18-07-1974 అవ్యక్త మురళి

18-07-1974         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంపూర్ణ పవిత్ర వృత్తి మరియు దృష్టి ద్వారా శ్రేష్ట అదృష్టం యొక్క చిత్రం.

                   శ్రేష్ట అదృష్టం యొక్క చిత్రం తయారుచేసేటువంటి , సర్వాత్మల శుభచింతకుడు లేదా సదా కళ్యాణకారి పరమపిత శివపరమాత్మ మాట్లాడుతున్నారు --
                   ఈరోజు విశేషంగా మధువన నివాసీయుల యొక్క అదృష్ట రేఖను చూస్తున్నారు. ప్రతి ఒక్కరు శ్రీమతానుసారంగా, బాప్ దాదా యొక్క పాలన అనుసారంగా తమ అదృష్టం యొక్క రేఖను తయారుచేసుకుంటున్నారు. సదా మీ చిత్రాన్ని దర్పణంలో చూసుకుంటూ ఉంటున్నారా? అదృష్ట రేఖ యొక్క ముఖ్య విశేషతలు తెలుసా? స్థూల చిత్రం తయారు చేసేవారికి ఈ చిత్రం యొక్క విశేషత ఏయే విశేషతల ఆధారంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. స్థూలచిత్రం యొక్క ముఖ్య విశేషత, ఆకర్షణ లేదా విలువ వారి ముఖం ఆధారంగానే ఉంటుంది. ఏ చిత్రం అయినా చూస్తే అందరి దృష్టి మొదట వారి ముఖం వైపే వెళ్తుంది. ప్రతి చిత్రం యొక్క నయనాలు, ముఖమే ఆ చిత్రానికి విలువ. అలాగే అదృష్ట చిత్రం యొక్క విలువ ముఖ్యంగా ఏ విషయాల ఆధారంగా ఉంటుంది? వారి ముఖ్య విశేషతలు ఏమిటి? ఒకవేళ ఎవరైనా అదృష్ట చిత్రాన్ని చూసినప్పుడు ఏ విశేషతలు చూస్తారు?
                  అదృష్టం యొక్క చిత్రంలో మొదటి విశేషత ఇదే చూస్తారు - స్మృతి శక్తిశాలిగా అంటే సదా స్మృతి స్వరూపంగా ఉన్నారా? రెండవ విషయం - సదా సోదరులు అనే వృత్తి సదా స్థిరంగా ఉంటుందా? మూడవ విషయం - ఆత్మిక అంటే సంపూర్ణ పవిత్ర దృష్టి ఉందా? ముఖ్యంగా స్మృతి, వృత్తి మరియు దృష్టి ఈ మూడు విషయాలు చూస్తారు. ఈ మూడు శేషతల ఆధారంగానే దివ్యగుణాల శృంగారం లేదా మెరుపు మరియు నిశ్చయం చిత్రంలో కనిపిస్తాయి. ఒకవేళ ఈ మూడు విషయాలు యుక్తీయుక్తంగా లేదా శ్రేష్టంగా మరియు యదార్ధంగా ఉంటే అటువంటి అదృష్టచిత్రం స్వతహగానే సర్వాత్మలను తమ వైపు ఆకర్షితం చేస్తుంది. ఎలా అయితే స్థూల నేత్రాల యొక్క నయనాలు మార్గంలో వెళ్తున్న ఆత్మలను కూడా తమ వైపు ఆకర్షితం చేసుకుంటాయో అలాగే, ఈ అదృష్టం యొక్క చిత్రం కూడా సర్వాత్మలను తమ వైపు తప్పకుండా ఆకర్షితం చేసుకుంటాయి. ఎలా అయితే స్థూల దేహధారి చిత్రం దేహభిమానంలోకి తీసుకురావడానికి నిమిత్తం అవుతుంది. అనుకోనప్పటికీ ఆకర్షిస్తుంది. కచ్చా బ్రాహ్మణాత్మలను లేదా ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థీ ఆత్మలను కూడా ఆకర్షించి దేహభిమానిగా చేస్తుంది. మరలా ఫిర్యాదు చేస్తున్నారు. మార్గంలో నడుస్తున్నప్పుడు చైతన్య చిత్రాన్ని లేదా జడచిత్రాన్ని చూస్తూ ఆత్మాభిమానికి బదులు దేహభిమానిగా అయిపోతున్నారు. అలాగే ఆత్మిక చిత్రాన్ని ఆకర్షణీయంగా తయారుచేసుకుంటే నడుస్తూ, తిరుగుతూ అనేక ఆత్మలు దేహభిమానం నుండి తొలగిపోయి ఆత్మాభిమాని అయిపోతారు. స్థూల చిత్రాలలోనే అంత ఆకర్షణ ఉన్నప్పుడు, ఆత్మిక చైతన్య చిత్రాలైన మీలో ఇంత ఆత్మిక ఆకర్షణ ఉండదా? నా అదృష్టం యొక్క చిత్రం ఇప్పుడు ఎంత వరకు ఆకర్షణీయంగా తయారయ్యింది అని పరిశీలన చేసుకోండి. ఈ ఆత్మిక చిత్రంలో ఒకవేళ ఈ మూడు విశేష విషయాలలో ఒకటి అయినా తక్కువ అయితే అది విలువైనదిగా లెక్కించబడదు.ఎలా అయితే స్థూల చిత్రాలలో కూడా ముక్కు మరియు చెవి మొదలైన వాటిలో ఒకటైనా యదార్ధంగా లేకపోతే చిత్రం యొక్క విలువ తక్కువ అయిపోతుంది, చిత్రమంతా చాలా అందంగా తయారుచేసినా కానీ ముఖ్యంగా ముఖంలో కొద్దిగా లోపం వచ్చినా చిత్రం విలువలేనిదిగా అయిపోతుంది. మరలా దాని విలువ సగానికి అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ విశేషతలలో ఒకటి అయినా లోపంగా ఉంటే ప్రాలబ్దం లేదా ప్రాప్తి యొక్క సమయం కూడా సగం అయిపోతుంది. అంటే 16 కళల నుండి 14 కళలోకి వచ్చేస్తే సగం విలువ అయినట్లే కదా? అందువలన మూడు విషయాలను ప్రతి సమయం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇలా పరిశీలన చేసుకుంటున్నారా?
                       పరిశీలన యొక్క యంత్రం ఏమిటో తెలుసా? యంత్రం ద్వారానే పరిశీలన చేస్తారు కదా! స్వయాన్ని పరిశీలన చేసుకునే యంత్రం ఏమిటి? యంత్రం బుద్ది. కానీ దివ్యబుద్ధి యొక్క యంత్రం బ్రాహ్మణులుగా అవ్వటంతోనే ఇస్తున్నారు. ఎలా అయితే లౌకిక కులంలో అక్కడ జన్మ తీసుకుంటూనే యుద్ధంలో లేదా హింసలో ప్రవీణులుగా చేసేటందుకు చిన్నతనం నుండి కత్తికి బదులు చాకు లేదా కర్ర తిప్పటం నేర్పిస్తారు. దీని ద్వారా వారికి తమ బలమైన కులం యొక్క స్మృతి ఉంటుంది. బాప్ దాదా కూడా ప్రతి బ్రాహ్మణాత్మకు మాయా యుద్ధం నుండి రక్షించుకునేటందుకు ఈ దివ్యబుద్ధి యొక్క నేత్రాన్ని ఇస్తున్నారు. కానీ దివ్యబుద్ధికి బదులు ఎప్పుడైతే సాధారణ లౌకిక బుద్ది వారిగా అయిపోతున్నారో, అప్పుడు మాయను పరిశీలించలేకపోతున్నారు. లేదా మాయా యుద్ధం నుండి రక్షించుకోలేకపోతున్నారు మరియు స్వయాన్ని పరిశీలన చేసుకోలేకపోతున్నారు. మొదట దివ్యబుద్ధి రూపి నేత్రం మా దగ్గర స్థిరంగా ఉందా? అని పరిశీలన చేసుకోండి. ఎక్కడైనా దివ్యబుద్ధి రూపి నేత్రంపై మాయా సాంగత్యదోషం లేదా వాతావరణం యొక్క ప్రభావశాలి యుద్ధంలో ఉండటం లేదు కదా? ఏ లోపం అయితే చేయటం లేదు కదా? అని అడగండి.
                      శ్రేష్ఠ అదృష్టాన్ని తయారుచేసుకునేటందుకు ముఖ్యమైన మూడు విశేషతలు నింపుకునేటందుకు మూడు మాటలు స్మృతి ఉంచుకోండి. 1.నిర్వాణ స్థితిలో ఉండాలి 2. నిర్మాణంగా అవ్వాలి 3. నిర్మాణం చేయాలి. నిర్వాణం, నిర్మాణం మరియు నిర్మానం అంటే గౌరవానికి అతీతంగా ఉండాలి. ఈ మూడు మాటలు స్మృతి ఉంచుకుంటే అదృష్టం యొక్క చిత్రం ఆకర్షణీయంగా అవుతుంది. నడుస్తూ, నడుస్తూ ఈ మూడు విషయాలలో లోపం వచ్చేస్తుంది. నిర్వాణ స్థితిలో తక్కువగా ఉంటున్నారు. వాణీలోకి సహజంగా మరియు అభిరుచితో వస్తున్నారు. ఎంత మాటలపై సంలగ్నత ఉందో, అంతగా మాటలకు అతీతమయ్యే స్థితిలో స్థితులయ్యే సంలగ్నత లేదా రసం తక్కువగా అనుభవం చేసుకుంటున్నారు. నిర్మానంగా అవ్వడానికి బదులు అనేక రకాలైన గౌరవాలను అంటే దేహం యొక్క, పొజిషన్ యొక్క, గుణాల యొక్క, సేవ యొక్క, సఫలత యొక్క గౌరవాలను సహజంగా స్వీకరించే కోరికలో ఉంటున్నారు. మీరు గౌరవం
యొక్క కోరికలో ఉన్నారు. కనుకనే స్వమానం యొక్క కోర్స్ ను ఇప్పటి వరకు చేయలేదు. ఎప్పుడైతే ఈ జిజ్ఞాస యొక్క రూపం సమాప్తి అవుతుందో, అప్పుడే స్వమానం యొక్క స్థితిలో సదా మరియు స్వతహగా ఉండగలరు. గౌరవం స్వమానాన్ని మరిపింపచేస్తుంది. అలాగే నవ నిర్మాణం అంటే స్థాపనకు బదులు వినాశనం చేస్తారు. అంటే నవ నిర్మాణానికి బదులు అప్పుడప్పుడు ఎవరోకరి స్థితిని క్రిందికి తీసుకురావడానికి నిమిత్తం అవుతారు. సదా ప్రతి కర్మలో మరియు ప్రతి సంకల్పంలో పరిశీలన చేసుకోండి - ఈ సంకల్పం, మాట లేదా కర్మ నవ నిర్మాణానికి నిమిత్తంగా ఉందా? అని. ఇటువంటి స్థితిని తయారుచేసుకోవటం ద్వారా సర్వ విశేషతలు స్వతహగానే వస్తాయి. ఇది వర్తమాన సమయంలో పురుషార్థాన్ని తీవ్రం చేసుకునే యుక్తి.
                    మధువన నివాసీయుల ఫలితం మంచిగా ఉంది. చాలా మంది స్నేహం మరియు సహయోగంతో అలసిపోని సేవాధారులుగా ఉన్నారు మరియు ఇక ముందు కూడా ఉంటారు. బాప్ దాదా యొక్క మహిమ చేస్తున్న కారణంగా మహిమాయోగ్యంగా అయితే అయ్యారు. ఇక ముందు ఏమి చేయాలి? మధువన నివాసీయుల నుండి మరియు అందరి నుండి విశేష వ్రతం తీసుకోవాలి. అది ఏమిటి? ఆ వ్రతం ఏమిటంటే మనమంతా ఒకే మతం, ఒకనివారము, శ్రేష్ట వృత్తి, ఒకే ఆత్మిక దృష్టి మరియు ఏకరస స్థితిలో ఒకరికొకరు సహయోగిగా అయ్యి శుభ చింతకులుగా అయ్యి, శుభభావన మరియు శుభకామన పెట్టుకుంటూ మరియు అనేక సంస్కారాలు ఉన్నప్పటికీ ఒకే బాబా సమానంగా సతో ప్రధాన సంస్కారం మరియు స్వ భావంలో ఉండేటువంటి స్వభావాన్ని తయారు చేసుకునే కోటను గట్టిగా చేసుకుంటాను అని. ఇదే వ్రతం. స్వయం పట్ల లేదా సర్వాత్మల పట్ల ఈ వ్రతం తీసుకునే ధైర్యం ఉందా? స్వయం పట్ల అయితే కుటుంబంలో ఉండేవారు లేదా ఈ వాతావరణంలో ఉండేవారు కూడా చేస్తారు. మధువన నివాసీయులు కేవలం స్వయం పట్ల చేయటం కాదు, వెనువెంట సంఘటన గురించి కూడా వ్రతం తీసుకునే ధైర్యం ఉండాలి. ఇదే మధువన వరదాని భూమి యొక్క విశేషత.
                    ఎలా అయితే ఇప్పుడు ధైర్యం యొక్క ప్రత్యక్షఫలం చూపించారో అలాగే ఒకరికొకరు జాగ్రత్తగా ఉంటూ మరియు ఒకరికొకరు సహయోగి అవుతూ ఉంటే ఈ వ్రతాన్ని సాకారంలోకి తీసుకురావటంలో సఫలులు అయిపోతారు. ఎలా అయితే ఇతర జోన్ల వారికి విశేష సేవ యొక్క ఋజువు చూపించమని చెప్పారో, అలాగే మధువన నివాసీయులు కూడా ఈ వ్రతానికి ఋజువు చూపించాలి. దీని ఆధారంగానే జనవరిలో బహుమతి లభిస్తుంది. ఇంత సమయంలో ఋజువు చూపించటం కష్టమా? సాకార రూపం ద్వారా లేదా అవ్యక్త రూపం ద్వారా శిక్షణ మరియు స్నేహం యొక్క పాలన ఎంత సమయం తీసుకున్నారు? పాలన తీసుకున్న తర్వాత అనేకాత్మలకు పాలన ఇవ్వడానికి నిమిత్తం అవుతారు. ఇలా పాలన ఇవ్వడానికి నిమిత్తంగా అయ్యారా లేక ఇప్పటి వరకు తీసుకునేవారిగానే ఉన్నారా? ఇప్పుడు పాతవారిని మరియు వచ్చేటువంటి క్రొత్త పిల్లలను పాలన చేయాలి. అంటే మీ శిక్షణా స్వరూపం ద్వారా మరియు స్నేహం ద్వారా వారికి స్వయం ముందుకు వెళ్ళటంలో సహయోగి అవ్వాలి మరియు ఈ కార్యంలో రాత్రి, పగలు బిజీగా ఉండాలి. ఈ అవ్యక్త పాత్ర కూడా విశేషంగా క్రొత్తవారికోసమే మరియు పాతవారైతే ఇప్పుడు బాబా సమానంగా అయ్యి క్రొత్త ఆత్మలకు ధైర్యం మరియు ఉల్లాసాన్ని పెంచాలి. ఎలా అయితే బాప్ దాదా పిల్లలను తన కంటే ముందు ఉంచుతూ తన కంటే ఉన్నతంగా తయారుచేసారో, అలాగే పాతవారి పని ఏమిటంటే క్రొత్తవారిని మీ కంటే ముందుకు తీసుకువెళ్ళే ఋజువు చూపించాలి. మరియు అన్ని శిక్షణలను సాకార స్వరూపంలో చూపించాలి. పాలన యొక్క ప్రత్యక్ష రూపాన్ని బదులుగా ఇవ్వాలి.
                     ఇలా సుపుత్రులైన పిల్లలకు, మీ అదృష్టం యొక్క చిత్రాన్ని మీ ధారణల ద్వారా చూపించేవారికి, సదా మూల మంత్రాన్ని మరియు యంత్రాన్ని కర్తవ్యంలోకి తీసుకువచ్చేవారికి, బాప్ దాదా సమానంగా ప్రతి సెకను మరియు ప్రతి సంకల్పం సర్వాత్మల కళ్యాణం పట్ల ఉపయోగించేవారికి, సదా స్వ భావంతో ఉండేవారికి, బాప్ దాదా సమానంగా శ్రేష్ట సంస్కారాన్ని అంటే అనాది, ఆది సంస్కారాలను ప్రత్యక్ష రూపంలోకి తీసుకువచ్చేవారికి, ప్రతి సంకల్పం మరియు ప్రతి సమయాన్ని సఫలం చేసుకునే సఫలతామూర్తి సితారలకు బాప్ దాదా యొక్క ప్రియస్వతులు, శుభరాత్రి మరియు నమస్తే.

Comments