19-10-1975 అవ్యక్త మురళి

19-10-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

వృక్షపతి ద్వారా కల్పవృక్షం యొక్క దుర్దశ యొక్క పరిస్థితి. 

                       మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు, కొత్త కల్పవృక్షం యొక్క రచయిత పరమపిత శివపరమాత్మ వృక్షం యొక్క విహర సమాచారం అంతా వివరిస్తూ అన్నారు -
                      ఈరోజు వృక్షపతి మరియు ఆదిదేవ్ ఇద్దరూ తమ వృక్షం యొక్క రూపు రేఖలను చూడడానికి వెళ్ళారు. ఆదిదేవ్ అనగా సాకార మనుష్య సృష్టి యొక్క రచయిత తండ్రి (ప్రజాపిత బ్రహ్మ) వృక్షం యొక్క నలువైపులా చూసినప్పుడు ఏమి చూశారు? మనుష్య ఆత్మ అనే ప్రతి ఒక్క ఆకు పాతదిగా అయితే అయిపోయింది, కానీ ఎక్కువ ఆకులకు చీడపట్టి ఉంది. అందువలన ఆకు యొక్క రంగు, రూపం మారిపోయింది అంటే వర్ణం మారిపోయింది. ఒకవైపు రాజ్యసత్తాను చూశారు, రెండవవైపు ధర్మ సత్తా, మూడవ వైపు భక్తి సత్తా, నాల్గవ వైపు ప్రజాసత్తా... ఈ నాలుగు శక్తులు ఆంతరంగికంగా పూర్తిగా శక్తిహీనంగా కనిపించాయి. లోపల ఖాళీ, బాహ్యంగా కేవలం రూపం మిగిలింది అంతే, చెద పట్టినప్పుడు ఎలాగైతే బయట రూపం బాగానే కనిపిస్తుంది, కానీ లోపల అంతా డొల్ల అయిపోతుంది. అదేవిధంగా రాజ్యసత్తాలో కూడా రాజ్యం యొక్క సత్తా లేదు, పేరుకు రాజ్యం కానీ రాత్రిపగలు పరస్పరంలో ఈర్ష్య యొక్క అగ్ని మండుతూ కనిపించింది. రాజ్యసుఖాల ప్రాప్తి ఎలా ఉన్నా కానీ ఒక్క నిమిషం కూడా శాంతి లేదు, నిద్ర యొక్క శాంతి కూడా లేదు. మానవజీవితంలో రోజంతటి అలసట పోవడానికి, సంకల్పాలను ఇముడ్చుకోవడానికి సాధారణంగా నిద్ర అనే నియమం పెట్టబడింది. ఆ అల్పకాలిక భాగ్యం కూడా లేదు అంటే భాగ్యహీన రాజ్యం . రాజ్యసత్తా లేదు, రాజ్యం ద్వారా అల్పకాలిక ప్రాప్తి యొక్క సత్తా కూడా లేదు. ఇలాంటి శక్తిహీన రాజ్యాలను చూశారు. సదా భయం అనే భూతాల మధ్య కుర్చీపై కూర్చుని ఉన్నట్టు చూశారు. ఇలా చూస్తూ తిరిగి మరోవైపు ఏం చూశారు? ధర్మసత్తా - ధర్మసత్తాలో కొన్ని చిన్నచిన్న కొత్త ఆకులు కనిపించాయి. కానీ ఆ ఆకులకు చాలా త్వరగా అహంకారం అనగా స్వ అభిమానం మరియు సిద్ధిని స్వీకరించాలి అనే పక్షులు ఆ ఆకులను తినేస్తున్నాయి. మరోవైపు ఏమి చూశారు; పేరుకు ధర్మం కానీ అతి కుకర్మ. కుకర్మ అనగా వికర్మ యొక్క పురుగు వారి ధర్మసత్తాను అనగా శక్తిని సమాప్తం చేసేస్తుంది. అనేక రకాలైన వ్యతిరేక నషాల్లో ఉండి ధర్మం యొక్క తెలివితప్పిపోయి ఉన్నారు. ఈ విధంగా ధర్మసత్తా కూడా బాహ్యంగా ఆడంబరూపంలో ఉండడం చూశారు. త్యాగం, తపస్సు మరియు వైరాగ్యానికి బదులు రిద్ది, ప్రసిద్ధులతో ప్రజలతో ఆడుకోవడం చూశారు. వైరాగ్యానికి బదులు రాగద్వేషాలు ఉన్నట్లు చూశారు. ఎక్కువ మంది ఎలాగైతే రాజ్యసత్తా వారు లాటరీ యొక్క జూదం ఆడుతున్నారో అలాగే వీరు ధర్మసత్తాలో ఉండి కూడా అమాయక భక్తులతో అల్పకాలిక సిద్ధుల యొక్క జూదం ఆడుతున్నారు. పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ ప్రాప్తులు చేయిస్తాము వీరు ఇంత ఇవ్వాల్సి ఉంటుంది, రోగాలను తగ్గిస్తాము. ఇంత దానపుణ్యాలు చేయాల్సి ఉంటుంది. ఇలా సిద్ధుల యొక్క జూదం ఆడుతున్నారు. ఇంకా ఏమి చూశారు?
                        భక్తి యొక్క సత్తా దానిలో ఏమి చూశారు? అంధశ్రద్ధ అనే పట్టీలు కళ్ళకు కట్టుకుని ఉన్నారు. గమ్యం కోసం వెతుకుతున్నారు. ఈ ఆట చూసి ఉంటారు కదా. కళ్ళకు గంతలు కట్టుకున్న వారు మార్గం ఎలా వెతుకుతారు, ఎక్కడ నుండి ధ్వని వస్తుంటే అక్కడకు వెళ్ళిపోతుంటారు. కానీ లోపల భయం ఉంటుంది ఎందుకంటే కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి. అలాగే భక్తులు కూడా లోపల నుండి దు:ఖము అశాంతితో బాధపడుతున్నారు. ఎటువైపు నుండైనా ఫలానా ఆత్మ చాలా త్వరగా ప్రాప్తి చేయిస్తుంది అని ఎవరైనా అంటే ఆ ధ్వని విని వారివెంట అంధశ్రద్దతో పరుగులు పెడుతున్నారు. ఏ గమ్యం కనిపించడం లేదు. రెండవవైపు బొమ్మలాటలో ఎంత నిమగ్నమై ఉన్నారంటే ఎవరైనా ఇంటి యొక్క సరైన మార్గం (పరంధామానికి) చెబుతున్నా కానీ ఎవరు వినటానికి తయారుగా లేరు. భక్తిసత్తా అనగా అతి స్నేహం యొక్క సత్తా కానీ స్నేహ సత్తా స్వార్ధంలోకి మారిపోయింది. స్వార్ధం యొక్క మాటలు ప్రసిద్ధంగా కనిపిస్తున్నాయి. స్వార్థంతో బికారీగా కనిపించారు. శాంతి ఇవ్వండి, సుఖాన్ని ఇవ్వండి, సంబంధీకుల ఆయుష్షు పెంచండి. ధనాన్ని వృద్ధి చేయండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి .. ఇలా భిక్షమడిగే బికారులుగా ఉన్నారు. ఈవిధంగా భక్తులను బికారీ రూపంలో చూశారు. ఇంకా ముందుకు వెళ్ళండి.
                      ప్రజాసత్తా - ప్రజల్లో ఏమి చూశారు? అందరూ చింత అనే చితిపై కూర్చుని ఉన్నారు. తింటున్నారు, నడుస్తున్నారు, ఇతర పనులు చేస్తున్నారు కానీ సదా భయంతో కూడిన సంకల్పం ఉంటుంది. ఇప్పుడిక అగ్ని అంటుకునే ఉందని. సంకల్పాల్లో స్వప్నంలో ఇదే కనిపిస్తుంది. ఇప్పుడిక పట్టుబడిపోయాము, పట్టుబడిపోయామని, ఒక్కోసారి రాజ్యసత్తా ద్వారా, ఒక్కోసారి ప్రకృతి ఆపదల ద్వారా, ఒక్కోసారి దొంగల ద్వారా ఇలా సంకల్పాల్లో స్వప్నాలను చూస్తూ ఉన్నారు. ఇలా చింత అనే చితిపై కూర్చుని అలజడిగా, దు:ఖీగా మరియు అశాంతిగా ఉన్నారు. తమని రక్షించుకునే మార్గం ఏదీ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళితే అక్కడే అగ్ని, ఎక్కడికి వెళితే అక్కడే నీరు ఇలా నలువైపులా టెన్షన్ మధ్యలో భయపడుతూ కనిపించారు. ఇది ఈనాటి విహరం యొక్క సమాచారం. ఇలా విహరించి తిరిగి వచ్చిన తరువాత కొత్తవృక్షం యొక్క అంటు చూశారు. ఆ అంటులో ఎవరున్నారు? మీరందరూ మిమ్మల్ని మీరు కొత్త వృక్షానికి అంటుగా భావిస్తున్నారా? ఎప్పుడైతే పాత వృక్షానికి చీడపట్టేస్తుందో, జడజడీభూతం అయిపోతుందో అప్పుడు కొత్త వృక్షానికి ఆధారమూర్తులైన మీ ద్వారా అంటు కట్టబడుతుంది. బ్రాహ్మణులే కొత్త వృక్షం యొక్క పునాది, మీరు పునాది. పునాదిగా ఎంత శక్తిశాలి అయినవాళ్ళు నిమిత్తం అయ్యారో చూశారా! ఇలా నలువైపులా చూసి బ్రహ్మబాబాకు సంకల్పం వచ్చింది - ఇప్పుడిప్పుడే పిల్లల యొక్క తపస్వీరూపం ద్వారా యోగాగ్ని ద్వారా ఈ పాతవృక్షాన్ని భస్మం చేసేయాలి అని. ఇంతలో తపస్వీ రూపంలో బ్రాహ్మణులు లేదా ఆత్మిక సైన్యం ప్రత్యక్షం అయ్యారు. అందరూ తపస్వీ రూపంలో తమ తమ శక్తిని అనుసరించి యోగాగ్నిని ప్రజ్వలితం చేస్తూ కనిపించారు. సంఘటన రూపంలో యోగాగ్ని యొక్క ప్రభావం తప్పకుండా మంచిగా ఉంటుంది. కానీ విశ్వవినాశనార్థం విశాలరూపం యొక్క యోగం లేదు, శక్తి ఉంది. కాని పూర్తి శక్తి లేదు అనగా బ్రాహ్మణులందరిలో నెంబర్ వారీగా శక్తిని అనుసరించి సంపూర్ణ స్థితిని ఏదైతే ప్రాప్తింపచేసుకోవాలో దానిలో పూర్తిగా లేరు అనగా  సంపన్నంగా లేరు. అందువలన పూర్తి శక్తి లేదు. ఒక్క దెబ్బతో వినాశనం అయిపోవాలి లేదా పాతవృక్షం భస్మం అయిపోవాలి. కనుక ఇప్పుడు ఏమి చేస్తారు? బ్రహ్మబాబా సంకల్పాలను సాకారంలోకి తీసుకురండి. బాబాకి స్నేహి అయి ఈ విశాలకార్యంలో సహయోగి అవ్వండి. కానీ ఎప్పుడో కాదు, ఇప్పుడు నుండే స్వయాన్ని సంపన్నంగా తయారుచేసుకోండి. అర్థమైందా! మంచిది..
                          ఈవిధంగా సంకల్పాన్ని సాకారం చేసేవారికి, స్నేహానికి బదులుగా సహయోగాన్ని ఇచ్చేవారికి, సదా దయాహృదయులకు విశ్వకళ్యాణకారీ స్థితిలో స్థితులయ్యేవారికి, అచంచలంగా మరియు స్థిరంగా ఉండేవారికి, సదా శుభచింతనలో ఉండేవారికి, శుభచింతకులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments