* 19-04-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“త్యాగము, తపస్సు మరియు సేవల నిర్వచనము”
ఈరోజు భట్టీని ప్రారంభించేందుకు పిలిచారు. ఈ భట్టిలో సర్వ గుణాలతో కూడిన ధారణామూర్తులుగా అయ్యేందుకు లేక సంపూర్ణ జ్ఞానమూర్తులుగా అయ్యేందుకు వచ్చారు. ఇందుకొరకు ముఖ్యమైన మూడు విషయాలను ధ్యానములో ఉంచుకోవాలి. అవి ఏవి? ఈ మూడు విషయాలతో సంపూర్ణ జ్ఞానమూర్తులుగా మరియు సర్వ గుణమూర్తులుగా అయ్యే వెళ్ళాలి. మొత్తము జ్ఞానము యొక్క సారమంతా ఈ మూడు మాటలలో నిండి ఉంది. ఆ మూడు మాటలు ఏవి? ఒకటి-త్యాగము, రెండవది-తపస్సు మరియు మూడవది-సేవ. ఈ మూడు మాటల ధారణామూర్తులుగా అవ్వటము అనగా సంపూర్ణ జ్ఞానమూర్తులుగా మరియు సర్వ గుణమూర్తులుగా అవ్వటము. త్యాగము అని దేనిని అంటారు? నిరంతర త్యాగవృత్తి మరియు తపస్యామూర్తులుగా అయ్యి ప్రతి క్షణము, ప్రతి సంకల్పము ద్వారా ప్రతి ఆత్మకు సేవ చెయ్యాలి. దీనిని నేర్చుకొనేందుకు భట్టీలోకి వచ్చారు. మామూలుగా అయితే త్యాగము మరియు తపస్సు - ఈ రెండింటిని గురించీ మీకు తెలుసు, మరి ఇప్పుడు ఏం చెయ్యటానికి వచ్చారు(కర్మలోకి తీసుకువచ్చేందుకు) తెలుసుకోవటమైతే తెలుసుకున్నారు కానీ ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నారో, దాని అనుసారంగా నడవాలి, ఈ రెండింటినీ సమానంగా తయారుచేసుకునేందుకు వచ్చారు. ఇప్పుడు తెలుసుకోవటము మరియు నడవటములో అంతరము ఉంది. ఆ అంతరమును సమాప్తము చేసేందుకు భట్టీలోకి వచ్చారు. మీ త్యాగము మరియు తపస్సుల శక్తి యొక్క ఆకర్షణ దూరము నుండే ప్రత్యక్షముగా కనిపించేంతగా అటువంటి తపస్వీమూర్తులుగా మరియు త్యాగమూర్తులుగా అవ్వాలి. ఏవిధంగా స్థూల అగ్ని మరియు ప్రకాశము లేక వేడిమి దూరము నుండే కనిపిస్తాయో లేక అనుభవము ఉంటుందో అలా మీ తపస్సు మరియు త్యాగముల మెరుపు దూరము నుండే ఆకర్షితము చెయ్యాలి. ప్రతి కర్మలో త్యాగము మరియు తపస్సు ప్రత్యక్షముగా కనిపించాలి అప్పుడే సేవలో సఫలతను పొందగలరు. కేవలము సేవాధారిగా అయ్యి సేవ చెయ్యటం ద్వారా సఫలతనేదైతే కోరుకుంటారో అది దొరకటం లేదు. కానీ సేవాధారిగా అవ్వడంతో పాటు త్యాగము మరియు తపస్యామూర్తిగా కూడా ఉన్నట్లయితే అప్పుడు సేవ యొక్క ప్రత్యక్ష ఫలము కనిపిస్తుంది. మరి సేవాధారులుగా అయితే చాలా బాగా ఉన్నారు, కానీ సేవ చేసే సమయంలో త్యాగము మరియు తపస్సులను మర్చిపోకూడదు. మూడూ కలసి ఉండటం ద్వారా శ్రమ తక్కువ మరియు ప్రాప్తి అధికంగా ఉంటుంది. సమయము తక్కువ, సఫలత అధికము. కావున ఈ మూడింటినీ కలపాలి. దీనిని మంచిగా అభ్యాసము చేసి వెళ్ళాలి. ఎంతటి నాలెడ్జ్ ఫుల్ లో అంతగానే పవర్ ఫుల్ మరియు సక్సెస్ ఫుల్ గా ఉండాలి. నాలెడ్జ్ ఫుల్ గుర్తుగా వారి ఒక్కొక్క మాటా పవర్ ఫుల్ గా ఉండటం మరియు ప్రతి కర్మ సక్సెస్ ఫుల్ గా ఉండటం కనిపిస్తుంది. ఒకవేళ ఈ రెండింటి రిజల్టు తక్కువగా కనిపించినట్లయితే నాలెడ్జ్ ఫుల్లుగా అవ్వాలి అని అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఆత్మల ద్వారా అసంపూర్ణ జ్ఞానాన్ని ఏదైతే ప్రాప్తి చేసుకుంటారో వారికి కూడా అల్పకాలము కొరకు సఫలతా ప్రాప్తి అనుభవమవుతుంది. కావున సంపూర్ణ శ్రేష్ఠ జ్ఞానపు ప్రాప్తి ప్రత్యక్షంగా ప్రాప్తమయ్యే అనుభవమును కూడా ఇప్పుడు చెయ్యాలి. ఈ జ్ఞానపు ప్రాప్తి భవిష్యత్తులో ఉండాలనే భావించకండి, అలా కాదు, వర్తమాన సమయములో జ్ఞానపు ప్రాప్తి మీ పురుషార్థములో సఫలత మరియు సేవలో సఫలత రూపంలో అనుభవమవుతుంది. సఫలత ఆధారంతో మీ జ్ఞానాన్ని తెలుసుకోగలరు. మేము ఎంతవరకు నాలెడ్జ్ ఫుల్ గా అయ్యాము అన్నదానిని పరిశీలించుకొనేందుకు మరియు పరిశీలన చేయించుకునేందుకు భట్టీలోకి వచ్చారు. ఎటువంటి పాత సంకల్పము మరియు సంస్కారము కనిపించకూడదు, అంతటి త్యాగమును నేర్చుకోవాలి. మస్తకము అనగా బుద్ధియొక్క స్మృతి ద్వారా లేక దృష్టి ద్వారా ఆత్మిక స్వరూపము తప్ప మరేమీ కనిపించకూడదు మరియు స్మృతిలోకి రాకూడదు. అటువంటి నిరంతర తపస్వులుగా అవ్వాలి. ఎటువంటి సంస్కారము కలవారైనా మరియు స్వభావము కలవారైనా, రజోగుణీ ఆత్మలైనా, తమోగుణీ ఆత్మలైనాగానీ, సంస్కారము మరియు స్వభావమునకు వశమై ఉన్నవారైనా గానీ, మీ పురుషార్థములో పరీక్షకు నిమిత్తంగా తయారైనవారైనా గానీ ప్రతి ఆత్మ పట్ల సేవ అనగా కల్యాణపు సంకల్పము మరియు భావన ఉత్పన్నమవ్వాలి. అలా సర్వ ఆత్మల సేవాధారిగా అనగా కల్యాణకారిగా అవ్వాలి. మరి ఏ త్యాగము నేర్చుకోవాలో, ఏ తపస్సు నేర్చుకోవాలో మరియు సేవ కూడా ఎంతవరకు చేయాలో ఇప్పుడు అర్థమైందా? వీటి సూక్ష్మతను అనుభవము చేసుకోవాలి. ఎవరిలో అయితే జ్ఞానము మరియు ధారణల ఫలములు ఉంటాయో వారు ప్రతి పురుషార్థములో ఫలీభూతులవ్వగలరు. ఇప్పుడు అందరి ఎదురుగా బ్రహ్మాకుమారులు ప్రసిద్ధముగా కనిపిస్తున్నారు వీరు బ్రహ్మాకుమారులని దూరము నుండే తెలుసుకొంటారు. ఇప్పుడు బ్రహ్మాకుమారులతో పాటు తపస్వీ కుమారులని కూడా దూరము నుండే కనిపించాలి, అలా తయారయ్యి వెళ్ళాలి, ఎప్పుడైతే మననము మరియు మగనము ఈ రెండింటి అనుభవమును చేస్తారో అప్పుడే ఇది జరుగుతుంది.
వీరు నషాలో ఉన్నారు అని ఏవిధంగా స్థూల నషాలో ఉన్నవారి దృష్టి వృత్తి నడవడికల ద్వారా కనిపిస్తుందో అలా మీ నడవడిక మరియు ముఖము ద్వారా ఈశ్వరీయ నషా మరియు నారాయణీ నషా కనిపించాలి. మీ ముఖమే మీ పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరి వద్దకైనా వెళ్ళినప్పుడు పరిచయము కొరకు మీ కార్డును ఇస్తారు కదా, అదేవిధంగా మీ ముఖము పరిచయమునిచ్చే కార్డు కర్తవ్యమును చెయ్యాలి. అర్థమైందా!
ఇప్పుడు గుప్తమైన ధారణా రూపాన్ని ఉంచుకోకూడదు. జ్ఞానము గుప్తమైనది, తండ్రి గుప్తమైనవారు, కావున ధారణ కూడా గుప్తమైనదే అని కొందరు భావిస్తారు. జ్ఞానము గుప్తము, తండ్రి గుప్తమే కానీ వారి ద్వారా ఏ ధారణల ప్రాప్తి అయితే లభించిందో అది గుప్తముగా ఉండజాలదు. కావున ధారణలను మరియు ప్రత్యక్ష రూపములో చూపించండి, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ముఖ్యంగా కుమారులలో పురుషార్థములో విఘ్నరూపముగా ఉండే ఒక సంస్కారము ఉంటుంది. అది ఏది? కుమారులలో కోరికలను పూర్తి చేసుకొనేందుకు కొన్ని సంస్కారాలను ఉంచుకునే అలవాటు ఉంటుంది. ఏవిధంగా జేబు ఖర్చులకు ఉంచుకుంటారో, రాజుల రాజ్యాలు పోయినా కానీ పిరవీ పర్స్(వారికి ప్రభుత్వం ఇచ్చే జేబు ఖర్చు)ను వదలరో, అదేవిధంగా సంస్కారాలను ఎంతగా సమాప్తము చేసుకొన్నాగానీ జేబు ఖర్చులాగా వేటినో వాటిని ప్రక్కకు తప్పకుండా ఉంచుకుంటారు. ఇదే ముఖ్య సంస్కారము, ఇక్కడ భట్టీలో తెలుసుకుంటారు కూడా మరియు నడిచేందుకు ధైర్యమును కూడా ధారణ చేస్తారు, అయినా మాయ జేబు ఖర్చులాగా ఎక్కడో అక్కడ మిగిలిపోతుంది. అర్థమైందా! కావున ఈ భట్టీలో అందరూ త్యాగము చేసి వెళ్ళాలి. సంపూర్ణంగా అయితే అంతిమములోనే అవ్వాలి కదా కావున ఇప్పుడు కొద్దో గొప్పో ఉండనే ఉంటాయి అని ఇలా ఆలోచించవద్దు. కానీ ఇలా కాదు, త్యాగమంటే త్యాగమే. జేబు ఖర్చులాగా మీ లోపల కొద్ది సంస్కారాలను కూడా ఉండనివ్వకూడదు. అర్థమైందా! కొద్దిపాటి సంస్కారమైనా ఒకవేళ ఉండిపోయినట్లైతే ఆ కొద్ది సంస్కారము కూడా మోసగిస్తుంది, కావున పాత సంపద ఏదైతే ఉందో దానిని పూర్తిగా భస్మము చేసి వెళ్ళాలి. దాచి ఉంచుకోకూడదు. అర్థమైందా! అచ్ఛా!
ఇది కుమారుల గ్రూపు, ఇప్పుడు తపస్వీ కుమారుల గ్రూపుగా అవ్వాలి. వీరు తపస్వీ కుమారులు, తపస్వీ భూమి నుండి వచ్చారు అని ఈ గ్రూపులోని ఈ విశేషత అందరికీ కనిపించాలి. ప్రతి ఒక్కరూ ప్రకాశ కిరీటధారులుగా కనిపించాలి. కిరీటధారులుగా అయితే భవిష్యత్తులో అవుతారు. కానీ ఈ భట్టీ నుండి ప్రకాశ కిరీటధారులుగా అయ్యి వెళ్ళాలి. సేవ యొక్క బాధ్యతా కిరీటము ఈ కిరీటముతో పాటు స్వతహాగనే ప్రాప్తిస్తుంది. కావున ఈ ప్రకాశ కిరీటమును ధరించడంలో ముఖ్యమైన శ్రద్ధను ఉంచాలి. అర్ధమైందా. ఏవిధంగా తపస్వులు ఎల్లప్పుడూ ఆసనముపై కూర్చుంటారో అలా మీ ఏకరస ఆత్మ స్థితి అనే ఆసనముపై విరాజమానులై ఉండండి. ఈ ఆసనమును వదలకండి, అప్పుడు సింహాసనము దొరుకుతుంది. ఎవరైనా మిమ్మల్ని చూడటంతోనే ఈ కుమారులు తపస్వీ కుమారులుగా అయ్యి వచ్చారు అని అందరి నోటి నుండి ఈ ఒక్క మాటే వెలువడాలి, అలా ప్రయత్నము చెయ్యండి. ప్రతి కర్మేంద్రియము ద్వారా దేహ అభిమానపు త్యాగము మరియు ఆత్మ అభిమానపు తపస్సు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి ఎందుకంటే బ్రహ్మా యొక్క స్థాపనా కార్యమైతే కొనసాగుతూనే ఉంది. ఈశ్వరీయ పాలన యొక్క కర్తవ్యము కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు చివరలో తపస్సు ద్వారా మీ వికర్మలను మరియు ప్రతి ఆత్మ యొక్క తమోగుణమును మరియు ప్రకృతిలోని తమోగుణీ సంస్కారములను భస్మము చేసే కర్తవ్యము జరగాలి. ఏ కర్తవ్యమును చేసేందుకు ఇది సమయమో ఇప్పుడు అర్థమైందా? తపస్సు ద్వారా తమోగుణమును భస్మము చేసే సమయమిది. ఏవిధంగా మీ చిత్రాలలో శంకరుని రూపమును వినాశనకారిగా అనగా తపస్వీ రూపముగా చూపిస్తారో, అలా ఏకరస స్థితి అనే ఆసనముపై స్థితులై మీ తపస్వీ రూపమును చూపించండి. ఏం నేర్చుకోవాలి, ఎలా అవ్వాలి మరియు ఎలా కావాలి అన్నది అర్థమైందా? ఇందుకొరకు ఈ కుమారుల గ్రూపు సఫలత ప్రాప్తించే ఏ ముఖ్యమైన స్లోగన్ ను మీ ముందు ఉంచుకుంటారు? సత్యత మరియు స్వచ్ఛతల ద్వారా సృష్టిలో వికారాలను శుభ్రపరిచేస్తాము. ఎప్పుడైతే సృష్టి నుండే చేస్తారో అప్పుడు స్వయము నుండైతే ముందే చేసుకుంటారు కదా! అప్పుడే సృష్టి నుండి చేయగలరు కదా! కావున ఈ స్లోగన్ ను గుర్తు పెట్టుకోవటం ద్వారా, తపస్వీమూర్తులుగా అవ్వటం ద్వారా సఫలతామూర్తులుగా అయిపోతారు. అర్థమైందా. అచ్ఛా!
Comments
Post a Comment