19-09-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
శక్తులు లేదా పాండవుల యొక్క విశేషతలు.
సర్వాత్మల జాతకం తెలిసిన వారు, జ్ఞాన సాగర, త్రికాలదర్శి శివపరమాత్మ చెబుతున్నారు-
ఈరోజు అమృతవేళ సేవాస్థానాలన్నింటికీ విహరించారు. ఆ విహార యాత్ర యొక్క సమాచారాన్ని చెబుతున్నారు. ఏమి చూశారంటే ప్రతి ఒక్క ఆత్మిక బిడ్డ ఆత్మిక సుఖాన్ని పొందేటందుకు బాబాని కలుసుకునేటందుకు, ఆత్మిక సంభాషణ చేసేటందుకు లేదా తమ మనసులోని విషయాలను మనోభిరాముడి ముందు పెడుతూ స్వయాన్ని డబల్ లైట్ గా చేసుకునే వరదానాన్ని పొందుతున్నారు మరియు ఇస్తున్నారు కూడా. కొంతమంది పిల్లలు విశ్వ కళ్యాణి స్వరూపంలో స్థితులై బాబా ద్వారా లభించిన సర్వశక్తుల యొక్క వరదానాన్ని లేదా మహాదానాన్ని అనేకాత్మలకు ఇస్తున్నారు. మూడు రకాలైన ఫలితాన్ని చూశారు 1) తీసుకునేవారు 2) కలుసుకునేవారు మరియు 3) తీసుకుని ఇచ్చేవారు అనగా సంపాదించుకునేవారు. ఇలా నలువైపులా మూడురకాలైన పిల్లలను చూశారు.
ఇవన్నీ చూస్తూ దీని తరువాత ఈశ్వరీయ విద్యార్థి రూపంలో చూశారు. ప్రతి ఒక్కరు విద్యార్ధి రూపంలో ఈశ్వరీయ జ్ఞానాన్ని చదువుకునేటందుకు ఉత్సాహ, ఉల్లాసాలతో వారి వారి ఆత్మిక విశ్వ విద్యాలయం వైపుకు వస్తున్నారు. నెంబరువారీగా పురుషార్థాన్ని అనుసరించి అందరూ తమ చదువులో నిమగ్నమై ఉన్నారు. ప్రతి సేవాకేంద్రం యొక్క ఆత్మిక మెరుపు ఎవరిది వారిదే. దాంట్లో కూడా మూడు రకాలు చూశారు. ఒకరు కేవలం వినేవారు అనగా విని హర్షించేవారు. రెండవవారు విని లీనం చేసుకునేవారు మరియు మూడవవారు బాబా సమానంగా జ్ఞానసాగరులై ఇతరులను తయారుచేసేవారు. ఇవన్నీ చూస్తూ మూడవ స్థితిని కూడా చూశారు. అది ఏమిటంటే కర్మయోగి స్థితి. ఈ మూడో స్థితిలో ఏమి చూశారు? ఒకరు కమలపుష్ప సమానం, రెండవ వారు ఆత్మిక గులాబి పుష్పంతో సమానం, మూడవవారు రకరకాల పుష్పాలు. ఆ రకరకాల పుష్పాలలో కూడా ఎక్కువమంది సూర్యముఖీ పుష్పాలు (పొద్దుతిరుగుడు పువ్వు) అనగా ఏ సమయంలో జ్ఞాన సూర్యునికి సన్ముఖంగా ఉంటారో, అప్పుడప్పుడు వికసించి ఉంటారు మరియు అప్పుడప్పుడు జ్ఞానసూర్యుడైన బాబాకి దూరం అవడం వలన పుష్పాలకు బదులు మొగ్గలుగా అయిపోతారు. అనగా రంగు రూపం మారిపోతున్నాయి. కమల పుష్పం అయిన వారు ఏమి చేస్తున్నారు? సర్వ కార్యాలు చేస్తూ సర్వుల సంబంధంలోకి, సంప్రదింపుల్లోకి వస్తూ మరియు వెనువెంట బాబాకి ప్రియంగా ఉన్నారు. వాయుమండలం లేదా ఆసురీ సాంగత్యం అనేక రకాల వృత్తి కలిగిన ఆత్మల యొక్క తరంగాల మధ్యలో కర్మ చేస్తూ కూడా కర్మ,యోగం రెండింటిలో సమాన స్థితిలో స్థితులై ఉన్నారు. అనేకరకాల అలజడుల్లో కూడా అచంచలంగా ఉన్నారు. కానీ ఇలాంటి ఆత్మలు ఎంతమంది ఉన్నారు? 25%. దీంట్లో కూడా ఎక్కువ శక్తులు.ఇలా ఎందుకు అని పాండవులు ఆలోచిస్తున్నారు. పాండవుల విశేషత కూడా చెప్తాను. కానీ కొద్ది సమయం ఓపిక పట్టండి. పాండవపతి యొక్క వారసులు, పాండవులకు కూడా మహిమ ఉంది. కమలపుష్పం తరువాత ఆత్మిక గులాబి పుష్పం అయిన వారు ఎలా ఉన్నారు? సదా తమ యొక్క ఆత్మీయత యొక్క స్థితిలో స్థితులై ఉంటూ సర్వులని కూడా ఆత్మీయత యొక్క దృష్టితో చూసేవారు. సదా మస్తకమణిని చూసేవారే ఆత్మిక గులాబి పుష్పాలు మరియు తమ ఆత్మీయత యొక్క స్థితి ద్వారా సదా అనగా ప్రతి సమయం సర్వ ఆత్మలను తమ స్మృతి, దృష్టి,వృత్తి మరియు వృత్తి ద్వారా ఆత్మీయంగా తయారుచేయాలనే శుభ సంకల్పంలో ఉండేవారు. అనగా ప్రతి సమయం యోగి ఆత్మ, సేవాధారి ఆత్మ అయ్యి నడిచేవారు. ఇలాంటి ఆత్మిక గులాబి పుష్పాలు నలువైపులా తోట మధ్యలో చాలా తక్కువమంది అక్కడక్కడ కనిపించారు. వీరి శాతం తక్కువ 10%. వెరైటీ పుష్పాలలో ఒకరు సూర్యముఖీ పుష్పాలు, రెండవ క్వాలిటీ ప్రతి సీజన్లో చాలా సుందరమైన రంగురంగుల పువ్వులు వాటిపై వాతావరణం యొక్క రంగు, రూపం యొక్క మెరుపు చాలా బాగుంటుంది. ఇది తోట యొక్క అందాన్ని పెంచుతాయి. ఇలా సీజన్ వారీగా పూచే రంగురంగుల పుష్పాల యొక్క దృశ్యాలను చాలా చూశారు. ఇది రంగు, రూపం కలిగి ఉంటాయి అనగా బ్రహ్మాకుమారీ కుమారులుగా ఉంటారు, జ్ఞానం అనే రంగు కూడా ఉంటుంది. రంగు ఉంది, రూపం ఉంది. కానీ ఆత్మీయత తక్కువ ఉంటుంది. ఆత్మిక దృష్టికి మరియు ఆత్మిక వృత్తి యొక్క సుగంధం ఉండదు. సీజన్ అనుసరించి అనగా కొద్ది సమయం కోసం వికసించి ఉంటారు మరియు కొద్ది సమయం తరువాత వాడిపోయినట్లు కనిపిస్తారు. అంటే సదా ఏకరసంగా ఉండరు. ఇలాంటి రంగురంగుల పుష్పాలు సీజన్లోనే వికసిస్తాయి.ఇలాంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. వర్తమాన సమయంలో ఆత్మిక దృష్టి మరియు వృత్తి యొక్క అభ్యాసం చాలా అవసరం. కానీ 75% ఈ ఆత్మీయత యొక్క అభ్యాసంలో బలహీనంగా ఉన్నారు. ఎక్కువమంది ఏదోక రకమైన ప్రకృతి యొక్క ఆకర్షణకు వశీభూతం అయిపోతున్నారు. వ్యక్తి లేదా వైభవం ఎప్పుడో అప్పుడు తమకు వశం చేసుకుంటున్నాయి. దీనిలో కూడా మనసా సంకల్పాల చక్రంలో చాలా అలజడి అయిపోతున్నారు. ఆ అలజడి కారణంగా స్వయం మానసికంగా బలహీనం అయిపోతున్నారు. వాస్తవానికి బ్రాహ్మణాత్మ సంకల్పంలో అయినా వికారీ దృష్టి మరియు వృత్తి పెట్టుకుంటుంది అంటే శరీరాన్ని చూస్తుంది. అంటే, శరీరం ద్వారా వికారి భావం పెట్టుకుంటుందంటే ఇలాంటి భావన పెట్టుకునేవారు కూడా మహాపాపీ జాబితాలోకి వస్తారు. బ్రాహ్మణ జీవితంతో చాలా పెద్ద పాపం లేదా మచ్చ ఈ వికారీ భావనగా లెక్కించబడుతుంది. బ్రాహ్మణులు అనగా దివ్యబుద్ధి యొక్క వరదానం కలవారు, దివ్యనేత్రం యొక్క వరదానం పొందిన వారు. ఇలాంటి దివ్యబుద్ధి మరియు దివ్యనేత్రం కలిగిన వారి బుద్ధిలో సంకల్పం ద్వారా అయినా, దివ్యనేత్రంతో ఒక్క సెకను కోసం అయినా దృష్టి ద్వారా ఈ దేహాన్ని తాకలేరు. దివ్యబుద్ధి యొక్క, దివ్యనేత్రం యొక్క శుద్ధ ఆహారం మరియు వ్యవహారం - శుద్ధ సంకల్పాలు. ఒకవేళ మీ శుద్ధ సంకల్పాల రూపి ఆహారాన్ని అనగా భోజనాన్ని వదిలి అశుద్ధ ఆహారాన్ని స్వీకరిస్తే అనగా సంకల్పంలో వశీభూతం అయిపోతే ఇలాంటి అపవిత్ర ఆహారం తినేవారు అపవిత్ర ఆత్మగా పిలవడబడతారు. మహాపాపి, ఆత్మహత్య చేసుకున్నవారిగా పిలవబడతారు. కనుక సంకల్పం ద్వారా కూడా మహాపాపం చేయకుండా స్వయాన్ని సదా రక్షించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే పాపం యొక్క శిక్ష చాలా కఠిన రూపంలో అనుభవించాల్సి వస్తుంది. అందువలన దివ్యబుద్ధి కలిగిన వారిగా మరియు సదా శుద్ధ ఆహారిగా అవ్వండి. అర్థమైందా!
పాండవుల యొక్క విశేషత ఏమి చూశారు? పాండవులు సేవ కోసం బాగా శ్రమించేవారు మరియు ప్లానింగ్ బుద్ధి కలవారు. అలసిపోనివారిగా అయి సేవా వేదికపై ప్రతి సమయం ఎవరెడిగా ఉంటారు. సేవా సబ్జెక్టులో మైదానంలోకి వచ్చేవారు ఎక్కువమంది పాండవులే. ఈ విశేషతలో పాండవులు ముందున్నారు మరియు ఈ సేవకు ఫలితంగా ధైర్యం మరియు ఉల్లాసాన్ని అనుభవం చేసుకుంటూ వెళ్తున్నారు. పాండవులు వికారీ వాతావరణం యొక్క తరంగాల మధ్యలో ఎక్కువగా ఉంటారు. అలాంటి వాతావరణంలో ఉంటూ కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. కనుక దీంట్లో సఫలత పొందినందుకు పాండవులకు శక్తుల కంటే అదనపు మార్కులు లభిస్తాయి. కానీ ఈ అదృష్టాన్ని మరింత ఎక్కువగా ఉపయోగించుకోండి లేదా ఇలాంటి స్వర్ణిమ అవకాశాన్ని మరింత ఎక్కువగా తీసుకోండి. ఈనాటి విహార యాత్ర యొక్క సమాచారం విన్నారా? మంచిది.
ఈవిధంగా సైగ ద్వారా అర్ధం చేసుకునే తెలివైనవారికి, స్థూల, సూక్ష్మ శుద్ధ ఆహారి, సదా శ్రేష్ట వ్యవహారి, ప్రతి సంకల్పంలో విశ్వకళ్యాణం యొక్క భావన ఉంచుకునే విశ్వకళ్యాణి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment