* 20-05-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"సారస్వరూపులుగా అవ్వడము ద్వారా సంకల్పాలు మరియు సమయంలో పొదుపు"
మాస్టర్ బీజరూప స్థితిలో స్థితులై ఉండే అభ్యాసము చేస్తూ చేస్తూ సహజంగా ఈ స్మృతిలో మిమ్మల్ని మీరు స్థితులను చేసుకోగలుగుతారా? ఏ విధంగా విస్తారంలోకి లేక వాణిలోకి సహజంగానే వచ్చేస్తారో అలా వాణి నుండి అతీతంగా విస్తారం యొక్క బీజమైన సారంలో స్థితులవ్వగలరా? హద్దులోని ఇంద్రజాలికులు విస్తారమును ఇముడ్చుకునే శక్తిని చూపిస్తారు. మరి అనంతమైన ఇంద్రజాలికులైన మీరు విస్తారమును సారములో ఇముడ్చుకోలేరా? మీ ముందుకు ఏ ఆత్మ వచ్చినా వారం రోజుల కోర్సును ఒక్క క్షణంలో ఎవ్వరికైనా ఇవ్వగలరా అనగా సప్తాహిక కోర్సు ద్వారా ఏ ఆత్మలలోనైనా ఆత్మిక శక్తిని లేక సంబంధాల శక్తిని నింపాలనుకుంటే దానిని ఒక్క క్షణంలో ఏ ఆత్మలోనైనా నింపగలరా లేక అది అంతిమ స్థితా? ఏ విధంగా ఏ వ్యక్తి అయినా అద్దం ముందుకు రావడంతోనే ఒక్క క్షణంలోనే స్వయమును సాక్షాత్కరింపజేసుకోగలరో అలా మీ ఆత్మిక స్థితి యొక్క శక్తిరూపీ దర్పణము ముందుకు ఏ ఆత్మ అయినా వచ్చినప్పుడు ఒక్క క్షణంలో స్వస్వరూప దర్శనమును లేక సాక్షాత్కారమును చేసుకోలేరా? ఆ స్థితిలో బాబా సమానంగా లైట్ హౌస్ గా మరియు మైట్ హౌస్ గా అయ్యే సమీప అనుభవమును పొందుతున్నారా లేక ఇప్పటికీ ఈ స్థితి చాలా దూరంగా ఉందా? సంభవమే అని భావించాక కూడా, అది ఇప్పటివరకు లభించకపోవడానికి కారణమేమిటి? ఏదైతే సంభవమో అది ఇప్పటివరకు ప్రాక్టికల్ గా లేనట్లయితే తప్పకుండా ఏదో కారణం ఉంటుంది కదా! ఆ డీలాతనం కూడా ఎందుకు ఉంది? ఇటువంటి స్థితిని తయారుచేసుకోవడంలో ముఖ్యంగా ఏ అటెన్షన్లో లోపం ఉంది? ఇప్పుడు సైన్స్ కూడా అనేక కార్యాలను ఒక్క క్షణంలో చేసి చూపించింది. కేవలం స్విచ్ ఆనాఫ్ చేయడమే తరువాయి. మరి ఇక్కడ ఆ స్థితి ఎందుకు తయారవ్వజాలదు. ముఖ్యమైన కారణం ఏమిటి? దర్పణమైతే ఉంది కదా! దర్పణం ముందు సాక్షాత్కారమవ్వడంలో ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు మీరు స్వయమే విస్తారంలోకి ఎక్కువగా వెళుతున్నారు. ఎవరైతే స్వయమే విస్తారంలోకి వెళుతూ ఉంటారో వారు ఇతరులను సారరూపంలోకి ఎలా తీసుకురాగలుగుతారు? ఏ విషయమునైనా చూస్తూ లేక వింటూ ఉన్నప్పుడు బుద్ధికి చాలా సమయపు అలవాటు ఉన్న కారణంగా విస్తారంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మీరు దేనిని చూసినా లేక విన్నా, దాని సారమును తెలుసుకొని క్షణములో దానిని ఇముడ్చివేసే లేక పరివర్తనచేసే అభ్యాసము తక్కువగా ఉంది. ఎందుకు, ఏమిటి... అన్న విస్తారంలోకి వద్దనుకుంటున్నా వెళ్ళిపోతూ ఉంటారు, కావున ఏ విధంగా బీజంలో శక్తి అధికంగా ఉంటుందో, వృక్షంలో తక్కువగా ఉంటుందో అలా వృక్షము అనగా విస్తారము. ఏదైనా విస్తారమైపోయినప్పుడు దాని శక్తి కూడా విస్తారమైపోతుంది. సాక్రీన్ కు మరియు పంచదారకు తేడా ఉంటుంది కదా! పంచదారను అధికమోతాదులో వేయవలసి ఉంటుంది, సాక్రీన్ కు తక్కువ మోతాదులోనే ఎక్కువ తియ్యదనము ఉంటుంది. అదేవిధంగా ఏ విషయం యొక్క విస్తారంలోకైనా వెళ్ళినప్పుడు సమయము మరియు సంకల్పాల శక్తి రెండూ వ్యర్థమైపోతాయి. వ్యర్థమైపోయిన కారణంగా ఆ శక్తి ఉండదు. కావున ఇటువంటి శ్రేష్ఠస్థితిని తయారుచేసుకునేందుకు సదా ఈ అభ్యాసమును చేయండి. ఏ విషయపు విస్తారమునైనా ఇముడ్చుకొని సారంలో స్థితులై ఉండగలరా? ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ స్వయం సారరూపులుగా అయిన కారణంగా ఇతర ఆత్మలకు కూడా ఒక్క క్షణంలో మొత్తం జ్ఞానసారమంతటినీ అనుభవం చేయించగలుగుతారు. అనుభవీ మూర్తులే ఇతరులకు అనుభవం చేయించగలరు. ఈ విషయంలో స్వయమే తక్కువగా అనుభవజ్ఞులుగా ఉన్నారు, ఈ కారణంగా ఇతర ఆత్మలకు కూడా అనుభవం చేయించలేరు. ఏదైనా శక్తి శాలీ వస్తువులో లేక శక్తి శాలీ సాధనాలలో ఏదైనా వస్తువును పరివర్తన చేసే శక్తి ఉంటుంది. అగ్ని చాలా తీవ్రంగా అనగా శక్తి శాలిగా ఉన్నప్పుడు అందులో ఏ వస్తువును వేసినా స్వతహాగానే దాని రూపము పరివర్తన అయిపోతుంది. ఒకవేళ అగ్ని శక్తిశాలిగా లేనట్లయితే ఏ వస్తువు యొక్క రూపమునైనా పరివర్తన చేయలేరు. అదేవిధంగా ఎల్లప్పుడూ మీ శక్తి శాలీ స్థితిలో ఉన్నట్లయితే ఏ విషయమైనా వ్యక్తభావము లేక వ్యక్తప్రపంచపు వస్తువులు లేక వ్యక్తభావనలో ఉండే వ్యక్తులు మీ ముందుకు వచ్చినప్పుడు, మీరు శక్తిశాలి స్థితిలో ఉన్న కారణంగా వారి స్థితి లేక రూపురేఖలు పరివర్తన అయిపోతాయి. వ్యక్తభావంలో ఉండేవారి వ్యక్తభావాలు మారి ఆత్మిక స్థితి తయారవుతుంది. వ్యర్థభావము పరివర్తన అయి సమర్థ రూపాన్ని ధారణ చేస్తుంది. వికల్పము అన్న పదము శుద్ధ సంకల్పరూపమును ధారణ చేస్తుంది. కాని, ఎప్పుడైతే ఇటువంటి శక్తి శాలీ స్థితిలో స్థితులవుతారో అప్పుడే ఇటువంటి పరివర్తన జరుగుతుంది, అప్పుడిక ఎటువంటి లౌకికత అయినా అలౌకికతలోకి పరివర్తన అయిపోతుంది. సాధారణమైనది అసాధారణ రూపంలోకి పరివర్తితమైపోతుంది. అప్పుడు ఇటువంటి స్థితిలో ఉండేవారు ఎటువంటి వ్యక్తి, వైభవాలు, వాయుమండలము, వైబ్రేషన్లు, వృత్తి లేక దృష్టికి వశమవ్వజాలరు. కావున కారణం ఏమిటో ఇప్పుడు అర్థం చేసుకున్నారా? ఒకటేమో, ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉంది. ఇంకొకటి పరివర్తన చేసే శక్తి తక్కువగా ఉంది, అనగా లైట్ హౌస్ గా, మైట్ హౌస్ గా రెండు స్థితులలో సదాకాలికంగా స్థితులై ఉండడం లేదు. ఏ కర్మనైనా చేసే ముందు బాప్ దాదాల ద్వారా విశేషంగా శక్తుల కానుక ఏదైతే లభించిందో దానిని ఉపయోగించరు. కేవలం చూస్తూ చూస్తూ సంతోషిస్తూ ఉంటారు, కాని సమయానికి వాటిని ఉపయోగించని కారణంగా ఆ లోటు అలా ఉండిపోతుంది.
ప్రతి కర్మను చేసేముందు మాస్టర్ త్రికాలదర్శులుగా అయి కర్మను చేయడంలేదు. మాస్టర్ త్రికాలదర్శులుగా అయి ప్రతి కర్మను, ప్రతి సంకల్పమును చేసినట్లయితే, ప్రతి మాటను మాట్లాడినట్లయితే, అప్పుడు ఏ కర్మ అయినా వ్యర్థముగా లేక అనర్థముగా అవ్వగలదా? కర్మ చేసేటప్పుడు ఆ కర్మకు వశమైపోతారు. త్రికాలదర్శులు అనగా సాక్షీ స్వరూపపు స్థితిలో స్థితులై ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించరు, కావున వశీభూతులైపోతారు. వశీభూతులైపోవడం అనగా భూతాలను ఆహ్వానించడము. కర్మ చేసిన తర్వాత పశ్చాత్తాపము కలుగుతుంది. కాని, దానివల్ల లాభమేమిటి? కర్మ యొక్క గతి లేక కర్మ యొక్క ఫలమైతే తయారైపోయింది కదా! కావున కర్మకు మరియు కర్మఫలము యొక్క బంధనలో చిక్కుకుపోయిన కారణంగా కర్మబంధిత ఆత్మ తన ఉన్నతమైన స్థితిని పొందజాలదు. కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు వచ్చారు. కాని, ముక్తులుగా అవుతూ అవుతూ కర్మబంధన యుక్తులుగా అయితే అయిపోలేదు కదా అని ఎల్లప్పుడూ పరిశీలించుకుంటూ ఉండండి జ్ఞానస్వరూపలుగా అయిన తర్వాత మాస్టర్ జ్ఞానస్వరూపులుగా, మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిన తరువాత యుక్తీయుక్తముగా లేని కర్మలను ఏవైనా చేస్తే ఈ కర్మల బంధనము అజ్ఞానకాలపు కర్మబంధనకన్నా కోటానురెట్లు ఎక్కువగా ఉంటుంది. కావున ఈ కారణంగా బంధనయుక్త ఆత్మ స్వతంత్రంగా లేని కారణంగా ఏది కావాలనుకుంటే అది చేయలేదు. ఇది జరుగకూడదు, ఇది జరగాలి, ఇది అంతమైపోవాలి. సంతోషము అనుభవమవ్వాలి, తేలికతనం రావాలి, సంతుష్టత అనుభవమవ్వాలి, సేవ సఫలీకృతమవ్వాలి లేక దైవీపరివారమునకు సమీపంగా లేక స్నేహులుగా అయిపోవాలి అని భావిస్తారు. కాని, చేసి ఉన్న కర్మల బంధన కారణంగా కోరుకుంటూ కూడా ఆ అనుభవం చేసుకోలేరు. ఈ కారణంగా తమను తాము లేక తమ పురుషార్థము ద్వారా అనేక ఆత్మలను సంతుష్టపర్చలేరు. కావున ఈ కర్మల గుహ్యగతిని తెలుసుకొని అనగా త్రికాలదర్శులుగా అయి ప్రతి కర్మనూ చేయండి, అప్పుడే కర్మాతీతంగా అవ్వగల్గుతారు. చిన్న చిన్న తప్పులు సంకల్పరూపంలో కూడా జరుగుతాయి. వాటి లెక్కాచారాలు చాలా కఠినంగా తయారవుతాయి. చిన్న పొరపాటును కూడా ఇప్పుడు పెద్ద పొరపాటుగా భావించాలి. ఏ విధంగా అతి స్వచ్ఛమైన వస్తువుపై చిన్న మచ్చ కూడా పెద్దదిగా కనిపిస్తుందో, అలాగే వర్తమాన సమయంలో అతి స్వచ్ఛమైన సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు, కావున చిన్న పొరపాటు కూడా ఇప్పుడు పెద్ద రూపంలో లెక్కించబడుతుంది. కావున ఇందులో కూడా ఇవి చిన్న చిన్న పొరపాట్లే కదా, ఇవైతే జరుగుతూనే ఉంటాయి అని నిర్లక్ష్యంతో ఉండకూడదు. అలా కాదు ఇప్పుడు సమయం మారిపోయింది, ఇప్పుడు సమయంతో పాటు పురుషార్థపు వేగం కూడా మారిపోయింది. వర్తమాన సమయం అనుసారంగా చిన్న పొరపాటు కూడా పెద్ద పొరపాటుగా లెక్కింపబడుతుంది. కావున ప్రతి అడుగులోను అప్రమత్తంగా ఉండండి. ఒక చిన్న పొరపాటు కూడా ఎంతో కాలము తమ ప్రాప్తి నుండి వంచితము చేస్తుంది. కావున నాలెడ్జ్ ఫుల్ అనగా లైట్‌హౌస్ గా, మైట్ హౌస్ గా అవ్వండి. అనేక ఆత్మలకు దారిని చూపించేవారు నడుస్తూ నడుస్తూ స్వయమే ఆగిపోతే ఇతరులకు దారిని చూపించేందుకు ఎలా నిమిత్తులవ్వగలరు? కావున సదా విఘ్నవినాశకులుగా అవ్వండి. అచ్ఛా!
ఈ విధంగా సదా త్రికాలదర్శులుగా, కర్మయోగులుగా అయి నడుచుకునేవారికి నమస్తే. ఓం శాంతి.
Comments
Post a Comment