19-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మాయతో సవాల్ చేసే సైన్యమే తమ జెండాను ఎగురవేయగలరు.
ధైర్యం మరియు ఉల్లాసాన్ని నింపి నిర్నయంగా తయారుచేసేవారు, అహింసక పాండవసేనతో శివబాబా మాట్లాడుతున్నారు -
బ్రహ్మాబాబా ఏమి కోరుకుంటున్నారు? సైన్యం తయారుగా ఉండాలని అనుకుంటున్నారు. కనుక సాకారంలో నిమిత్తమైన ఆత్మలు ఇప్పుడు సైన్యాన్ని తయారుచేయడంలో తీవ్రగతిని చూపించాలి, తీవ్రగతి అనగా త్వరగా చేయడం, త్వరగా చేయడం అనగా ఆలోచించగానే చేసేయడం, సంకల్పం మరియు కర్మలో సమానత రావాలి. ప్లాన్ వేయడం మరియు ప్రత్యక్షంలోకి తీసుకురావడంలో సమానత ఉండాలి. ఇలాంటి వేగం ఉందా? లేక చాలా ప్లాన్లు తయారుచేస్తున్నారు కానీ, ప్రత్యక్షంలోకి తక్కువగా తీసుకువస్తున్నారా? సంకల్పాలు చాలా చేస్తున్నారు. కాని కర్మలోకి తక్కువ వస్తున్నాయా? సంకల్పం మరియు కర్మలో సమానతయే సంపూర్ణతకు గుర్తు. ఈ గుర్తు ద్వారానే మీ గమ్యానికి ఎంత దగ్గరగా ఉన్నారో నిర్ణయించుకోగలరు. కనుక మీ సంఘటనను ఎలా తయారుచేయాలంటే వారిని చూసి ఇతరులు కూడా ధైర్యం ఉల్లాసంలోకి వచ్చి అనుసరించాలి. ఎలాగైతే సాకార తండ్రి యొక్క ఉదాహరణ పురుషార్థీల పురుషార్థాన్ని సహజం చేసిందో అదేవిధంగా నమూనా తయారుచేస్తే వారిని చూసి ఇతర పురుషార్థులకు కూడా సహజమైపోవాలి, అలాంటి సంఘటన తయారేనా? శక్తుల యొక్క ఎలాంటి సంఘటన ఉండాలంటే, మాయ ఎంతటి శక్తి గలవారిలో ఉన్నా కానీ మాయకు సవాల్ చేసేవారిగా ఉండాలి. జూదంలో ఓటమి అయితే వారికే ఉంటుంది. కల్పపూర్వపు స్మృతిచిహ్నంలో కూడా జూదాన్ని చూపించారు. కానీ యదార్థ రూపంలో చూపించలేదు. కౌరవులు తమ జూదంలో నిమగ్నమై ఉన్నారు మరియు ధర్మసత్తా గలవారు తమ జూదంలో నిమగ్నమై ఉన్నారు. జూదంలో వారి ఓటమి తప్పదు మరియు పాండవుల యొక్క జెండా ప్రసిద్ధి అవుతుంది.
ఈవిధంగా సవాల్ చేసే నిర్భయులకు, మాయా తుఫానులకు కూడా భయపడనివారికి, నిరంతర విజయం యొక్క ఛాలెంజ్ చేసే ఇలాంటి సేనకు ఇన్‌ఛార్జ్ గా అవ్వాలి, అప్పుడే ఇతరులు కూడా అనుసరిస్తారు.
Comments
Post a Comment