* 19-07-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“సంగఠన యొక్క మహత్వము మరియు సంగఠన ద్వారా సర్టిఫికెట్”
స్వయమును ముత్యాలుగా లేక మణులుగా భావిస్తున్నారా? ముత్యము లేక మణికి విలువ ఎందులో ఉంటుంది? మణులు లేక ముత్యాలు మాల నుండి వేరుగా అయితే దాని విలువ ఎందుకు తగ్గుతుంది? మాలలో తిప్పబడడం ద్వారా దానికి విలువ ఏర్పడుతుంది. అందులో నుండి వేరైపోతే విలువ ఎందుకు తగ్గిపోతుంది? కారణం ఏమిటి? సంగఠనలో ఉన్న కారణంగా ఆ ముత్యము లేక మణి శక్తిశాలిగా అయిపోతుంది. ఒకటికి ఇంకొకటి కలిస్తే, ఆ రెండిటినీ పదకొండుగా వర్ణిస్తారు. కాని, ఒక్కటిగానే ఉంటే ఒక్కటి అనే అంటారు. రెండూ కలిసి పదకొండుగా అయిపోతాయి. కావున ఒక్కటి ఎక్కడ, పదకొండు ఎక్కడ? దీని విలువ ఇంతగా పెరిగిపోతుంది! రెండుకు బదులుగా పదకొండు అని అంటారు. సంగఠిత శక్తిని ప్రసిద్ధం చేసేందుకు ఇలా అంటారు. మీరు స్వయమును ఎటువంటి ముత్యముగా భావిస్తున్నారు? మీరు మాలలోని ముత్యమా లేక స్వతంత్ర ముత్యమా? మీ విలువను చూస్తూ, మీ శక్తిని చూస్తూ, మేము మాలలోని మణులము అని అనుభవం చేసుకుంటున్నారా? పరస్పరం ఈ విధంగా సంగఠిత రూపంలో స్మరింపబడే విలువైన ముత్యాలుగా భావిస్తున్నారా? ఇతరులు కూడా మిమ్మల్ని ఆ విధంగా భావిస్తున్నారా లేక కేవలం మీరే స్వయమును అలా భావిస్తున్నారా? ఏదైనా విశేష కార్యమును చేసేటప్పుడు లేక ఏ విధముగానైనా విజయులుగా అయి వస్తే వారికి మెడల్ లభిస్తుంది కదా! అలాగే ఇప్పటివరకు ఏ పురుషార్థమునైతే చేస్తున్నారో దాని సర్టిఫికెట్ ను ప్రాక్టికల్ గా తీసుకునేందుకే మధ్య మధ్యలో ఈ సంఘటన జరుగుతుంది. కావున ఈ సంఘటనలో ప్రతి ఒక్కరూ తమ సంగఠిత రూపములో నడిచే, సంగఠిత శక్తి యొక్క విలువను పెంచే మెడల్ ను తీసుకున్నారా? మీరు విశ్వవిద్యాలయంలోకి వచ్చారు కదా! కావున ఇప్పటివరకు చేసిన పురుషార్థము లేక ఈశ్వరీయ సేవ యొక్క సర్టిఫికెట్ నైతే తీసుకోవాలి కదా! ప్రతి ఒక్కరూ పరస్పరము ఎంతవరకు సంతుష్టంగా ఉన్నారు లేక పరస్పరము ఎంతగా సమీపంగా ఉన్నారు అన్న సర్టిఫికెట్ ను తీసుకోవలసి ఉంటుంది. ఒకటేమో మీ సంగఠనలో లేక సంపర్కంలో సహయోగము మరియు అందరితో స్నేహులుగా ఉండే మెడలు లేక బహుమతి మరియు రెండవది ఈశ్వరీయ సేవలో తమ పురుషార్థము ద్వారా ఎక్కువలో ఎక్కువ ప్రత్యక్షం చేయడం అనే బహుమానము. మూడవది ఎవరు ఎటువంటి స్థానానికి నిమిత్తంగా అయ్యారో ఆ స్థానంలోని ఆత్మలు వారితో సంతుష్టంగా ఉన్నారా లేక ఎవరైనా స్వయం అందరితో సంతుష్టంగా ఉన్నారా? స్వయమూ సంతుష్టంగా లేకపోయినా లోపము ఉన్నట్లు మరియు వచ్చేవారిలో ఒక్కరైనా సంతుష్టంగా లేకపోతే అది కూడా లోపముగా ఉన్నట్లు. టీచర్లతో అందరూ సంతుష్టంగా ఉన్నారా? టీచర్లకు చదువుతో లేక సంబంధముతో దేనినైతే మీరు హ్యాండ్లింగ్ అని అంటారో దానితో అందరూ సంతుష్టంగా ఉన్నట్లయితే దానికి కూడా ఇనాం లభిస్తుంది. ప్రారంభంలో మాల తయారుచేసేవారు, ఎందుకోసం? ఉల్లాస ఉత్సాహాలను పెంచేందుకు. ఎవరు ఏ సమయంలో ఏ స్థితిలో ఉంటారో వారికి ఆ స్థితి లభించడం ద్వారా సంతోషం కలుగుతుంది. ఉల్లాస ఉత్సాహాలను పెంచేందుకు మరియు పరస్పరం ఒకరినొకరు చూసుకునేందుకు ఈ సాధనాలను తయారుచేసేవారు. దీని భావము అదేదో ఫైనల్ స్టేజ్ లోని మెడల్ అని కాదు. ఇది సమయము మరియు పురుషార్థముల బలిహారి. దీనిద్వారా ఉల్లాస ఉత్సాహాలు కలుగుతాయి, రిజల్టును గురించి తెలుస్తుంది. ఎవరు ఏ పురుషార్థంలో ఉన్నారు లేక ఎవరికి ఏ పురుషార్థముపై అటెన్షన్ ఉంది లేక పాస్ అయి విజయపు అధికారులుగా అయ్యారా? అన్న రిజల్టు తెలుస్తుంది. దీనిని చూసి కూడా సంతోషిస్తారు. మీరు కూడా ఇప్పుడు కూడా మీ క్లాసులలో ఎవరికైనా ఇనామును ఇస్తారు కదా! ఇనాము అనేది ఏమంత పెద్ద విషయం కాదు. మీరు రుమాలు ఇచ్చినా కాని దానికి విలువ ఉంటుంది. ఏ పురుషార్థమునైతే చేస్తారో దానికి విలువ ఉంటుందే కాని వస్తువుకు కాదు. మీరు ఎవరికైనా కొద్దిగా సేవ యొక్క ఇనామును ఇస్తే లేక క్లాసులో పేరును ప్రఖ్యాతము చేస్తే, ముందు ముందు వారిపై ముద్ర పడిపోతుంది, ఉల్లాస ఉత్సాహాల తిలకము దిద్దబడుతుంది.
కొందరు విశేష ఆత్మలు కూడా విశేష కర్తవ్యాన్ని చేస్తూ ఉంటారు. అయినా వారు నిమిత్తమై ఉన్నారు. తప్పకుండా ఏదో ఒక శ్రేష్ఠత లేక విశేషత ఉంది, కావుననే డ్రామా అనుసారంగా సంపూర్ణంగా అయిన తరువాత, సర్వస్వ త్యాగులుగా అయిన తర్వాత ఇతరుల సేవ కొరకు నిమిత్తంగా అయ్యారు కదా! ప్రతి ఒక్కరిలోను ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంది, పరస్పరంలో ఉన్న విశేషతలను గూర్చిన పరిచయం కూడా తప్పకుండా ఉండాలి, అంతేకాని లోపాలది కాదు. మీరు పరస్పరంలో కలిసినప్పుడు ఒకరి సమాచారాలను మరొకరు ఎందుకు వింటారు? ప్రతి ఒక్కరిలోను ఏ విశేషతలైతే ఉన్నాయో వాటిని స్వయంలోకి తెచ్చుకునేందుకు. ప్రతి ఒక్కరికీ బాప్ దాదాల జ్ఞానం ద్వారా ఏదో ఒక విశేష గుణము ప్రాప్తమవుతుంది. అది స్వయముది కాదు, నా గుణము కాదు జ్ఞానము ద్వారా ప్రాప్తమైంది, ఇందులో అభిమానము రాదు. అది స్వయంలోని గుణమైనట్లయితే మరి అది మొదటినుండే ఉంటుంది కదా! కాని, జ్ఞానము తర్వాత గుణవంతులుగా అయ్యారు. ప్రారంభంలో భక్తిలో- నిర్గుణులమైన మాలో ఏ గుణమూ లేదు అని అనేవారు. కావున దీనిని స్వయములోని గుణము అని అనరు. జ్ఞానము ద్వారా స్వయములో దానిని నింపుకుంటూ ఉంటారు. కావున విశేషత యొక్క గుణమును వర్ణన చేస్తూ జ్ఞానము ద్వారా మాకు ఇది ప్రాప్తమైంది అన్న స్మృతి ఉండాలి. కావున ఇది జ్ఞానం యొక్క మహిమయే కాని మీది కాదు. ఇది జ్ఞానస్వరూపులుగా ఉన్నందుకు లభించే అభినందన. అదే రూపముతో పరస్పరంలో వర్ణన చేసినట్లయితే దీనిద్వారా కూడా పరస్పరంలో విశేషతలను తీసుకోవడంలో లాభాన్వితులవుతారు. ఇంతకుముందు మీలో ఒక నియమము చలామణిలో ఉండేది. మీ వర్తమాన సమయంలోని సూక్ష్మ పురుషార్థము ఏమిటో వర్ణన చేసేవారు, పైపైన విషయం కాదు. సూక్ష్మమైన బలహీనతలపై ఏ పురుషార్థం ద్వారా విజయమును ప్రాప్తించుకొని ముందుకు వెళుతున్నారు అన్నది పరస్పరంలో వర్ణన చేసేవారు. దీనిద్వారా పరస్పరంలో పరిచయము ఉన్న కారణంగా ఎవరిలో ఏ విశేషత ఉందో దాని వర్ణన జరగడం ద్వారా వారి బలహీనతవైపుకు ధ్యానము తక్కువయిపోయేది, విశేషతవైపుకే అటెన్షన్ వెళ్ళేది. ప్రారంభంలో పరస్పరంలో ఇటువంటి సూక్ష్మ ఆత్మిక సంభాషణ చేసేవారు. కావున ఇప్పుడు పరస్పరంలోని వర్తమాన సమయపు పురుషార్థం యొక్క విశేషతనే పరస్పరంలో వర్ణన చేయండి. అప్పుడు కూడా మంచి వాతావరణం తయారవుతుంది. ఎప్పుడైతే దాని టాపిక్కే ఈ విధంగా అయిపోతుందో అప్పుడు ఇతర టాపిక్కులు వాటంతట అవే ఉండిపోతాయి. కావున పరస్పరం కలుసుకునే రూపము ఈ విధంగా ఉండాలి మరియు ప్రతి ఒక్కరి విశేషతను చూస్తూ ఉంటే చాలా మంచిది. నాలో ఎటువంటి విశేషతా లేదు అని ఎవరూ భావించడమనేది జరుగజాలదు. దీనిద్వారా వారికి స్వయమును గూర్చే తెలియదు అని అర్థమవుతుంది. దృష్టి మరియు వృత్తి ఎంత నేచురల్‌గా ఉండాలంటే, ఏ విధంగా మీరు ఇతరులతో , హంస దృష్టి ఎటువైపుకి వెళుతుంది? అది గులకరాళ్ళను చూస్తూ కూడా ముత్యాలనే చూస్తుంది కదా! అని చెబుతారో, అదేవిధంగా సహజమైన దృష్టి లేక వృత్తి ఎవరి బలహీనతలు లేక ఎవరి విషయాలనైనా వింటూ, చూస్తూ కూడా అవి లోపలికి వెళ్ళకూడదు మరియు ఇంకా ఎవరి బలహీనతలనైనా వింటూ, చూస్తూ కూడా ఈ బలహీనత వీరిది కాదు, నాది అని భావించాలి. ఎందుకంటే మనమందరము ఒకే తండ్రికి చెందినవారము, ఒకే పరివారానికి చెందినవారము, ఒకే మాలలోని మణులము. మాల మధ్యలో అటువంటి ముత్యమేదైనా ఉంటే, మొత్తం మాల విలువ అంతా తగ్గిపోతుంది. కావున ఎప్పుడైతే ఒకే మాలలోని మణులుగా ఉన్నారో అప్పుడిక ఎటువంటి వృత్తి ఉండాలి? ఇది నా బలహీనత అని భావించాలి. ఎవరైనా తీవ్ర పురుషార్థులు స్వయములో బలహీనతలను చూస్తే, వాటిని లభించిన యుక్తుల ఆధారంపై వెంటనే అంతం చేసేస్తారు, ఎప్పుడూ వర్ణన చేయరు. మీ బలహీనతను వర్ణన చేయకూడదు అని అనుకున్నప్పుడు మరి ఇతరుల బలహీనతను కూడా ఎందుకు వర్ణన చేస్తారు? ఫలానావారు సహయోగమునివ్వలేదు లేక వీరు మాట్లాడలేదు, కావుననే సేవలో వృద్ధి జరగడం లేదు లేక నా పురుషార్థంలో ఫలానా విషయము, ఫలానా ఆత్మ విఘ్నరూపంగా ఉంది... దీనినైతే మీ వృద్ధి ద్వారానే ఏదో ఒక ఆధారమును తయారుచేసుకొని దానిపై నిలిచి ఉండే ప్రయత్నము చేస్తారు. కాని, ఆ ఆధారము పునాది లేకుండా ఉంది, అందుకు అది నిలువజాలదు. కొద్ది సమయం తర్వాత అదే ఆధారము నష్టపరిచేదిగా అయిపోతుంది. కావున మీరు హోలీ హంసలు కదా! కావున హోలీ హంసల నడవడిక ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరి విశేషతలను గ్రహించడము మరియు బలహీనతలను అంతం చేసేందుకు ప్రయత్నము చేయడము. మరి ఇటువంటి పురుషార్థము కొనసాగుతోందా?
మనమంతా ఒక్కటే దీనిని స్మృతిలో ఉంచుకుంటూ పురుషార్థము కొనసాగుతోందా? ఇదే ఈ సంగఠన యొక్క విశేషత లేక భిన్నత. ఇది మొత్తం విశ్వంలో మరే సంగఠనకూ లేదు. ఇప్పుడు చూసేవారు, వచ్చేవారు, వినేవారు ఏమని వర్ణన చేస్తారు? ఇక్కడ ఒక్కొక్క ఆత్మ లేవడము, మాట్లాడడము, నడవడము అన్నీ ఒకే విధంగా ఉంటాయి అని ఈ విశేషతనే గానం చేస్తారు. కావున ఐకమత్యము లేక ఒకే విషయము, ఒకే గీతము, ఒకే విధానము, ఒకే నీతి యొక్క గాయనమేదైతే ఉందో అదే అనుసారంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వర్తమాన సమయపు పురుషార్థంలో కారణము అన్న పదము సమాప్తమైపోవాలి. కారణము అంటే ఏమిటి? ఇప్పుడైతే మీరు ముందుకు వెళుతున్నారు కదా! ఎప్పుడైతే సృష్టి పరివర్తన, ప్రకృతి పరివర్తన యొక్క బాధ్యతను చేపట్టే ధైర్యముకలవారిగా ఉన్నారో, ఛాలెంజ్ చేస్తారో, మరి మీకు కారణము ఏమంత పెద్ద విషయము! కారణమురూపీ రచన ఎక్కడినుండి వస్తుంది? కారణానికి బీజము ఏమిటి? ఏదో ఒకరకమైన మనసా కాని, వాచా కాని, సంపర్కము లేక సంబంధము కాని ఈ బలహీనత వచ్చేందుకు ద్వారమవుతుంది, ఈ బలహీనత ద్వారానే కారణము ఉత్పన్నమవుతుంది. కావున మరి ఈ రచనయే వ్యర్థము కదా! బలహీనత యొక్క రచన ఎలా ఉంటుంది? బీజము ఎలా ఉంటుందో ఫలము అలా ఉంటుంది. కావున ఎప్పుడైతే రచనయే తల్లక్రిందులుగా ఉందో, అప్పుడిక దానిని అక్కడే అంతం చేసెయ్యాలా లేక దాని ఆధారమును తీసుకొని ముందుకు వెళ్ళాలా? ఫలానా కారణం యొక్క నివారణ జరిగితే ముందుకు వెళ్ళగలము అని భావిస్తారు, కారణపు నివారణ జరిగితే సేవ జరుగుతుంది, విఘ్నాలు కలుగుతాయి అని భావిస్తారు. ఇప్పుడిక ఈ భాషను కూడా మార్చండి. మీరు అందరికీ నివారణను ప్రసాదించేవారే కదా! మీ వద్దకు అజ్ఞానులు తమ కారణం యొక్క నివారణను పొందేందుకు వస్తారు కదా! ఎవరైతే అనేక కారణాలను నివారణ చేస్తారో వారు వీటి ఆధారమును ఎలా తీసుకోగలరు? ఎప్పుడైతే ఆధారాలన్నీ అంతమైపోతాయో అప్పుడిక ఈ దేహాభిమానము లేక పాత సంస్కారాలు వాటంతట అవే అంతమైపోతాయి. ఈ విషయాలే దేహాభిమానంలోకి తెస్తాయి. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ అంతమైపోతాయో అప్పుడు వాటి పరిణామాలు కూడా అంతమైపోతాయి. చిన్న చిన్న కారణాలలోకి రావడం ద్వారా రకరకాల దేహాభిమానాలు వచ్చేస్తాయి. మరి ఇప్పటివరకు దేహాభిమానాన్ని వదలలేదా? అదేమైనా చాలా ప్రియముగా అనిపిస్తుందా? ఇప్పుడిక మీ భాషను మరియు వృత్తిని అన్నింటినీ మార్చండి. ఎవ్వరినైనా, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా చూసినప్పుడు వృతి మరియు భావము యథార్థంగా ఉన్నట్లయితే మీపైన వారి ప్రభావము పడదు. కళ్యాణ వృత్తి మరియు శుభచింతక భావము ఉండాలి. ఈ వృత్తిని మరియు భావమును సరిగ్గా ఉంచుకున్నట్లయితే అప్పుడిక ఈ విషయాలే ఉండవు. ఎవరు ఏమి చేసినా కాని, ఎవరైనా మీకు విఘ్నరూపంగా అయినా కాని మీ భావము అటువంటివారిపై కూడా శుభచింతకముగా ఉండాలి. ఇటువంటివారినే తీవ్ర పురుషార్థులు లేక హోలీ హంసలు అని అంటారు. ఎవరికైతే మీపై శుభభావన ఉంటుందో వారిపై మీరు కూడా శుభభావనను ఉంచడం ఏమంత పెద్ద విషయమేమీ కాదు. కాని, ఎటువంటి అద్భుతమును చేయాలంటే అది గాయనయోగ్యంగా ఉండాలి. అపకారులపై కూడా ఉపకారము చేసేవారికి గాయనము ఉంటుంది. ఉపకారులపై ఉపకారము చేయడము పెద్ద విషయమేమీ కాదు. ఎవరైనా పదే పదే పడదోయడానికి ప్రయత్నిస్తే, మీ మనస్సును అలజడి పరిచినా కాని మీకు వారిపట్ల సదా శుభచింతకమైన, స్థిరమైన భావము ఉండాలి, ఆ విషయంపై భావము మారకూడదు. సదా అచలమైన, స్థిరమైన భావము ఉండాలి, అప్పుడే హోలీ హంసలుగా పిలువబడతారు, దాంతో ఏ విషయాలు కనిపించవు... లేకపోతే ఇందులో కూడా సమయం ఎంతగానో వర్థమవుతుంది. బాల్యంలో సమయమైతే వ్యర్థమవుతూనే ఉంటుంది. పిల్లలు సమయాన్ని వ్యక్తం చేస్తే, వీరు పిల్లలు కదా అని అంటారు. కాని, వివేకవంతులు కూడా సమయాన్ని వ్యర్థం చేస్తే ఏమంటారు... పిల్లలు సమయాన్ని వ్యర్థంచేస్తే అది దోషంగా అనిపించదు, వారి పనే అది. కావున మీరు ఇప్పుడు ఏ సేవార్థమైతే నిమిత్తులుగా అయ్యారో ఆ స్థితే జగన్మాతా స్థితి. మీరు విశ్వకళ్యాణకారులు కదా! హద్దులోని కళ్యాణము చేసేవారు అనేకమంది ఉన్నారు. విశ్వకళ్యాణభావన యొక్క స్థితి జగన్మాతా స్థితి. కావున జగన్మాతా స్థితిలో ఉంటూ ఈ విషయాలలో సమయాన్ని వ్యర్థం చేస్తున్నట్లయితే వారిని ఏమని భావించాలి!
Om shanthi mere baba.....
ReplyDelete