19-07-1971 అవ్యక్త మురళి

* 19-07-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “సింపుల్ గా అవ్వండి, శాంపుల్ గా అవ్వండి."

             ఈరోజు ఏ సంగఠన అయితే ఉందో దానిని ఏ సంగఠన అని అంటాము? కర్మ ప్రమాణంగా ఈ సంగఠన పేరును ఏమని అందాము? కర్తవ్య ఆధారంగా పేరు చెప్పండి? (ప్రతి ఒక్కరూ వినిపించారు) అందరూ ఏ పేర్లనైతే చెప్పారో వాటిని ప్రాక్టికల్ లో మీ కర్తవ్యముగా భావించి చెప్పారా? ప్రాక్టికల్ లో నడుస్తున్నట్లయితే అప్పుడిక ఏమౌతారు? సపూత్ మరియు సబూత్ (సుపుత్రులు మరియు ప్రమాణ) మూర్తులు. ఒకవేళ అభ్యాసములో ఉన్నట్లయితే సబూత్ మూర్తులు అని అనరు, ప్రాక్టికల్ లో ఉన్నట్లయితే సుపుత్రులుగా మరియు ప్రమాణమూర్తులుగా ఈ రెండు రకాలుగా ఉంటారు. ఈ గ్రూపు సింపుల్ మరియు శాంపుల్ (నిరాడంబర మరియు ఉదారహణ) మూర్తులు. సింపుల్ గా ఉండి శాంపుల్ ను చూపించేవారు. సింపుల్ అనేది కేవలము డ్రెస్ మొదలగు విషయాలలోనే కాదు, అన్ని విషయాలలో సింపుల్ గా ఉండి శాంపుల్ గా అయ్యేవారు. ఏదైనా సింపుల్ వస్తువు ఒకవేళ స్వచ్ఛముగా ఉన్నట్లయితే అది తన వైపుకు ఆకర్షితము చేస్తుంది, అదేవిధంగా మనసులో వచ్చే సంకల్పాలలోనైనా, సంబంధములో, వ్యవహారములలో కూడా మరియు జీవన పద్ధతి, నడవడికలో కూడా అన్నింటిలో సింపుల్ గా మరియు స్వచ్ఛముగా ఉండేవారు శాంపుల్ గా అయ్యి తమ వైపుకు ఆకర్షితము చేస్తారు. ఒకవేళ సంకల్పములలో లేక సంబంధములో సింపుల్ గా ఉండనట్లయితే ప్రత్యామ్నాయంగా ఏమౌతుంది? సింపుల్ అనగా సాధారణత. సాధారణతలోనే మహానత ఉండాలి. బాబా సాకార సృష్టిలో సింపుల్ గా ఉంటూ మీ అందరి ముందూ శాంపుల్ గా అయ్యారు కదా! అతి సాధారణతయే అతి మహానతను ప్రసిద్ధము చేస్తుంది కావున సాధారణతగా అనగా సింపుల్ గా లేనట్లయితే ప్రాబ్లమ్ గా అయిపోతారు, సంకల్పాల ప్రాబ్లమ్ లో ఉంటారు. జీవన పద్ధతి నడవడిక కూడా సింపుల్ గా ఉండని కారణంగా ఇతరులకు లేక స్వయమునకు ఏదో ఒక ప్రాబ్లమ్ (సమస్య)గా తయారవుతారు. మరి ప్రాబ్లమ్ గా అవుతారా లేక సింపుల్ గా అవుతారా? ప్రాబ్లమ్ కలిగినవారు సింపుల్ గా అవ్వజాలరు. కావున మనస్సులో కూడా సింపుల్ గా ఉండాలి. ఒకవేళ ఎవరైనా మనస్సులో కూడా చిక్కుకోవటము ఉన్నట్లయితే అనగా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే వారిని సింపుల్ అని అంటారా? గాంధీని సింపుల్ అని అనేవారు, సింపుల్‌గా అయ్యి ఒక శాంపుల్ గా అయ్యి చూపించారు కదా! వారి సింపుల్ ఏక్టివిటీ(సాధారణ కార్యవ్యవహారములు) కూడా మహానతకు గుర్తుగా ఉంటాయి. అది హద్దుతో కూడిన ఏక్ట్ (కార్యము). కానీ ఇక్కడ, ఇది అనంతమైన తండ్రి పిల్లలుగా అయ్యి అనంతమైన కార్యము చెయ్యటము. మీరు విశ్వ నిమిత్తులు కదా! ఏవిధంగా విశ్వము అనంతమైనదో, తండ్రి అనంతమైనవారో అలాగే ఏ కార్యము చేసినా అనంతమైన స్థితిలో స్థితులై కార్యమును చెయ్యాలి. ఆ ఆర్ట్ తమవైపుకు అట్రాక్ట్ (ఆకర్షణ) చేస్తుంది. కావున ఆకర్షణ మూర్తులుగా అయ్యేందుకు ఏం చెయ్యవలసి ఉంటుంది? సింపుల్ గా అవ్వవలసి ఉంటుంది. ఇక్కడ దైవీ సంబంధములో కూడా కొందరు సింపుల్ గా అవ్వరు, ప్రాబ్లమ్ గా అవుతారు, అప్పుడు రిజల్టు ఏమౌతుంది? స్నేహము మరియు సహయోగము నుండి వంచితులుగా ఉండిపోతారు. ఎవరైతే సాధారణంగా, సింపుల్ గా ఉంటారో వారి వైపుకు అనుకోకపోయినా కూడా అందరి స్నేహము మరియు సహయోగమును ఇచ్చే శుభ భావన ఉంటుంది. కావున సర్వుల స్నేహులుగా అయ్యేందుకు మరియు సర్వుల నుండి సహయోగమును పొందేందుకు మరియు సర్వుల సహయోగులుగా అయ్యేందుకు సింపుల్ గా ఉండటము చాలా అవసరము. ఏ ప్రాబ్లమ్ లేదు కదా! లేక స్వయమే ప్రాబ్లమ్ గా అయితే అవ్వలేదు కదా? లౌకిక పరివారములో గానీ లేక వ్యవహారములో గానీ, దైవీ పరివారములో గానీ ఎప్పుడూ మీలో ప్రాబ్లమ్ ను ఇమర్జ్ చేసుకోకండి, ఇతరులకు ప్రాబ్లమ్ గా అవ్వకండి. ఒకవేళ ప్రాబ్లమ్ గా అయినట్లయితే సేవను తీసుకొనేవారుగా అవుతారు. మీరు ఈశ్వరీయ సేవాధారులు. కావున సేవాధారి అనగా సేవ చేసేవారే కానీ సేవను తీసుకొనేవారు కాదు. ఒకవేళ సేవను తీసుకొనేవారుగా అయినట్లయితే పేరు ప్రమాణంగా కర్తవ్యము లేనట్లు కదా! ఈశ్వరీయ సేవాధారులు సేవను తీసుకోరు, ఇస్తారు ఎందుకంటే దాత పిల్లలు కదా! తండ్రి కూడా ఏమన్నా తీసుకుంటారా? వారైతే దాత కదా! ఒకవేళ ప్రాబ్లమ్ అయిన కారణంగా సేవను తీసుకున్నట్లయితే దాత పిల్లలుగా ఉన్నట్లా? ఒకవేళ ఏవిధమైన అదనపు సేవనైనా తీసుకున్నట్లయితే మేము దాత మరియు వరదాత పిల్లలము అన్న నషా ఎప్పుడూ ఉండదు.

           ఇది వృత్తి కలిగినవారి గ్రూపా లేక నివృత్తి కలిగినవారి గ్రూపా? లౌకిక ప్రవృత్తి అయితే  సమాప్తమైపోయింది కదా! లౌకిక ప్రవృత్తిని కూడా ఈశ్వరీయ ప్రవృత్తిలోకి పరివర్తన చేసారా? ఎప్పటివరకయితే  పరివర్తన చెయ్యరో అప్పటివరకు అలౌకిక స్థితిలో ఏకరసంగా ఉండజాలరు, కావున మీ పేరు, రూపము,  గుణము మరియు కర్తవ్యములను ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకొని, అప్పుడు ప్రవృత్తిలో ఉండండి,  దీని ద్వారా లౌకిక ప్రవృత్తి పరివర్తన అవుతుంది అని అన్నాము. ఎల్లప్పుడూ స్వయమును సేవాధారిగా  భావించటం ద్వారా అధికార దర్పము ఎప్పుడూ ఉండదు. సేవాధారులు ఎల్లప్పుడూ నమ్రచిత్తులుగా నిర్మానులుగా ఉంటారు మరియు తమ ఇంటిని కూడా ఇంటిగా కాకుండా సేవాస్థానముగా భావిస్తారు. సేవాధారుల ముఖ్య గుణము త్యాగము. ఒకవేళ త్యాగము లేనట్లయితే సేవ కూడా ఉండజాలదు.  త్యాగము ద్వారా తపస్వీ మూర్తులుగా అవుతారు. సేవాధారుల కర్తవ్యము - ఎల్లప్పుడూ సేవలో ఉండటము. కావాలంటే మనసా సేవలో ఉండండి లేదా వాచా సేవలో ఉండండి లేదా కర్మణా సేవలో అయినా  ఉండండి కానీ సేవాధారి అనగా నిరంతర సేవలో తత్పరులై ఉండేవారు. వారు ఎప్పుడు కూడా సేవను  తమ నుండి వేరుగా భావించరు. నిరంతర సేవను గురించే ధ్యానము ఉంటుంది. వీరినే సేవాధారులు అని అంటారు. కావున మిమ్మల్ని మీరు సేవాధారులుగా భావించండి, సేవాస్థానంగా భావించి ఉండండి.  త్యాగవృత్తి కలిగిన తపస్యామూర్తులుగా భావించి ఉండండి. నిరంతర సేవను గురించే బుద్ధిలో లగనము  ఉన్నట్లయితే అప్పుడిక లౌకిక ప్రవృత్తి మారిపోయి ఈశ్వరీయ ప్రవృత్తి కలిగినవారిగా అయిపోరా? మరి ఈ గ్రూపు ఏ గ్రూపూ చూపించనటువంటి ఏ నవీనతను చూపిస్తారు? ఏదో ఒక నవీనతను తప్పక  తీసుకురావాలి. ప్రత్యేకంగా భట్టీలోకి వచ్చారు. కనుక మీలో పరివర్తన కూడా విశేషంగా ఉండాలి.  నడుస్తూ-తిరుగుతూ అయితే ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రత్యేకతను తీసుకువచ్చి మీ పేరును విశేష ఆత్మలలో  జమ చేసుకొని వెళ్ళాలి. బాప్ దాదా వద్ద ఎన్ని రకాల లిస్టులు ఉన్నాయో తెలుసా? మీ పేరు ఏ లిస్టులో ఉందో  తెలుసా? మీ పేరును విశేష ఆత్మల లిస్ట్ లో ఉండేందుకు ప్రయత్నము చెయ్యండి. ఎప్పుడైతే ఏదైనా విశేష కర్తవ్యమును చేస్తారో లేక విశేషతను చూపిస్తారో అప్పుడే విశేష ఆత్మలుగా అవుతారు. కావున విశేష  ఆత్మలుగా అయ్యే వెళ్ళాలి. మరజీవులుగా అయ్యారా లేక అయ్యేందుకు వచ్చారా? మరజీవులుగా అయ్యే  బ్రహ్మాకుమారులుగా అయ్యారా లేక ఇప్పుడు అవుతారా? ఎప్పుడైతే మరణించి జన్మను తీసుకున్నారో  అప్పుడే బ్రహ్మాకుమారులుగా పిలువబడ్డారు కదా! మరణించి క్రొత్త జన్మను తీసుకోవటము, దీనిని మరజీవ అని అంటారు కదా! అలా కానట్లయితే జన్మ తీసుకోవటానికి ముందే బ్రహ్మాకుమారులుగా ఎలా  అయ్యారు! పిల్లలుగా అయితే ఉన్నారు, అధికారులుగా ఉన్నారు, ఇక కావలసినది - సుపుత్రులుగా అయ్యి ప్రమాణమును ఇవ్వటము. బ్రహ్మాకుమారులైనప్పుడు ఇక మరజీవాగా అయిపోయినట్లే! మరజీవాగా  అయిపోయాము అన్న ఈ స్మృతి ఉండటం ద్వారా ఈ శరీరము కూడా మీదిగా ఉండదు. ఈ శరీరమును తండ్రి ఈశ్వరీయ సేవార్థం ఇచ్చారు. మీరైతే మరణించారు కదా! కానీ ఈ పాత శరీరము కేవలము ఈశ్వరీయ సేవ కొరకు లభించింది అని భావించుకొని నడవటం ద్వారా ఈ శరీరమును కూడా  అమానతు(తాకట్టు)గా భావిస్తారు. ఏవిధంగా ఎవరి వస్తువైనా అమానతుగా ఉన్నట్లయితే అమానతులో  అపనాపన్(తనది అన్న భావన)ఉండదు. మమకారము కూడా ఉండదు. కావున ఈ శరీరమును కూడా ఒక అమానతుగా భావించండి. అప్పుడు దేహపు మమకారము కూడా సమాప్తమైపోతుంది. నిమిత్తులై  ఉండటం ద్వారా, అమానతుగా భావించటం ద్వారా మమకారము తక్కువైపోతుంది కదా! ఇదేవిధంగా ఈ శరీరము కూడా కేవలము ఈశ్వరీయ సేవ కొరకు అమానతు (తాకట్టు) రూపంలో లభించింది. తాకట్టు వస్తువును చూసినప్పుడు అది ఎవరు పెట్టిన తాకట్టో వారి స్మృతి వస్తుంది కదా! తాకట్టుగా పెట్టబడిన వస్తువును చూసి, ఇచ్చినవారి స్మృతి వస్తుంది కదా! ఈ అమానతును ఆత్మిక తండ్రి ఇచ్చారు. ఆత్మిక తండ్రి స్మృతి ఉంటుంది, అమానతుగా భావించటం ద్వారా ఆత్మికత ఉంటుంది మరియు ఆత్మికత ద్వారా ఎల్లప్పుడూ బుద్ధిలో విశ్రాంతి, సుఖము ఉంటాయి, అలసట ఉండదు. అమానతులో ఖ్యానత్(మోసము) చెయ్యటం ద్వారా ఆత్మికతకు బదులుగా చిక్కులు వచ్చేస్తాయి. విశ్రాంతి బదులుగా గాభరా వచ్చేస్తుంది.  కావున ఈ శరీరము ఉన్నదే కేవలము ఈశ్వరీయ సేవ కొరకు. అమానతుగా భావించటం ద్వారా  ఆటోమేటిక్ గానే ఆత్మికతా స్థితి ఉంటుంది. ఇది సహజ ఉపాయము కదా! ఇప్పుడు నిరంతర సహజయోగులుగా అవ్వగలరు కదా! నిరంతర ఆత్మికత స్థితిలో స్థితులై ఉండండి, మిమ్మల్ని చూసి మనుష్యులు వీరైతే శాంపుల్ గా అయ్యి వచ్చారు అన్న అనుభవము చేసుకోవాలి, ఈ నవీనతను చూపించండి. ఇతరులకు కూడా స్మృతియాత్ర సహజముగా చేసేందుకు శాంపుల్ గా అయ్యి వెళ్ళాలి. ఈ గ్రూపు శాంపుల్‌గా అయ్యి వెళ్తారు కదా!

           ఒకవేళ ఒక్కొక్క స్థానం నుండి ఒక్కొక్క శాంపుల్ వెళ్ళినట్లయితే అప్పుడు విషయం సింపుల్ అయిపోతుంది. ఏ పేరును మీరు స్మృతిలో ఉంచుకుంటారు? సేవాధారి. సేవాధారులుగా అయితే ఉన్నారు కానీ, సేవ ఎలా చెయ్యాలంటే అది ప్రత్యక్ష ఫలపు ప్రాప్తి చేయించగలగాలి. మరి ఏ స్లోగన్ ను స్మృతిలో ఉంచుకుంటారు? మీ ఆత్మికత స్థితిని ప్రత్యక్షము చేసి ప్రతి ఆత్మకు ప్రత్యక్ష ఫలమును ఇప్పించేవారు. ఇదే ఈ గ్రూపు కర్తవ్యము. ఎంతగా మీ ఆత్మికత స్థితిని దృఢంగా చేసుకుంటారో అంతగా ప్రత్యక్ష ఫలమును ఇవ్వగలరు. ఒకవేళ ఆత్మికత స్థితిని ప్రత్యక్షము చేయించకపోతే ఫలము ప్రత్యక్షముగా కనిపించదు. ప్రత్యక్ష ఫలమును చూపించేందుకు ఆత్మిక స్థితిని ప్రత్యక్షము చెయ్యండి. అర్థమైందా, స్లోగన్! అచ్ఛా - మీపై మీరు ఏ ముద్రను వేయించుకుంటారు? సేవాధారి, అర్థమైంది కదా, మనసులో కూడా సేవ. ఈ త్యాగము ద్వారా తపస్వులుగా అవ్వగలిగే ఏ ముఖ్య త్యాగమును ఈ గ్రూపు చేస్తారు? మీ ప్రాక్టికల్ దినచర్యలో ఏది చాలా విఘ్నరూపంగా ఉంటుంది? ఒక్క మాటలో దానిని దర్పము అని అంటారు, కనుకనే ఆత్మిక దర్పము రాదు. ప్రవృత్తిలో నేను రచయితను అన్న అధికారమునేదైతే ఉంచుతారో లేక వ్యవహారములో కూడా ఏ దర్పమైతే ఉంటుందో, సంబంధములో కూడా ముఖ్య విఘ్నంగా అధికార దర్పము వస్తుంది... దీనిని త్యాగము చెయ్యాలి. సేవాధారులు దర్పమును చూపించరు కావున అధికార దర్పమును త్యాగము చెయ్యాలి. ఇదే ముఖ్యమైన త్యాగము. త్యాగము చేసేందుకు ధైర్యమైతే ఉంది కదా! ఏయే ప్రతిజ్ఞలనైతే చేసారో ఆ ఒక్కొక్క ప్రతిజ్ఞపై అవినాశీ ముద్రను వెయ్యండి. అవినాశ ముద్రను వెయ్యని కారణంగా ప్రతిజ్ఞ, అల్పకాలము ఉంటుంది. చాలామంది రిజల్టులో ఇక్కడ ప్రతిజ్ఞ చేసి వెళ్తారు, మళ్ళీ ప్రతిజ్ఞను మార్చేసి విలాపాలు చేస్తుంటారు. ఏం చెయ్యాలి, ఏమైపోయింది! ఇప్పుడు సహాయము ఇవ్వండి... అనుకోలేదు కానీ ఇది కారణమైపోయింది. యోగికి బదులుగా వియోగులుగా అయ్యి విలపిస్తారు. కావున ఇప్పుడు నిరంతర యోగులుగా అవ్వాలి. విలపించే వియోగులుగా అవ్వవద్దు. ఈ గ్రూపు దీనినే ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. ఏది అంటామో దానినే చేస్తారు, దీనికొరకు ఎన్ని విషయాలను సహించవలసి వచ్చినా గానీ ఎదుర్కొని చూపిస్తాము. విజయులుగా అయ్యే చూపిస్తాము. పరస్పరములో ఒకరికొకరు సహాయకులుగా, శుభ చింతకులుగా అయి ఉన్నట్లయితే సహయోగులుగా అయ్యి ఇక చెయ్యలేనిది ఏముంటుంది! ఎప్పుడైతే వారు ఒకరికొకరు సహయోగులై చుట్టుముట్టగలిగినప్పుడు మరి మీరు మాయను చుట్టుముట్టలేరా? పాండవసేన ఘెరావ్ చెయ్యలేరా? ఒకరికొకరు శుభచింతకులుగా, సహయోగులుగా అయ్యి ఉన్నట్లయితే మీ క్షేత్రము లోపలకు రావటానికి మాయకు ధైర్యము రాజాలదు. ఇదే సహయోగపు శక్తి. ఇది సహయోగ శక్తి యొక్క సంగఠన. ఈ సంగఠన సహయోగపు శక్తి యొక్క ప్రత్యక్ష రూపమును చూపించాలి. అచ్ఛా!

Comments