18-04-1971 అవ్యక్త మురళి

 * 18-04-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“మనోభావాలను తెలుసుకొనేందుకు విధి మరియు లాభాలు."

           ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో, వారందరూ మన్మనాభవ స్థితిలో స్థితులయ్యారా? ఎవరైతే మన్మనాభవ స్థితిలో స్థితులవుతారో వారు ఇతరుల మనోభావాలను తెలుసుకోగలరు. ఏ వ్యక్తి అయినా మీ ఎదురుగా వచ్చినట్లయితే మన్మనాభవ స్థితిలో ఉండి వారి మనసులోని భావమును స్పష్టముగా తెలుసుకోగలరా? ఎందుకంటే మన్మనాభవ స్థితి సూక్ష్మ స్థితిగా అయినట్లయితే సూక్ష్మ స్థితి మరియు సూక్ష్మ భావమును తెలుసుకోగలరు. కావున ఈ అభ్యాసము అనుభవములోకి వస్తూ ఉంటుంది. మాటలు ఏవైనా గానీ ఎవరి భావము ఏమిటి అన్నదానిని తెలుసుకొనే అభ్యాసమును చేస్తూ ఉండండి. ఎవరి మనసులోని భావమునైనా తెలుసుకుంటూ పోయినప్పుడు దాని రిజల్టు ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరి మనసులోని భావాన్ని తెలుసుకోవటం ద్వారా వారి ఇష్టము, లేక ప్రాప్తి పట్ల వారి కోరిక ఏదైతే ఉందో అదే వారికి లభించటం ద్వారా ఏమౌతుంది? మీరు వారిని ఎలా తయారుచేయాలనుకుంటే వారు అలా తయారైపోతారు అనగా సేవా సఫలత చాలా త్వరగా వెలువడుతుంది ఎందుకంటే వారి కోరిక ప్రమాణంగా వారికి ప్రాప్తి కలిగింది. ఒకవేళ ఎవరికైనా శాంతి కావాలన్న దాహం ఉండి, వారికి శాంతి లభించేసినట్లయితే ఏమౌతుంది? ప్రాప్తి ద్వారా అవినాశీ పురుషార్థిగా అయిపోతారు. కావున మనసులోని భావాన్ని గమనించటం ద్వారా, తెలుసుకోవటం ద్వారా పరిణామము ఏమి వెలువడుతుంది? కొద్ది సమయంలోనే సేవా సఫలత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సఫలతా స్వరూపులుగా అయిపోతారు. ఇప్పుడు పురుషార్థ స్వరూపులుగా ఉన్నారు. ఈ లక్షణము రావటం ద్వారా సఫలతా స్వరూపులుగా అయిపోతారు. అర్థమైందా!

           ఇప్పుడు సఫలతను తీసుకువచ్చేందుకు మీరు చాలా సమయము మరియు సంకల్పము, సంపత్తి,  శక్తిని పెట్టవలసి వస్తుంది మళ్ళీ తరువాత ఏమౌతుంది? సఫలత స్వయంగా మీ ఎదురుగా వస్తుంది. సంపత్తిని పెట్టవలసిన అవసరము ఉండదు. సంపత్తి మీ ఎదురుగా స్వయం స్వాహా అయ్యేందుకు వస్తుంది. అర్థమైందా! కేవలము ఒక్క విషయపు ధారణ ద్వారా ఇంతటి మార్పు ఉంది, అది ఏ విషయము? మన్మనాభవులుగా అయ్యి ప్రతి ఒక్కరి మనోభావమును తెలుసుకోవటము.

           ప్రకృతి దాసిగా అవుతుంది అన్న గాయనము ఉంది, అది సత్యయుగములోనే అవుతుందా? సత్యయుగములో అయితే ప్రకృతిపై విజయాన్ని పొందటం ద్వారా ప్రాప్తి లభించింది అన్న విషయమే తెలియదు. కానీ ప్రకృతిపై విజయులుగా అయ్యేందుకు ఇప్పుడు పురుషార్థమునేదైతే చేస్తున్నారో, దానిపై విజయము యొక్క ఫలితము లేక ప్రాప్తి అన్నవాటిని ఈ శ్రేష్ఠ జన్మలోనే చూస్తారు. మీ ఎదురుగా ప్రకృతి మిమ్మల్ని అధీనులుగా చెయ్యదు, కానీ అధికారులుగా అయ్యి ప్రకృతి కర్తవ్యమును చూస్తారు. అర్థమైందా! ఎవరిలోనైతే ఏవిధమైన అధీనతా లేనటువంటి సంపూర్ణ స్థితి ఉంటుందో, వారు సర్వులపై అధికారమును అనుభవము చేస్తారు. అలా తయారయ్యేందుకు ఏం చెయ్యవలసి ఉంటుంది? ఒకటి-ఆత్మికత, రెండవది-ముఖముపై ఎల్లప్పుడూ ఈశ్వరీయ రుహాబ్(ఆత్మిక నషా యొక్క శక్తి) కనిపించాలి మరియు మూడవది-సేవలో ఎల్లప్పుడూ దయాహృదయపు సంస్కారము లేక గుణము ప్రతి ఆత్మకు ప్రత్యక్షంగా అనుభవమవ్వాలి. మూడు విషయాలు- ఆత్మికత, ఆత్మిక నషా యొక్క శక్తి మరియు దయాహృదయపు గుణము - ఈ మూడు విషయాలు ప్రత్యక్ష రూపంలో, స్థితిలో, ముఖములో, మరియు సేవలో అనగా కర్మలో కనిపించాలి, ఇప్పుడు సఫలత మా సమీపంగా వస్తూ ఉంది అని అప్పుడు భావించండి. మూడూ కలిసి ఉండాలి. ఇప్పుడేమౌతుంది? ఒక వేళ దయాహృదయులుగా అయినట్లయితే దయాహృదయముతో పాటు రుహాబ్(నషా)కూడా ఏదైతే కనిపించాల్సి ఉందో, ఈ రెండూ తోడుగా కనిపించటం లేదు. దయాహృదయమన్నా కనిపిస్తుంది లేకపోతే నషా అన్నా కనిపిస్తుంది. రుహాబ్ తో పాటు ఆత్మికత కూడా కనిపించాలి. మూడూ కలిసి ప్రత్యక్ష రూపంలో ఉండాలి. అది ఇప్పటికి తక్కువగా ఉంది, అభ్యాసులుగా ఉన్నారు. ఇప్పుడు కేవలము మిమ్మల్ని మీరూ సర్వాత్మల కంటే మహాన్ ఆత్మలుగా భావిస్తారు. మహాన్ ఆత్మగా అయ్యి ప్రతి సంకల్పము మరియు ప్రతి కర్మను చేస్తున్నారా? లక్ష్యాన్ని తెలుసుకోవాలి మరియు చెయ్యాలి, అదే ప్రాక్టికల్. ఆత్మలందరి కంటే శ్రేష్ఠమైన మహాన్ ఆత్మను, ఈ స్మృతి ద్వారా ఎవరి ముందుకైనా వెళ్ళినట్లయితే ఏమి అనుభవం చేసుకుంటారు? మీ మహానత ముందు అందరూ తల  వంచుతారు. ఈ కలియుగములోని ఎంతటివారైనా, ఎంత గొప్ప పదవి కలవారైనా మీ జడమైన చిత్రాల ముందుకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? తల వంచుతారు. చిత్రాల ముందే తల వంచినప్పుడు చైతన్యమైన చరిత్రవంతులు, సర్వ గుణాలలో తండ్రి సమానులైన చైతన్యమూర్తుల ముందు తల వంచరా? లేక ఈ రిజల్టు భవిష్యత్తుకు చెందినదని భావిస్తున్నారా?

          ఇప్పుడు జరగాలా? ఎప్పుడు? అంతిమమునకు కూడా ఎంత సమయము మిగిలి ఉంది? ఒకవేళ మీరు వంగి, వంగేటట్లు చేస్తే అది ఏమంత పెద్ద విషయము? సేవ కారణంగా వంగవలసి వస్తుంది అన్న లక్ష్యమునేదైతే ఉంచుకుంటారో ఆ లక్ష్యము సరైనది కాదు, తప్పు. ఈ లక్ష్యములోనే బలహీనత నిండి ఉంది. బీజమే బలహీనంగా ఉన్నట్లయితే ఫలాలు ఎటువంటివి వెలువడుతాయి? నూతన స్థాపన చేసేవారు ఎవరూ కొంత వంగి ఉండి చెయ్యాలి అనైతే ఆలోచించరు. ఆత్మలు కూడా ఎప్పుడైతే వంగి ఉండే లక్ష్యాన్ని ఉంచుకొని అనేకమందిని తమ ముందు వంగి ఉండేటట్లుగా చేసి చూపిస్తారు, దీనితో పోలిస్తే చూడండి ఈ స్థాపన కార్యము ఎంత ఉన్నతమైనది మరియు ఎవరి మతంపై ఉంది? వారి ముందు సర్వ ఆత్మలూ వంగాలి అన్న లక్ష్యమును ఉంచుకొని, ఈ ఈశ్వరీయ హుందాతనమును ధారణ చేసి ఎవరి ముందుకయినా వెళ్ళినట్లయితే ఎటువంటి రిజల్టు వెలువడుతుందో అప్పుడు చూడండి.

           మహానతను తీసుకువచ్చేందుకు జ్ఞానపు మహీనత(సూక్ష్మత)లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఎంతెంతగా జ్ఞానపు మహీనతలోకి వెళ్తారో అంతగా మిమ్మల్ని మీరు మహానులుగా తయారుచేసుకోగలరు. మహానత తక్కువగా ఉంది అంటే - జ్ఞానపు మహీనత యొక్క అనుభవజ్ఞులుగా తక్కువగా ఉన్నట్లు, కావున మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - మహాన్ ఆత్మల కర్తవ్యము ఏముంటుంది - అన్నది స్మృతిలో ఉంచుకోండి. ఎవరైతే మహాన్ కర్తవ్యమును చేసి చూపిస్తారో వారినే మహాన్ ఆత్మ అని అంటారు. ఒకవేళ ఎవరైనా సాధారణ కర్తవ్యమును చేసినట్లయితే వారిని మహాన్ ఆత్మ అని అనరు. కావున మహాన్ ఆత్మల కర్తవ్యము కూడా గొప్పగా ఉండాలి. మొత్తము రోజంతటి దినచర్యలో- మహాన్ ఆత్మగా అయ్యే విషయంగా మొత్తము రోజులో ఇప్పుడు ఏ మహాన్ కర్తవ్యమును చేసాను? మహాదానిగా అయ్యానా? అని పరిశీలించుకోండి. మామూలుగా కూడా మహాన్ ఆత్మల కర్తవ్యము దానపుణ్యాలు చెయ్యటముగా ఉంటుంది. కావున వీరు అందరి కంటే మహాన్ ఆత్మలు అని పిలవబడేవారు. మరి ఈ రోజంతటిలో ఎంతమందికి దానమును ఇచ్చాను మరియు ఏ దానమును ఇచ్చాను? అని పరిశీలించుకోండి. ఏవిధంగా మహాన్ ఆత్మల భోజనము, ఆహారపానీయాలు మొదలగునవన్నీ గొప్పగా ఉంటాయో అలా మిమ్మల్ని మీరు చూసుకోవాలి - ఈరోజు మా బుద్ధి భోజనము మహాన్ గా ఉందా? శుద్ధమైన భోజనాన్ని స్వీకరించానా? మహాన్ ఆత్మలుగా పిలువబడే వారు అశుద్ధ భోజనాన్ని స్వీకరించినట్లయితే వారిని చూసి అందరూ ఏమంటారు? వీరు మహాన్ ఆత్మలేనా? అని అంటారు. కావున ఈరోజు మేము బుద్ధి ద్వారా ఎటువంటి అశుద్ధ సంకల్పాల భోజనమునైతే తినలేదు కదా అని మీకు మీరే పరిశీలించుకోండి. మహాన్ ఆత్మల ఆహార విహారాలను అందరూ చూస్తారు. ఈ రోజు మొత్తం దినంలో బుద్ధికి ఆహారంగా ఏముంది? ఒకవేళ ఏదైనా అశుద్ధ సంకల్పము లేక వికల్పము లేక వ్యర్థ సంకల్పమునైనా బుద్ధి గ్రహించినట్లయితే ఈరోజు నా ఆహారంలో అశుద్ధత పడింది అని భావించండి. మహాన్ ఆత్మలుగా ఎవరైతే ఉంటారో వారి ప్రతి వ్యవహారములో అనగా నడవడికలో సర్వ ఆత్మలకు సుఖమనే దానాన్ని ఇచ్చే లక్ష్యము ఉంటుంది. వారు సుఖాన్ని ఇస్తారు మరియు సుఖాన్ని తీసుకుంటారు. కావున ఆవిధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - మహాన్ ఆత్మ లెక్కతో ఈ రోజు ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వటం గానీ లేక తీసుకోవటం గానీ చెయ్యలేదు కదా? పుణ్య కార్యమంటే ఏమిటి? పుణ్యము అనగా ఎవరికైనా ఎటువంటి వస్తువును ఇవ్వాలంటే, దాని ద్వారా ఆ ఆత్మ నుండి ఆశీర్వాదాలు వెలువడాలి, దీనినే పుణ్య కర్తవ్యము అని అంటారు. ఎవరికైతే సుఖాన్ని ఇస్తారో వారి లోపల నుండి మీ పట్ల ఆశీర్వాదాలు వెలువడుతాయి. కావున ఇదే పుణ్య కార్యము. మరొక ముఖ్య లక్షణము అహింస. మీరు రోజు మొత్తంలో - ఎటువంటి హింసనూ చెయ్యలేదు కదా? అని కూడా పరిశీలించుకోవాలి. ఎటువంటి హింస ఉంటుంది అన్నదానిని పరిశీలించుకోవాలి. మిమ్మల్ని మీరు డబుల్ అహింసకులు అని పిలిచుకుంటారు కదా! మనస్సులో మీ సంస్కారాలతో చాలా యుద్ధము కూడా నడుస్తుంటుంది, అంటే మాయను చంపే హింసను చేస్తారు కదా! యుద్ధము ఉన్నా గానీ దీనిని అహింస అని ఎందుకని అంటారు? ఎందుకంటే ఈ యుద్ధ పరిణామంగా సుఖము మరియు శాంతి వెలువడుతాయి. హింస అనగా దాని ద్వారా దుఃఖ-అశాంతుల ప్రాప్తి ఉంటుంది. కానీ దీని ద్వారా శాంతి మరియు సుఖపు లేక కల్యాణపు ప్రాప్తి ఉంటుంది, కావుననే దీనిని హింస అని అనరు. కావున డబుల్ అహింసకులుగా అయ్యారు. కావున మహాన్ ఆత్మల లక్షణమేదైతే గాయనముందో దానిని కూడా చూడాలి. రోజు మొత్తంలో ఏవిధమైన హింసను చెయ్యలేదు కదా? ఒకవేళ ఏవైనా మాటల ద్వారా ఎవరి స్థితినైనా క్రింద మీద చేసినట్లయితే అది కూడా హింసే అవుతుంది. ఏదైనా బాణము ద్వారా ఎవరినైనా గాయపరచటము హింసే అవుతుంది, అదే విధంగా .. ఒకవేళ ఏవైనా మాటల ద్వారా ఎవరి ఈశ్వరీయ స్థితినైనా అస్థిరం చేసినట్లయితే అనగా గాయపరిచినట్లయితే అది హింసే అవుతుంది కదా! ఆత్మకున్న అసలైన సతో ప్రధాన సంస్కారమును లేక మీ ఒరిజనల్ ఈశ్వరీయ సంస్కారమును అణచివేసి, వేరే సంస్కారములను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చినట్లయితే, ఎవరి గొంతునైనా నొక్కేస్తే, అది హింసగా పరిగణింపబడుతుంది, ఇది కూడా అలాంటిది. కావున మీ ఒరిజినల్ మరియు సతో ప్రధాన స్థితి యొక్క సంస్కారమును అణచివెయ్యటము, ఇది కూడా హింసయే.

           కావున ఈ అన్ని లక్షణాలూ ఎంతవరకు ప్రాక్టికల్ లో ఉన్నాయి అన్నదానిని పరిశీలించుకోవాలి. మహాన్ ఆత్మల లక్షణము ఏమిటో ఇప్పుడు అర్థమైందా? మొత్తము రోజంతా దానమును కూడా చేస్తూ ఉండండి, పుణ్యకర్మ కూడా చెయ్యండి మరియు అహింసకులుగా కూడా అవ్వండి. మరి స్థితి ఎలా అవుతుందో చెప్పండి? అప్పుడిక అటువంటి మహీనతలోకి వెళ్ళే సంపూర్ణ స్థితిలో స్థితులై ఉండే మహాన్ ఆత్మల ముందు అందరూ తప్పకుండా శిరస్సు(తల) వంచుతారు. స్థూలమైన శిరస్సును వంచుతారా? అన్నింటికంటే పైన శిరస్సు ఉంటుంది. తల వంచటము అనగా మొత్తం వంచటము. కావున ఈ రోజుల్లో ఎవరైతే తమను తాము ఉన్నతమైన మహాన్ ఆత్మలని భావిస్తారో లేక తమ కర్తవ్యమును ఉన్నతమైనది, గొప్పది అని భావిస్తారో వారు శిరస్సును వంచుతారు, అనగా ఈ శ్రేష్ఠ కర్తవ్యము ముందు మనందరి కర్తవ్యము అసలు గొప్పదేమీ కాదు అని అనుభవము చేస్తారు. తమ శ్రేష్ఠతను శ్రేష్ఠముగా భావించకుండా సాధారణముగా భావించినట్లయితే దీనినే సర్వ ఆత్మలు మీ ముందు శిరస్సు వంచుతారు అని అంటారు. ఇప్పుడు అర్థమైందా ఏం పరిశీలించుకోవాలో? మొత్తము రోజంతటిలో మహాన్ ఆత్మల మహాన్ కర్తవ్యములు లేక లక్షణములు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చాను? అని పరిశీలించుకోవాలి. తరువాత దీని రిజల్టును అడుగుతాము.

           మీరు త్రిమూర్తి తండ్రి పిల్లలు, కావున మీ నుండి త్రిమూర్తి లైట్ కనిపించాలని ఇంతకుముందు వినిపించాము కదా అనగా మీ ప్రతి ఒక్కరి ద్వారా మూడు లైట్ల సాక్షాత్కారము జరగాలి. మీ ముందుకు ఎవరు వచ్చినా, ఒకటి మస్తకము నుండి మణి కనిపించాలి, రెండవది రెండు నయనాల నుండి ఎటువంటి అనుభవమవ్వాలంటే రెండు బల్బులు వెలుగుతూ ఉన్నట్లుగా అనిపించాలి మరియు  మూడవది మస్తకముపై ప్రకాశ కిరీటము కనిపించాలి. ఈ మూడు లైట్ సాక్షాత్కారము జరగాలి చాలామందికి ఇలా ఉంటుంది కూడా, స్మృతియాత్రలో కూర్చోపెట్టినప్పుడు ఈ రెండు నయనాలు ప్రకాశముతో కూడిన గోలాలుగా కనిపిస్తాయి మరియు కొందరి మస్తకము నుండి ప్రకాశ కిరీటపు సాక్షాత్కారము కూడా జరుగుతుంది. మరి మీ ద్వారా ఈ మూడు లైట్ ల సాక్షాత్కారము జరిగినట్లయితే ఏమౌతుంది? స్వయమే లైట్ గా అయిపోతారు. అనుభవజ్ఞులుగా అవుతారు కదా! సాకారరూపములో చూసారు, మస్తకము నుండి మరియు నయనాల నుండి పవిత్రతా కిరీటపు సాక్షాత్కారము అనేకులకు జరిగింది. కావున బాబాను అనుసరించాలి. ఒకవేళ ఇటువంటి స్వరూపపు సాక్షాత్కారమును ఆత్మలకు చేయించినట్లయితే సేవలో సఫలత మీ చరణాలపై వ్రాలుతుంది. మీరు ఎవరి ఎదుటకు వెళ్ళినా, వారికి సాక్షాత్కారమయ్యేటంత మహాన్ ఆత్మలుగా అవ్వండి. మరి చెప్పండి వారు వారి శిరస్సును సాక్షాత్కారమూర్తులైన మీ ముందు చూపించగలరా? శిరస్సు వంచేస్తారు. ఎప్పుడైతే ఈ శిరస్సును వంచుతారో అప్పుడు మీ జడమైన చిత్రాల ముందు స్థూల శిరస్సును వంచుతారు. కావున ఎంతమందినైతే ఇప్పుడు శిరస్సు వంచేటట్లుగా చేస్తారో అంతగా వారి జడమైన చిత్రాల ముందు శిరస్సును వంచుతారు. ప్రజలతో పాటు భక్తులను కూడా తయారు చెయ్యాలి. మొత్తము కల్పము యొక్క ప్రారబ్దము ఫిక్స్ అవ్వటమన్నది ఇప్పుడే జరగనుంది. వారసులను కూడా తయారు చెయ్యాలి మరియు ప్రజలను కూడా ఇప్పుడు తయారు చెయ్యాలి. ద్వాపరయుగపు భక్తులు కూడా ఇప్పుడే తయారవుతారు. అర్థమైందా! మీ ద్వారా మీ భక్తులలో కూడా భక్తి సంస్కారాలు అనగా భావన యొక్క సంస్కారాలు ఇప్పుడు నిండాలి. వీరు చాలా ఉన్నతమైనవారు, కేవలము ఈ భావన యొక్క సంస్కారము నిండటం ద్వారా భక్తులుగా అయిపోతారు. కావున భక్తులను కూడా ఇప్పుడు తయారుచేయాలి. ఇప్పటివరకైతే ప్రజలను తయారుచెయ్యటంలోనే శ్రమ చేస్తున్నారు. ఎంతెంతగా మీ స్థితి ప్రత్యక్షమవుతూ ఉంటుందో అలా అలా మీ వారసులు అనగా రాయల్ ఫ్యామిలీ, ప్రజలు మరియు భక్తులు మూడు రకాల వారూ ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఇప్పుడైతే మిక్స్ గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు మీ స్థితే ఫిక్స్ అవ్వలేదు, కావున అది కూడా మిక్స్ అయిపోతుంది, మళ్ళీ ప్రత్యక్షముగా కనిపిస్తుంది. వీరు భక్తులు అన్నది కూడా అనుభవము చేస్తారు. ఎందుకంటే త్రికాలదర్శి గుణము ప్రత్యక్షమైపోతుంది. కావున మీ మూడు కాలాల ప్రారబ్దమును స్పష్టముగా చూడగలరు. దివ్యదృష్టితో కాదు, ప్రత్యక్ష సాక్షాత్కారమును చేసుకుంటారు. అచ్ఛా!

Comments