలో సఫలతను ప్రాప్తించుకునేందుకు కూడా ఈ రెండు కిరీటాలు అవసరము మరియు ఎంతెంతగా నెంబర్ వారీగా ప్రతి ఒక్కరూ ధారణ చేశారో దాని అనుసారంగా స్వరూపంలో సఫలతను లేక తమ పురుషార్థంలో సఫలతను పొందుతున్నారు. కావున డబుల్ కిరీటము కావాలి మరియు డబుల్ సింహాసనము కూడా కావాలి. డబుల్ సింహాసనము ఏది? (ప్రతి ఒక్కరూ తమ తమ జవాబును ఇచ్చారు). ఒకటేమో- బాప్ దాదాల హృదయరూపీ సింహాసనాధికారులుగా అవ్వడం. అన్నింటికన్నా శ్రేష్ఠ సింహాసనం బాప్ దాదాల హృదయరూపీ సింహాసనానికి అధికారులుగా అవ్వడమే. దానితో పాటు ఈ సింహాసనంపై కూర్చునేందుకు కూడా అచలమైన, స్థిరమైన ఏకరస స్థితి యొక్క ఆసనం కావాలి. ఒకవేళ ఈ స్థితి యొక్క ఆసనంపై స్థితులవ్వకపోతే బాప్ దాదాల హృదయరూపీ సింహాసనంపై కూడా స్థితులవ్వజాలరు. కావున ఈ అచలమైన, స్థిరమైన ఏకరస స్థితి యొక్క ఆసనము ఎంతో అవసరము. ఈ ఆసనంపై పదే పదే ఊగుతూ ఉన్నట్లయితే అకాల సింహాసనాధికారులుగా అవ్వని కారణంగా ఈ ఏకరస స్థితి యొక్క ఆసనంపై కూడా స్థితులవ్వజాలరు. కావున మీ ఈ భృకుటి రూపీ ఆసనంపై అకాలమూర్తులుగా అయి స్థితులైనట్లయితే ఏకరస స్థితి యొక్క ఆసనంపై మరియు బాప్ దాదాల హృదయ సింహాసనంపై విరాజమానులవ్వగలరు. కావున మీరు డబుల్ కిరీటధారులు మరియు డబుల్ సింహాసనాధికారులు కూడా. మరియు ఏ జ్ఞానమైతే లభిస్తుందో ఆ జ్ఞానం కూడా ముఖ్యంగా రెండు విషయాలదే, అవి ఏమిటి?
జ్ఞానం కూడా ముఖ్యంగా రెండు విషయాలకు లభిస్తుంది కదా! తండ్రి మరియు వారసత్వము అనండి లేక రచయిత మరియు రచన అని అనండి. రచనలో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. కావున రచయిత మరియు రచన ఈ రెండు విషయాలలో జ్ఞాన సంపన్నులుగా ఉన్నట్లయితే శక్తిశాలురుగా కూడా అవ్వగలరు. ఎవ్వరైనా రచన యొక్క జ్ఞానంలో పూర్తి నాలెడ్జ్ ఫుల్ గా లేనట్లయితే, బలహీనంగా ఉన్నట్లయితే స్థితి అలజడి చెందుతుంది. రచన యొక్క పూర్తి జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే కేవలం వినడం కాదు, తెలుసుకోవడం అంటే అంగీకరించడము మరియు ఆ విధంగా నడుచుకోవడము. దీనినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. అనగా తెలుసుకోవడము, అంగీకరించడము మరియు నడుచుకోవడం కూడా, అంగీకరించడము మరియు నడుచుకోవడం లేకపోతే నాలెడ్జ్ ఫుల్ లేక జ్ఞాన స్వరూపులు అని అనరు. నడుచుకోవడము-అంగీకరించడము అనగా స్వరూపంగా అవ్వడము. ఎంతో కొంత రచయిత మరియు రచన యొక్క జ్ఞానంలో లోపం ఏర్పడిన కారణంగా పురుషార్ధంలో కూడా లోపము ఏర్పడుతుంది. కావున జ్ఞానం యొక్క ఈ రెండు విషయాలను ధ్యానంలో ఉంచుకుంటూ నడవండి. అచ్ఛా! ఇది జ్ఞానము. అలాగే డబుల్ కర్తవ్యంలో కూడా ఉండాలి. ఈ డబుల్ కర్తవ్యము ఏమిటి? ఈరోజు రెండింటి లెక్కనే వినిపిస్తున్నారు. రెండు కర్తవ్యాలను గూర్చి చెప్పండి. రోజంతటిలో మీ రెండు కర్తవ్యాలు కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యమైన కర్తవ్యాలు - వినాశనము మరియు స్థాపనయే. కొన్నింటిని వినాశనం చేయాలి, మరికొన్నింటిని రచించాలి. అన్నిరకాల రచనను రచిస్తూ ఉంటారు. ఒకటేమో - సేవ ద్వారా మీ రాజధానిని రచిస్తున్నారు మరియు ఇంకొకటి - బుద్ధిలో శుద్ధ సంకల్పాల రచన మరియు వ్యర్థ సంకల్పాల వినాశమునకు విధిని కూడా మీరు అర్థం చేసుకున్నారు. రచనను రెండు విధాలుగాను మనసు ద్వారా కూడా మరియు వాణి ద్వారా కూడా రచిస్తారు. అదేవిధంగా డబుల్ కర్తవ్యమును చేస్తారు. ఈ కార్యంలో రోజంతా బిజీగా ఉన్నట్లయితే మరి ఏకరస స్థితి ఏర్పడదా? ఏకరస స్థితి లేకపోవడానికి కారణం - రచనను రచించడం రాదు లేక వినాశనము చేయడం రాదు. రెండు కర్తవ్యాలలోను లోపము ఉన్న కారణంగా ఏకరస స్థితి నిలువజాలదు. కావున డబుల్ కర్తవ్యంలో ఉండాలి. ఎప్పుడైతే మీరు మీ పొజిషన్ లో ఉంటారో అప్పుడే ఈ డబుల్ కర్తవ్యమును కూడా చేయగలరు. డబుల్ పొజిషన్ అంటే ఏమిటి? ఈ సమయంలోని దానిని గూర్చి అడుగుతున్నారు. దేవతా స్థితి కన్నా ఈ సమయంలోని ఈశ్వరీయ పొజిషన్ ఉన్నతోన్నతమైనది. కావున ఒకటేమో - ఈశ్వరీయ పిల్లలుగా ఉన్నారు అలాగే బ్రహ్మాకుమారీ కుమారులుగా కూడా ఉన్నారు. ఇది సాకారీ పొజిషన్, ఇంకొకటి నిరాకారీ పొజిషన్ మనము ఆత్మలందరిలోకెల్లా హీరో పాత్రధారీ ఆత్మలము, శ్రేష్ఠ ఆత్మలము. మరియు ఇంకొక పొజిషన్ - ఈశ్వరీయ సంతానముగా బ్రహ్మాకుమారీ కుమారులుగా ఉండే పాత్ర. ఈ రెండు పొజిషన్లు స్మృతిలో ఉన్నట్లయితే కర్మ మరియు సంకల్పాలు రెండూ శ్రేష్ఠంగా అయిపోతాయి. శ్రేష్ఠ ఆత్మలు అనగా హీరో పాత్రధారులుగా స్వయమును భావించడం ద్వారా ఈశ్వరీయ మర్యాదలకు లేక బ్రాహ్మణకులపు మర్యాదలకు విరుద్ధంగా ఉన్న వాటినేవీ చేయరు. కావున ఈ రెండు పొజిషన్లు స్మృతిలో ఉన్నట్లయితే మాయ యొక్క అపోజిషన్ అంతమైపోతుంది. కావున డబుల్ పొజిషన్‌ను కూడా ఎల్లప్పుడు స్మృతిలో ఉంచుకోండి.
అచ్ఛా - డబుల్ లక్ష్యం ఏమిటి?
డబుల్ నషా ఏదైతే ఉంటుందో అదే డబుల్ లక్ష్యంగా కూడా ఉంటుంది. ఒకటేమో - నిరాకారీ లక్ష్యము. స్వయమును సదా నిరాకారీ దేశ నివాసులుగా భావించాలి మరియు నిరాకారీ స్థితిలో స్థితులవ్వాలి. సాకారంలో ఉంటూ కూడా స్వయమును నిరాకారులుగా భావిస్తూ నడుచుకోవాలి. ఒకటేమో - సోల్ కాన్షియస్ లేక ఆత్మాభిమానిగా అయ్యే లక్ష్యము మరియు రెండవది - నిర్వికారీ స్థితి. అందులో మనసాలో కూడా నిర్వాకారీ స్థితిని తయారుచేసుకోవలసి ఉంటుంది. కావున ఒకటేమో - నిరాకారీ స్థితి మరియు ఇంకొకటి - సాకారీ స్థితి. కావున నిరాకారీ మరియు నిర్వికారీ ఈ రెండూ లక్ష్యాలు. రోజంతా యోగిగా మరియు పవిత్రంగా అయ్యే పురుషార్థం చేస్తారు కదా! ఎప్పటివరకైతే పూర్తిగా ఆత్మాభిమానిగా అవ్వరో అప్పటివరకు నిర్వికారులుగా కూడా అవ్వలేరు. కావున నిర్వికారీ స్థితి యొక్క లక్ష్యము మరియు నిరాకారీ స్థితి యొక్క లక్ష్యము. దానినే ఫరిస్తా అనండి, కర్మాతీత స్థితి అని అనండి. కావున ఎప్పుడైతే ఏవిధమైన అపవిత్రత అనగా పంచతత్వాల యొక్క ఆకర్షణ ఆకర్షితం చేయదో అప్పుడే ఫరిస్తాగా కూడా అవుతారు. కొద్దిగా కూడా మనస్సులోని సంకల్పం కూడా అపవిత్రంగా ఉండకూడదు, అప్పుడే ఫరిస్తా స్వరూపపు స్థితిలో స్థితులవ్వగలరు. కావున ఈ డబుల్ లక్ష్యాన్ని కూడా సదా స్మృతిలో ఉంచుకోవాలి. అలాగే డబుల్ ప్రాప్తి ఏమిటి? అతీంద్రియ సుఖము యొక్క ప్రాప్తి. అందులో శాంతి మరియు సంతోషము ఇమిడి ఉన్నాయి. ఇది సంగమ యుగపు వారసత్వము. ఇప్పటి ప్రాప్తి ఏదైతే ఉందో అది మళ్ళీ ఎప్పుడూ ప్రాప్తమవ్వజాలదు. కావున బాబా మరియు వారసత్వము ఇది డబుల్ ప్రాప్తి. బాబా ప్రాప్తిని కూడా మొత్తం కల్పంలో ఇంకెప్పుడూ పొందలేరు. అలాగే బాబా ద్వారా ఇప్పుడు ఏ వారసత్వమైతే లభిస్తుందో అది కూడా మొత్తం కల్పం లోపల ఇప్పుడే లభిస్తుంది. అది మళ్ళీ ఇంకెప్పుడూ లభించజాలదు. ఈ సమయంలోని ప్రాప్తులైన అతీంద్రియ సుఖము మరియు సంపూర్ణ జ్ఞానము మళ్ళీ ఇంకెప్పుడూ లభించజాలవు. కావున ఈ రెండు పదాలలో డబుల్ ప్రాప్తి లభిస్తుంది. బాబా మరియు వారసత్వము. వీటిలో జ్ఞానమూ వచ్చేస్తుంది, అతీంద్రియ సుఖము కూడా వచ్చేస్తుంది అలాగే ఆత్మిక సంతోషము కూడా వచ్చేస్తుంది, ఆత్మిక శక్తి కూడా వచ్చేస్తుంది. కావున ఇది డబుల్ ప్రాప్తి. అర్థమైందా? ఎప్పుడైతే స్వయమును కూడా కంబైండ్ గా భావిస్తారో అప్పుడే ఈ రెండు రెండు విషయాలన్నింటినీ ధారణ చేయగలుగుతారు.
ఒకరేమో బాబా, ఇంకొకటి నేను. కంబైండ్ గా భావించడం ద్వారా ఈ రెండు రెండు విషయాలన్నీ సహజముగా ధారణ అవ్వగలవు. భట్టీలోకి వచ్చారు కదా! కావున ఈ రెండు రెండు విషయాలనేవైతే వినిపించారో వాటన్నింటి స్మృతి స్వరూపంగా భట్టీలో తయారై వెళ్ళండి. కేవలం విని వెళ్ళకండి. ఎన్నో విన్నారు, వినడము అనగా అంగీకరించడము మరియు నడుచుకోవడము అనగా స్వరూపంగా అవ్వడము. కావున మీరు జ్ఞానులుగా ఉన్నారు, కాని జ్ఞాన స్వరూపులుగా అయి వెళ్ళాలి. యోగులుగా ఉన్నారు. కాని యోగయుక్తంగా, యుక్తియుక్తంగా అయి వెళ్ళాలి. తపస్వీ కుమారులుగా ఉన్నారు. కాని త్యాగమూర్తులుగా కూడా అయిపోవాలి. త్యాగమూర్తులుగా అవ్వకుండా తపస్వీమూర్తులుగా అవ్వజాలరు. కావున తపస్వులుగా ఉన్నారు కాని దానితో పాటు త్యాగమూర్తులుగా కూడా అవ్వాలి. బ్రహ్మాకుమారులుగా ఉన్నారు కాని బ్రహ్మాకుమారులు లేక బ్రాహ్మణ కులపు మర్యాదలను తెలుసుకుని మర్యాదా పురుషోత్తములుగా అయి వెళ్ళాలి. మీ ఒక్కొక్క సంకల్పము వాయుమండలంపై ప్రభావం చూపే విధంగా అటువంటి మర్యాదా పురుషోత్తములుగా, శక్తిశాలిగా అయి వెళ్ళండి. శక్తి ఉంది కాని శక్తి శాలిగా అయి వెళ్ళాలి. ఎవరైతే ఫుల్ గా ఉంటారో వారు ఎప్పుడూ ఫెయిలవ్వరు. ఫుల్ గా ఉండడానికి గుర్తు - ఒకటేమో ఫీలవ్వరు, ఇంకొకటి - ఫెయిలవ్వరు మరియు ఫ్లా అనగా మచ్చలేవీ ఉండవు. కావున ఫుల్ గా అయి వెళ్ళండి, అందుకే భట్టీలోకి వచ్చారు. ఏమి నేర్చుకోవాలి? ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఇంతటి పాఠాన్ని ప్రాక్టికల్ లో నేర్చుకుని వెళ్ళాలి. ఈ పాఠమును ప్రాక్టికల్ గా చదువుకుని వెళ్ళాలి. పాఠమును ఎంత పక్కాగా చేసుకోవాలంటే మీ ప్రాక్టికల్ ఏక్టివిటీ పాఠంగా అయిపోవాలి. ఒకటేమో - పాఠమును నోటితో చదవడము, ఇంకొకటి నేర్పించడము. నోటితో చదివించడం జరుగుతుంది, కర్మ ద్వారా నేర్పించడం జరుగుతుంది. కావున ప్రతి నడవడక ఒక్కొక్క పాఠము. ఎటువంటి పాఠమును నేర్చుకుంటారో అటువంటి ఉన్నతిని పొందుతారు కదా! ఇదేవిధంగా మీ అందరి ఒక్కొక్క కర్మ ఎటువంటి పాఠంగా ఉండాలంటే అందరికీ నేర్పించాలి లేక చదివించాలి దానితో వారు ఉన్నతిని పొందుతూ ఉండాలి. మీరూ చదవాలి మరియు చదివించాలి కూడా. వారం రోజుల కోర్సునైతే అందరూ చేశారు కదా! సప్తాహిక కోర్సును ఏదైతే చేశారో ఆ ఫోర్సును ఫుల్ గా చేశారా లేక కోర్సునే చేశారా? కోర్సు అర్థమే - తమలో స్వయంలో ఫోర్స్ ను నింపుకోవడము. ఫోర్సును నింపుకోకపోతే కోర్సును కూడా ఏమి చేసినట్లు? నిర్బల ఆత్మల నుండి శక్తిశాలి ఆత్మగా అయ్యేందుకు కోర్సును చేయించడం జరుగుతుంది. కావున కోర్సు యొక్క ఫోర్స్ లేకపోతే మరి అది ఏమైనా కోర్సా? కావున ఇప్పుడు ఫోర్సుబుల్ గా కోర్సు చేసేందుకు వచ్చారు కదా!
డబుల్ కిరీటధారులుగా కూడా అవ్వాలి. డబుల్ కిరీటము ఏమిటి? రోజూ మీ తిలకమును చూస్తున్నారా? అమృతవేళ జ్ఞానస్నానము చేసేటప్పుడు తిలకమును కూడా దిద్దుకుంటున్నారా? ఆత్మిక స్మృతి లేక స్వరూపం యొక్క తిలకమునైతే దిద్దుకున్నారు. రెండవది - నిశ్చయరూపీ తిలకము. ఒకటేమో - ఆత్మిక స్థితిరూపీ తిలకము మరియు ఇంకొకటి - మనము విజయీ రత్నాలము. ప్రతి సంకల్పము, ప్రతి అడుగులో విజయము, సఫలత నిండి ఉండాలి. ఈ విజయ తిలకమే విక్టరీ. కావున మీ తిలకము విజయ తిలకము మరియు విజయీరూపం యొక్క తిలకము. ఈ డబుల్ తిలకము సదా స్మృతిలో ఉండాలి. స్మృతి అనగా తిలకధారులుగా అవ్వాలి. కావున ఈ డబుల్ తిలకమును కూడా ఎప్పుడూ మరిచిపోకూడదు. నేను విజయుడను అన్న ఈ స్మృతిలో ఉండడం ద్వారా ఎప్పుడూ భిన్న భిన్న పరిస్థితులు చలింపజేయజాలవు. విజయము లభించే తీరుతుంది. వర్తమాన సమయంలో మీ స్థితి అలజడి చెందుతున్న కారణంగా విజయము అనగా సఫలతలో అలజడి కనిపిస్తూ ఉంటుంది. కాని విజయము ప్రతి కర్తవ్యములోనూ లభించే ఉంది. ఏ విధంగా ఏదైనా సీజన్ లో అలజడి ఉన్నట్లయితే వాతావరణంలో లోపం కారణంగా టెలివిజన్ లో కూడా స్పష్టంగా కనిపించదు. అదేవిధంగా మీ స్థితిలో అలజడి ఉన్న కారణంగా విజయము లేక సఫలతను స్పష్టంగా అనుభవం చేసుకోలేకపోతారు. కారణం ఏమిటి? మీ స్థితిలో అలజడి స్పష్టమును కూడా అస్పష్టంగా చేసేస్తుంది. అలజడుల కారణంగా ఉజ్వలంగా అవ్వలేరు. కావున మీ స్థితి అలజడి చెందకపోతే స్మృతి క్లియర్ గా ఉంటుంది. అక్కడ సీజన్ క్లియర్ గా ఉండడం ఇది స్మృతి క్లియర్ గా ఉండడం. స్మృతి క్లియర్ గా ఉన్నట్లయితే సఫలత కూడా క్లియర్ రూపంలో కనిపిస్తుంది. స్మృతి క్లియర్ గా లేకపోతే లేక తమపై తాము పూర్తి జాగ్రత్తగా లేకపోతే తక్కువ కేర్ ఫుల్ గా ఉన్నట్లయితే రిజల్టు కూడా ఫుల్ గా కనిపించదు. ఎంతగా మీపై మీరు కేర్ ఉంచుతారో అంతగా క్లియర్ గా ఉంటారు మరియు అంతగానే సఫలతను మీ పురుషార్థంలో లేక సేవలో స్పష్టంగా మరియు సమీపంగా కనిపిస్తుంది. లేకపోతే స్పష్టంగానూ కనిపించదు మరియు సమీపంగానూ కనిపించదు. టెలివిజన్లో దూరంగా ఉన్న దృశ్యము సమీపంపగాను మరియు స్పష్టంగాను ఉంటుంది కదా! అదేవిధంగా ఏకరస స్థితి ఉన్న కారణంగా కేర్ ఫుల్ గా మరియు క్లియర్ గా ఉన్న కారణంగా సఫలత సమీపంగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది. అర్థమైందా? ఈ రెండింటిలో ఒక్కదాని యొక్క లోపము ఉన్నా సఫలతను అనుభవం చేసుకోలేరు. అప్పుడు మళ్ళీ తికమకపడతారు. అప్పుడిక ఏమి చేయాలి, ఇది ఎలా అవుతుంది అన్న బలహీనతతో కూడిన భాష ఉంటుంది. కావున ఈ రెండు విషయాలను ధారణ చేసి వెళ్ళినట్లయితే సఫలతామూర్తులుగా అయిపోతారు. సఫలత ఎంత సమీపంగా వస్తుందంటే - మీ మెడలోని మాల ఎంత సమీపంగా వచ్చేస్తుందో అంతగా సఫలత కూడా కంఠహారంగా అయిపోతుంది. అచ్ఛా!
Comments
Post a Comment