18-04-1977 అవ్యక్త మురళి

18-04-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

యోగ్యశిక్షకుని యొక్క ప్రతి కర్మ రూపి బీజం ఫలదాయకంగా ఉంటుంది, నిష్పలం అవ్వదు.

                    సేవాకేంద్రాలకు నిమిత్తమైన అక్కయ్యలతో బాబా మాట్లాడుతున్నారు -
            టీచర్స్ అంటే శిక్షకులు. శిక్షకులు అంటే అర్థం ఏమిటి? శిక్షకులు అంటే శిక్షణా స్వరూపులు. ఉన్నతోన్నతమైన శిక్షణ ఇచ్చే సహజ సాధనం ఏమిటి? అనేక రకాలైన శిక్షణలు ఇచ్చే సాధనాలు ఉంటాయి కదా! శిక్షణ ఇచ్చేటువంటి సహజ సాధనం ఏమిటి? స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వాలి, నోటి ద్వారా కాదు. సాకార బాబా అన్నింటికంటే సహజ సాధనమైన స్వరూపం ద్వారా శిక్షణ  ఇచ్చారు కదా! కేవలం మాటలతో కాదు, కర్మతో ఇవ్వాలి. వారు నేర్చుకుంటారు అనటం కాదు. కాని నేను ఏది చేస్తానో అది చూసి ఇతరులు కూడా చేస్తారు, ఇదే మంత్రం కనుక అన్నింటికంటే సహజమైన పద్దతి - స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వటం. ఎవరికి ఎంతగా మీరు ఆత్మ, మీరు శాంత స్వరూపులు అని చెప్పినా స్వయం మీరు ఎప్పటి వరకు ఆ స్వరూపంలో స్థితులవ్వరో అప్పటి వరకు వారు అర్థం చేసుకోరు. ఇలా అనుభవం యొక్క చదువు చదువుకునే వారిని ఎవరు ఓడించలేరు. ఇలా చదువు అవినాశిగా అయిపోతుంది. కనుక ఎలా శిక్షణ ఇస్తారు? మాటలతోనా లేక స్వరూపంతోనా?
            ప్రతి అడుగు ద్వారా అనేకాత్మలకు శిక్షణ ఇవ్వటమే యోగ్య టీచరుగా అవ్వటం. ఉపన్యాసం  ద్వారా లేదా 7 రోజుల కోర్స్ ద్వారా శిక్షణా స్వరూపంగా తయారుచేయాలి. అటువంటి శిక్షకుల ప్రతి మాటను వాక్యం కాదు, మహావాక్యం అని అంటారు. ఎందుకంటే ప్రతి మాట మహాన్ గా తయారు చేసేదిగా ఉంటుంది. కనుక మహావాక్యం అని అంటారు. ప్రతి కర్మ అనేకాత్మలను శ్రేష్ఠముగా తయారుచేసే ఫలం ఇచ్చేదిగా ఉంటుంది. కర్మని బీజం అని అంటారు మరియు ఫలితాన్ని కర్మఫలం అని అంటారు. ఇటువంటి శిక్షకుల కర్మ రూపి బీజం ఫలదాయకంగా ఉంటుంది. నిష్పలంగా ఉండదు. వీరినే యోగ్యశిక్షకులు అని అంటారు. వారి ప్రతి సంకల్పం ఎలా అయితే బ్రహ్మ యొక్క సంకల్పానికి ఒక సంకల్పం ద్వారా క్రొత్త సృష్టి రచించబడింది అని మహిమ ఉందో అలాగే అటువంటి శిక్షకుల సంకల్పం, క్రొత్త సృష్టికి అధికారిగా చేసేదిగా ఉంటుంది. ఇదే శిక్షకుల పరిభాష. అర్థమైందా!
            టీచరుకు ఒక లిఫ్ట్ యొక్క గిఫ్ట్ కూడా ఉంది. అది ఏమిటి? టీచర్స్ గా అవ్వటం అంటే పాత సంబంధాలను త్యాగం చేయటం. టీచరు ఈ త్యాగానికి భాగ్యం యొక్క లిఫ్ట్ యొక్క గిఫ్ట్  లభిస్తుంది. మొదటి త్యాగం అయితే చేసారు కదా! మొదట త్యాగం సంబంధాల త్యాగం ఇదైతే  చేసారు కదా! ఇక ముందు కూడా త్యాగం యొక్క లిఫ్ట్ చాలా ఉంది. కానీ ఈ త్యాగం యొక్క  ధైర్యం పెట్టుకున్నందుకు, సహయోగిగా అవ్వాలనే సంకల్పం చేసినందుకు ఈ లిఫ్ట్ యే  గిఫ్ట్ గా అవుతుంది. కానీ సంపూర్ణ త్యాగిగా అయ్యి బాబాకి బహుమతిగా, విశ్వానికి లిఫ్ట్ అయిపోండి. ఎవరు కూర్చున్నా కూర్చోగానే చేరుకోవాలి, శ్రమ అనిపించకూడదు అటువంటి లిఫ్ట్ గా  అవ్వండి. టీచర్లకు అవకాశం చాలా ఉంది కానీ తీసుకునేవారు తీసుకోవాలి. టీచర్స్ గా అయ్యే భాగ్యం గురించి అందరు వర్ణన చేస్తూ కోరిక కూడా పెట్టుకుంటారు. కోరిక పెట్టుకోవటం కూడా శ్రేష్ఠ భాగ్యం కదా! దానిని సదా శ్రేష్ఠముగా ఉంచుకోవటంలో ప్రతి ఒక్కరు నెంబర్ అనుసరించి ఉంటారు. టీచర్స్ ఎంతగా కావాలంటే అంతగా తమ భవిష్యత్తుని ఉజ్వలంగా తయారు చేసుకోవచ్చు కాని యోగ్య టీచర్సే తయారు చేసుకోగలరు. కొద్దిలో సంతోషపడే టీచర్ కాదు కదా? బాప్  దాదా టీచరును  ఏ దృష్టితో చూస్తారు? సహయోగుల దృష్టితో చూస్తారు. సహయోగులను చూసి సంతోషపడతారు కదా! టీచర్స్ సదా సంతుష్టంగా ఉంటారు. అడగటం అంటే సహయోగిని అగౌరవ పరిచినట్లు. మంచిది.

Comments