18-01-1977 అవ్యక్త మురళి

18-01-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

జనవరి 18 తేదీ యొక్క విశేష మహత్వం.

                     స్థిరంగా, అచంచలంగా, అఖండంగా సదా ప్రతి పరిస్థితిలో అడోల్ గా, సర్వ గుణాలు మరియు సర్వ శక్తులతో సంపన్నంగా చేసే బాబా మాట్లాడుతున్నారు -
                    అందరు స్మృతి స్వరూపంగా అంటే సమర్థ స్వరూప స్థితిలో స్థితులయ్యారా? ఈరోజు విశేషంగా స్మృతి స్వరూపంగా అయ్యే రోజు. బాప్ దాదా యొక్క స్నేహంలో ఇమిడిపోవటం అంటే బాబా సమానంగా అయ్యేవారి స్నేహానికి గుర్తు - సమానత. కనుక ఈ రోజంతా స్మృతి స్వరూపంగా అంటే స్వయాన్ని బాబా సమానంగా అనుభవం చేసుకున్నారా? ఈరోజు విశేషంగా సహజంగా మరియు స్వతహాగానే కొద్ది సమయంలోనే బాబా సమాన స్థితి అనుభవం చేసుకునే రోజు. ఏవిధంగా అయితే అన్ని యుగాలలో కంటే సంగమయుగం సహజప్రాప్తి యుగం అని మహిమ చేయబడుతుందో అదేవిధంగా బ్రాహ్మణులకు సంగమయుగంలో కూడా ఈరోజు విశేషంగా సర్వశక్తుల యొక్క వరదానం పొందేటందుకు, బాబా సమాన స్థితిని చేరుకునే పాత్ర డ్రామానుసారం నిర్ణయించబడి ఉంది. విశేషమైన రోజు యొక్క విశేష మహాత్యాన్ని తెలుసుకుని మహాన్ రూపంతో జరుపుకున్నారా? అమృతవేళ నుండి బాప్ దాదా విశేష అనుభవాలు అనే స్వర్ణిమ అవకాశం యొక్క లాటరీ తెరిచారు. ఈ లాటరీని తీసుకునే అధికారాన్ని అనుభవం చేసుకున్నారా? స్నేహయుక్తంగా ఉంటూ లేదా యోగయుక్తంగా, సర్వశక్తులయుక్తంగా, సర్వ రకాల ప్రకృతి లేదా మాయ యొక్క ఆకర్షణలకు అతీతంగా ఉన్నారా? ఈ రోజు బాప్ దాదా
పిల్లల పురుషార్థం యొక్క ఫలితం చూసారు. ఫలితంలో ఏమి చూసారో తెలుసా?
                     చాలా మంది పిల్లలను బాబా తన శిరోకిరీటాలుగా చూసారు మరియు కొంతమంది పిల్లలను కంఠహార రూపంలో చూసారు మరియు కొంతమంది పిల్లలను భుజాల యొక్క శృంగారరూపంలో చూసారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్వయాన్ని నేను నా స్థానం ఎక్కడ? అని అడగండి. (బాబా ఎక్కడ కూర్చోబెడితే అక్కడ). బాబా అయితే కూర్చోబెడతారు, కానీ కూర్చునేది మీరే కదా! బాబా ఆజ్ఞ అయితే చాలా పెద్దది. అది మీకు తెలుసు కదా! విదేశీ నుండి స్వదేశీ అయినవారు దేనిలో ఉంటారు? విదేశీయులందరు కిరీటంలోకి వచ్చేస్తే స్వదేశీయులు ఎక్కడికి వెళ్తారు? కిరీటంలో అయితే కొద్దిమందే ఉంటారు. కానీ కంఠహారంగా, భుజాల శృంగారంగా ఎక్కువ మంది ఉంటారు. కిరీటధారులు అంటే బాబా యొక్క కిరీటంలో మెరిసే రత్నాలు. ఎవరికైతే విశేషమైన పూజ జరుగుతుందో వారి యొక్క గుర్తు సదా బాబాలో ఇమిడిపోయి బాబా సమానంగా ఉంటారు. వారి యొక్క ప్రతి మాట, కర్మ ద్వారా స్వతహాగా మరియు సదా బాబా ప్రత్యక్షం అవుతారు. వారి చిత్రం మరియు ముఖం చూసి ప్రతి ఒక్కరి నోటి నుండి అద్భుతం, బాబా వీరిని ఇంత యోగ్యంగా తయారుచేసారు అనే మాట వస్తుంది. వారి గుణాలను చూస్తూ అందరూ సదా బాబా యొక్క గుణాలనే పాడతారు. వారి దృష్టి అందరి వృత్తులను పరివర్తన చేస్తుంది. ఇటువంటి స్థితి కలిగిన వారే శిరోకిరీటాలుగా కీర్తించబడతారు.
                     కంఠానికి శృంగారం అంటే రెండవ నెంబర్ వారు. వీరు తమ కంఠ ధ్వని అంటే నోటి మాట ద్వారా బాబాని ప్రత్యక్షం చేసే ప్రయత్నంలో ఉంటారు. సదా బాప్ దాదాని తమ ఎదురుగా ఉంచుకుంటారు కానీ ఇమిడి ఉండలేరు. సదా బాప్ దాదా యొక్క గుణాలను పాడుతూ ఉంటారు కానీ స్వయం గుణమూర్తిగా కాలేరు. సమానంగా అవ్వాలనే భావన మరియు శ్రేష్ట కామన ఉంచుకుంటారు కానీ అన్ని రకాలైన మాయా యుద్ధాలను ఎదుర్కోలేరు. ఇటువంటి స్థితి కలిగినవారు కంఠహారాలు. మూడవరకం వారి గురించి సహజంగానే అర్థం అయిపోయి ఉంటుంది. భుజాలకు గుర్తు సహయోగం. ఏదోక రకంగా అంటే మనస్సుతో, వాణీతో లేదా కర్మతో, తనువు, మనస్సు, ధనాలతో బాబా యొక్క కర్తవ్యంలో సహయోగిగా ఉంటారు, కానీ సదా యోగులుగా కాలేరు. ఇలా చాలా మంది ఉంటారు. బాప్ దాదా రివైజ్ కోర్స్ తో పాటు రిలైజేషన్ కోర్స్ (అనుభూతి కోర్స్) కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు ఏమి మిగిలి ఉంది? ఇప్పుడు ఇక ఏ లోపం మిగిలి ఉంది?
                     నష్టోమోహ స్మృతి స్వరూపంగా అయిపోయారా? లేక ఇప్పుడు అవ్వాలా? 1976కి అయిపోవాలి కదా? అంతిమ వినాశనం కొరకు ఆగి ఉన్నారా? ఎదురుచూడటం లేదు కదా? వినాశనం కోసం ఎదురుచూడటం అంటే మీ మృత్యువు యొక్క తారీఖుని స్మృతిలో ఉంచుకోవటం లేదా మీ మృత్యువుని ఆహ్వానించటం. వినాశనం ఎందుకు అవ్వలేదు? ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? ఇలా ఎన్ని సంకల్పాలు చేస్తున్నారు? సంగమయుగం సౌభాగ్యంగా అనిపిస్తుందా లేక సత్యయుగమా? వినాశనం ఎందుకు అవ్వటం లేదు అని ఎందుకు భయపడుతున్నారు? స్వయం ఈ ప్రశ్నతో ప్రసన్నం అయితేనే ఇతరులను కూడా ప్రసన్నం చేయగలరు. స్వయమే ప్రశ్నలో ఉంటే ఇతరులు కూడా తప్పకుండా అడుగుతారు. అందువలన భయపడకండి. కొంతమంది వినాశనం ఎందుకు అవ్వలేదు అని అడుగుతారు. వారికి మీ కారణంగానే అవ్వలేదు అని చెప్పండి. బాబాతో పాటూ మనమంతా కూడా విశ్వ కళ్యాణకారులం. విశ్వకళ్యాణంలో మీ కళ్యాణంతో పాటు అనేక ఆత్మల కళ్యాణం మిగిలి ఉంది. అందువలన ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఎవరైనా ప్రశ్నించినప్పుడు స్వయమే ఏమిటి? ఎందుకు? అని తికమక పడిపోతున్నారు. అవును చెప్పాము, రాసాము, ఆవిధంగానే అవ్వాలి అని ఇలా అంటున్నారు అందువలన ఇతరులు సంతుష్టం అవ్వటం లేదు. నిశ్చయంతో కళ్యాణకారి బాబా యొక్క ఈ మాటలో కూడా కళ్యాణం నిండి ఉంది అని చెప్పండి. దానిని మేం తెలుసుకున్నాం. ఇక ముందు మీరు కూడా తెలుసుకుంటారు అని చెప్పండి. భయపడకండి. ఏమంటారో, ఎలా చెప్పాలో అని దాటేయకండి. ఎవరికి చెప్పారో వారిని చూసి భయపడి దాటేయకండి. ఏం చేస్తారు. ఒకవేళ ఏదైనా తప్పుగా ప్రచారం చేసినా ఆ వ్యతిరేక మాట ఎంతో మందిని మంచిగా చేస్తుంది. ప్రత్యక్షతకు సాధనంగా అవుతుంది. బాబా పిల్లలే అడుగుతున్నప్పుడు బయటివారు అడిగితే అది ఏమైనా గొప్ప విషయమా? ఇది చేద్దామా వద్దా? అని ఆలోచిస్తున్నారు. ప్రవృత్తిని ఎలా నడిపించాలి? వ్యవహారాలను ఎలా సెట్ చేసుకోవాలి? పిల్లల పెళ్ళి చేద్దామా లేక వద్దా? ఇల్లు కట్టుకుందామా లేక వద్దా? వాస్తవానికి ఈ ప్రశ్నలకు వినాశనం యొక్క తారీఖుకు ఏ సంబంధం లేదు. ఒకవేళ మీకు ధనం ఉండి ఇల్లు కట్టుకుందాం అని సంకల్పం వస్తే అది స్వయంపట్ల ఉపయోగించాలనే భావన ఉన్నట్లే. ఈశ్వరీయ సేవలో ఉపయోగించాలనే సంకల్పం ఉంటే ఇల్లు కట్టుకుందామా, ఈ ధనాన్ని ఇలానే ఉంచుదామా అనే ప్రశ్నలే రావు. ఒకవేళ అవసరం ఉండి బాబా ఆజ్ఞానుసారం కట్టుకుంటే అది వ్యర్ధం అవ్వదు, జమ అవుతుంది. కనుక వినాశనం కారణంగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీమతంపై నడవటం అంటే భీమా చేసుకోవటం. దానికి వారికి ఫలం లభిస్తుంది.
                      ఇక మిగిలింది పెళ్ళి చేసుకోవాలా? వద్దా? పెళ్ళి చేయాలా? వద్దా? అనే ప్రశ్న. దానికి బాబా మొదటి సలహా ఇచ్చారు. అదేమిటంటే ఎంత వరకు స్వయాన్ని మరియు ఇతరులని రక్షించాలో అంత వరకు రక్షించండి. ఒకవేళ 1976లో వినాశనం అవ్వకపోతే వినాశనం అయిపోతుందనే కారణంగా పవిత్రంగా ఉంటారా ఏమిటి? పవిత్రత అనేదే బ్రాహ్మణ జన్మ యొక్క స్వ ధర్మం. పవిత్రత యొక్క సంకల్పం బ్రాహ్మణ జన్మ యొక్క లక్ష్యం మరియు లక్షణాలు. ఎవరికైతే పవిత్రత నిజ లక్షణంగా ఉంటుందో వారికి వినాశనం యొక్క తారీఖుతో ఏ సంబంధం ఉండదు. ఇవన్నీ స్వయం యొక్క బలహీనతలను దాచుకోవటానికి చెప్పే సాకులు. ఎందుకంటే బ్రాహ్మణులకు సాకులు చెప్పటం చాలా బాగా తెలుసు. ఇక మిగిలింది ఇతరులకు పెళ్ళి చేయటం. వారిని కూడా ఎంత వరకు రక్షించాలో అంత వరకు రక్షించండి. స్వయం బలహీనంగా అయిపోయి వారికి ఉత్సాహం ఇవ్వకండి. ఇప్పుడు చేయాల్సిందే అని మనస్సులో కూడా సంకల్పం చేయకండి. 10 సంవత్సరాల క్రితం ఎవరిని రక్షిచలేకపోయారో వారిని ఏం చేసారు? సాక్షి అయ్యి సంకల్పం ద్వారా, వాణీ ద్వారా కూడా రక్షించటానికి ప్రయత్నం చేసారు. అలాగే ఇప్పుడు కూడా ఆ రకంగానే ధృడంగా ఉండండి కానీ ఎవరైతే పడిపోవాలి అనుకుంటారో వారిని మీరు ఏమి చేస్తారు? వినాశనం కారణంగా స్వయం అలజడిలోకి రాకండి. మీ అలజడి అజ్ఞానీ ఆత్మలను కూడా అలజడిలోకి తీసుకువస్తుంది. మీరు అచంచలంగా ఉండండి. నిశ్చయంతో, నిర్భయంగా మాట్లాడండి. అప్పుడు వారు స్వతహాగానే నిశ్శబ్దం అయిపోతారు, ఏమీ మాట్లాడలేరు. మీరు నిశ్చయబుద్ధిగా ఉండండి. సంకల్పంలో కూడా సంశయబుద్ధిగా అవ్వకండి. అలా అయితే అవ్వాలి, బాబా ఎందుకు అలా చెప్పారో తెలియదు అనే సంకల్పమే రాయల్ రూపం యొక్క సంశయం. బాప్ దాదా మొదటే చెప్తున్నారు. ఇప్పుడు వారి ఎదురుగా ఎలా వెళ్తారు? ఈ రాయల్ రూపం యొక్క సంశయం ప్రపంచం వారిని కూడా సంశయబుద్దిగా చేయటానికి నిమిత్తం అవుతుంది. అవును చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తాము ఈ నిశ్చయం మరియు నషాలో ఉంటే మీ నిశ్చయానికి ధన్యవాదాలు అంటూ వారు నమస్కారం చేయడానికి వస్తారు. అర్ధమైందా! కనుక భయపడకండి. జైలుకి పంపిస్తే భయపడతారా? ఎదుర్కొనే శక్తి లేదా? ఏదైతే చెప్పారో దానిలో కళ్యాణం ఉంది అనే చెప్పండి. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం అని చెప్పండి. ఇలా వారికి ఈశ్వరీయ నషాతో మరియు రమణీయతతో చెప్తే వారు ఇంకా నవ్వుతారు. కానీ మొదట స్వయం గట్టిగా ఉండాలి. అర్ధమైందా!
                    ఈరోజు అందరి సంకల్పం చేరింది. అందరు జనవరి 18వ తారీఖున బాబా ఏమి చెప్తారు అనే సంకల్పంలో ఉన్నారు. ఇప్పుడు విన్నారా? బాప్ దాదా మీ తోడు ఉన్నారు, ఎవరూ ఏమీ చేయలేరు, ఏమీ అనలేరు, కాలుతున్న భట్టీలో కూడా పిల్లి పిల్లలు రక్షణగా ఉన్నాయి. వెంట్రుక కూడా పీకలేరు. ఈవిధంగా మీ తోడు సాధారణమైనవారు కాదు, సర్వశక్తివంతుడు కనుక నిశ్చయబుద్ది విజయంతి.
                   తారీఖు చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ఎప్పుడు కూడా వినాశనం యొక్క అంతిమ తారీఖు నిర్ణయించబడదు. ఒకవేళ తారీఖు నిర్ణయిస్తే సీట్స్ కూడా నిర్ణయించబడతాయి. అప్పుడు పాస్ విత్ ఆనర్ అయ్యేవారి వరుస పెద్దది ఉంటుంది. అందువలన తారీఖుతో నిశ్చింతగా అయిపోండి. అందరు నిశ్చింతగా అయిపోతే అప్పుడు తారీఖు కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైతే అందరు ఈ సంకల్పం నుండి నిస్సంకల్పం అయిపోతారో అదే వినాశనం యొక్క తారీఖు.
                  ఈ విధంగా అచంచలంగా, స్థిరంగా, అఖండంగా సదా ప్రతి పరిస్థితిలో శ్రేష్టంగా స్థిరంగా ఉండేవారికి, సర్వగుణాలు, సర్వశక్తుల రూపి స్థంభాల స్వరూప ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments