* 20-06-1973 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“లగనమునకు సాధనము విఘ్నము.”
వరదాన భూమి నుండి వరదాత ద్వారా సర్వ వరదానాలను ప్రాప్తించుకొని తీవ్ర పురుషార్థులుగా అవుతున్నారా? పురుషార్థం యొక్క నడవడికలో ఏ పరివర్తననైతే తీసుకువచ్చారో దానిని అవినాశిగా తీసుకువచ్చారా లేక అల్పకాలికంగా తీసుకువచ్చారా? ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా, చలింపజేసేందుకు ఎటువంటి విఘ్నం వచ్చినా కాని, ఎవరితోనైతే స్వయంగా సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారో వారి ముందు ఆ విఘ్నము ఎంత! వారి ముందు ఆ విఘ్నము పరివర్తన చెంది ఎలా అయిపోతుంది? విఘ్నము లగనము యొక్క సాధనంగా అయిపోతుంది. హర్షితమవుతారు కదా! ఎటువంటి పరిస్థితి అయినా లేక వ్యక్తి అయినా విఘ్నమును తీసుకువచ్చేందుకు నిమిత్తంగా అయితే, వారి పట్ల ద్వేషదృష్టి, వ్యర్థ సంకల్పాల ఉత్పత్తి జరుగకూడదు. వారి పట్ల ఓహో, ఓహో అనే భావన వెలువడాలి. ఈ దృష్టి ఉంచినట్లయితే మీ అందరికీ శ్రేష్ఠ దృష్టి ఏర్పడుతుంది. ఎవ్వరు ఎలా ఉన్నా కాని మీ దృష్టి మరియు వృత్తి ఎల్లప్పుడూ శుభచింతకంగా ఉండాలి మరియు కళ్యాణభావనతో ఉండాలి. ప్రతి విషయంలోనూ కళ్యాణము కనిపించాలి. కళ్యాణకారి తండ్రి సంతానమైన మీరు కళ్యాణకారులు కదా! కళ్యాణకారులుగా అయిన తర్వాత ఎటువంటి అకళ్యాణపు విషయము జరుగజాలదు. ఈ నిశ్చయము మరియు సృతిస్వరూపంగా అయిపోయినట్లయితే మీరెప్పుడూ అలజడి చెందజాలరు. ఎవరైనా పచ్చ కళ్ళద్దాలు లేక ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుంటే వారికంతా పచ్చగా లేక ఎర్రగానే కనిపిస్తుంది. అలాగే మీ మూడవ నేత్రంపై కళ్యాణకారులు అనే కళ్ళద్దాలు ఉన్నాయి. ఈ మూడవ నేత్రము ఉన్నదే కళ్యాణకారిగా, అందులో అకళ్యాణము కనిపించడం అనేది జరుగజాలదు. దానిని అజ్ఞానులు అకళ్యాణంగా భావిస్తారు. కాని మీకు ఆ అకళ్యాణంలోనే కళ్యాణము ఇమిడి ఉంది. జనులు వినాశనాన్ని అకళ్యాణముగా భావిస్తారు, కాని మీరు దీని ద్వారానే గతి, సద్గతి ద్వారాలు తెరుచుకుంటాయి అని భావిస్తారు. కావున ఏ విషయం మీ ముందుకు వచ్చినా అన్నింటిలోను కళ్యాణం నిండి ఉంది అన్న ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారిగా అయి నడుచుకున్నట్లయితే ఎటువంటి ప్రాప్తి లభిస్తుంది? ఏకరస స్థితి తయారవుతుంది. ఏ విషయంలోనూ ఆగిపోకూడదు. ఎవరైతే ఆగిపోతారో వారు బలహీనంగా ఉంటారు. మహావీరులు ఎప్పుడూ ఆగరు. విఘ్నాలు వచ్చి ఆగిపోవడం అన్నది జరుగకూడదు. అచ్ఛా! ఓం శాంతి!
Comments
Post a Comment