19-04-1973 అవ్యక్త మురళి

* 19-04-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ప్రత్యక్షత కొరకు పురుషార్థం.

          నికృష్టుల నుండి శ్రేష్ఠంగా లేదా భాగ్యహీనుల నుండి భాగ్యవంతులుగా  తయారుచేసే శివబాబా చెప్తూన్నారు...

          మిమ్మల్ని మీరు బాప్ దాదాకు సమీపంగా ఉండే పదమాపదమ భాగ్యశాలురుగా, శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? ఎవరు ఎవరికీ సమీపంగా ఉంటారో, వారిలో సమీపంగా ఉండేవారి గుణాలు స్వతహాగ మరియు సహజముగానే వచ్చేస్తాయి. కావుననే సాంగత్యపు రంగు తప్పక అంటుకుంటుంది అని అంటారు. మరి ఆత్మలైన మీరు, ఎవరైతే సదా బాప్ దాదాకు సమీపంగా అనగా శ్రేష్ఠ సాంగత్యములో ఉంటారో వారి గుణాలు మరియు సంస్కారాలైతే తప్పకుండా బాప్ దాదా సమానంగానే ఉంటాయి కదా! నిరంతరము శ్రేష్ఠ సాంగత్యములో ఉండే పిల్లలైన మీరు మీలో ఎల్లప్పుడూ ఆ ఆత్మిక రంగును కలిగి ఉండటమును అనుభవము చేసుకుంటున్నారా? మీరు స్వయమును ప్రతి సమయము ఆత్మిక రంగులో రంగరింపబడి ఉండే ఆత్మలుగా భావిస్తారా? ఏవిధంగా స్థూలమైన రంగు స్పష్టంగా కనిపిస్తుందో, అలాగే చెడు సాంగత్యములో ఉండే ఆత్మల మాయావీ రంగు కూడా దాగి ఉండజాలదు, చెప్పండి, కనిపిస్తుంది కదా? (అవును, కనిపిస్తుంది).

          అటువంటప్పుడు శ్రేష్ఠ సాంగత్యములో ఉండే వారి ఆత్మికరంగు కూడా అందరికీ కనిపించాలి కదా! వీరిని ఎవరు చూసినా కానీ, వీరు ఆత్మికరంగులో రంగరింపబడియున్న ఆత్మలు అని వారికి తెలిసిపోవాలి. ఇలా అందరికీ తెలుస్తుందా లేక ఇప్పుడు గుప్తంగా ఉన్నారా? ఈ ఆత్మికరంగు గుప్తంగానే ఉండాలా? ఎప్పుడు ప్రత్యక్షమవ్వాలి? లేకపోతే అంతిమంలోనే ప్రత్యక్షమవుతుందా? ఆ తారీఖు ఏది? అంతిమ డేట్ అనేది అందరి ప్రత్యక్షత పైనే ఆధారపడి ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా శ్రేష్ఠ ఆత్మలైన మీతోటి పశ్చాత్తాపమునకు సంబంధము ఉంది. ఎప్పటివరకైతే పశ్చాత్తాపపడరో అప్పటివరకు ముక్తిధామమునకు వెళ్ళేందుకు వారసత్వమును పొందలేరు. కావున నిమిత్తంగా అయ్యి ఉన్న ఆత్మలెవరైతే ఉన్నారో వారినైతే అడుగుతారు కదా? నిమిత్తులెవరు? మీరందరూ కదా? ఇప్పుడు మీముందే మీకు మీ సంపూర్ణస్థితి ప్రత్యక్షమవ్వకపోతే ఇక ఇతరుల ముందు ఎలా ప్రత్యక్షమవుతుంది? మీ సంపూర్ణస్థితి మీకు శ్రేష్ఠముగా కనిపిస్తోందా? వాస్తవానికి జ్ఞానముతోనే అందరూ సంపూర్ణస్థితిని తెలుసుకుంటారు. కానీ మిమ్మల్ని మీరు ఏమని భావిస్తున్నారు? సమీపంగా ఉండే లెక్కతో వారి సమానంగా అవుతారు కదా? మరి మీ సంపూర్ణస్థితి కనిపిస్తుందా?

          నేను ఎవరిని ఈ పొడుపు కథ ఇంకా పరిష్కారమవ్వలేదా? కల్పపూర్వము నేను ఎవరిని? ఈ మీ సంపూర్ణస్థితిని మర్చిపోయారా? ఇతరులకైతే 5000 సంవత్సరాల విషయాన్ని మొదటగా గుర్తు తెప్పిస్తారు. మొట్టమొదటగా ఎవరైనా వస్తే, మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు కలిసారా? అని అడుగుతారు కదా! ఇతరులకు కల్పపూర్వపు విషయాలను గుర్తు తెప్పించినప్పుడు, గుర్తు తెప్పించేవారికి వారి స్వవిషయము గుర్తు ఉంటుంది కదా? దర్పణము స్పష్టంగా లేదా? దర్పణము స్పష్టంగా మరియు పవర్ ఫుల్ గా ఉన్నట్లయితే అందులో కనిపించే వస్తువు కూడా ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుంది. విశేష ఆత్మలు మరియు సర్వ శ్రేష్ఠ ఆత్మలైన మీరు మీ శ్రేష్ఠ స్థితిని చూసుకోలేరా? నిమిత్త ఆత్మలైన మీకు ఎప్పుడైతే మీ సంపూర్ణస్థితి స్పష్టంగా సాక్షాత్కారమౌతుందో, వినాశనము రావటానికి ఇక అదే ఆలస్యము. మంచిది, చెప్పండి, వినాశనానికి ఇక ఎంత సమయము ఉంది? త్వరగా అవ్వాలా లేక ఆలస్యమవ్వాలా?

          ఈరోజు సద్గురువారము కదా? ఈ రోజు వతనములో ఆత్మిక సంభాషణ జరిగింది. ఏ ఆత్మిక సంభాషణ? నంబర్ వారీ పురుషార్ధీల వర్తమానపు స్థితి ఎంతవరకు తయారైంది? ఇందులో ఏ రిజల్టు వెలువడి ఉంటుంది? మొదటి ప్రశ్నకు చెందిన రిజల్టులో మెజారిటీ 50 శాతం కంటే ఎక్కువ వెలువడలేదు. ఆ మొదటి ప్రశ్న ఏది? ఈ సంవత్సరము విశేషరూపంలో స్మృతియాత్రలో ఉండాలి మరియు అవ్యక్త స్థితిలో స్థితులై వరదానాలను ప్రాప్తి చేసుకోవాలి అని ఈ సంవత్సరపు మహత్వాన్ని ఏదైతే వినిపించామో మరియు డైరెక్షన్‌ను ఇచ్చామో, ఆ డైరెక్షన్ ప్రమాణంగా సంవత్సరము మొదట్లో ఎంతటి అటెన్షన్ మరియు స్థితి ఉండిందో, అది ఇప్పుడు ఉందా? అవ్యక్త వాతావరణము మరియు ఆత్మిక అనుభవమును మొదట్లో ఏదైతే చేసారో, ఇప్పుడు కూడా అదే ఆత్మిక స్థితి ఉందా? స్థితిలో మరియు అనుభవములో తేడా ఉందా? ఏవిధంగా అన్ని సేవాకేంద్రాలలో మీకందరికీ ఆకర్షణ కలిగిస్తూ ఉండే ఆకర్షణమయ వాతావరణము ఏదైతే ఉందో, దానిని సేవ చేస్తూ తయారుచేసుకోలేరా? ఈ ప్రశ్నకు చెందిన రిజల్టులో 50 శాతము కూడా రిజల్టు లేదు అని వినిపించాము.

          రెండవ ప్రశ్నలో రిజల్టు 60 శాతము సరిగ్గా ఉంది. అది ఏ ప్రశ్న ? సేవ రిజల్టులో మరియు ఉల్లాసఉత్సాహాలలో రిజల్టు చాలా మంచిగా ఉంది, కానీ బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? ఒకవేళ బ్యాలెన్స్ సరిగ్గా ఉంచుకున్నట్లయితే చాలా త్వరగానే మాస్టర్ సక్సెస్ ఫుల్ లుగా అయ్యి మీ ప్రజలు మరియు భక్తులకు ఆనందాన్ని ఇచ్చి ఈ దు:ఖ ప్రపంచము నుండి దూరంగా తీసుకొని వెళ్ళగలరు. ఇప్పుడు భక్తుల పిలుపు స్పష్టంగా మరియు సమీపంగా వినిపించటం లేదు, ఎందుకంటే మీకు స్వయమే మీ స్థితి స్పష్టంగా లేదు. రెండవ ప్రశ్నకు రిజల్టు ఇదే.

          మూడవ ప్రశ్న - సంపర్కము మరియు సంబంధములో, సేవలో మరియు ప్రవృత్తిలో మీతో మీరు సంతుష్టంగా ఉన్నారా మరియు మీతో ఇతర ఆత్మలు ఎంతవరకు సంతుష్టంగా ఉన్నారు? సేవా కేంద్రము కూడా ప్రవృత్తే కదా! ప్రవృత్తిలో మరియు సేవలో ఎంతవరకు సంతుష్టులుగా ఉన్నారు? ఇందులో మైనారిటీ పాస్ అయ్యారు. మెజారిటీ 50-50 (ఫిఫ్టీ, ఫిస్టీ)గా ఉన్నారు. ఇప్పుడు ఉంటారు. ఇప్పుడు ఉండరు. ఈ రోజు ఉంటారు, రేపు ఉండరు. దీనిని 50-50 అంటారు. ఈ మూడు ప్రశ్నల ద్వారా నడుస్తున్న సంవత్సరపు రిజల్టు స్పష్టంగా ఉంది కదా? ఈ సంవత్సరములో విశేషంగా వరదానాన్ని తీసుకోవచ్చు అని వినిపించి ఉన్నాము కదా! కానీ ఒక్క మాసమునే వరదానీ మాసముగా భావించి అటెన్షన్ ను  ఉంచారు. ఇప్పుడు మళ్ళీ నెమ్మది-నెమ్మదిగా సమయానుసారంగా వరదానీ సంవత్సరమును మర్చిపోతూ ఉన్నారు, కావున ఈ వరదానీ సంవత్సరములో వరదానాలను తీసుకొనేందుకు ఎంతగానైతే స్మృతిలో ఉంటారో అంతగా సహజముగానే వరదానముకూడా ప్రాప్తిస్తుంది మరియు ఒకవేళ విస్మృతి అయిందంటే విఘ్నాలను కూడా చాలా ఎదుర్కొంటారు. కావున నలువైపులా మరియు సర్వ బ్రాహ్మణ పరివారపు ఆత్మల ముందు వచ్చే అన్ని రకాల విఘ్నాలను తొలగించేందుకు మొదటి మాసములో ఏవిధంగా అయితే స్మృతి లేక లగనమనే అగ్నిని ప్రజ్వలితము చేసారో, అలాగే ఇప్పుడు కూడా అటువంటి అవ్యక్త వాతావరణమును తయారు చేయాలి. ఒకవైపు వరదానము, మరొకవైపు విఘ్నము. రెండింటికీ ఒకదానికొకటి సంబంధము ఉంది. కేవలము మీ కొరకు మీరు విఘ్నవినాశకులుగా అవ్వటం కాదు, కానీ మీ బ్రాహ్మణకులములోని సర్వ ఆత్మల విఘ్నములను వినాశనము చేసేందుకు సహయోగులుగా అవ్వాలి, అటువంటి స్పీడ్ ను వేగవంతము చెయ్యండి. మధ్య మధ్యలో నడుస్తూ నడుస్తూ వేగాన్ని తగ్గించేస్తారు, కనుకనే ప్రత్యక్షత జరగటంలో కూడా డ్రామాలో ఇంత ఆలశ్యము కనిపిస్తూ ఉంది. అప్పుడే స్వయమును కూడా ప్రత్యక్షము చేసుకోగలరు. స్వయములో సర్వశక్తివంతుని ప్రత్యక్ష రూపమును అనుభవము చెయ్యండి, ఒకటి-రెండు శక్తులను కాదు, సర్వ శక్తులను అనుభవము చెయ్యండి. మాస్టర్ సర్వశక్తివంతులు, రెండు-నాలుగు శక్తులుగల వారి సంతానమా? సర్వశక్తివంతుని ప్రత్యక్షము చెయ్యండి. అచ్ఛా!

          మాస్టర్ ఆనందస్వరూపులు, మాస్టర్ జ్ఞానసంపన్నులు, మాస్టర్ విజయీలు, సర్వ శ్రేష్ఠులు, సదా ఆత్మిక సాంగత్యపు రంగులో ఉండే విశేష ఆత్మలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments