18-09-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మాయా చక్రాల నుండి అతీతంగా స్వదర్శన చక్రధారులైన వారే భవిష్యత్తులో చక్రవర్తులు కాగలరు.
నిర్బలులను మహా శక్తిశాలిగా తయారుచేసేవారు, మాయా చక్రాల నుండి ముక్తులుగా తయారుచేసేవారు, దయాహృదయులు లేదా స్నేహమూర్తి శివబాబా స్వదర్శనచక్రధారుల నుండి చక్రవర్తి అయ్యే పిల్లలను చూసి మాట్లాడారు --
ఈరోజు బాప్ దాదా బ్రాహ్మణ పిల్లలందరి యొక్క వర్తమానం మరియు భవిష్యత్తు రెండింటినీ చూసి హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు స్వదర్శన చక్రధారి నుండి చక్రవర్తి. వర్తమానం చక్రధారి మరియు భవిష్యత్తులో చక్రవర్తి. చక్రధారి కాకపోతే చక్రవర్తి కూడా కాదు. ఏ పిల్లలకైతే సంగమయుగం అనగా ఈ కొద్దిపాటి అమూల్య సమయంలో నిరంతరం సదాకాలికంగా చక్రంలో తిరుగుతూ ఉంటారో అనగా అవినాశీ చక్రధారి అవుతారో, ఆ ఆత్మలే సదాకాలిక చక్రవర్తిగా కాగలరు. చక్రధారిగా అయ్యే ఆత్మ సదా మాయకు అధికారిగా ఉంటుంది. మాయపై అధికారి అయిన ఆత్మలే తండ్రి యొక్క బేహద్ వారసత్వానికి అధికారులు అవుతారు. అనగా స్వదర్శన చక్రధారి నుండి చక్రవర్తి అవుతారు. సదా చక్రం మరియు రాజ ఛత్రం రెండూ కనిపిస్తున్నాయా? చక్రధారి ఆత్మ యొక్క గుర్తులు ఏమి కనిపిస్తాయి? మీ గుర్తులు మీరు చూశారా? చక్రధారులు ఇప్పుడు కూడా ప్రకాశ చక్రధారిగా కనిపిస్తారు. చక్రానికి గుర్తుగా వారిలో ప్రకాశ చక్రం కనిపిస్తుంది.ఇలాంటి చక్రధారులు సదా మాయ యొక్క అనేక రకాలైన చక్రాల నుండి ముక్తులుగా ఉంటారు. తమ దేహం యొక్క స్మృతి, అనేక వ్యర్ధ సంకల్పాల యొక్క చక్రాల నుండి, లౌకిక, అలౌకిక చక్రాల సంబంధం నుండి, తమ యొక్క అనేక జన్మల స్వభావ సంస్కారాల చక్రాల నుండి, ప్రకృతి యొక్క అనేక రకాల ఆకర్షణల యొక్క చక్రాల నుండి వారు సదా ముక్తులుగా ఉంటారు.వారు కేవలం స్వదర్శన చక్రం తప్ప మరే ఇతర చక్రంలోకి రారు. ఇతరాత్మలను కూడా బాబా నుండి ప్రాప్తించిన శక్తుల ద్వారా అనేక చక్రాల నుండి సహజంగానే విడిపిస్తారు. మాయ యొక్క అనేక రకాల చక్రాలకు గుర్తు ఏమిటి? ఎలాగైతే చక్రధారి ఆత్మ ప్రకాశ కిరీటధారిగా ఉంటుందో మరియు తండ్రి యొక్క వారసత్వానికి అధికారిగా ఉంటుందో అలాగే మాయ యొక్క అనేక రకాల చక్రాల్లోకి వచ్చేవారి గుర్తు ఏముంటుంది? ఎలాగైతే స్వదర్శన చక్రధారుల శిరస్సుపై ప్రకాశ కిరీటం ఉంటుందో అలాగే వీరి శిరస్సుపై అనేక రకాల విఘ్నాల యొక్క భారం ఉంటుంది.కిరీటం ఉండదు. సదా ఏదోక రకమైన భారం వారి శిరస్సుపై అనగా బుద్ధిలో అనుభవం అవుతుంటుంది. అటువంటి ఆత్మ సదా రుణగ్రస్తులుగా మరియు రోగగ్రస్తులుగా ఉంటారు. వారి మస్తకంలో మరియు నోటి ద్వారా సదా ప్రశ్నార్థకాలే ఉంటాయి. ప్రతి విషయంలో ఎందుకు?.ఏమిటి? మరియు ఏ విధంగా.. ఈ ప్రశ్నలే ఉంటాయి. ఒక్క సెకెండు కూడా బుద్ధి ఏకాగ్రంగా అనగా బిందురూప స్థితిలో ఉండదు. ఫుల్‌స్టాప్ కి గుర్తు - బిందువు, అనగా మనసులో కూడా బిందు స్వరూపం యొక్క స్థితి ఉండదు. వాచా మరియు కర్మణాలో కూడా జరిగిపోయిందేదో జరిగిపోయింది, కొత్తదేమీ కాదు, ఏదైతే జరుగుతుందో అది కళ్యాణకారి ఇలా... ఈవిధంగా పుల్‌స్టాప్ అనగా బిందువు పెట్టడం రాదు. ప్రశార్ధకం రాయడానికి వంకరగా ఉంటుంది. బిందువు రాయడం సహజంగా ఉంటుంది. రాయడానికి పుల్‌స్టాప్ కంటే క్వశ్చన్ మార్కు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా స్వయంతో లేదా ఇతరులతో లేదా బాబాతో అనేక రకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలాంటి గుర్తులున్న ఆత్మ స్వదర్శనచక్రధారి నుండి చక్రవర్తి అవ్వదు.
ఈవిధమైన ఆత్మ యొక్క ప్రతి సంకల్పంలో స్వయం గురించి కూడా ప్రశ్నలుంటాయి. నేను సఫలతామూర్తిగా కాగలనా? సర్వుల సంప్రదింపుల్లో నేను సఫలత పొంది సమీప ఆత్మగా అవుతానా? నేను అందరి స్వభావ సంస్కారాలతో నడవగలనా? అందరినీ సంతుష్టం చేయగలనా? ఈవిధంగా అనేక రకాల ప్రశ్నలు స్వయం గురించి ఉంటాయి మరియు ఇతరుల గురించి కూడా ఉంటాయి. వీరు నాతో ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నాకు విశేష సహయోగం ఎందుకు లభించడం లేదు? నాకు పేరు ప్రతిష్ఠలు ఎందుకు లభించడం లేదు?
ఈవిధంగా స్వయం గురించి ప్రశ్నలుంటాయి. అదేవిధంగా బాబా గురించి కూడా ప్రశ్నలుంటాయి. బాబా సర్వశక్తివంతుడైతే నా బుద్దిని ఎందుకు పరివర్తన చేయడం లేదు? దృష్టి ద్వారా అద్భుతం చేసేవారు నా వైపు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? తండ్రి అయినప్పుడు నేను ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా బాబా వాడినే కదా, బాధ్యత బాబాదే కదా, నన్ను దాటించాలి కదా, బాబా దాత అయినప్పుడు నేను ఏది అడిగితే అది ఎందుకు ఇవ్వడం లేదు? బాబా త్రికాలదర్శి, నా యొక్క మూడు కాలాల గురించి బాబాకు తెలిసినప్పుడు తన శక్తితో నాకు శ్రేష్ట పదవిని ఎందుకు ఇవ్వడం లేదు? ఈ విధంగా మధురాతి మధురమైన ఫిర్యాదులు బాబా ముందు పెడుతున్నారు. ఒక వైపు జన్మజన్మల భారం, రెండోవైపు తండ్రికి పిల్లలైన కారణంగా బాబా ద్వారా ప్రాప్తించిన సర్వ అధికారాలకు బదులివ్వాల్సిన కర్తవ్యం చేయని కారణంగా అనగా తమ విధి తాము నిర్వర్తించని కారణంగా రుణగ్రస్థులుగా అయిపోతున్నారు. ఈ రుణ భారం ఆత్మ యొక్క బలహీనతలన్నింటిని బయటకు తీసుకువస్తుంది. ఈ విధంగా డబల్ భారం కలిగిన వారు స్వదర్శన చక్రధారిగా ఏ విధంగా అవుతారు?
ఒకరు చక్రధారులు, రెండవ వారు - భారం కలిగిన వారు; ఇలాంటి భారం కలిగిన ఆత్మలు డబల్ లైట్ ధారిగా ఏ విధంగా అవుతారు? అనుభవం అవ్వడం లేదు, వారి నోటి నుండి మాటిమాటికి ఇదే మాట వస్తుంది. వింటారు నడుస్తారు కూడా, కాని ప్రాప్తి యొక్క గమ్యం కనిపించదు. చాలా కష్టం అనే మాట బాబా విన్నప్పుడు మరియు అలాంటి పిల్లల్ని చూసినప్పుడు బాబా ఏం చేస్తారు? నవ్వుకుంటారు. అయినా కానీ దయాహృదయులు కనుక తండ్రి సంబంధం ఉంది. కనుక మాటిమాటికి ధైర్యాన్ని మరియు ఉల్లాసాన్ని ఇస్తుంటారు - పిల్లలైన మీరే అనేక సార్లు విజయం పొందారు. ధైర్యం మీది సహాయం బాబాది నడుస్తూ ఉండండి. ఆగిపోకండి. కల్పం పూర్వం వలె మరలా విజయీలు అవ్వండి అని చెప్తారు. కేవలం ఒక్క సెకెండు అయినా కానీ సత్యమైన మనస్సుతో సర్వ సంబంధాలతో బాబాని స్మృతి చేయండి. ఆ ఒక్క సెకెనులో బాబా కలయిక అనుభూతి లేదా ప్రాప్తి రోజంతటిలో అనేకసార్లు మనల్ని అన్ని వైపుల నుండి దూరం చేసి బాబా వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది. ఎంత నిర్బలంగా ఉన్నా కాని ఒక్క సెకెనైతే స్మృతి చేయగలరు కదా? ఇలాంటి నిర్భల ఆత్మలు ఒక్క సెకెను సృతి చేసినా కానీ ఆ ధైర్యానికి బదులుగా బాబా వేల రెట్లు సహాయకారి అవుతారు. ఇంత కంటే సహజమైనది ఏముంటుంది? లేదా మీ తరపున యోగం కూడా బాబాయే చేయాలా? నాజూకు పిల్లలు కదా! నాజూకు పిల్లలు బాబాతో గారం చేస్తున్నారు. ఇలాంటి గారం కలవారిగా అవ్వకండి. రాజయుక్తులగా మరియు యుక్తియుక్తులుగా అవ్వండి. అర్ధమైందా! మంచిది.
ఈవిధంగా చక్రధారి నుండి చక్రవర్తిగా అయ్యేవారికి, స్వయాన్ని మరియు సర్వులను నిర్బలం నుండి మహా బలవాన్ గా తయారుచేసుకునేవారికి, సర్వ బలహీనతలను సెకెనులో సంకల్పంలో బలిచ్చేవారికి, మహాబలి అయ్యే మహాబలవాన్ అనగా మాస్టర్ సర్వశక్తులను శాస్ర్ర్తాల వలె కార్యంలో ఉపయోగించే కర్మయోగులకు కర్మయోగి, సహజయోగి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment